Parkinson Disease
-
బ్రహ్మాండంగా బైడెన్ ఆరోగ్యం.. నిర్ధారించిన వైట్ హౌస్ వైద్యులు
వాషింగ్టన్ డీసీ : అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌కు మతిమరుపుతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయంటూ వస్తున్న వదంతుల్ని వైట్‌హౌస్‌లో అధ్యక్షుడి వైద్యుడు డాక్టర్ కెవిన్ ఓ కార్నర్ ఖండించారు. అధ్యక్షుడి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉందని తెలిపారు. అంతర్జాతీయ మీడియా సంస్థ న్యూయార్క్ పోస్ట్ ప్రతినిధి జోబైడెన్ ఆరోగ్యం గురించి వ్యక్తమవుతున్న ఆందోళనపై డాక్టర్ కెవిన్‌ను ప్రశ్నించారు.ప్రస్తుతం జోబైడెన్ ఆరోగ్యం ఎలా ఉంది? అధ్యక్ష పదవి ముగిసేలోపు ఆయనలో ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. లేదు.లేదు. ఆయ ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేశారు. మరి మానసిక పరిస్థితి ఎలా ఉందని అడగ్గా.. అద్భుతంగా ఉందని బదులిచ్చారు. మరోవైపు ఆనారోగ్యం కారణంగా డాక్టర్ కెవిన్ ఓ కార్నర్ సుమారు ఎనిమిది నెలల కాలంలో ఎనిమిది సార్లు వైట్ హౌస్‌లో బైడెన్‌తో భేటీ అయినట్లు పలు మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.In just a few months, the American people will choose the course of America’s future. I made my choice.And I would like to thank our great Vice President—@KamalaHarris.She’s experienced, tough, capable. She has been an incredible partner to me and leader for our country.— Joe Biden (@JoeBiden) July 25, 2024 అధ్యక్ష రేసు నుంచి అవుట్ఇటీవల బైడెన్‌కు తలెత్తుతున్న అనారోగ్య సమస్యల కారణంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీలో ఓటమి భయం మొదలైంది. అందుకే మరోసారి బైడెన్‌ను అధ్యక్ష పదవికి పోటీచేసేందుకు ఆ పార్టీ నేతలు అంగీకరించలేదు. బాహాటంగా నిరసనను వ్యక్తం చేశారు. దీంతో అధ్యక్ష రేసు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.కమలా హారిస్ సమర్థురాలంటూపదవుల కంటే ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే ముఖ్యమంటూ వైదొలగాలన్న తన నిర్ణయాన్ని బైడెన్ సమర్థించుకున్నారు. నియంత, నిరంకుశుల కంటే కూడా దేశం గొప్పదని పరోక్షంగా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై విమర్శలు గుప్పించారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సమర్థురాలంటూ... ఆమే అధ్యక్ష అభ్యర్థికి తగిన వ్యక్తి అని పునరుద్ఘాటించారు. మిగిలి ఉన్న ఆరు నెలల పదవీకాలంలో తన విధిని సమర్థంగా నిర్వర్తిస్తానని బైడెన్ హామీ ఇచ్చారు. -
Kiran Kamdar: కిచిడీ బామ్మ
ఆస్పత్రిలోని రోగులు ప్రతి మధ్యాహ్నం ఆమె కోసం ఎదురు చూస్తారు. ఆమె రాకుండా పోదు. మబ్బులు రానీ నిప్పులు కురవనీ వస్తుంది. ముంబై ఆస్పత్రుల్లోని పేద రోగులకు రోజుకు వంద మందికి ఆమె కిచిడీ పంచుతుంది. ఆమె దగ్గర డబ్బు లేదు. మనసు తప్ప. అందుకే ఆమెను అందరూ ‘కిచిడీ ఆజి’ అని పిలుస్తారు.62 సంవత్సరాల కిరణ్ కామ్దార్ కుదురుగా నిలబడిగాని, కూచునిగాని మాట్లాడలేదు. దానికి కారణం ఐదేళ్ల క్రితం ఆమెకు వచ్చిన పార్కిన్సన్స్ వ్యాధి. కాని ఆమె ఆలోచనలు కుదురుగా ఉన్నాయి. ఆమె సేవాగుణం కుదురుగా ఉంది. దానిని ఎవరూ కదపలేరు. ముంబై శివార్లలో కొంకణి తీరాన ఉన్నపాల్ఘర్ పట్టణం ఆమెది. సాదాసీదా జీవనమే అయినా ఒక మనిషికి సాటి మనిషి సేవ అవసరం అని ఆమె తెలుసుకుంది. అందుకు కారణం ఆమె కుమారుడు సెరిబ్రల్‌పాల్సీతో జన్మించడమే. కుమారుడి కోసం జీవితాన్ని అంకితం చేసిన కిరణ్ చుట్టుపక్కల పేద పిల్లలకుపాఠాలు చెప్పడంతోపాటు చేతనైన సాయం చేయడం కొనసాగించేది. అయితేపార్కిన్సన్స్ వ్యాధి ఆమె కార్యకలాపాలను స్తంభింపచేస్తుందని ఆమె భర్త, కుమార్తె అనుకున్నారు. కాని 2021లో జరిగిన ఒక ఘటన అందుకు విరుద్ధంగా ఆమెను ప్రేరేపించింది.కిచిడి ముద్దపాల్ఘర్లో ఒకే ఒక పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. చుట్టుపక్కల 15 పల్లెల నుంచి పేద జనం ఉదయం నుంచే వచ్చి ఓపీలో వెయిట్ చేస్తుంటారు. వారికి చెకప్ అయ్యేసరికి మధ్యాహ్నం 2 అవుతుంది. ఆ సమయంలో వారి ఆకలి బాధకు అక్కడ విరుగుడు లేదు. 2021లో కోవిడ్ సెకండ్‌వేవ్ సమయంలో ఒక బంధువును పరామర్శించడానికి కిరణ్ ఆ ఆస్పత్రికి వెళ్లింది. మధ్యాహ్నం వేళ చాలామంది పేషెంట్లు ఆకలితో బాధ పడుతున్నారని గ్రహించింది. ‘వీరికి ఆకలి తీరే మార్గమే లేదా?’ అనుకుని వెంటనే రంగంలో దిగింది. హాస్పిటల్ డీన్‌ని కలిసి ‘నేను మీ హాస్పిటల్‌లోని పేషెంట్లకు శుచిగా చేసిన వెజిటబుల్ కిచిడి పెట్టొచ్చా. వాళ్లు అన్నం లేక బాధ పడుతున్నారు’ అని అడిగింది. హాస్పిటల్ డీన్ వెంటనే అంగీకారం తెలిపారు. అలా మొదలైంది కిరణ్ ‘కిచ్డీ బ్యాంక్’ ఆలోచన.రోజూ 100 మందిఅంతటిపార్కిన్సన్స్ వ్యాధితో బాధ పడుతున్నా రోజూ స్వయంగా దాదాపు 20 నుంచి 22 కిలోల కిచిడి తయారు చేస్తుంది కిరణ్. ఆ తర్వాత దానిని స్వయంగా తీసుకుని ఆస్పత్రి చేరుతుంది. అక్కడ వార్డు వార్డుకు తిరుగుతూ పేషెంట్లకి, వారి బంధువులకి, చిన్న పిల్లలకు పంచి పెడుతుంది. ఇందుకు రెండు మూడు గంటలు పట్టినా ఆమె అలసి పోదు. పల్లెటూరి పేదవారు ఆమె తెచ్చే ఆ కిచిడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ‘నువ్వు దేవతవు తల్లీ’ అని ఆశీర్వదిస్తూ ఉంటారు. ‘కిచిడి పేషెంట్లను త్వరగా కోలుకునేలా చేస్తుంది. సులభంగా అరుగుతుంది’ అంటుంది కిరణ్.అదే వైద్యంపార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతూ ఇంతమందికి రోజూ వండటం గురించి కిరణ్‌కు చికిత్స చేస్తున్న డాక్టర్లు ఆందోళన చెందినా, వారించినా ఇప్పుడు మూడేళ్లుగా సాగుతున్న ఆమె సేవను చూశాక, ఆమెకు పరీక్షలు చేశాక ‘ఆమె చేస్తున్న సేవే ఆమెకు వైద్యంగా పని చేస్తున్నదని’ తేల్చారు. ఆమె సంకల్పం వ్యాధిని అదుపులో పెడుతోందని తెలియచేశారు. కిరణ్ కామ్దార్ గత మూడేళ్లుగా సాగిస్తున్న ఈ సేవకు ఆమెకు ఎన్నో అవార్డులు వచ్చాయి. మెచ్చుకోళ్లు దక్కుతున్నాయి. నిజానికి ఇది అసాధ్యమైన పని కాదు. ఆమె మాత్రమే చేయదగ్గ పని కాదు. ఎవరైనా అతి సులువుగా పూనుకోదగ్గదే. ప్రతి ్రపాంతంలో ఎన్నో ప్రభుత్వ ఆస్పత్రుల దగ్గర పేదవాళ్లు, లోపలి పేషెంట్లు సరైన తిండి లేక బాధపడుతుంటారు. వారికి కిచ్డీయో సాంబార్ రైసో పెట్టడం పెద్ద కష్టం కాదు. రోజూ చేయకపోయినా వారానికి ఒకరోజైనా ఇలాంటి సేవ చేస్తే ఆ తృప్తే వేరు. ఎక్కువమంది పూనుకోరు. పూనుకున్నవారు కిరణ్ కామ్దార్లా చిరాయువు పొందుతారు. -
పెద్దవయసు వారిని వణికించే పార్కిన్సన్స్ వ్యాధి!
పార్కిన్సన్స్ వ్యాధి కాస్త వయసు పెరిగిన వారిలో అంటే 60 ఏళ్లు పైబడిన వారిలో కనిపించే వ్యాధి. ఇందులో బాధితుల వేళ్లు, చేతులు వణుకుతుంటాయి. ఈ వ్యాధిని డాక్టర్ జేమ్స్ పార్కిన్సన్ అనే వైద్యనిపుణుడు 1817లో గుర్తిం, ‘షేకింగ్ పాల్సీ’ అని పేరు పెట్టినప్పటికీ... కనిపెట్టినవారి పేరుతోనే ఇది ప్రాచుర్యం పొందింది. ఈ వ్యాధి గురిం ప్రాథమిక అవగాహన కోసం ఈ కథనం. పార్కిన్సన్స్ వ్యాధి మహిళల్లో కంటే పురుషుల్లో దాదాపు ఒకటిన్నర రెట్లు ఎక్కువ. కొందరిలో యుక్తవయసులో అంటే 30 ఏళ్ల వారిలోనూ కనిపిస్తుండటంతో దీన్ని అనువంశీకంగా కనిపించే పార్కిన్సనిజమ్ (హెరిడిటరీ పార్కిన్సనిజమ్) అంటున్నారు. లక్షణాలు: కదలికలు నెమ్మదిస్తాయి (దీన్ని బ్రాడీకైనేసియా అంటారు). దాంతో నడక, స్నానం, దుస్తులు ధరించడం కష్టమవుతుంది. ముందుకు పడిపోతున్నట్లు అనిపిస్తుంటుంది. బ్యాలెన్స్ కోల్పోతారు. కాళ్ల, చేతుల్లోని కండరాలు బిగుసుకుపోవడం, వణకడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన అలసట (ఫెటీగ్)కనిపిస్త, తరచూ నిద్రాభంగమవుతుంది. ఈ పరిణామాలతో పాటు మెదడులోని కొన్ని రసాయనాల అసమతౌల్యత వల్ల కుంగుబాటు (డిప్రెషన్), నిద్రసమస్యలు కనిపిస్తాయి. పీడకలల, రాత్రి నిద్రలేమితో అకస్మాత్తుగా పగటినిద్ర రావచ్చు. కొందరిలో మింగడం కష్టంకావడం, మింగలేకపోవడంతో ఆహారం గొంతులో పట్టేయడం /ఇరుక్కుపోవడం. కొందరిలో కండరాల నొప్పులు / కీళ్ల నొప్పులు. మొదట్లో కనిపించే ఈ లక్షణాల్ని నిర్లక్ష్యం చేస్తే, అవి మరింత ముదిరి బాధితులు తమ రోజువారీ పనులు చేసుకోలేనంతగా ఇబ్బంది పడతారు. ∙కొన్ని చర్మ సమస్యలతో పాటు నాడీ వ్యవస్థ దెబ్బతినడం వల్ల మూత్ర విసర్జన సమస్యల అలాగే మలబద్దకం వంటి లక్షణాలూ కనిపించవచ్చు. నిర్ధారణ ఇలా... పార్కిన్సన్స్ వ్యాధిని పసిగట్టడం అన్నది ప్రధానంగా వ్యాధి లక్షణాల్ని బట్టి, క్లినికల్ పరీక్షల సహాయంతో జరుగుతుంది. నిర్ధారణ కోసం ఈ కింది పరీక్షలు అవసరమవుతాయి. మెదడు ఎమ్మారై పరీక్ష, స్పెక్ట్ అనే పరీక్ష. దీన్నే డాట్ స్కాన్ అని కూడా అంటారు. పెట్ స్కాన్ పరీక్ష. చికిత్స : వయసు పెరగడంతో మెదడులోని డోపమైన్ తగ్గడం, దాంతో కదలికలను నియంత్రించే మెదడు కణాలు నశించడం వల్ల పార్కిన్సన్స్ వ్యాధి వస్తుంది. డోపమైన్ ఉత్పత్తిని పెంచే మందులతో లక్షణాల్ని అదుపులోకి తేవచ్చు. అయితే పెరిగే వయసుతో పాటు డోపమైన్ ఉత్పాదన / మెదడులో దాని మోతాదు తగ్గుతూ వస్తుండటంతో మందుల మోతాదును పెంచుతూ పోవాల్సి ఉంటుంది. లెవోడోపా / కార్బిడోపా అనే మందులు దేహంలోకి వెళ్లగానే డోపమైన్‌గా మారతాయి. మావో–బి ఇన్హిబిటార్స్ మందులు మరింత డోపమైన్ లభ్యమయ్యేలా చేస్తాయి. ∙యాంటీ కొలెనెర్జిక్ మందులు లక్షణాల తీవ్రతను తగ్గిం, ఉపశమనాన్నిస్తాయి. శస్త్రచికిత్స : మందుల మోతాదు పెరుగుతున్న కొద్దీ ఓ దశలో దుష్ప్రభావాలు మొదలవుతాయి. అందుకే మాత్రలు వేసుకున్నా ప్రయోజనం లేని సందర్భాల్లో ఇక చివరి యత్నంగా ‘డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ’ అనే శస్త్రచికిత్స అవసరం పడవచ్చు. నివారణతో పాటు అవసరమయ్యే ఇతర పద్ధతులు: ∙వ్యాయామం పార్కిన్సన్ వ్యాధిని కొంతమేరకు నివారిస్తుంది. ఫిజియోథెరపీ, రీ–హ్యాబిలిటేషన్, మింగలేని సమయాల్లో పోషకాహార లోపాలను అధిగమించడానికి విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం. అలాగే పార్కిన్సన్ వ్యాధి వల్ల కుంగుబాటు (డిప్రెషన్) వంటి వనసిక సమస్యలు పార్కిన్సన్ వ్యాధికి దారితీసే ప్రమాదమూ ఉంది. అందుకే సైకియాట్రిక్ ఇవాల్యుయేషన్ అవసరం కావచ్చు. డాక్టర్ ఎం సాయి శ్రవంతి, కన్సల్టెంట్ న్యూరోఫిజిషియన్ (చదవండి: షిజెల్లోసిస్..! పిల్లల్ని బంకలా పట్టేస్తాయి!) -
వాసనను బట్టి వ్యాధిని చెప్పేస్తున్న వృద్ధురాలు... ఆశ్చర్యపోతున్న వైద్యులు
ఒక వృద్ధురాలు కేవలం వాసనతోనే వ్యాధిని గుర్తించేస్తోంది. ఆమె ముక్కు అలాంటి ఇలాంటి వ్యాధిని కాదు అరుదైన పార్కిన్సన్ వ్యాధిని గుర్తిస్తోంది. ఈ వ్యాధి దీర్ఘకాలిక నాడీ సంబంధిత రుగ్మత. ఈ వ్యాధి తీవ్రతను బట్టి శరీరంలోని మొత్తం ప్రధాన వ్యవస్థను నియంత్రించేస్తుంది. ఈ వ్యాధి కారణంగా వణుకుతూ ధృఢంగా లేకుండా ఉంటారు. క్రమంగా కదలిక మందగించడమే కాకుండా నడవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రతి 500 మందిలో ఒకరు ఈ వ్యాధి భారినపడతారు. అంతేకాదు పార్కిన్సన్స్ వ్యాధికి మందు లేదు. స్కాట్లాండ్కి చెందిన జాయ్మిల్నే అనే 72 ఏళ్ల వృద్ధురాలు ఒక ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంది. ఆమె ముక్కుకి ఒక విలక్షణమైన లక్షణ ఉంది. ఆమె వాసన ద్వారా పార్కిన్సన్ వ్యాధిని పసిగట్టేస్తుంది. దీన్ని మొదటసారిగా తన భర్తలో గుర్తించింది. తన భర్తకు 45 ఏళ్ల వయసులో పార్కిన్సన్ వ్యాధి భారిన పడతారని చెప్పేసింది. అంటే ఆమె 12 ఏళ్లకు ముందే నాడిసంబంధిత వ్యాధితో బాదపడుతున్నాడని నిర్థారించగలిగింది. తన భర్తకు 33 ఏళ్లు వచ్చేటప్పటికి తన భర్త శరీరం నుంచి ఒక విధమైన వాసన వచ్చేదని అప్పుడే తాను ఈ వ్యాధి లక్షణాలను గుర్తించినట్లు వివరించింది. ఆమెకు శరీర వాసనలో వింత మార్పును పసిగట్టగల సామర్థ్యం కలిగి ఉంది. దీంతో శాస్త్రవేత్తలు, వైద్యులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అంతేకాదు ఆమె సాయంతో ఈ విషయాన్ని అధ్యయనం చేసే పనిలో నిమగ్నమయ్యారు శాస్త్రవేత్తలు. ఈ మేరకు మాంచెస్టర్ విశ్వవిద్యాలయంలోని విద్యావేత్తలు ఆమె సాయంతో పార్కిన్సన్తో బాధపడుతున్న వ్యక్తులను గుర్తించే విధానాలపై పలు పరిశోధనలు చేస్తున్నారు. (చదవండి: హౌస్‌కీపర్‌ని పెళ్లి చేసుకున్న డాక్టర్) -
రష్యా అధ్యక్షుడు పుతిన్ జీవించేది మరో రెండేళ్లే!
మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్(69) ఆరోగ్యం నానాటికీ వేగంగా క్షీణిస్తోందని, ఆయన మరో రెండేళ్ల కంటే ఎక్కువ కాలం జీవించే అవకాశం లేదని ఉక్రెయిన్ నిఘా విభాగం అధికారి మేజర్ జనరల్ కైరిలో బుడానోవ్ వెల్లడించారు. తాను ఇటీవలే రష్యాలో రహస్యంగా పర్యటించానని, ఈ మేరకు కచ్చితమైన సమాచారం ఉందని చెప్పారు. పుతిన్ ఆరోగ్యంపై గత కొన్ని నెలలుగా రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలయ్యాక పుతిన్ తన మిలటరీ అధికారులతో తరచుగా సమావేశమవుతున్నారు. యుద్ధ వ్యూహాలు రచిస్తున్నారు. రష్యా విడుదల చేస్తున్న చిత్రాల్లో పుతిన్ అస్వస్థతతో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఇటీవల మాస్కోలో జరిగిన కార్యక్రమంలో పుతిన్ ఎక్కువసేపు నిలబడలేకపోయారు. మరో కార్యక్రమంలో నీరసంగా వెనుకా ముందు ఊగుతూ దర్శనమిచ్చారు. బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని వైద్యులు ఆయనకు సూచించినట్లు వార్తలు వచ్చాయి. పుతిన్ కంటిచూపు కూడా తగ్గిపోయినట్లు తెలుస్తోంది. పార్కిన్సన్స్, స్కిచోఫ్రినియా లక్షణాలు సైతం ఉన్నాయని రష్యా వర్గాలు తెలియజేశాయి. పుతిన్ ఇప్పటికే క్యాన్సర్ బాధితుడు. గతంలో క్యాన్సర్ సర్జరీ జరిగినట్లు సమాచారం. ఆయనలో మళ్లీ తీవ్రమైన క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తున్నాయని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. -
‘వణికి’స్తోంది
సాక్షి, హైదరాబాద్: పార్కిన్సన్స్ (వణుకుడు రోగం) వ్యాధికి కేంద్ర బిందువుగా భారత్ మారుతోందని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూరాలజీ విభాగం వైద్య బృందం తెలిపింది. ప్రస్తుతం దేశంలో ప్రతి లక్ష మందిలో 120 మంది ఈ వ్యాధిగ్రస్తులు ఉన్నారని.. మొత్తంగా 5.8 లక్షల మంది పార్కిన్సన్స్తో బాధపడుతున్నారని చెప్పింది. 2030 నాటికి ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు తాము చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయని నిమ్స్ ఆస్పత్రి వైద్య బృందం చెప్పింది. ఆదివారం నిమ్స్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్‌లో పార్కిన్సన్స్ వ్యాధిపై వైజ్ఞానిక సదస్సు జరిగింది. పార్కిన్సన్స్ అధునాతన చికిత్సలో వాడే డి–మైన్ పంపులు, ఇంజక్షన్లను లండన్‌లోని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్‌కు చెందిన మూవ్మెంట్ డిజార్డర్స్, పార్కిన్సన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డైరెక్టర్ డాక్టర్ వినోద్ మెట్టా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. పార్కిన్సన్స్ చికిత్సలో భాగంగా అపోమోర్ఫిన్ థెరపీ విధానంలో మందులు తీసుకునేప్పుడు ఉపశమనం ఉంటుంది కానీ కొద్దిరోజుల తర్వాత అవి సరిగా పని చేయట్లేదని చెప్పారు. ఫలితంగా రోగుల్లో వణుకు, పటుత్వం కోల్పోవడం, ఆందోళన చెందడం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. ప్రస్తుతం అధునాతన చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. యువ జనాభాలోనూ సమస్య నిమ్స్ హాస్పిటల్లో డి–మైన్ పంపులు, సిరంజ్ లు ఉపయోగించి చేసే అపోమోర్ఫిన్ చికిత్సా విధానాన్ని అందుబాటులోకి తెచ్చామని నిమ్స్ న్యూరాలజీ హెచ్‌వోడీ ప్రొఫెసర్ రూపమ్ బొర్గొహెయిన్ తెలిపారు. ఐరోపాలో బాగా వాడే ఈ థర్డ్ జనరేషన్ అపోమోర్ఫిన్–డెలివరీ పరికరాలు నిమ్స్‌తో పాటు నగరంలోని అన్ని ప్రఖ్యాత ఆస్పత్రుల్లో రోగులకు అందుబాటు లోకి వచ్చాయన్నారు. రోగుల్లో ఎక్కువ మంది 50 ఏళ్లు పైబడిన వారే ఉన్నా యువ జనాభాలో నూ సమస్య పెరుగు తోందని అన్నారు. భవిష్యత్‌లో దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై పార్కిన్సన్స్ ప్రభావం చూపొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన 30 మంది న్యూరాలజిస్ట్లు, మూవ్ మెంట్ డిజార్డర్స్ స్పెషలిస్టులు ఈ కొత్త తరహా డ్రగ్ డెలివరీ పరికరం వాడకంపై సందేహాలను నివృత్తి చేసుకున్నారని సెలెరా న్యూరో సైన్సెస్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ బాబూ నారాయణన్ చెప్పారు. -
Elgar Case: స్టాన్ స్వామికి బాంబే హైకోర్టులో ఊరట
ముంబై: ఎల్గర్ పరిషద్ కేసులో నిందితుడిగా ఉన్న కార్యకర్త స్టాన్ స్వామికి బాంబే హైకోర్టులో శుక్రవారం ఊరట లభించింది. పార్కిస్కన్ వ్యాధితో బాధపడుతున్న ఆయనను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ ఎస్ఎస్ షిండే, ఎన్ఆర్ బోర్కర్లతో కూడిన ధర్మాసం స్టాన్ స్వామికి సుబ్రున్ బాంద్రాలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో 15 రోజుల పాటు చికిత్స అందించేందుకు అంగీకరించింది. చికిత్సకు అయ్యే డబ్బులను తానే భరిస్తానని స్వామి ధర్మాసనం ఎదుట అంగీకరించారని ధర్మాసనం తెలిపింది. కాగా అంతకముందు స్టాన్ స్వామి కేసును అత్యవసరంగా విచారించాలంటూ ఆయన తరపు సీనియర్ న్యాయవాది మిహిర్ దేశాయ్ పిటిషన్ దాఖలు చేశారు. పార్కిస్కన్ వ్యాధితో బాధపడుతున్న 84 ఏళ్ల స్టాన్ స్వామిని కరోనా రోగుల మధ్య ఉంచి చికిత్స అందకుండా చేస్తున్నారని.. అతని ప్రాణాలు పోయే అవకాశం ఉందని మిహిర్ దేశాయ్ ఆరోపించారు. ఆయన వాదనలు విన్న బాంబే హైకోర్టు స్టాన్ స్వామిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేందుకు అంగీకరించింది. కాగా ఎల్గర్ పరిషద్- మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై స్టాన్ స్వామిని అక్టోబర్ 2020లో అరెస్టు చేశారు. అప్పటినుంచి ఆయన నవీ ముంబైలోని తలోజా జైలులో ఉంటున్నారు. -
పుతిన్ పదవి నుంచి వైదొలగనున్నారా?
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇకపై పదవిలో కొనసాగబోరనే వార్తలు వినపడుతున్నాయి. పార్కిన్సన్స్ వ్యాధి కారణంగా పుతిన్ జనవరిలో పదవి నుంచి వైదొలగే వీలుందని వార్తలొచ్చాయి. పుతిన్ ప్రియురాలు 37 ఏళ్ళ ఎలీనా కబేవా, ఆయన కుమార్తెలు పుతిన్‌ని పదవి నుంచి దిగిపోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు, మాస్కోకి చెందిన రాజకీయ విశ్లేషకులు వలేరి సొలోవే వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ‘ద డెయిలీ మెయిల్’ఒక కథనాన్ని ప్రచురించింది. పుతిన్ పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతూ ఉండి ఉండవచ్చునని సొలేవే తెలిపారు. పుతిన్ పాదాల కదలికలో తేడాలున్నాయని, ఆయన కుర్చీని గట్టిగా పట్టుకుని కూర్చుని ఉన్న దృశ్యాలు బయటపడ్డాయని, ఆయన పక్కనున్న కప్పు నిండా మాత్రలున్నాయని ఆయన తెలిపారు. పుతిన్ త్వరలోనే నూతన ప్రధానిని నియమిస్తారని, ఆయనను తన వారసుడిగా తయారు చేస్తారని సొలోవే తెలిపినట్లు న్యూయార్క్ పోస్ట్ ప్రచురించింది. ఇదిలా ఉండగా పుతిన్ పదవి నుంచి దిగిపోతారనే ప్రచారాన్ని రష్యా అధికార వర్గాలు తోసిపుచ్చాయి. పదవి నుంచి వైదొలగే అవకాశమే లేదని క్రిమ్లిన్ అధికార ప్రతినిధి డిమిట్రీ పెస్కోవ్ స్పష్టం చేశారు. -
అరుదైన వ్యాధి.. పుతిన్ రాజీనామా..!
మాస్కో : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకోనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఆయన అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. అరుదైన వ్యాధితో బాధపడుతున్న పుతిన్‌ను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకునేలా కుటుంబ సభ్యులతో పాటు వైద్యులు సైతం ఒత్తిడి చేస్తున్నారని రష్యాలోని ఓ ప్రముఖ పత్రిక తన కథనంలో పేర్కొంది. 68 ఏళ్ల పుతిన్ పార్కిన్సన్ (మెదడులోని నాడీ వ్యవస్థ దెబ్బతినడం) వ్యాధితో బాధపడుతున్నారని, ఈ సమయంలో పదవీ బాధ్యతలను నిర్వర్తించడం అంత సరైనది కాదని వైద్యులు సూచించినట్లు తెలిపింది. అయితే బతికున్నంతకాలం అధ్యక్ష పదవిలో కొనసాగే విధంగా రాజ్యాంగంలో సవరణలు తీసుకువచ్చిన పుతిన్.. అనుహ్యంగా తప్పుకునే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే అనారోగ్యం కారణంగా ఆయన తన విధులను ఇంటి నుంచే నిర్వర్తిస్తున్నారని, భవిష్యత్‌లో వ్యాధి మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని కారణంగానే అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. గత 20 ఏళ్లుగా రష్యాను ఏకఛత్రాధిపత్యం కిందపాలిస్తున్న పుతిన్.. వ్యాధి కారణంగా పదవీ బాధ్యత నుంచి తప్పుకుంటారన్న వార్తలను ఆ దేశ ప్రజలు కొట్టిపారేస్తున్నారు.పుతిన్ తొలుత 1999 నుంచి 2000 వరకు ప్రధాన మంత్రిగా కొనసాగారు. అనంతరం 2000 నుంచి 2008 వరకు అధ్యక్షుడిగా, 2012 వరకు ప్రధానమంత్రిగా కొనసాగారు. ఆ తరువాత మరోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. పెద్ద ఎత్తున రాజ్యాంగ సవరణలు చేపట్టి.. బతికునేంత వరకు తానే అధ్యక్షుడిగా కొనసాగే విధంగా మార్పులు చేశారు. పుతిన్ ప్రస్తుత అధ్యక్ష పదవీ కాలం 2024లో ముగియనుంది. ఆ తర్వాతా మరో 12ఏళ్లు తనే అధ్యక్షుడిగా కొనసాగించేందుకు వీలుగా చేసిన రాజ్యాంగ సవరణలను రష్యా పార్లమెంట్ ఇటీవల ఆమోదం తెలిపింది. మాజీ కేజీబీ అధికారి అయిన వ్లాదిమిర్ పుతిన్ 20 ఏళ్లుగా రష్యా రాజకీయాల్లో ఆధిపత్యం కొనసాగిస్తుండటం తెల్సిందే. సోవియట్ యూనియన్ (యూఎస్ఎస్ఆర్) విచ్ఛిన్నం అనంతరం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రష్యాను ప్రగతిపథంలో నడిపించడంలో పుతిన్ విజయవంతం అయ్యారు. ఆ తరువాత దేశంలో చోటుచేసుకున్న రాజకీయ పరిస్థితుల కారణంగా పార్లమెంట్ ఎన్నికల్లో కనీస పోటీ కూడా లేకుండా విజయం సాధిస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో పుతిన్ అర్థాంతరంగా అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటారనే వార్తలు ఆ దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజా వార్తలపై సోషల్ మీడియా వేదికగా ఆయన అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం కుదుటపడి.. పదవిలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నారు. అయితే తాజా పుతిన్ రాజీనామా వార్తలపై అధ్యక్ష కార్యాలయం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. -
జీవితాన్నే మార్చిన ఐడియా..
ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటారు.. బెంగళూరు కుర్రాడు సమయ్ గోధిక ఇప్పుడు ఇదే అనుకుంటూ ఉంటాడు.. ఎందుకంటే పదహారేళ్ళ ఈ నేషనల్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి ఐడియా కోట్ల రూపాయల బహుమతి తెచ్చి పెట్టింది మరీ. ఎలాగంటారా... ‘బ్రేక్ త్రూ జూనియర్ చాలెంజ్ ’పేరుతో నిర్వహించిన ఒక అంతర్జాతీయ పోటీలో సమయ్ తొలి స్థానంలో నిలిచాడు. జీవ, భౌతిక శాస్త్రాల్లో కొత్త, వినూత్న ఐడియాలను సులువైన భాషలో అందరికీ అర్థమయ్యేలా 3 నిముషాల వీడియో తీసి పంపడం ఈ పోటీ లక్ష్యం. సమయ్.. 24 గంటల మనిషి జీవితంలో గడియారానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన ఆలోచనను వీడియోగా పంపారు. మెచ్చిన న్యాయ నిర్ణేతల బృందం సమయ్కు రెండు లక్షల యాభై వేల డాలర్ల (రూ.1.8 కోట్ల) బహుమతి ప్రకటించింది. అంతేకాకుండా సమయ్ సైన్స్ టీచర్ ప్రమీల మీనన్‌కి రూ.36 లక్షలు, పాఠశాలలో పరిశోధనశాల ఏర్పాటుకు రూ.కోటి అందించారు. ఇంతకీ సమయ్ దేని గురించి వీడియో పంపాడో తెలుసా.. మన జీవగడియారానికి పార్కిన్సన్స్ వ్యాధికి ఉన్న సంబందంపై వీడియో రూపొందించి పంపాడు. -
రోగాలను గుర్తించే స్మార్ట్ గ్లోవ్స్
న్యూయార్క్: చలికాలం వచ్చిందంటే బయటకెళ్లేటప్పుడు సాక్సులు, గ్లౌవ్స్, షూ వేసుకోడం తప్పనిసరి. అయితే భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త కునాల్ మన్ కొండియా తయారు చేసిన సాక్సులు, షూలు, గ్లౌవ్స్ వేసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారా? మీకేదైనా అనారోగ్య సమస్య ఉందా? అనే వివరాలు మీ వైద్యుడి వద్దకు గణాంకాలతోసహా వెళ్లిపోతాయి. ఎందుకంటే ఈ స్మార్ట్ వస్త్రాలను సెన్సార్లను ఉపయోగించి తయారు చేశానని చెబుతున్నాడు కునాల్. ఇటువంటివి అందుబాటులోకి వస్తే మన ఆరోగ్యానికి సంబంధించి పదే పదే వైద్యుడి వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ముందే జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుందని కునాల్ చెబుతున్నాడు. ప్రస్తుతానికి తాను తయారుచేసిన సాక్సులు గుండె పనితీరును ఎప్పటికప్పుడు అంచనావేస్తూ.. వైద్యుడికి సమాచారం అందిస్తాయని, దీనివల్ల వైద్యుల నుంచి తగిన సూచనలు, సలహాలు మనకు అందుతూనే ఉంటాయన్నాడు. భవిష్యత్తులో పెరాలసిస్, పార్కిన్సన్, రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులను నిర్ధారించే స్మార్ట్ వస్త్రాలను తయారు చేస్తానని చెబుతున్నాడు. ఇవి అందుబాటులోకి వస్తే.. రోగ నిర్ధారణ పరీక్షల కోసం ఇక డయాగ్నోస్టిక్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని కునాల్ భరోసా ఇస్తున్నాడు.