White House Drug Scandal: Allegations On Hunter Biden Of Illegally Brings Drugs Into White House - Sakshi
Sakshi News home page

White House Drug Scandal: అమెరికా అ‍ధ్యక్ష భవనంలో కొకైన్‌.. బైడెన్‌ కొడుకుపైనే ఆరోపణలు!

Published Wed, Jul 5 2023 2:23 PM | Last Updated on Wed, Jul 5 2023 3:11 PM

Cocaine entered the White House with the involvement of Joe Biden son - Sakshi

అమెరికాలోని శ్వేత సౌధంలో అధికారులు కొకైన్‌ గుర్తించిన నేపధ్యంలో దీనివెనుక అధ్యక్షుడు జో బైడెన్‌ కుమారుడు హంటర్‌ బైడెన్‌ ప్రమేయమందంటూ పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హంటర్‌ బైడెన్‌ మాదక ద్రవ్యాలు తీసుకుంటూ గతంలో బహిరంగంగా దొరికిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. తండ్రి జో బైడెన్‌ హాలిడే వీకెండ్‌కు వెళ్లిన సమయంలో జోహంటర్‌ ఇక్కడకు వచ్చారని సమాచారం. ఈ విషయం బయటకు పొక్కడంతో సోషల్‌ మీడియాలో హంటర్‌ బైడెన్‌పై పలు మీమ్స్‌ ప్రత్యక్షమవుతున్నాయి.

ఈ మాదకద్రవ్యాలను హంటర్‌ బైడెన్‌ అక్రమంగా వైట్‌హౌస్‌లోకి తీసుకువచ్చారని పలువురు ఆరోపిస్తున్నారు. కాగా గతంలో జో బైడెన్‌ కుమారుడు హంటర్‌ బైడెన్‌పై అమెరికా న్యాయ విభాగం.. ఫెడరల్‌ టాక్స్‌ ఎగవేత, మారణాయుధాలు కలిగివున్నాడన్న ఆరోపణలు చేసింది. ఈ నేపధ్యంలో హంటర్‌ తాను అక్రమంగా ఆయుధాలు కలిగివున్నానన్న విషయాన్ని అంగీకరించారు. దీనికి తోడు హంటర్‌ బైడెన్‌ 2017, 2018లలో 1.5 మిలియన్‌ డాలర్ల అధిక ఆదాయంపై తన ఆదాయపు పన్నురిటర్న్‌లను దాఖలు చేయలేదు.

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ కుమారుడు హంటర్‌ బైడెన్‌కు చెందిన ల్యాప్‌టాప్‌ నుంచి 9 వేల ఫొటోలను గతంలో మార్క్‌పోలో పబ్లిష్‌ చేసింది. వీటిలో హంటర్‌ డ్రగ్స్‌ తీసుకున్నవి, వేశ్యలతో ఉన్నవి, నగ్నంగా తిరుగుతూ ఎంజాయ్‌ చేస్తున్న ఫొటోలు ఉన్నాయి. డైలీమెయిల్‌ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఫొటోలు బీచ్‌లలో హంటర్‌ ఎంజాయ్‌ చేస్తున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. అలాగే హంటర్‌ స్మోకింగ్‌చేస్తూ, స్పీడ్‌ డ్రైవింగ్‌ చేస్తుంటారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

ప్రతిష్టాత్మక వైట్‌ హౌస్‌లో కొకైన్‌ లభ్యమైన దరిమిలా ట్విట్టర్‌లో పలు కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. వైట్‌ హౌస్‌లో కొకైన్‌ కనిపించడం వెనుక ప్రధాన కారణం హంటర్‌ బైడెన్‌? అని, హంటర్‌ బైడెన్‌ దేశానికి చీడపురుగు, నేరగాడు అంటూ పలువురు దుమ్మెత్తి పోస్తున్నారు.  


ఇది కూడా చదవండి: వైట్‌హౌస్‌లో కొకైన్‌ కలకలం..అధికారులు అప్రమత్తం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement