
ముంబై: ఎల్గర్ పరిషద్ కేసులో నిందితుడిగా ఉన్న కార్యకర్త స్టాన్ స్వామికి బాంబే హైకోర్టులో శుక్రవారం ఊరట లభించింది. పార్కిస్కన్ వ్యాధితో బాధపడుతున్న ఆయనను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ ఎస్‌ఎస్ షిండే, ఎన్‌ఆర్ బోర్కర్‌లతో కూడిన ధర్మాసం స్టాన్ స్వామికి సుబ్రున్ బాంద్రాలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో 15 రోజుల పాటు చికిత్స అందించేందుకు అంగీకరించింది. చికిత్సకు అయ్యే డబ్బులను తానే భరిస్తానని స్వామి ధర్మాసనం ఎదుట అంగీకరించారని ధర్మాసనం తెలిపింది.
కాగా అంతకముందు స్టాన్ స్వామి కేసును అత్యవసరంగా విచారించాలంటూ ఆయన తరపు సీనియర్ న్యాయవాది మిహిర్ దేశాయ్ పిటిషన్ దాఖలు చేశారు. పార్కిస్కన్ వ్యాధితో బాధపడుతున్న 84 ఏళ్ల స్టాన్ స్వామిని కరోనా రోగుల మధ్య ఉంచి చికిత్స అందకుండా చేస్తున్నారని.. అతని ప్రాణాలు పోయే అవకాశం ఉందని మిహిర్ దేశాయ్ ఆరోపించారు. ఆయన వాదనలు విన్న బాంబే హైకోర్టు స్టాన్ స్వామిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేందుకు అంగీకరించింది. కాగా ఎల్గర్ పరిషద్- మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై స్టాన్ స్వామిని అక్టోబర్ 2020లో అరెస్టు చేశారు. అప్పటినుంచి ఆయన నవీ ముంబైలోని తలోజా జైలులో ఉంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment