పార్కిన్‌సన్స్ వ్యాధి కాస్త వయసు పెరిగిన వారిలో అంటే 60 ఏళ్లు పైబడిన వారిలో కనిపించే వ్యాధి. ఇందులో బాధితుల వేళ్లు, చేతులు వణుకుతుంటాయి. ఈ వ్యాధిని డాక్టర్ జేమ్స్ పార్కిన్‌సన్ అనే వైద్యనిపుణుడు 1817లో గుర్తిం, ‘షేకింగ్ పాల్సీ’ అని పేరు పెట్టినప్పటికీ... కనిపెట్టినవారి పేరుతోనే ఇది ప్రాచుర్యం పొందింది. ఈ వ్యాధి గురిం ప్రాథమిక అవగాహన కోసం ఈ కథనం.
పార్కిన్‌సన్స్ వ్యాధి మహిళల్లో కంటే పురుషుల్లో దాదాపు ఒకటిన్నర రెట్లు ఎక్కువ. కొందరిలో యుక్తవయసులో అంటే 30 ఏళ్ల వారిలోనూ కనిపిస్తుండటంతో దీన్ని అనువంశీకంగా కనిపించే పార్కిన్‌సనిజమ్ (హెరిడిటరీ పార్కిన్‌సనిజమ్) అంటున్నారు.
లక్షణాలు:
- కదలికలు నెమ్మదిస్తాయి (దీన్ని బ్రాడీకైనేసియా అంటారు). దాంతో నడక, స్నానం, దుస్తులు ధరించడం కష్టమవుతుంది. ముందుకు పడిపోతున్నట్లు అనిపిస్తుంటుంది. బ్యాలెన్స్ కోల్పోతారు.
- కాళ్ల, చేతుల్లోని కండరాలు బిగుసుకుపోవడం, వణకడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
- తీవ్రమైన అలసట (ఫెటీగ్)కనిపిస్త, తరచూ నిద్రాభంగమవుతుంది. ఈ పరిణామాలతో పాటు మెదడులోని కొన్ని రసాయనాల అసమతౌల్యత వల్ల కుంగుబాటు (డిప్రెషన్), నిద్రసమస్యలు కనిపిస్తాయి. పీడకలల, రాత్రి నిద్రలేమితో అకస్మాత్తుగా పగటినిద్ర రావచ్చు.
- కొందరిలో మింగడం కష్టంకావడం, మింగలేకపోవడంతో ఆహారం గొంతులో పట్టేయడం /ఇరుక్కుపోవడం.
- కొందరిలో కండరాల నొప్పులు / కీళ్ల నొప్పులు.
- మొదట్లో కనిపించే ఈ లక్షణాల్ని నిర్లక్ష్యం చేస్తే, అవి మరింత ముదిరి బాధితులు తమ రోజువారీ పనులు చేసుకోలేనంతగా ఇబ్బంది పడతారు. ∙కొన్ని చర్మ సమస్యలతో పాటు నాడీ వ్యవస్థ దెబ్బతినడం వల్ల మూత్ర విసర్జన సమస్యల అలాగే మలబద్దకం వంటి లక్షణాలూ కనిపించవచ్చు.
నిర్ధారణ ఇలా...
- పార్కిన్‌సన్స్ వ్యాధిని పసిగట్టడం అన్నది ప్రధానంగా వ్యాధి లక్షణాల్ని బట్టి, క్లినికల్ పరీక్షల సహాయంతో జరుగుతుంది. నిర్ధారణ కోసం ఈ కింది పరీక్షలు అవసరమవుతాయి. మెదడు ఎమ్మారై పరీక్ష, స్పెక్ట్ అనే పరీక్ష. దీన్నే డాట్ స్కాన్ అని కూడా అంటారు.
- పెట్ స్కాన్ పరీక్ష.
చికిత్స :
వయసు పెరగడంతో మెదడులోని డోపమైన్ తగ్గడం, దాంతో కదలికలను నియంత్రించే మెదడు కణాలు నశించడం వల్ల పార్కిన్‌సన్స్ వ్యాధి వస్తుంది. డోపమైన్ ఉత్పత్తిని పెంచే మందులతో లక్షణాల్ని అదుపులోకి తేవచ్చు. అయితే పెరిగే వయసుతో పాటు డోపమైన్ ఉత్పాదన / మెదడులో దాని మోతాదు తగ్గుతూ వస్తుండటంతో మందుల మోతాదును పెంచుతూ పోవాల్సి ఉంటుంది.
లెవోడోపా / కార్బిడోపా అనే మందులు దేహంలోకి వెళ్లగానే డోపమైన్‌గా మారతాయి. మావో–బి ఇన్హిబిటార్స్ మందులు మరింత డోపమైన్ లభ్యమయ్యేలా చేస్తాయి. ∙యాంటీ కొలెనెర్జిక్ మందులు లక్షణాల తీవ్రతను తగ్గిం, ఉపశమనాన్నిస్తాయి.
శస్త్రచికిత్స : మందుల మోతాదు పెరుగుతున్న కొద్దీ ఓ దశలో దుష్ప్రభావాలు మొదలవుతాయి. అందుకే మాత్రలు వేసుకున్నా ప్రయోజనం లేని సందర్భాల్లో ఇక చివరి యత్నంగా ‘డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ’ అనే శస్త్రచికిత్స అవసరం పడవచ్చు.
నివారణతో పాటు అవసరమయ్యే ఇతర పద్ధతులు: ∙వ్యాయామం పార్కిన్‌సన్ వ్యాధిని కొంతమేరకు నివారిస్తుంది. ఫిజియోథెరపీ, రీ–హ్యాబిలిటేషన్, మింగలేని సమయాల్లో పోషకాహార లోపాలను అధిగమించడానికి విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం. అలాగే పార్కిన్‌సన్ వ్యాధి వల్ల కుంగుబాటు (డిప్రెషన్) వంటి వనసిక సమస్యలు పార్కిన్‌సన్ వ్యాధికి దారితీసే ప్రమాదమూ ఉంది. అందుకే సైకియాట్రిక్ ఇవాల్యుయేషన్ అవసరం కావచ్చు.
డాక్టర్ ఎం సాయి శ్రవంతి, కన్సల్టెంట్ న్యూరోఫిజిషియన్
Comments
Please login to add a commentAdd a comment