Unanimous
-
ప్రపంచ ధ్యాన దినోత్సవంగా డిసెంబర్ 21
ఐక్యరాజ్యసమితి: ఏటా డిసెంబర్ 21వ తేదీన ప్రపంచ ధ్యాన దినోత్సవంగా జరుపుకోవాలన్న భారత్ సహ ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి ఏకగ్రీవంగా ఆమోదించింది. లీచెన్స్టయిన్, భారత్, శ్రీలంక, నేపాల్, మెక్సికో, అండొర్రాలతో కూడిన దేశాల బృందం 193 సభ్య దేశాలతో కూడిన జనరల్ అసెంబ్లీలో శుక్రవారం ఈ తీర్మానం ప్రవేశపెట్టాయని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ ‘ఎక్స్’లో వెల్లడించారు. ‘సర్వజనుల శ్రేయస్సు, అంతర్గత పరివర్తన కోసం ఒక రోజు! డిసెంబర్ 21ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఐరాస ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించేందుకు ఇతర దేశాలతో కలిసి భారత్ మార్గదర్శనం చేసిందని తెలిపేందుకు సంతోíÙస్తున్నాం’అని హరీశ్ పేర్కొన్నారు. -
ఢిల్లీ సీఎం ఆతిశి
సాక్షి, న్యూఢిల్లీ: సస్పెన్స్ వీడింది. ఢిల్లీ సీఎం పీఠం ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకురాలు ఆతిశీ మార్లీనాకు దక్కింది. పార్టీ శాసనసభాపక్షం మంగళవారం ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. అనంతరం కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారు. సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఆయన రాజీనామా లేఖ అందజేయడం, ఆ వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఎల్జేకు ఆతిశి లేఖ సమరి్పంచడం వెంటవెంటనే జరిగిపోయాయి. వారంలోగా ఆమె ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం 26, 27 తేదీల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో లాంఛనంగా మెజారిటీ నిరూపించుకుంటారు. కేజ్రీవాల్ కేబినెట్లో ఆరి్ధకం, విద్య, సాగు నీరు సహా 14 శాఖల బాధ్యతలను మోస్తూ వచి్చన ఆతిశి త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల దాకా సీఎంగా ప్రభుత్వాన్ని నడపనున్నారు. ఢిల్లీకి ఆమె మూడో మహిళా సీఎం. గతంలో బీజేపీ దిగ్గజం సుష్మా స్వరాజ్, కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్ సీఎంలుగా చేశారు. మమతా బెనర్జీ (పశి్చమ బెంగాల్) తర్వాత ప్రస్తుతం దేశంలో రెండో మహిళా సీఎం కూడా ఆతిశే కానున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఐదు నెలల పై చిలుకు కారాగారవాసం నుంచి కేజ్రీవాల్ వారం క్రితం బెయిల్‌పై బయటికి రావడం, సీఎం పదవికి రాజీనామా చేస్తానంటూ ఆదివారం సంచలన ప్రకటన చేయడం తెలిసిందే. దాంతో తదుపరి సీఎంగా ఆతిశితో పాటు కేజ్రీవాల్ భార్య సునీత తదితర పేర్లు రెండు రోజులుగా తెరపైకొచ్చాయి. మంగళవారం ఆప్ ఎల్పీ భేటీలో కేజ్రీవాల్ సూచన మేరకు ఆతిశి పేరును పార్టీ సీనియర్ నేత దిలీప్ పాండే ప్రతిపాదించారు. ఎమ్మెల్యేలంతా నిలబడి ఆమోదం తెలిపారు. 2013లో ఆప్ ఆవిర్భావం నుంచి పారీ్టలో ఆతిశి క్రియాశీలంగా ఉన్నారు. 2015 నుంచి కేజ్రీ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2018 దాకా నాటి ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా చూసిన విద్యా శాఖకు సలహాదారుగా ఉన్నారు. 2020లో కాల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారి గెలుపొందారు. మద్యం కుంభకోణంలో మంత్రి పదవులకు సిసోడియా, సత్యేంద్ర జైన్ రాజీనామా తర్వాత ఆమె మంత్రి అయ్యారు. కీలకమైన ఆర్ధిక, విద్య, తాగునీరు సహా 14 శాఖలు చూస్తున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత అటు పారీ్టని, ఇటు ప్రభుత్వాన్ని సర్వం తానై నడిపించారు. కేజ్రీవాల్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే మా ఏకైక లక్ష్యం: అతిశిఆప్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యాక ఆతిశి మీడియాతో మాట్లాడారు. తన గురువు కేజ్రీవాల్‌కు ధన్యవాదాలు తెలిపారు. ‘‘సీఎం పదవికి ఆయన రాజీనామా చేస్తున్నందుకు ఎంతో బాధగా ఉంది. నన్ను నమ్మి ఇంతటి బాధ్యత కట్టబెట్టారు. ఎమ్మెల్యేను చేశారు. మంత్రిని చేశారు. ఇప్పుడిలా సీఎంనూ చేశారు. ఇది ఆప్‌లో మాత్రమే సాధ్యం. సామాన్య కుటుంబం నుంచి వచి్చన నా వంటివారికి మరో పారీ్టలో అయితే కనీసం ఎమ్మెల్యే టికెట్ కూడా దక్కదు. ఢిల్లీ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేజ్రీవాల్ మార్గదర్శకత్వంలో సాగుతా. ఆయన్ను తిరిగి సీఎం చేయడమే లక్ష్యంగా పని చేస్తాం’’ అన్నారు. నిజాయితీపరుడైన కేజ్రీవాల్‌పై తప్పుడు అభియోగాలు మోపారన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను గెలిపించి ఆయన్ను మళ్లీ సీఎం చేయాలని ఢిల్లీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. షెడ్యూల్ ప్రకారం అవి వచ్చే ఫిబ్రవరిలో జరగాల్సి ఉంది. మహారాష్ట్రతో పాటే నవంబర్లోనే జరపాలని కేజ్రీవాల్ డిమాండ్ చేయడం తెలిసిందే. ఆ అవకాశం లేదని ఈసీ వర్గాలంటున్నాయి.మారింది ముఖమే: బీజేపీ సీఎంగా ఆతిశి ఎంపికపై బీజేపీ పెదవి విరిచింది. కేవలం ముఖాన్ని మార్చినంత మాత్రాన పార్టీ స్వభావం మారబోదని పార్టీ ఢిల్లీ విభాగం చీఫ్ వీరేందర్ సచ్దేవ అన్నారు. ఈ రాజకీయ జూదంతో కేజ్రీవాల్‌కు లాభించేదేమీ ఉండబోదని ఆయన జోస్యం చెప్పారు. -
ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవం..
-
Lok Sabha Election Result 2024: ఎన్డీఏ నేతగా మోదీ
బీజేపీ సారథ్యంలోని అధికార ఎన్డీఏ కూటమి నేతగా ప్రధాని నరేంద్ర మోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం వెలువడ్డ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ మెజారిటీ స్థానాలు సాధించడం తెలిసిందే. దాంతో మోదీ వరుసగా మూడోసారి ప్రధాని కానున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో ప్రధాని నివాసంలో ఎన్డీఏ కీలక సమావేశం జరిగింది. మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో బీజేపీతో పాటు ఎన్డీఏ పక్షాల అగ్ర నేతలంతా పాల్గొన్నారు. న్యూఢిల్లీ/బెంగళూరు: బీజేపీ సారథ్యంలోని అధికార ఎన్డీఏ కూటమి నేతగా ప్రధాని మోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం వెలువడ్డ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ మెజారిటీ స్థానాలు సాధించడం తెలిసిందే. దాంతో మోదీ వరుసగా మూడోసారి ప్రధాని కానున్నారు. తొలి ప్రధాని నెహ్రూ తర్వాత ఈ ఘనత సాధించనున్న నాయకునిగా రికార్డు సృష్టించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో ప్రధాని నివాసంలో ఎన్డీఏ కీలక సమావేశం జరిగింది. మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో బీజేపీతో పాటు ఎన్డీఏ పక్షాల అగ్ర నేతలంతా పాల్గొన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జేడీ(యూ) చీఫ్ నితీశ్‌కుమార్, శివసేన అధినేత ఏక్నాథ్ షిండే, ఎల్జేపీ (ఆర్వీ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్, జేడీ(ఎస్) నేత హెచ్.డి.కుమారస్వామి, ఎన్సీపీ నాయకుడు ప్రఫుల్ పటేల్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సహా 16 పారీ్టలకు చెందిన 21 మంది నాయకులు భేటీలో పాల్గొన్నారు. బీజేపీ నుంచి పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అగ్ర నేతలు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్ తదితరులు హాజరయ్యారు. భేటీనుద్దేశించి తొలుత మోదీ మాట్లాడారు. ఎన్నికల విజయానికి కూటమి పక్షాలను అభినందించారు. కేంద్రంలో ఎన్డీఏ వరుసగా మూడోసారి మెజారిటీ సాధించడం చరిత్రాత్మకమని అభిప్రాయపడ్డారు. ఇది గత 60 ఏళ్లలో ఎవరికీ సాధ్యపడని ఘనత అన్నారు. వీలైనంత త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నితీశ్ సూచించారు. ఇండియా కూటమిలో చేరాలంటూ ఎన్డీఏ పారీ్టలకు కాంగ్రెస్ బాహాటంగానే పిలుపులిస్తున్న నేపథ్యంలో అనిశ్చితికి తావు లేకుండా తక్షణం ప్రభుత్వం కొలువుదీరాలని నేతలన్నారు. అందుకు వీలుగా శాఖల పంపకం తదితర మంతనాలను వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవాలని నిర్ణయించారు. ప్రభుత్వ కూర్పుపైనా భేటీలో నేతలు చర్చించారు. శుక్రవారం ఎన్డీఏ ఎంపీలంతా సమావేశమై మోదీని తమ నాయకునిగా లాంఛనంగా ఎన్నుకుంటారని హెచ్ఏఎం(ఎస్) జితిన్‌రాం మాంఝీ వెల్లడించారు. అనంతరం రాష్ట్రపతిని కలిసి ఎన్డీఏ కూటమికి మద్దతు లేఖలు సమరి్పస్తామని భేటీ అనంతరం మీడియాకు వెల్లడించారు. మోదీపై నేతల ప్రశంసలు దేశ ఘన వారసత్వాన్ని ప్రగతికి, సమగ్రాభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం పాటుపడుతుందంటూ ఎన్డీఏ భేటీలో నేతలంతా తీర్మానం చేశారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు కృషి చేస్తుందని పేర్కొన్నారు. ‘‘ప్రధాని మోదీ సారథ్యంలో గత పదేళ్లలో పలు ప్రజానుకూల నిర్ణయాలతో దేశం అన్ని రంగాల్లోనూ వృద్ధి బాటన సాగుతోంది. ఆయన నాయకత్వంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో సమైక్యంగా పోటీ చేసి గొప్ప విజయం సాధించడం మాకందరికీ గర్వకారణం. మోదీని మా నాయకునిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాం’’ అంటూ నేతలు తీర్మానించారు. ఎన్డీఏతోనే ఉంటాం తాము ఎన్డీఏలోనే కొనసాగుతామని బాబు, నితీశ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి ఊహాగానాలకూ తావు లేదన్నారు. దేశ నిర్మాణం కోసం పదేళ్లుగా మోదీ చేసిన కృషిని ప్రస్తుతిస్తూ నేతలంతా ఆయన్ను అభినందించారని తెలిపారు. ‘‘అంతర్జాతీయంగా భారత్ స్థాయిని మోదీ పెంచారు. ఆయన లక్ష్యాల సాధనకు సహకరిస్తాం’’ అన్నారు.కీలక శాఖలు, స్పీకర్ ఎన్డీఏ పక్షాల డిమాండ్లు 2014, 2019ల్లోనూ కేంద్రంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పాటైనా ఆ రెండుసార్లూ బీజేపీకి ఒంటరిగానే సంపూర్ణ మెజారిటీ వచి్చంది. ఈసారి మాత్రం ఆ పార్టీ 240 లోక్‌సభ స్థానాలకు పరిమితమై మెజారిటీకి 32 సీట్ల దూరంలో నిలిచింది. దాంతో ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్య పక్షాల మద్దతు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో మోదీ 3.0 సర్కారు పనితీరు గత రెండుసార్లతో పోలిస్తే చాలా భిన్నంగా ఉండేలా కనిపిస్తోంది. ఎన్డీఏ భాగస్వాములంతా కీలక శాఖలు డిమాండ్ చేస్తున్నట్టు చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాలతో పాటు జాతీయ మీడియా పేర్కొంటున్న మేరకు ఎవరేం కోరుతున్నారంటే... టీడీపీ: ఏకంగా 7 నుంచి 8 కేబినెట్ బెర్తులు, ఒక సహాయ మంత్రి పదవి కోరుతోంది! వ్యవసాయ, రవాణా, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, ఐటీ–వాణిజ్య, విద్య, గృహ నిర్మాణ, జల శక్తి, ఆర్థిక (సహాయ) శాఖలతో కూడిన జాబితాను బీజేపీ ముందు పెట్టినట్టు తెలుస్తోంది. లోక్‌సభ స్పీకర్ పదవి కూడా అడుగుతోంది. జేడీ(యూ): జేడీ(యూ) పార్టీ కనీసం మూడు కేబినెట్ పదవులు డిమాండ్ చేస్తోంది. ఒకట్రెండు సహాయ మంత్రి పదవులు కూడా కోరవచ్చంటున్నారు. మరోవైపు విపక్షాల ‘ఇండియా’ కూటమి కూడా ఇప్పటికే తమను ఆకర్షించేందుకు ప్రయతి్నస్తోందని జేడీ(యూ) సీనియర్ నేత, బిహార్ మంత్రి విజయ్‌కుమార్ చౌదరి మీడియాకు చెప్పడం విశేషం. ఆయన వ్యాఖ్యలను బీజేపీపై ఒత్తిడి పెంచే వ్యూహంగా భావిస్తున్నారు. ఎల్జేపీ (ఆర్వీ): ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవి కోసం పట్టుబడుతోంది. బిహార్‌లో పోటీ చేసిన ఐదు లోక్‌సభ స్థానాల్లోనూ పార్టీ ఘనవిజయం సాధించడం తెలిసిందే. హెచ్ఏఎం(ఎస్) నేత జితిన్‌రాం మాంఝీ కూడా కేబినెట్ పదవి ఆశిస్తున్నారు. శివసేన: ఒక కేబినెట్, మరో సహాయ మంత్రి పదవి కోరుతోంది. వ్యవసాయ శాఖపై జేడీ(ఎస్) కన్ను: తనకు వ్యవసాయ శాఖ కావాలంటూ జేడీ(ఎస్) నేత కుమారస్వామి స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఆయన పార్టీ జేడీ(ఎస్) రెండు లోక్‌సభ స్థానాలు గెలిచింది. ‘‘కేంద్ర వ్యవసాయ శాఖపై మా పారీ్టకి ఆసక్తి ఉంది. అయితే మేమేమీ డిమాండ్లు చేయడం లేదు. మాకు కర్నాటక ప్రయోజనాలే ప్రధానం. కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రానికి ఎలాంటి ప్రాతినిధ్యం కలి్పంచాలో మోదీ నిర్ణయిస్తారు. అయినా దానిపై సరైన సమయంలో మాట్లాడుకుందాం’’ అని చెప్పుకొచ్చారు. -
Lok Sabha Election 2024: ఎన్నికల చరిత్రలో ఏకగ్రీవాలు
గుజరాత్లో అన్ని లోక్‌సభ స్థానాలకూ మే 7న మూడో విడతలో భాగంగా పోలింగ్ జరిగింది. అయితే అంతకుముందే ఒక సీటు అధికార బీజేపీ ఖాతాలో పడింది! సూరత్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ‘తిరస్కరణ’కు గురవడం, ఆ వెంటనే పోటీలో ఉన్న మిగతా 8 మంది అభ్యర్థులూ నామినేషన్లు ఉపసంహరించుకోవడమే అందుకు కారణం. దాంతో పోలింగ్‌తో పని లేకుండా బీజేపీ అభ్యర్థి ముఖేశ్ దలాల్ ఏకగ్రీవ ఎంపీగా ఎన్నికైపోయారు! అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి నీలేశ్ కుంభానీ మీడియాకు ముఖం చాటేయడంతో ఇదంతా బీజేపీ స్క్రిప్టేనంటూ ఆరోపణలొచ్చాయి. లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఏకగ్రీవాలను ఓసారి చూస్తే... లోక్‌సభ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవడం అసాధారణమైన విషయం. తొలి లోక్‌సభ ఎన్నికలు జరిగిన 1952 నుంచి ఇప్పటిదాకా ఇలా పోటీ లేకుండా గెలిచిన 29వ ఎంపీ దలాల్. బీజేపీ నుంచైతే ఏకగ్రీవంగా ఎన్నికైన తొలి ఎంపీ ఆయనే. 1952, 1957, 1967 ఎన్నికల్లో ఐదేసి మంది చొప్పున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1952లో ఏకగ్రీవమైన ఐదుగురు ఎంపీల్లో ఒక్క జమ్మూ కశీ్మర్ నుంచే నలుగురుండటం విశేషం! ఆంధ్రప్రదేశ్, అసోం, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ సహా ఎనిమిది రాష్ట్రాలు ఒకరికంటే ఎక్కువ మంది ఎంపీలను పోటీ లేకుండా లోక్‌సభకు పంపాయి. పారీ్టలపరంగా చూస్తే ఏకంగా 20 మంది ఏకగ్రీవ ఎంపీలతో ఈ జాబితాలో కాంగ్రెస్ అగ్ర స్థానంలో ఉంది. నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)ల నుంచి ఇద్దరేసి ఏకగ్రీవమయ్యారు. లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఇప్పటిదాకా ఒకే ఒక్క స్వతంత్ర అభ్యర్థి ఏకగ్రీవంగా నెగ్గారు. సిక్కిం, శ్రీనగర్ లోక్‌సభ స్థానాలకు ఒకటి కంటే ఎక్కువసార్లు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవ ప్రముఖులు.. ఏకగ్రీవంగా గెలుపొందిన ఎంపీల్లో పలువురు ప్రముఖులున్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైబీ చవాన్, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా, నాగాలాండ్ మాజీ సీఎం, మాజీ గవర్నర్ ఎస్సీ జమీర్, ఒడిశా తొలి సీఎం హరేకృష్ణ మహతాబ్, రాజ్యాంగ పరిషత్ సభ్యుడు, కాంగ్రెస్ నాయకుడు టీటీ కృష్ణమాచారి, కేంద్ర మాజీ మంత్రులు పీఎం సయీద్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే విజయవాడ నుంచి కేఎల్ రావు పోటీ లేకుండా గెలిచారు. రాజ కుటుంబీకుల నుంచి మొదలు... లోక్‌సభకు ఏకగ్రీవాలు రాజ కుటుంబీకుల నుంచి మొదలయ్యాయి. 1952 తొలి ఎన్నికల్లో లోక్‌సభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మొదటి నాయకునిగా ఆనంద్ చంద్ రికార్డులకెక్కారు. అంతేగాక ఏకగ్రీవమైన ఏకైక స్వతంత్ర అభ్యర్థి కూడా ఆయనే! బిలాస్పూర్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన గెలుపొందారు. నిధుల కొరతను కారణంగా చూపుతూ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్‌ను ఉపసంహరించుకోవడమే అందుకు కారణం. ఆయనకు చంద్ లంచం ఇచి్చనట్టు కాంగ్రెస్ ఆరోపించింది. చంద్ ఎన్నికను కోర్టులో సవాలు కూడా చేసింది. అయితే తీర్పు చాంద్‌కే అనుకూలంగా వచ్చింది. ఇక ఒడిశా తొలి సీఎం హరేకృష్ణ మహతాబ్ 1962లో అంగుల్ నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనపై బరిలో ఉన్న గణతంత్ర పరిషత్ పార్టీ అభ్యర్థి నామినేషన్‌ను ఉపసంహరించుకోవడమే అందుకు కారణం. అదే ఏడాది తెహ్రీ గడ్వాల్ నుంచి మానవేంద్ర షా కాంగ్రెస్ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1967లో లద్దాఖ్ కాంగ్రెస్ అభ్యర్థి, బౌద్ధ ఆధ్యాతి్మక నాయకుడు చోగ్నోర్ పోటీ లేకుండా గెలుపొందారు. 1971లోనూ ఆయన విజయం సాధించారు. 1977లో సిక్కిం స్థానంలో ఏకంగా ఏడుగురు అభ్యర్థుల నామినేషన్ పత్రాలు చెల్లకపోవడంతో ఛత్ర బహదూర్ ఛెత్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అరుణాచల్ వెస్ట్ స్థానంలో రించిన్ ఖండూ ఖ్రీమే ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయనా పోటీ లేకుండా నెగ్గారు. 1989లో కశీ్మర్లో మూడు లోక్‌సభ స్థానాలకు జరిగిన పోలింగ్‌లో కేవలం 5 శాతం ఓటింగ్ నమోదైంది. కాశీ్మర్ లోయలో తిరుగుబాట్లు, ఉగ్రవాదం పెచ్చరిల్లుతున్న నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన మహమ్మద్ షఫీ భట్ శ్రీనగర్ నుంచి పోటీ లేకుండా గెలిచారు! కన్నౌజ్ నుంచి డింపుల్ దలాల్‌కు ముందు చివరిసారిగా ఏకగ్రీవంగా గెలిచిన ఎంపీ సమాజ్‌వాదీ పార్టీ నాయకురాలు డింపుల్ యాదవ్. కన్నౌజ్ ఎంపీగా ఉన్న ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ 2012లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎం అయ్యారు. దాంతో ఖాళీ అయిన కన్నౌజ్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన భార్య డింపుల్ బరిలో దిగారు. కాంగ్రెస్, బీఎస్పీ, రా్రïÙ్టయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ)తో సహా ప్రధాన పార్టీలు ఉప ఎన్నికకు దూరంగా ఉన్నాయి. కొందరు స్వతంత్రులతో పాటు బీజేపీ, పలు చిన్న పారీ్టలు బరిలో దిగాయి. కానీ అంతా నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో డింపుల్ ఏకగ్రీవంగా నెగ్గారు. తమ అభ్యర్థులు నామినేషన్ వేయకుండా ఎస్పీ అడ్డుకుందని బీజేపీ, పీస్ పార్టీ వంటివి ఆరోపించడం విశేషం! చివరి నిమిషం ఉపసంహరణలు... 1985 సిక్కిం లోక్‌సభ స్థానం సిట్టింగ్ ఎంపీ నార్ బహదూర్ భండారీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో లోక్‌సభకు రాజీనామా చేశారు. ఉప ఎన్నికలో ఆయన భార్య దిల్ కుమారి భండారీ సిక్కిం సంగ్రామ్ పరిషత్ నుంచి ఏకగ్రీవంగా నెగ్గారు. కాంగ్రెస్‌తో సహా ఎనిమిది మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడమే అందుకు కారణం. అధికార పార్టీ వారిపై బెదిరింపులకు పాల్పడిందంటూ ఆరోపణలొచ్చాయి!– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎమ్మెల్సీలుగా నితీశ్, రబ్డీ దేవి ఏకగ్రీవం
పట్నా: బిహార్ శాసనమండలి సభ్యులుగా సీఎం నితీశ్ కుమార్, మాజీ సీఎం రబ్డీ దేవి సహా 10 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆర్జేడీకి చెందిన రబ్డీ దేవి శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. కేబినెట్ మంత్రి సంతోష్ సుమన్ కూడా మండలికి ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో ఉన్నారు. జేడీయూ చీఫ్ కూడా అయిన నితీశ్ కుమార్ గురువారం పార్టీ నాయకులతో శాసనమండలి సెక్రటేరియట్‌కు చేరుకుని ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. -
Supreme Court: చట్టసభల్లో అవినీతీ... విచారణార్హమే
సాక్షి, న్యూఢిల్లీ: అవినీతికి పాల్పడే ప్రజాప్రతినిధులు రాజ్యాంగ రక్షణ మాటున దాక్కోలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్టసభల్లో ఓటేయడానికి, మాట్లాడడానికి లంచం తీసుకొనే ఎంపీలు, ఎమ్మెల్యేలు విచారణ నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో వారికి విచారణ నుంచి రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుందంటూ 1998లో జేఎంఎం లంచం కేసులో ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వెలు వరించిన తీర్పును కొట్టేసింది! ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత రాజ్యాంగ ధర్మాసనం సోమవారం ఏకగ్రీవంగా చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. చట్టసభల్లోపల ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రత్యేక అధికారాలను కట్టబెడుతున్న రాజ్యాంగంలోని ఆరి్టకల్ 105(2), ఆరి్టకల్ 194(2) ఇలాంటి ఆరోపణలకు వర్తించబోవని స్పష్టం చేసింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయంటూ ధర్మాసనం స్పష్టత ఇవ్వడం విశేషం. ‘‘పార్లమెంటులోనూ, శాసనమండలి, శాసనసభల్లోనూ, సంబంధిత కమిటీల్లోనూ ఏం అంశం మీదైనా సభ్యులు ఒత్తిళ్లకు అతీతంగా స్వేచ్ఛగా చర్చించగలిగే వాతావరణం నెలకొల్పడమే ఆరి్టకల్ 105, 194 ఉద్దేశం. అంతే తప్ప ఓటేయడానికి, సభలో ప్రసంగించడానికి లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై విచారణ నుంచి కాపాడటం కాదు. లేదంటే ఆ వాటి అసలు ఉద్దేశమే నెరవేరకుండా పోతుంది. లంచం తీసుకునే ప్రజాప్రతినిధి నేరానికి పాల్పడ్డట్టే. వారికి ఎలాంటి రక్షణా కలి్పంచలేం’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాప్రతినిధుల అవినీతి దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య పునాదులనే పెకిలించి వేస్తుందంటూ ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ ఆకాంక్షలను, ఆదర్శాలతో పాటు ప్రజా జీవితంలో విశ్వసనీయతను కూడా దెబ్బ తీస్తుందని ఆవేదన వెలిబుచి్చంది. ‘‘ఆరి్టకల్ 105(2), 194(2) కింద సభ్యుడు కోరే రక్షణ సదరు అంశంపై సభ సమష్టి పనితీరుకు, సభ్యునిగా తాను నెరవేర్చాల్సిన విధులకు పూర్తిగా అనుగుణంగా ఉండాల్సిందే’’ అంటూ రెండు కీలక నిబంధనలను తాజా తీర్పులో పొందుపరిచింది. వాటిని తృప్తి పరిచినప్పుడే సభలో వారు చేసే ప్రసంగానికి, వేసే ఓటుకు చట్టపరమైన విచారణ నుంచి రక్షణ ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ధర్మాసనం తరఫున సీజేఐ 135 పేజీల తీర్పు రాశారు. రాజ్యసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యరి్థకి ఓటేసేందుకు జేఎఎం ఎమ్మెల్యే సీతా సొరెన్ లంచం తీసుకున్నారన్న కేసుపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ సంజయ్‌కుమార్, జస్టిస్ మనోజ్ మిశ్రలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపి 2023 అక్టోబరులో తీర్పు రిజర్వు చేసింది. సోమవారం తీర్పు వెలువరించింది. ‘‘ఒక ప్రజాప్రతినిధి చట్టసభలో ఓటేసేందుకు లంచం స్వీకరించిన, స్వీకరించేందుకు అంగీకరించిన క్షణంలోనే నేరానికి పాల్పడ్డట్టు లెక్క. అంతిమంగా ఓటేశారా, లేదా అన్నదానితో నిమిత్తం లేదు. లంచం స్వీకరించినప్పుడే నేరం జరిగిపోయింది’’ అని స్పష్టం చేసింది. ‘‘ఓటేయడానికి, మాట్లాడడానికి లంచం తీసుకుంటే రాజ్యాంగం కలి్పంచిన స్వేచ్ఛాయుత వాతావరణం సభలో కొనసాగకుండా పోతోంది. అలాంటి నేరాలకు సభ్యుడు రాజ్యాంగపరమైన మినహాయింపులు కోరజాలడు. ఆరి్టకల్ 105, 194 రక్షణలు వర్తించబోవు’’ అని స్పష్టం చేసింది. ‘‘ఇలాంటి సందర్భాల్లో కూడా సభ్యుడుకి విచారణ నుంచి మినహాయింపు ఇస్తున్న 1998 నాటి పీవీ నరసింహారావు కేసు తీర్పును పునఃపరిశీలించడం తప్పనిసరి. లేదంటే న్యాయస్థానం తప్పిదానికి పాల్పడ్డట్టే అవుతుంది’’ అని అభిప్రాయపడింది. కేసు పూర్వాపరాలివీ... జార్ఖండ్‌లో 2012లో రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆ సందర్భంగా ఓటేసేందుకు ఓ స్వతంత్ర అభ్యర్థి నుంచి జేఎంఎం ఎమ్మెల్యే సీతా సొరెన్ లంచం తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. కానీ తాను తమ పార్టీ అభ్యరి్థకే ఓటేశానని పోలింగ్ అనంతరం ఆమె తెలిపారు. మళ్లీ ఎన్నికలు నిర్వహించినా ఆమె సొంత పార్టీ అభ్యరి్థకే ఓటేశారు. అయితే సొరెన్ తన నుంచి లంచం తీసుకున్నారంటూ సదరు స్వతంత్ర అభ్యర్థి పోలీసుల్ని ఆశ్రయించడంతో ఆమెపై ఛార్జిషీటు దాఖలు చేయడంతో పాటు క్రిమినల్ విచారణ చర్యలు చేపట్టారు. ఆరి్టకల్ 194(2) కింద తనకు రక్షణ ఉంటుంది గనుక ఈ ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయాలంటూ సీతా సొరెన్ జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ప్రతికూల నిర్ణయం రావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2014 సెపె్టంబరులో కేసు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందుకు వెళ్లింది. అనంతరం 2019 మార్చిలో నాటి సీజేఐ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసును విచారించింది. 1998 నాటి పీవీ నరసింహారావు కేసులో ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం వెలువరించిన తీర్పును ఈ కేసు విచారణ సందర్భంగా జార్ఖండ్ హైకోర్టు ఉటంకించినందున విచారణను విస్తృత ధర్మాసనానికి అప్పగించాలని నిర్ణయించింది. తదనంతరం సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారించింది. 1998 నాటి కేసులో సీతా సొరెన్ మామ శిబు సొరెన్‌కు ఇదే తరహా కేసులో ఊరట లభించిందని ఆమె తరఫు న్యాయవాది ప్రస్తావించారు. ఆ వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు. ‘‘1998 నాటి పీవీ కేసు తీర్పుతో విభేదిస్తున్నాం. ఆ తీర్పును కొట్టేస్తూ ఏడుగురు న్యాయమూర్తులం ఏకగ్రీవ నిర్ణయానికి వచ్చాం’’ అని పేర్కొంది. ఏమిటీ పీవీ కేసు... 1993లో కేంద్రంలో పీవీ నరసింహారావు ప్రభుత్వం పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంది. ఆ సమయంలో శిబు సొరెన్ సహా ఐదుగురు జేఎంఎం ఎంపీలు లంచం తీసుకొని తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఆరి్టకల్ 105(2), ఆర్టికల్ 194(2) కింద సదరు సభ్యులకు ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపు ఉంటుందంటూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 3:2 మెజారిటీతో 1998లో తీర్పు వెలువరించింది. అది పరస్పర విరుద్ధ ఫలితాలకు దారితీసిందని సీజేఐ సారథ్యంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ‘‘లంచం తీసుకుని తదనుగుణంగా ఓటేసిన సభ్యులకు విచారణ నుంచి ఆ తీర్పు రక్షణ కలి్పస్తోంది. కానీ లంచం తీసుకుని కూడా మనస్సాక్షి మేరకు స్వతంత్రంగా ఓటేసిన సభ్యులను శిక్షిస్తోంది. తద్వారా ఈ రెండు పరిస్థితుల మధ్య కృత్రిమ భేదాన్ని సృష్టించింది. ఆ తీర్పుతో విభేదిస్తూ ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు వెలువరించిన మైనారిటీ తీర్పు దీన్ని ఎత్తి చూపింది కూడా’’ అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. -
ఇమ్రాన్ స్థానంలో గోహర్ అలీ
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్–ఇ– ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ చీఫ్‌గా గోహర్ అలీ ఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ ఎన్నికల గుర్తుగా ‘బ్యాట్’ కొనసాగాలంటే సంస్థాగత ఎన్నికలు జరపాల్సిందేనన్న ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఈ ఎన్నిక జరిగినట్లుగా భావిస్తున్నారు. గోహర్ పేరును ఇమ్రాన్ ప్రతిపాదించారు. శనివారం జరిగిన ప్రత్యేక సమావేశంలో గోహర్(45) పార్టీ అధ్యక్ష పదవికి పోటీ లేకుండా ఎన్నికైనట్లు డాన్ పత్రిక తెలిపింది. తోషఖానా అవినీతి కేసు సహా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇమ్రాన్ సెప్టెంబర్ నుంచి జైలులో∙ఉన్నారు. అందుకే, సంస్థాగత ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేకపోయారు. -
మళ్లీ అణు పరీక్షల బాటలో రష్యా!
మాస్కో: ఉక్రెయిన్‌తో యుద్ధం ఇప్పటికే దీర్ఘకాలిక పోరుగా మారిపోయిన నేపథ్యంలో ఆ దేశానికి పాశ్చాత్య దేశాల సాయానికి అడ్డుకట్టే వేసేందుకు అవసరమైతే అణు పరీక్షలు జరిపేందుకు రష్యా సిద్ధమవుతోందా? తాజా పరిణామాలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. అంతర్జాతీయ సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందానికి ఆమోదాన్ని వెనక్కు తీసుకునేందుకు ఉద్దేశించిన బిల్లుకు రష్యా పార్లమెంట్ డ్యూమా దిగువ సభ తుది ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన సమావేశంలో చట్టసభ సభ్యులంతా ఏకగ్రీవంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆ బిల్లు వచ్చే వారం ఎగువ సభ అయిన ఫెడరేషన్ కౌన్సిల్ ముందుకు వెళ్లనుంది. 2000 నాటి ఈ ఒప్పందం నుంచి తప్పుకుంటామని పుతిన్ ఇటీవలే ప్రకటించడం తెల్సిందే. 1996లో తెరపైకి వచి్చన ఈ ఒప్పందం ఏ దేశమూ ప్రపంచంలో ఎక్కడా అణు దాడులు చేయకూడదు. అయితే ఈ ఒప్పందం పూర్తిస్థాయిలో అమల్లోకి రాలేదు. రష్యా మాత్రమే దీనికి పూర్తి ఆమోదం తెలిపింది. అమెరికా, భారత్, పాకిస్థాన్, ఉ.కొరియా తదితర దేశాలేవీ దీనికి ఆమోదం తెలపలేదు. రష్యా వీలైనంత త్వరగా మళ్లీ అణు పరీక్షలకు దిగి సత్తా చాటాలని ఆ దేశ రాజకీయ వర్గాల నుంచి పుతిన్‌పై ఒత్తిడి పెరిగిపోతోంది. -
మహిళా బిల్లుకు ఆమోదం.. పార్లమెంటు నిరవధిక వాయిదా
న్యూఢిల్లీ: మూడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెర పడింది. నారీ శక్తికి పార్లమెంటు సగౌరవంగా ప్రణమిల్లింది. నూతన భవనంలో తొట్టతొలిగా మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించి సరికొత్త చరిత్ర లిఖించింది. ఈ చరిత్రాత్మక ఘట్టానికి రాజ్యసభ వేదికైంది. ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన నారీ శక్తి విధాన్ అధినియమ్ బిల్లుకు గురువారం పెద్దల సభ సైతం జై కొట్టింది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన 128వ రాజ్యాంగ సవరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. సభకు హాజరైన మొత్తం 214 మంది సభ్యులూ పార్టీలకు అతీతంగా బిల్లుకు మద్దతిచ్చారు. దాంతో అది ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. మహిళా బిల్లు బుధవారమే లోక్‌సభలో మూడింట రెండొంతులకు పైగా మెజారిటీతో పాస్ అవడం తెలిసిందే. 454 మంది ఎంపీలు మద్దతివ్వగా ఇద్దరు మజ్లిస్ సభ్యులు మాత్రమే వ్యతిరేకించారు. ఈ రిజర్వేషన్లు 15 ఏళ్లపాటు అమల్లో ఉంటాయని కేంద్రం ప్రకటించింది. అనంతరం వాటి కొనసాగింపుపై అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పింది పార్టీలకతీతంగా మద్దతు అంతకుముందు బిల్లుపై జరిగిన చర్చలో రాజ్యసభ సభ్యులంతా ముక్త కంఠంతో మద్దతు పలికారు. కొందరు విపక్షాల సభ్యులు మాత్రం దీన్ని బీజేపీ ఎన్నికల గిమ్మిక్కుగా అభివరి్ణంచారు. తాజా జన గణన, నియోజకవర్గాల పునర్విభజన కోసం ఎదురు చూడకుండా బిల్లు అమలు ప్రక్రియను వీలైనంత వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. బిల్లును తక్షణం అమలు చేయాలని కేసీ వేణుగోపాల్ (కాంగ్రెస్) డిమాండ్ చేశారు. ఈ బిల్లు అంశాన్ని తొమ్మిదేళ్లుగా పట్టించుకోకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇప్పుడు హడావుడి చేస్తున్నారని ఆరోపించారు. ఓబీసీ మహిళలకూ దీన్ని వర్తింపజేయాలన్నారు. 2014, 2019ల్లో కూడా మహిళా బిల్లు తెస్తామని బీజేపీ వాగ్దానం చేసి మోసగించిందని ఎలమారం కరీం (సీపీఎం) ఆరోపించారు. మహిళలంటే మోదీ సర్కారుకు ఏ మాత్రమూ గౌరవం లేదన్నారు. మణిపూర్ హింసాకాండపై ప్రధాని మోదీ నిర్లిప్తతే ఇందుకు రుజువన్నారు. ఎన్నికల వేళ బిల్లు తేవడంలో ఆంతర్యం ఏమిటని రామ్‌నాథ్ ఠాకూర్ (జేడీయూ) ప్రశ్నించారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా తక్షణం మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కె.కేశవరావు (బీఆర్ఎస్), వైగో (ఎండీఎంకే) డిమాండ్ చేశారు. తక్షణం డీ లిమిటేషన్ కమిషన్ వేయాలని వారన్నారు. మహిళా బిల్లుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తోందని ఆ పార్టీ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి పునరుద్ఘాటించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను రాజ్యసభకు, రాష్ట్రాల శాసన మండళ్లకు కూడా వర్తింపజేయాలని కోరారు. కర్ణాటక సీఎంగా, ప్రధానిగా మహిళా రిజర్వేషన్ల కోసం తాను తీసుకున్న చర్యలను జేడీ (ఎస్) సభ్యుడు దేవెగౌడ గుర్తు చేసుకున్నారు. ఇప్పుడేం జరుగుతుంది? రాష్ట్రపతి ఆమోద ముద్ర పడగానే మహిళా బిల్లు చట్ట రూపం దాలుస్తుంది. తర్వాత మెజారిటీ రాష్ట్రాల అసెంబ్లీలు దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నూతన జన గణన, నియోజకవర్గాల పునరి్వభజన అనంతరం రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. ఇది 2029 కల్లా జరిగే అవకాశముందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారమే పరోక్షంగా తెలిపారు. ఏమిటీ బిల్లు? ► ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును నారీ శక్తి విధాన్ అధినియమ్‌గా పేర్కొంటున్నారు. ► దీని కింద లోక్‌సభ, ఢిల్లీ సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు, అంటే 33 శాతం సీట్లు రిజర్వ్ చేస్తారు. ► ప్రధానంగా పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగే రాజ్యసభ, రాష్ట్రాల శాసన మండళ్లకు ఈ రిజర్వేషన్లు వర్తించవు. చరిత్రాత్మక క్షణాలివి! ప్రధాని మోదీ భావోద్వేగం మహిళా బిల్లు రాజ్యసభ ఆమోదం పొందిన క్షణాలను చరిత్రాత్మకమైనవిగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. బిల్లు పెద్దల సభ ఆమోదం పొందిన సమయంలో ఆయన సభలోనే ఉన్నారు. ‘భారత మహిళలకు మరింత ప్రాతినిధ్యం, సాధికారత లభించే నూతన శకంలోకి మనమిక సగర్వంగా అడుగు పెట్టనున్నాం. ఇది కేవలం చట్టం మాత్రమే కాదు. మన దేశాన్ని నిరంతరం ఇంత గొప్ప స్థాయిలో తీర్చిదిద్దుతున్న, అందుకోసం తమ సర్వస్వాన్నీ నిరంతరం త్యాగం చేస్తూ వస్తున్నా సంఖ్యాకులైన మహిళామణులకు, మన మాతృమూర్తులకు మనం చేస్తున్న వందనమిది. వారి సహనశీలత, త్యాగాలు అనాదిగా మన గొప్ప దేశాన్ని మరింత సమున్నతంగా తీర్చిదిద్దుతూ వస్తున్నాయి‘ అంటూ మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. ‘ఉభయ సభల్లోనూ బిల్లుపై అర్థవంతమైన చర్చలు జరిగాయి. అవన్నీ పూర్తిగా విజయవంతమయ్యాయి. ఈ చర్చలు భవిష్యత్తులోనూ మనందరికీ ఎంతగానో ఉపకరిస్తాయి. బిల్లుకు మద్దతి చి్చన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఈ స్ఫూర్తి భారతీయుల ఆత్మ గౌరవాన్ని సరికొత్త ఎత్తులకు చేరుస్తుంది‘ అని ఆయన పేర్కొన్నారు. రాజ్యసభ, మండళ్లలో అసాధ్యం: నిర్మల చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించుకోవడం ద్వారా పార్లమెంటు నూతన భవనానికి శుభారంభం అందించే నిమిత్తమే ఈ సమావేశాలను ఏర్పాటు చేసినట్టు ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు. బిల్లుపై చర్చలో ఆమె మాట్లా డుతూ రాజ్యసభ, శాసన మండళ్లకు జరిగేవి పరోక్ష ఎన్నికలు గనుక మహిళలకు రిజర్వేషన్లు ఆచరణసాధ్యం కాదన్నారు. పార్లమెంటు నిరవధిక వాయిదా చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించిన అనంతరం పార్లమెంటు ఉభయ సభలు గురువారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. నిజానికి 18న మొదలైన ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు షెడ్యూల్ ప్రకారం 22వ తేదీ దాకా జరగాల్సి ఉంది. రాజ్యసభకు ఇది 261 సెషన్. కాగా, 17వ లోక్‌సభకు బహుశా ఇవే చివరి సమావేశాలని భావిస్తున్నారు. -
Womens Reservation Bill 2023: ఏకగ్రీవ ఆమోదానికి కలిసి రండి
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందేందుకు కలిసి రావాల్సిందిగా విపక్షాలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. బిల్లులో లోపాలేమన్నా ఉంటే తర్వాత సరిచేసుకుందామని సూచించారు. కేంద్రం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన జోక్యం చేసుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. బిల్లు అమలులో ఆలస్యానికి సంబంధించి కాంగ్రెస్ సహా విపక్షాలు చేస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. మహిళలకు రిజర్వేషన్లు 2029 తర్వాత అమల్లోకి వస్తాయన్న సంకేతాలిచ్చారు. ఓబీసీలకు బీజేపీ పాలనలో అన్యాయం జరుగుతోందన్న విపక్షాల ఆరోపణలను తోసిపుచ్చారు. వారికి తమ హయాంలోనే అన్నింటా అత్యధిక ప్రాతినిధ్యం దక్కిందని చెప్పారు. ‘రాబోయే ఎన్నికల తర్వాత కేంద్రంలో వచ్చే నూతన ప్రభుత్వం వెంటనే జన గణన, నియోజకవర్గాల పునర్విభజన చేపడుతుంది. పార్లమెంటులో మహిళా బిల్లు ఆమోదానికి ఇది ఐదో ప్రయత్నం. ఇప్పుడు కాంగ్రెస్ లేవనెత్తిన అడ్డంకులను అధిగమించేందుకు వారి హయాంలో ఎందుకు ప్రయతి్నంచలేదు? అందుకే గత నాలుగు సార్లూ బిల్లును ఆమోదించలేని పార్లమెంటు తీరుతో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. అందుకే ఈసారైనా ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించుకుందాం‘ అని విపక్షాలను అమిత్ షా కోరారు. రాహుల్ పై విసుర్లు 90 మంది కేంద్ర కేబినెట్ కార్యదర్శుల్లో ముగ్గురు మాత్రమే ఓబీసీలు ఉన్నారన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలను అమిత్ ఎద్దేవా చేశారు. ‘కార్యదర్శులు దేశాన్ని నడుపుతారన్నది నా సహచర ఎంపీ అవగాహన! కానీ నాకు తెలిసినంత వరకూ ప్రభుత్వమే దేశాన్ని నడుపుతుంది. విధాన నిర్ణయాలు చేసేది కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్‘ అన్నారు. ‘ఎవరో స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన చీటీలను సభలో చదవడం గొప్ప కాదు. ఓబీసీల అభ్యున్నతికి ప్రధాని మోదీ చిత్తశుద్ధితో కృషి చేశారు‘ అన్నారు. ‘బీజేపీ ఎంపీల్లో దాదాపు 29 శాతం మంది ఓబీసీలే. దేశవ్యాప్తంగా 27 శాతానికి పైగా బీజేపీ ఎమ్మెల్యేలు, 40 శాతానికి పైగా ఎమ్మెల్సీలు ఓబీసీలే’ అని అమిత్ అన్నారు. అప్పుడు కేంద్రాన్నే నిందిస్తారు! మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణం అమల్లోకి తేవాలన్న విపక్షాల డిమాండ్‌ను అమిత్ షా తోసిపుచ్చారు. ‘రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్, అసదుద్దీన్ ఒవైసీ (మజ్లిస్ అధినేత) ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ లోక్‌సభా స్థానాలు ఒకవేళ మహిళలకు రిజర్వ్ అయితే రాజకీయాలు చేస్తోందంటూ అందుకు మళ్లీ మోదీ సర్కారునే నిందిస్తారు. అందుకే నియోజకవర్గాల పునరి్వభజనను సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీ సారథ్యంలోని కమిషన్ పూర్తి పారదర్శకంగా చేపడుతుంది‘ అన్నారు. -
ఉప ఎన్నికల్లోనూ సగానికిపైగా ఏకగ్రీవాలు
సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా 484 మండలాల పరిధిలో మొత్తం 1,033 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో సగానికి పైగా స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఆయా గ్రామాల్లో మొత్తం 66 సర్పంచ్ స్థానాలతోపాటు 1,064 వార్డు సభ్యులకు ఉప ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. పదో తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగగా, సోమవారం సాయంత్రం మూడు గంటలకు నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ముగిసింది. అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి అందిన సమాచారం మేరకు.. సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగే మొత్తం 66 గ్రామాల్లో 32 చోట్ల ఎన్నిక ఏకగ్రీవం కాగా, రెండుచోట్ల అభ్యర్థులెవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. కేవలం 32చోట్ల మాత్రమే సర్పంచ్ స్థానాలకు ఈ నెల 19న పోలింగ్ జరగనుంది. మరోవైపు 1,064 వార్డు సభ్యులకు ఉప ఎన్నికలు జరుగుతుండగా.. 757 స్థానాలు ఏకగ్రీవం కాగా, 261 చోట్ల 19న పోలింగ్ జరగనుంది. 46 వార్డు సభ్యుల స్థానాలకు ఒక్కరు కూడా నామినేషన్లు దాఖలు చేయనందున ఆయా స్థానాల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. మూడురెట్లు పెరిగిన ఏకగ్రీవాలు.. రెండున్నర ఏళ్ల క్రితం... అంటే 2021 జనవరి, ఫిబ్రవరిలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో సర్పంచ్ స్థానాల్లో కేవలం 17 శాతం, వార్డు సభ్యుల స్థానాల్లో 36 శాతం ఏకగ్రీవమయ్యాయి. కానీ, ఇప్పుడు రెండున్నర ఏళ్ల తర్వాత ఉప ఎన్నికలు జరుగుతున్నప్పటికీ.. అప్పటికంటే సర్పంచ్ స్థానాల్లో దాదాపు మూడు రెట్లు ఏకగ్రీవాలు పెరగగా, వార్డు సభ్యుల స్థానాల్లో ఏకగ్రీవాలు రెట్టింపు కావడం గమనార్హం. -
ఆరు పద్దులకు ఆమోదం
సాక్షి, అమరావతి: శాసనసభ సమావేశాల సందర్భంగా ఆరు బడ్జెట్ పద్దులకు ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. గురువారం సభలో వ్యవసాయ–సహకార, పశు సంవర్థక–మత్స్య, పౌర సరఫరాలు, ప్రణాళిక–శాసన వ్యవహారాలు, గవర్నర్, కేబినెట్, జీఏడీ నిర్వహణ, సమాచార, ప్రజా సంబంధాలకు చెందిన పద్దులను ప్రవేశపెట్టారు. వీటిపై చర్చించిన అనంతరం మంత్రులు సమాధానం ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకునే ప్రతి నిర్ణయం రైతులకు అండగా నిలిచిందని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. ఎన్నడూ లేనివిధంగా ఖరీఫ్‌కు ముందస్తుగా సాగునీరు, వైఎస్సార్ రైతు భరోసాతో పెట్టుబడి సాయం అందించడం మంచి ఫలితాలను ఇస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులపై పైసా భారం పడకుండా వైఎస్సార్ ఉచిత పంటల బీమాను అందిస్తున్నామన్నారు. మార్కెట్లో గిట్టుబాటు ధర లభించని పంటలను ఎమ్మెస్పీకి కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు. టీడీపీ హయాంలో ఆక్వా జోన్ పరిధిలో 2.56 లక్షల ఎకరాలు, నాన్ ఆక్వా జోన్లో 1.90 లక్షల ఎకరాలు భూమి ఉందని పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక ఆక్వా జోన్లోకి 4.20 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయన్నారు. ఆక్వా రైతులకు సబ్సిడీ విద్యుత్‌కు సంబంధించి టీడీపీ సర్కారు రూ.309 కోట్ల రీయింబర్స్ పెండింగ్‌లో పెట్టగా, తమ ప్రభుత్వం వచ్చాక యూనిట్ రూ.1.50 చొప్పున సబ్సిడీ విద్యుత్ ఇస్తూనే పాత బకాయిలతో కలిపి రూ.2,687 కోట్లు ఖర్చు చేశామన్నారు. పాడి రైతులకు గతంలో ఎన్నడూ లేని విధంగా లీటరు గేదె పాలపై రూ.20 లబ్ధి చేకూరుస్తున్నట్టు చెప్పారు. అమూల్ రేట్లు పెంచడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ డెయిరీలు రేట్లు పెంచాల్సి వచి్చందని, ఆ మేరకు రైతులకు రూ.2,300 కోట్ల మేర ప్రయోజనం కలిగిందని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల బిల్లుకు సభ ఆమోదం సాక్షి, అమరావతి : గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు చట్టబద్ధత కల్పిస్తూ రూపొందించిన ఏపీ గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల బిల్లు–2023కు గురువారం శాసనసభ ఆమోదం తెలిపింది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ సభలో బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో సచివాలయాల వ్యవస్థను ప్రభుత్వం తీసుకొచ్చిందని మంత్రి సురేశ్ తెలిపారు. సచివాలయాల ద్వారా 500కు పైగా సేవలు ప్రజలకు గ్రామ, వార్డు స్థాయిల్లోనే అందుతున్నాయన్నారు. ఇక సచివాలయాల బిల్లుతో పాటు మరో ఆరు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. సభ ఆమోదం పొందిన ఆరు బిల్లులు ♦ ఏపీ ఎస్సీ సబ్ ప్లాన్, ట్రైబల్ సబ్ ప్లాన్ (సవరణ) బిల్లు–2023 ♦ ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ ఎస్టీ (సవరణ) బిల్లు–2023 ♦ ఏపీ పబ్లిక్ సర్విసెస్ డెలివరీ గ్యారంటీ (సవరణ) బిల్లు–2023 ♦ ఏపీ మున్సిపల్ లాస్ (సవరణ) బిల్లు–2023 ♦ ఏపీ మున్సిపల్ లాస్ (రెండో సవరణ) బిల్లు–2023 ♦ ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ (సవరణ) బిల్లు–2023 -
5 ఎమ్మెల్సీ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఏకగ్రీవం.. ఎన్నికైంది ఎవరెవరంటే?
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న 9 స్థానాల్లో ఐదింట్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సోమవారం ముగిసింది. అనంతరం అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటరి్నంగ్ అధికారులు ప్రకటించి, విజేతలకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులతో పాటు టీడీపీ మద్దతుదారులు, పలువురు స్వతంత్రులు నామినేషన్లు సమరి్పంచారు. అయితే, వారి నామినేషన్ పత్రాలు సరిగా లేకపోవడం, ప్రతిపాదితుల సంతకాలు ఫోర్జరీవి కావడం తదితర కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. దీంతో వైఎస్సార్సీపీ అభ్యర్థులు మాత్రమే రంగంలో మిగిలారు. పలువురు అభ్యర్థులు పోటీలో ఉండటంతో పశి్చమ గోదావరి జిల్లాలోని 2 స్థానాలు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లోని మరో రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు వంకా రవీంద్రనా«థ్, కవురు శ్రీనివాస్, మరో ముగ్గురు పోటీలో ఉన్నారు. శ్రీకాకుళం బరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి నర్తు రామారావు, ఓ స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు. కర్నూలు జిల్లా బరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ ఎ.మధుసూదన్, ఇద్దరు స్వతంత్రులు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ బరిలో పలువురు అభ్యర్థులు 3 పట్టభద్రుల నియోజకవర్గాలు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పలువురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో వైఎస్సార్సీపీ మద్దతిస్తున్న సీతంరాజు సుధాకర్, టీడీపీ మద్దతిస్తున్న డా.వి.చిరంజీవిరావు, బీజేపీ మద్దతుతో మాధవ్ సహా 37 మంది ఉన్నారు. ఉమ్మడి ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు పట్టభద్రుల స్థానంలో వైఎస్సార్సీపీ తరపున పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి, టీడీపీ తరపున కంచర్ల శ్రీకాంత్ చౌదరి సహా 22 మంది పోటీలో ఉన్నారు. పశి్చమ రాయలసీమ (ఉమ్మడి అనంతపురం, వైఎస్సార్, కర్నూలు జిల్లాలు) స్థానానికి వైఎస్సార్సీపీ తరపున వెన్నపూస రవీంద్రారెడ్డి, టీడీపీ నుంచి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి సహా 49 మంది రంగంలో ఉన్నారు. ఉమ్మడి ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో వైఎస్సార్సీపీ మద్దతిస్తున్న పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, పీడీఎఫ్ మద్దతుతో పొక్కిరెడ్డి బాబురెడ్డి సహా 8 మంది రంగంలో ఉన్నారు. పశి్చమ రాయలసీమ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి వైఎస్సార్సీపీ మద్దతిస్తున్న ఎం.వి.రామచంద్రారెడ్డితో పాటు ఒంటేరు శ్రీనివాసరెడ్డి, కత్తి నరసింహారెడ్డి సహా 12 మంది బరిలో ఉన్నారు. ఎన్నికలు జరిగే ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే నెల 13న పోలింగ్ జరుగుతుంది. 16న ఓట్లను లెక్కించి, విజేతలను ప్రకటిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్సార్సీపీ అభ్యర్థులు ► అనంతపురం జిల్లా – ఎస్.మంగమ్మ ► వైఎస్సార్ జిల్లా – పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ► చిత్తూరు జిల్లా – సిపాయి సుబ్రమణ్యం ► శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా – మేరుగ మురళీధర్ ► తూర్పు గోదావరి జిల్లా – కుడిపూడి సూర్యనారాయణ -
వేడెక్కుతున్న రాష్ట్రపతి ఎన్నిక.. ఏకగ్రీవమా, ఎన్నికా?
రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ క్రమంగా వేడెక్కుతోంది. ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలన్న విపక్షాల ప్రయత్నాలు కొలిక్కి రాకుండానే బీజేపీ ‘ఏకగ్రీవ’ రాగం ఎత్తుకుని పరిస్థితిని ఆసక్తికరంగా మార్చింది. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో దాదాపుగా 49 శాతం ఓట్లున్న బీజేపీకి ఒకటీ అరా పార్టీల మద్దతుతో తన అభ్యర్థిని గెలిపించుకోవడం సునాయసమని భావిస్తున్నారు. కానీ ఆజాదీ అమృతోత్సవ్ జరుపుకుంటున్న తరుణం గనుక రాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని పార్టీ పిలుపునిచ్చింది. ఇందుకు విపక్షాలనూ ఒప్పించేందుకు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ చీఫ్ నడ్డా రంగంలోకి దిగినా అన్ని పార్టీలూ ఏకతాటిపైకి తెచ్చే అవకాశాలు అంతంతే. మరోవైపు అభ్యర్థి ఎంపిక కోసమంటూ తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన విపక్షాల భేటీకి టీఆర్ఎస్, ఆప్, బీజేడీ వంటి పార్టీలు డుమ్మా కొట్టడంతో అస్పష్టత మరింత పెరిగింది. అందుకే బీజేపీ ఇప్పటికే తన అభ్యర్థి ఎంపిక కసరత్తును ముమ్మరం చేసింది. ఈసారి ముస్లింకు అవకాశమిస్తుందన్న అంచనాలున్నాయి. ఇప్పటివరకు ముగ్గురు ముస్లింలు డాక్టర్ జాకీర్ హుస్సేన్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ , ఏపీజే అబ్దుల్ కలాం రాష్ట్రపతులయ్యారు. గత ఎన్నికలప్పుడు రాష్టపతి అభ్యర్థి పేరును బీజేపీ చివరి నిమిషం దాకా గోప్యంగా ఉంచింది. దళితుడైన రామ్‌నాథ్ కోవింద్ పేరును ప్రకటించింది. 2002లోనూ ఎన్డీఏ హయాంలో నాటి ప్రధాని వాజ్‌పేయి కూడా ఇలాగే చివరి నిమిషంలో అనూహ్యంగా అబ్దుల్ కలాం పేరును ప్రకటించారు. ఈసారి ప్రచారంలో ఉన్న వారిని ఓసారి చూస్తే... అరిఫ్ మహమ్మద్ ఖాన్ రాష్ట్రపతి రేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు కేరళ గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్. యూపీలోని బులంద్‌షహార్‌కు చెందిన ఈయన విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్, జనతాదళ్, బీఎస్పీ, లెఫ్ట్ పార్టీల్లో పని చేశారు. 2004లో బీజేపీలో చేరారు. మహ్మద్ ప్రవక్తపై బీజేపీ సస్పెండెడ్ నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా అగ్గి రాజేసిన నేపథ్యంలో ముస్లింకు అత్యున్నత పదవిని కాషాయ పార్టీ కట్టబెట్టవచ్చన్న అభిప్రాయం బలంగా ఉంది. ద్రౌపది ముర్ము ఆరు రాష్ట్రాల్లో ఆదివాసీల ఓట్లు గణనీయంగా ఉన్నందున ఈసారి ఆదివాసీలకు అవకాశమివ్వాలని ప్రధాని మోదీ యోచిస్తున్నట్టు ప్రచారముంది. తొలి చాయిస్‌గా జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము పేరు వినిపిస్తోంది. మహిళకు చాన్సిస్తే రానున్న పలు ఎన్నికల్లో మహిళల ఓట్లను మరింతగా రాబట్టవచ్చన్నది బీజేపీ వ్యూహమంటున్నారు. ద్రౌపదిది ఒడిశా గనుక కీలకమైన బిజూ జనతాదళ్ మద్దతూ లభిస్తుంది. గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్‌కు షాకిచ్చేలా ఆ పార్టీ అసంతృప్త నేత గులాం నబీ ఆజాద్‌ను బీజేపీ రంగంలోకి దించే చాన్స్ లేకపోలేదంటున్నారు. ఆజాద్ అనుచరులు ఇప్పటికే భారీ సంఖ్యలో బీజేపీలో చేరారు. కశ్మీరీ ముస్లిం నేతను రాష్ట్రపతిని చేస్తే ఒక్క దెబ్బకు ఎన్నో పిట్టల్ని కొట్టొచ్చన్న యోచనా ఉందంటున్నారు. గోపాలకృష్ణ గాంధీ, ఫరూక్ అబ్దుల్లా విపక్షాల తరఫున బరిలో దిగేందుకు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నిరాకరించడంతో మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా పేర్లను మమత తెరపైకి తెచ్చారు. 77 ఏళ్ల గాంధీ బ్యూరోక్రాట్‌గా, దౌత్యవేత్తగా పలు దేశాల్లో పని చేశారు. పశ్చిమబెంగాల్ గవర్నర్‌గానూ చేశారు. 2017లో ఉపరాష్ట్రపతిగా పోటీ చేసి ఓడారు. స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ గాంధీ మనవడిని దింపి బీజేపీని ఇరకాటంలో పెట్టవచ్చన్న ఆలోచన విపక్షాల్లో ఉంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో బీజేపీ హవాకు అడ్డుకట్ట వెయ్యాలంటే ఆ ప్రాంతానికి చెందిన ఫరూక్‌ను బరిలో దించే ఆలోచనా ఉంది. బీజేపీ ముస్లింకు అవకాశమిస్తే పోటీగా ఫరూక్‌ను దించాలని భావిస్తున్నాయి. బీజేపీ నేత ముక్తార్ అబ్సాస్ నక్వీ, ఛత్తీస్‌గఢ్ గవర్నర్ అనుసూయ ఊకే, తెలంగాణ గవర్నర్ తమిళసై , కర్ణాటక గవర్నర్, దళిత నేత తావర్ చంద్ గెహ్లాట్, లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్ర మహాజన్ తదితరుల పేర్లు కూడా చక్కర్లు కొడున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏపీలో 11 మంది ఎమ్మెల్సీలు ఏకగ్రీవం.. అన్నీ వైఎస్సార్సీపీ ఖాతాలోకే..!
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల కోటాలో శాసనమండలిలోని 11 స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి వైఎస్సార్సీపీ అభ్యర్థులు మాత్రమే బరిలో మిగిలారు. పోటీ లేకపోవడంతో వైఎస్సార్సీపీ అభ్యర్థులంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందుకు సంబంధించిన ప్రకటనను రిటర్నింగ్ అధికారులు లాంఛనంగా జారీ చేయనున్నారు. దీంతో 58 మంది సభ్యులు ఉన్న శాసనమండలిలో వైఎస్సార్సీపీ బలం 20 నుంచి 31కు పెరగనుంది. స్థానిక సంస్థల కోటాలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు వీరే.. జిల్లా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ విజయనగరం ఇందుకూరు రఘురాజు విశాఖపట్నం వరుదు కళ్యాణి, వంశీకృష్ణ యాదవ్ తూర్పుగోదావరి అనంత ఉదయభాస్కర్ కృష్ణా తలశిల రఘురాం, మొండితోక అరుణ్‌కుమార్ గుంటూరు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు ప్రకాశం తూమాటి మాధవరావు చిత్తూరు కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ అనంతపురం వై.శివరామిరెడ్డి -
కాకినాడ మేయర్‌గా శివప్రసన్న
కాకినాడ(తూర్పుగోదావరి): తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ నూతన మేయర్‌గా సుంకర శివప్రసన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్పొరేషన్ ప్రత్యేక సమావేశంలో ఆమె ఎన్నిక జరిగింది. ఆమెపై పోటీ చేసేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రిసైడింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ ప్రకటించారు. డిప్యూటీ మేయర్–1గా 24వ డివిజన్ కార్పొరేటర్ మీసాల ఉదయ్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎక్స్అఫీషియో సభ్యులు, మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ వంగా గీత, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీకి చెందిన డిప్యూటీ మేయర్–2 చోడిపల్లి ప్రసాద్‌తో పాటు 17 మంది కార్పొరేటర్లు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనకు ఆకర్షితులై స్వచ్ఛందంగా ముందుకొచ్చి వైఎస్సార్సీపీ కండువాలు వేసుకుని పార్టీకి మద్దతు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ కాకినాడ నగర మాజీ అధ్యక్షుడు నున్న దొరబాబు సోమవారం మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేల సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. సామాజిక సమతుల్యం కాకినాడ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా సామాజిక సమతుల్యం పాటించారు. ఎన్నికల సందర్భంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు పదవుల ఎంపికలో సామాజిక సమతుల్యం పాటిస్తానని సీఎం ఇచ్చిన హామీని ఇక్కడ నెరవేర్చారు. మేయర్‌గా కాపు సామాజికవర్గానికి చెందిన సుంకర శివప్రసన్నకు అవకాశం దక్కగా, డిప్యూటీ మేయర్–1 ఎస్సీ రెల్లి సామాజికవర్గానికి చెందిన మీసాల ఉదయ్‌కుమార్‌ను ఎంపిక చేశారు. కొద్దిరోజుల కిందట జరిగిన ఎన్నికలో డిప్యూటీ మేయర్–2గా బీసీ మత్స్యకార వాడబలిజకు చెందిన చోడిపల్లి ప్రసాద్‌కు అవకాశమిచ్చారు. సీఎం జగన్ సామాజిక న్యాయం: మంత్రి కన్నబాబు సీఎం వైఎస్ జగన్ సామాజిక న్యాయం పాటిస్తూ బలహీనవర్గాలకు రాజకీయ పదవులు ఇస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడ కౌన్సిల్ రెండు డిప్యూటీ మేయర్ పదవులను మత్స్యకార, రెల్లి సామాజిక వర్గాలకు ఇచ్చారన్నారు. మాటలతో కాకుండా చేతలతో చేసి చూపించే సీఎం.. వైఎస్ జగన్ అని కన్నబాబు అన్నారు. ఇది కార్పొరేటర్ల విజయం: ఎమ్మెల్యే ద్వారంపూడి మేయర్ల ఎన్నిక కార్పొరేటర్ల విజయం అని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. సీఎం జగన్ భావాలకు అనుగుణంగా మేయర్‌గా ఒక మహిళను, రెండు డిప్యూటీ మేయర్ పదవులకు ఒక బీసీ( మత్స్యకార), ఎస్సీ(రెల్లి) కార్పొరేటర్లను ఎన్నుకున్నామని ఎమ్మెల్యే తెలిపారు. చదవండి: AP: ఐదు కోట్ల డోసులు.. కోవిడ్ టీకాల్లో మరో మైలురాయి డిప్యూటీ మేయర్ మీసాల ఉదయ్‌కుమార్ -
గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్: ఆయనే ఎందుకు
గాంధీనగర్: గుజరాత్లో 2017లో తొలిసారిగా బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన భూపేంద్ర పటేల్(59)ను అదృష్టం వరించింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆదివారం సమావేశమైన బీజేపీ శాసనసభా పక్షం ఆయనను తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలుండగా, 112 మంది బీజేపీ సభ్యులున్నారు. శాసనసభా పక్ష సమావేశానికి వీరంతా హాజరయ్యారు. తదుపరి సీఎంగా భూపేంద్ర పటేల్ పేరును శనివారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విజయ్ రూపానీ ప్రతిపాదించారు. ఇందుకు బీజేపీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. శాసనసభా పక్ష సమావేశానికి బీజేపీ కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, ప్రహ్లాద్ జోషీ, సీనియర్ నేత తరుణ్ చుగ్ హాజరయ్యారు. కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్ ఎన్నికతో రూపానీ వారసుడు ఎవరన్న దానిపై సస్పెన్స్‌కు తెరపడింది. భూపేంద్ర పటేల్ ఆదివారం సాయంత్రం గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌ను కలిశారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయనకు తెలియజేశారు. ఈ సందర్భంగా భూపేంద్ర వెంట నరేంద్రసింగ్ తోమర్, ప్రహ్లాద్ జోషీ, విజయ్ రూపానీ, సి.ఆర్.పాటిల్ తదితరులు ఉన్నారు. నేడు భూపేంద్ర ఒక్కరే ప్రమాణం భూపేంద్ర పటేల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సోమవారం మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రమాణ స్వీకా రం చేస్తారని గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సి.ఆర్.పాటిల్ ప్రకటించారు. కేవలం ఆయన ఒక్కరే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందన్నారు. సీనియర్ నేతలతో సంప్రదింపులు జరిపి, 2, 3 రోజుల్లో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడిం చారు. ఉప ముఖ్యమంత్రి పదవిపై పార్టీ శాసనసభా పక్ష భేటీలో ఎలాంటి చర్చ జరుగలేదన్నారు. మోదీ, షా, నడ్డాలకు కృతజ్ఞతలు తనపై నమ్మకం ఉంచి, ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినందుకు గాను ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డాకు భూపేంద్ర పటేల్ కృతజ్ఞతలు తెలియజేశారు. మాజీ సీఎం ఆనందిబెన్ పటేల్ ఆశీస్సులు తనకు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. విజయ్ రూపానీ ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని ఉద్ఘాటించారు. భూపేంద్ర పటేల్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో, భూపేంద్ర నాయకత్వంలో గుజరాత్ అభివృద్ధికి కొత్త ఉత్సాహం, ఊతం లభిస్తాయని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. మళ్లీ అధికారం దక్కించుకోవాలనే.. గుజరాత్ తదుపరి సీఎంగా భూపేంద్ర పటేల్‌ను ఎన్నుకోవడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపర్చింది. నిజానికి తొలుత కేంద్ర పాలిత ప్రాంతాలైన లక్షద్వీప్, దాద్రా నగర్ హవేలి, డయ్యూ, డామన్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా పేర్లు వినిపించాయి. కొత్త ముఖ్యమంత్రిగా వారిద్దలో ఒకరిని ఎంపిక చేస్తారన్న ప్రచారం సాగింది. ఆశావహుల జాబితాలో భూపేంద్ర పటేల్ పేరు లేదు. తొలిసారిగా ఎమ్మెల్యేగా నెగ్గిన ఆయనను ఏకంగా సీఎం పదవి వరించడం గమనార్హం. భూపేంద్ర పటేల్ గుజరాత్లో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలమైన పాటిదార్ సామాజిక వర్గానికి చెందినవారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది డిసెంబర్లో శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. మళ్లీ అధికారం దక్కించుకోవాలంటే పాటిదార్ వర్గాన్ని మచ్చిక చేసుకోక తప్పదన్న అంచనాతోనే బీజేపీ నాయకత్వం భూపేంద్ర వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. విజయ్ రూపానీ మొదటిసారిగా 2016 ఆగస్టు 7న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఏడాది ఆగస్టు 7న సీఎంగా మొత్తం ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తిచేసుకున్నారు. వార్డు కౌన్సిలర్ నుంచి సీఎం దాకా.. అహ్మదాబాద్: గుజరాత్ నూతన ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్న భూపేంద్ర పటేల్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఘాట్లోడియా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి శశికాంత్ పటేల్‌ను రికార్డు స్థాయిలో 1,17,000 ఓట్ల తేడాతో మట్టికరిపించారు. భూపేంద్ర ఎమ్మెల్యేగా నెగ్గడం ఇదే మొదటిసారి. గుజరాత్ మాజీ సీఎం, ఉత్తరప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ ఆనందిబెన్ పటేల్ 2012 నుంచి 2017 దాకా ఘాట్లోడియా స్థానం నుంచే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. భూపేంద్ర పూర్తిపేరు భూపేంద్ర రజనీకాంత్ భాయి పటేల్. అభిమానులు, అనుచరులు దాదా అని పిలుచుకుంటారు. అనందిబెన్ పటేల్‌కు సన్నిహితుడిగా పేరుగాంచిన ఆయన 1999 నుంచి 2000 దాకా మేమ్‌నగర్ నగర పాలిక అధ్యక్షుడిగా పనిచేశారు. 2008 నుంచి 2010 దాకా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ బోర్డు వైస్ చైర్మన్‌గా వ్యవహరించారు. 2010 నుంచి 2015 వరకూ అహ్మదాబాద్‌లోని థాల్టెజ్ వార్డు కౌన్సిలర్‌గా పనిచేశారు. అహ్మద్‌బాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా, అహ్మదాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్‌గా సేవలందించారు. అహ్మదాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్‌లో డిపొ్లమా పూర్తిచేసిన భూపేంద్ర పటేల్ పాటిదార్ సామాజికవర్గంలోని కాడ్వా అనే ఉప కులానికి చెందినవారు. గతంలో గుజరాత్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన పాటిదార్ వర్గం నేతలు లియువా అనే ఉప కులానికి చెందినవారు. భూపేంద్ర పాటిదార్ సంస్థలైన సర్దార్‌ధామ్, విశ్వ ఉమియా ఫౌండేషన్ ట్రస్టీగా కూడా పనిచేస్తున్నారు. మంత్రిగా పని చేయకుండానే ఆయన సీఎం అవుతుండడం విశేషం. ఆయనే ఎందుకు? వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మరోసారి గెలిపించే బాధ్యతను అధిష్టానం భూపేంద్ర పటేల్‌పై మోపింది. ఎన్నికలకు దాదాపు ఏడాది ముందు ఆయనను సీఎం పదవిలో కూర్చోబెట్టడం ఆసక్తికరంగా మారింది. బలమైన పాటిదార్(పటేల్) సామాజికవర్గంతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసు చూరగొన్న వ్యక్తి కావడమే ఆయనకు కలిసొచ్చినట్లు తెలుస్తోంది. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో భూపేంద్ర అహ్మదాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. నగర అభివృద్ధి విషయంలో మోదీ ప్రణాళికలను చక్కగా అమలు చేశారు. అప్పుడే మోదీ దృష్టిలో సమర్థవంతుడైన నాయకుడిగా ముద్రపడ్డారు. ఇటీవల కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్నప్పుడు బాధితుల కోసం భూపేంద్ర ఆక్సిజన్ సిలిండర్లు విరివిగా సమకూర్చారు. ఆసుపత్రుల్లో పడకలు ఏర్పాటు చేయించారు. పదవిలో ఉన్నప్పటికీ ఆడంబరాలు, ఆర్భాటాలకు దూరంగా ఉండడం, తన పని తాను నిశ్శబ్దంగా చేసుకుపోవడం భూపేంద్ర ప్రత్యేకత. ఇవన్నీ ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇక ఆనందిబెన్ పటేల్ సిఫారసు కూడా బీజేపీ నాయకత్వం భూపేంద్ర వైపు మొగ్గు చూపేలా చేసింది. కొత్త ముఖ్యమంత్రి ఎంపికలో తమ పార్టీ అధిష్టానం ఆనందిబెన్ అభిప్రాయానికి విలువనిచి్చందని బీజేపీ నేత ఒకరు తెలిపారు. లేకపోతే నితిన్ పటేల్ గానీ, మరొకరు గానీ ముఖ్యమంత్రి అయ్యేవారని వెల్ల డించారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత మన్సుఖ్ మాండవియా(ప్రస్తుతం కేంద్ర మంత్రి) గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయపడ్డారు. పాటిదార్ వర్గం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల వెనుక చేరకుండా చూడాలన్నదే ప్రధాని మోదీ ఉద్దేశమని మరో నేత చెప్పాడు. గుజరాత్ జనాభాలో పాటిదార్ వర్గం దాదాపు 14 శాతం ఉంటుంది. దాదాపు 90 అసెంబ్లీ స్థానాల్లో గెలుపోటములను నిర్దేశించేది పాటిదార్లే. రాష్ట్రంలో ప్రతి ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరు పాటిదార్ కావడం గమనార్హం. 1995 నుంచి బీజేపీకి అండగా నిలుస్తున్న పాటిదార్లు 2015లో రిజర్వేషన్ల ఆందోళనతో కొంత దూరమయ్యారు. -
ప్రజారంజక పాలనకు ఏకగ్రీవాలే దర్పణం..
సాక్షి, తాడేపల్లి: పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సానుభూతిపరులను ఆదరించిన విధంగానే మున్సిపల్ ఎన్నికల్లో సైతం ప్రజలు తమ పార్టీ అభ్యర్దులకు పట్టం కడతారని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజారంజక పాలనకు వరుసగా వస్తున్న ఫలితాలే దర్పనమన్నారు. సీఎం జగన్ నాయకత్వాన్ని ప్రజలు పూర్తిగా విశ్వసించారు కాబట్టే మున్సిపల్ ఎన్నికల్లో 20, 797 వార్డులకు గాను 571 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్దులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. పన్నులు పెంచుతామంటూ చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని, సీఎం జగన్ నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయమే తీసుకుంటుందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా చేసిన సంస్కరణల్లో భాగంగా చట్టం చేసామే కానీ, చంద్రబాబులా ఇష్టారాజ్యంగా పన్నులు పెంచలేదని తెలిపారు. పట్టణ ప్రజల వైద్య అవసరాలు తీర్చే నిమిత్తం సీఎం జగన్ చేతుల మీదుగా త్వరలో 550 అర్బన్ క్లినిక్‌లు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. నాడు నేడు పథకం కింద స్కూల్లు అభివృద్ధి బాట పడుతున్నాయని పేర్కొన్నారు. చంద్రబాబు కల్లబొల్లి మాటలు నమ్మొద్దని ప్రజలను అభ్యర్ధించారు. విశాఖ ఉక్కును కాపాడుకోవడం కోసం జరుగనున్న రేపటి బంద్‌కు సంఘీభావం తెలుపుతున్నట్లు ప్రకటించారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు...దాని కోసం ఏమి చేయాలో అన్నీ చేస్తామని వివరించారు. -
మున్సిపోల్స్: జిల్లాల వారిగా ఏకగ్రీవాల వివరాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. ఎన్నికలు జరుగనున్న 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 17,418 నామినేషన్లు దాఖలు కాగా, 2,900 మందికిపైగా అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. కాసేపట్లో అభ్యర్థుల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల కమీషన్ అధికారికంగా ప్రకటించనుంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఈనెల 10న జరుగనుండగా, 14న ఫలితాలు వెలువడునున్నాయి. ఇక ఏకగ్రీవాల విషయానికొస్తే.. పంచాయతీ ఎన్నికల తరహాలోనే ఈ ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ తన హవాను కొనసాగించింది. చిత్తూరు కార్పొరేషన్లో వైఎస్సార్సీపీ పాగా.. చిత్తూరు కార్పొరేషన్ పరిధలోని 50 డివిజన్లకు గాను 37 డివిజన్లు ఏకగ్రీవం కావడంతో ఎన్నికలతో సంబంధం లేకుండా కార్పొరేషన్‌ను వైఎస్సార్సీపీ కైవసం చేసుకంది. దీంతోపాటు జిల్లాలోని పుంగనూరు, పలమనేరు మున్సిపాలిటీలు కూడా వైఎస్సార్సీపీ ఖాతాలో చేరాయి. మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు మున్సిపాలిటీలో మొత్తం 31 వార్డులను వైఎస్సార్సీపీ ఏకగ్రీవం చేసుకుంది. ఇక పలమనేరు మున్సిపాలిటీలో 26 వార్డులకు గాను 18 వార్డులు, నగరి మున్సిపాలిటీలో 7 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మదనపల్లి మున్సిపాలిటీలో 35 వార్డులకు గాను 15 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 19 డివిజన్లను వైఎస్సార్సీపీ ఏకగ్రీవం చేసుకుంది. వైఎస్సార్ జిల్లాలో తిరుగేలేదు.. పులివెందుల మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 33 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాయచోటి మున్సిపాలిటీలోని 34కు 34 వార్డులు, ఎర్రగుంట్ల మున్సిపాలిటీ లోని 20 వార్డుల్లో 13 స్థానాల్లో, బద్వేలు మున్సిపాలిటీలోని 35 వార్డులకు గాను 10 వార్డుల్లో, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని 41 వార్డులకు గాను 9 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడప కార్పొరేషన్‌లోని 50 డివిజన్లలో 23 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్సార్సీపీ ఖాతాలో డోన్, ఆత్మకూరు మున్సిపాలిటీలు.. కర్నూల్ జిల్లాలోని డోన్ మున్సిపాలిటీని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డులకు గాను 22 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరధిలోని 24 వార్డులకు గాను 15 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కర్నూలు కార్పొరేషన్‌లోని 34, 35 డివిజన్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నంద్యాల మున్సిపాలిటీలో 42 వార్డులకు గాను 12, ఆళ్ళగడ్డ మున్సిపాలిటీలోని 27 వార్డులకు గాను 8, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో 2, ఆదోని మున్సిపాలిటీలో 9, నందికొట్కూరు మున్సిపాలిటీలోని 29 వార్డులకు గాను 4 వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతపురం జిల్లాలోని గుత్తి మున్సిపాలిటీలో 6 వార్డులు, ధర్మవరం మున్సిపాలిటీలో 10 వార్డులు, గుంతకల్లు మున్సిపాలిటీలోని 3 వార్డులు, తాడిపత్రిలో 2 వార్డులను వైఎస్సార్సీపీ ఏకగ్రీవం చేసుకుంది. ప్రకాశం జిల్లాలో మాచర్ల మున్సిపాలిటీలో 31 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చీరాల మున్సిపాలిటీలోని 33 వార్డులకు గాను 3, గిద్దలూరు మున్సిపాలిటీలో 20 వార్డులకు 7, మార్కాపురం మున్సిపాలిటీలోని 35 వార్డులకుగాను 5 వార్డులు, కనిగిరి నగర పంచాయతీలోని 20 వార్డులకు గాను 7 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట మున్సిపాలిటీలోని 25 వార్డులకు గాను 13 వార్డుల్లో, ఆత్మకూరు మున్సిపాలిటీలోని 23 వార్డుల్లో 6 వార్డులు, నాయుడుపేట మున్సిపాలిటీలోని 25కి గాను 21 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాచర్ల, పిడుగురాళ్ల వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్.. గుంటూరు జిల్లాలోని మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ చేసింది. మాచర్ల మున్సిపాలిటీలోని మొత్తం 31 వార్డుల్లో, పిడుగురాళ్లలోని మొత్తం 33 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వినుకొండ మున్సిపాలిటిలో 7, రేపల్లె మున్సిపాలిటీలో 4, సత్తెనపల్లిలో 2, తెనాలిలో 2, గుంటూరు కార్పొరేషన్లో 1 డివిజన్( 48వ డివిజన్)ను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. కృష్ణా జిల్లా ఉయ్యూరు నగర పంచాయతీలో 2 వార్డులు, తిరువూరు నగర పంచాయతీలో 2 వార్డులు, నూజివీడు మున్సిపాలిటీలోని 32 వార్డులకు గాను 2 వార్డులను వైఎస్సార్సీపీ ఏకగ్రీవం చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం, తుని మున్సిపాలిటీల్లోనూ వైఎస్సార్సీపీ హవా కొనసాగింది. రామచంద్రాపురం మున్సిపాలిటీలో 28 వార్డులకు గాను 10 వార్డులు, తుని మున్సిపాలిటీలోని 30 వార్డులకుగాను 15 వార్డులు, అమలాపురం మున్సిపాలిటీలోని 30 వార్డులకు గాను 6, పిఠాపురంలో 6, సామర్లకోటలో 28 వార్డుల్లో 2, ముమ్మిడివరంలో 20 వార్డుల్లో 1 వార్డును వైఎస్సార్సీపీ ఏకగ్రీవం చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్లో 3 డివిజన్లు, కొవ్వూరు మున్సిపాలిటీలో 9 వార్డులు, నర్సాపురం మున్సిపాలిటీలో 31 వార్డులకు గాను 3 వార్డులను వైఎస్సార్సీపీ ఏకగ్రీవం చేసుకుంది. విశాఖ జిల్లాలోని యలమంచిలి మున్సిపాలిటీలో 25 వార్డులకు గాను 3 వార్డులను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మున్సిపాలిటీలో 20 వార్డులకుగాను 2 వార్డులు, పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో 31 వార్డులకు గాను 2 వార్డుల్లో వైఎస్సార్సీపీ ఏకగ్రీవం. విజయనగరం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీలోని 30 వార్డులకు గాను 6 వార్డులు, బొబ్బిలి మున్సిపాలిటీలో 1 వార్డులో వైఎస్సార్సీపీ ఏకగ్రీవం. -
ఏకగ్రీవాలను రద్దు చేసే అధికారం కోర్టుకు కూడా లేదు
సాక్షి, కృష్ణా: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలతో మొదలైన ఏకగ్రీవాల పరంపర జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కొనసాగేలా ఉంది. కోవిడ్ కారణంగా 2020 మార్చి 15న వాయిదా పడ్డ ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని ఎన్నికల కమిషన్ ఆలోచిస్తుంది. ఈ క్రమంలో గతంలో నోటిఫికేషన్ జారీ చేసిన సమయంలో పలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. త్వరలోనే ఎస్ఈసీ ఈ ఎన్నికలు నిర్వహించాaని భావిస్తుండగా.. గతంలోని ఏకగ్రీవాలను రద్దు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై హైకోర్టు న్యాయవాది జనార్ధన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ఫారం 10లో.. ఎన్నికల్లో గెలిచినవారికి ఫారం 23లో ధ్రువీకరణ ఇస్తారు. ఏకగ్రీవమైనా.. ఎన్నికల్లో గెలిచినా.. ఒకసారి ధృవీకరణ పత్రం ఇచ్చాక రద్దు చేసే అధికారం ఎవరికీ లేదు. ఎస్ఈసీ, కోర్టులకు కూడా దీన్ని రద్దు చేసే అధికారం లేదు. కేవలం ఓడిపోయిన వ్యక్తి మాత్రమే ఆర్టికల్ 329 ప్రకారం జిల్లా కోర్టులో ఎలక్షన్ పిటిషన్ వేసుకోవాలి. విచారణ తర్వాతే కోర్టు తీర్పు ఇస్తుంది’’ అని తెలిపారు. -
వివాదాస్పద కొఠియాలో.. పంచాయతీలు ఏకగ్రీవం
జయపురం: ఏఓబీ(ఆంధ్రా–ఒడిశా బోర్డరు) కొఠియాలో ఏపీ నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల్లో ఇక్కడి గంజాయి పొదర్, ఫంగుణ సినారి గ్రామపంచాయితీలు ఏకగ్రీవమయ్యాయి. ఈ క్రమంలో ఫంగుణ సినారి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కున్నేటి కుసుమ, గంజాయి పొదర్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన దినకర గమేల్ సర్పంచ్ల ఎంపిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. వాస్తవానికి కొఠియాని ఓ గ్రామపంచాయతీగా ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేయగా, ఏపీ ప్రభుత్వం ఇదే ప్రాంతాన్ని 3 గ్రామపంచాయతీలుగా విభజించి, ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇదే ప్రాంతం విషయంలో ఉభయ రాష్ట్రాలు తమ ప్రాంతమంటే తమదని గొడవపడుతున్న విషయం తెలిసిందే. కొఠియా సర్పంచ్‌ని సత్కరిస్తున్న దృశ్యం ఏపీని అడ్డుకుంటాం.. కొరాపుట్: వివాదాస్పద కొఠియా పంచాయతీలో ఏపీ(ఆంధ్రప్రదేశ్) చొరబాటుని అడ్డుకుంటామని రాష్ట్ర ఔళి శాఖ మంత్రి పద్మినీ దియాన్ తెలిపారు. స్థానిక సద్భావన సమావేశ మందిరంలో కొరాపుట్ జిల్లా సంబాదిక సంఘ వార్షిక సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ‘కరోనా పొరే సమాజ్’( కరోనా తర్వాత సమాజం)అనే అంశంపై స్పందిస్తూ కరోనా కట్టడి చర్యల్లో మీడియా ప్రతినిధుల సేవలు ప్రశంసనీయమన్నారు. ఈ నేపథ్యంలో వారిని కరోనా యోధులుగా పరిగణించి సత్కరించాలన్నారు. ప్రాణ భయం వీడి, కరోనా వైరస్ వ్యాప్తిపై వార్తలు సంగ్రహిస్తూ ప్రజలను చైతన్యం చేశారని వివరించారు. అలాగే కొఠియా పంచాయతీ బౌగోళిక స్థితిగతులు, అక్కడి ప్రజల భాష, సంస్కృతీ, సంప్రదాయాలన్నీ కొరాపుట్ జిల్లా ఆదివాసులకు చెందినవని, ముఖ్యమంత్రి కొఠియా పంచాయతీని కాపాడుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. ఆ పంచాయతీ సమగ్ర అభివృద్ధికి అత్యధిక నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తోందన్నారు. కార్యక్రమంలో భాగంగా పాత్రికేయులను మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు సన్మానించారు. సమావేశంలో జిల్లా బీజేడీ అధ్యక్షుడు ఈశ్వరచంద్ర పాణిగ్రాహి, ఎమ్మెల్యేలు రఘురాం పడాల్, ప్రభు జని, పీతం పాఢి, తారాప్రసాద్ బాహిణీపతి పాల్గొన్నారు. చదవండి: ఏకగ్రీవాల నుంచే అదే ట్రెండ్ -
జూన్‌లో నూతన అధ్యక్షుడు
సాక్షి,న్యూఢిల్లీ: రాబోయే రెండు మూడు నెలల్లో ఐదు అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్న నేప«థ్యంలో కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుని ఎన్నికను జూన్‌లో నిర్వహించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)ఏకగ్రీవంగా నిర్ణయించింది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సిఫార్సుల మేరకు మేలో అ«ధ్యక్ష ఎంపిక ప్రక్రియ జరగాల్సి ఉన్నప్పటికీ తాజా పరిస్థితుల నేపథ్యంలో జూన్ నెలాఖరు వరకు వాయిదా వేశారు. శుక్రవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికపై సీనియర్ నేత మధుసూదన్ మిస్త్రీ నేతృత్వంలోని ఎన్నికల కమిటీ చేసిన సిఫార్సులపై చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం పార్టీ అధ్యక్షురాలు సోనియా ప్రసంగంతో ప్రారంభమైంది. రైతు ఆందోళ నలపై కేంద్రం అత్యంత దారుణంగా, అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని సోనియా విమర్శించారు. రైతు ప్రతినిధులతో చర్చల్లో ప్రభుత్వ అహంకార ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని మండిపడ్డారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెం ట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు సోనియా దిశానిర్దేశం చేశారు. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నిలబ డాలని, దేశవ్యాప్తంగా కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమాలు ఉధృతంగా చేయాలని సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది. అంతేగాక కోవిడ్–19 విషయంలో టీకా అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలను అభినందించడంతో పాటు, పంపిణీ ప్రారంభం అయిన నేపథ్యంలో ప్రజలు వాక్సినేషన్‌కు ముందుకు రావాలని తీర్మానం చేసింది. అలాగే, దేశవ్యాప్తంగా ప్రజలందరికీ టీకా పంపిణీకి సంబంధించి ప్రభుత్వం వద్ద ఉన్న ప్రణాళికలను బహిర్గత పరచాలని కోరింది. దేశ రక్షణకు సంబం ధించిన వ్యాఖ్యలతో బహిర్గతమైన రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్ణబ్ గోస్వామి వాట్సాప్ చాట్ వ్యవహారంపై జేపీసీ విచారణకు డిమాండ్ చేస్తూ మరో తీర్మానం చేసింది. గహ్లోత్ సీరియస్ సీడబ్ల్యూసీ సమావేశంలో గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మలపై రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారని సమాచారం. సంస్థాగత ఎన్నికల నిర్వహణలో పార్టీ నాయకత్వంపై నమ్మకం లేదా అని గహ్లోత్ ప్రశ్నించారు. గతేడాది ఆగస్టు 24న జరిగిన సమావేశంలోనూ ఆజాద్, శర్మ తదితర నాయకులు పార్టీ అధినేత్రిని ఉద్దేశించి రాసిన ఒక లేఖలో లేవనెత్తిన అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ లేఖ బహిర్గతం అయినప్పటినుంచి పార్టీలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం కొనసాగుతున్న విష యం తెలిసిందే.ఆ లేఖపై సంతకం చేసిన నాయకులు బీజేపీతో కుమ్మక్కయ్యారని గత సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ ఆరోపణలపై ఆజాద్, కపిల్ సిబల్ అభ్యంత రం వ్యక్తం చేసిన తరువాత, కాంగ్రెస్ అధిష్టా నం డ్యామేజ్ కంట్రోల్ మోడ్‌లోకి వెళ్లింది. -
స్కాట్లాండ్ ఓకే చెప్పింది
ప్రపంచంలోనే తొలిసారి ఇలాంటి ఒక చట్టం తెచ్చిన ఘనతను స్కాట్లాండ్ దక్కించుకుంది. బిల్లు చట్టం కాగానే దేశవ్యాప్తంగా మహిళలకు శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా లభిస్తాయి. ఉచిత విద్యకు, ఉచిత ఆరోగ్య భద్రతకు బిల్లు తెచ్చినంత సులభంగా ఉండదు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్‌ను పంపిణీ చేసే బిల్లుకు ఆమోదం లభించడం. ‘అవసరమా?’ అనే ప్రశ్న మొదటే పురుషుల నుంచి వస్తుంది. ఆ తర్వాత ప్రతిపక్షం నుంచి వస్తుంది. తిండికి లేదా? పెడదాం. చదువుకోవాలని ఉందా? చదివిద్దాం. అనారోగ్యం వస్తే వైద్య ఖర్చులకు డబ్బుల్లేవా? ఉచితంగా వైద్యం చేయిద్దాం. కానీ ఇదేంటి! శానిటరీ న్యాప్కిన్లను, టాంపన్లను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం.. అని రెండేళ్లుగా ‘పీరియడ్ ప్రాడక్ట్స్ (ఫ్రీ ప్రొవిజన్) చట్టం’ బిల్లుకు స్కాట్లాండ్ పార్లమెంటులో విపక్ష సభ్యులు అభ్యంతరం చెబుతూ వస్తున్నారు. అనుకూలంగా ఓటేయకుండా బిల్లును ఆపుతున్నారు. ఎట్టకేలకు.. ఏడాదికి కనీసం 86 కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని ప్రభుత్వంపై మోపే ‘పీరియడ్ పావర్టీ బిల్లు’కు మంగళవారం నాడు ఏకగ్రీవ ఆమోదం లభించింది. దాంతో ప్రపంచంలోనే తొలిసారి ఇలాంటి ఒక చట్టం తెచ్చిన ఘనతను స్కాట్లాండ్ దక్కించుకుంది. అన్ని పేదరికాల మాదిరిగానే ప్యాడ్స్‌ని కొనలేని పేదరికం కూడా ఉంటుందని అంటూ ఈ బిల్లుకు ఊపిరిపోసి, బిల్లు సాధనకు ఉద్యమరూపం తెచ్చి, సభ ఆమోదం పొందగలిగేవరకు ఆవిశ్రాంతంగా పోరాటం జరిపిన మోనికా లెనన్ (39) ఇప్పుడు ఆ దేశంలోని మహిళల మన్ననలను పొందుతున్నారు. బిల్లు ముసాయిదాలో పలుమార్లు కనిపించే ‘పీరియడ్ పావర్టీ’ అనే మాటను కూడా తనే సృష్టించిన మోనికా 2016 నుంచీ స్కాటిష్ లేబర్ పార్టీ ఎంపీగా ఉన్నారు. ఆమె స్త్రీవాది, శాకాహారి. బిల్లు చట్టం రూపం ధరించగానే దేశవ్యాప్తంగా కమ్యూనిటీ సెంటర్లు, విద్యాసంస్థలు, యూత్ క్లబ్బులు, ఫార్మసీ దుకాణాలన్నింటిలోనూ మహిళలకు శానిటరీ న్యాప్కిన్స్, టాంపన్లు ఉచితంగా అందుబాటులోకి వస్తాయి. ‘‘ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడాన్ని గర్వంగా భావిస్తున్నాను’’ అని స్కాట్లాండ్ మహిళా ప్రధాని (ఫస్ట్ మినిస్టర్ అంటారు) నికోలా స్టురియన్ ట్వీట్ చేస్తూ, ‘మహిళలకు, బాలికలకు అవసరమైన ఒక ముఖ్యమైన ప్రభుత్వ విధానంగా’ ఈ చట్టాన్ని అభివర్ణించారు. అరకోటికి పైగా జనాభా వున్న స్కాట్లాండ్ యు.కె. కిందికి వస్తుంది. ‘ప్లాన్ ఇంటర్నేషనల్ యుకె’ అనే సంస్థ 2017 లో జరిపిన ఒక సర్వేలో యు.కె.లోని ప్రతి 10 మంది బాలికల్లో ఒకరు ప్యాడ్స్ కొనే స్థితిలో లేనివారే. అంతేకాదు, యు.కె.లో 14–21 ఏళ్ల మధ్య వయసులో ఉన్న బాలికల్లో సగం మంది ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్యాడ్స్ కొనలేకపోతున్నవారే. -
రాజ్యసభలో వంద దాటిన ఎన్డీయే బలం
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి సహా 9 మంది సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికవడంతో రాజ్యసభలో ఎన్డీయే బలం 100 దాటింది. ప్రధాన విపక్షం కాంగ్రెస్ సభ్యుల సంఖ్య అత్యల్పంగా 38కి పడిపోయింది. తాజా విజయాలతో రాజ్యసభలో బీజేపీ సభ్యుల సంఖ్య 92కి చేరింది. మిత్రపక్షం జేడీయూకి ఎగువ సభలో ఐదుగురు సభ్యులున్నారు. వీరు కాకుండా, మిత్రపక్షాలు ఆర్పీఐ–అఠావలే, అసోం గణపరిషత్, మిజో నేషనల్ ఫ్రంట్, నేషనల్ పీపుల్స్ పార్టీ, నాగా పీపుల్స్ ఫ్రంట్, పీఎంకే, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్లకు ఒక్కొక్కరు చొప్పున రాజ్యసభ సభ్యులున్నారు. దీంతో ఎగువ సభలో ఎన్డీయే బలం 104కి చేరింది. ఇవి కాకుండా, నలుగురు నామినేటెడ్ సభ్యుల మద్దతు కూడా ప్రభుత్వానికి లభిస్తుంది. అలాగే, కీలక బిల్లుల ఆమోదానికి, అవసరమైనప్పుడు అంశాలవారీగా ప్రభుత్వానికి మద్దతిచ్చే పార్టీలు కొన్ని ఉన్నాయి. వాటిలో అన్నాడీఎంకేకు 9 మంది, బీజేడీకి 9 మంది సభ్యులు ఉన్నారు. ఇన్నాళ్లు రాజ్యసభలో కీలక, ప్రతిష్టాత్మక బిల్లుల ఆమోదానికి ఇబ్బంది పడిన ప్రభుత్వానికి తాజా విజయాలతో ఆ సమస్య తొలగనుంది. ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 242. యూపీ, ఉత్తరాఖండ్‌ల్లో జరిగిన తాజా ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 3 స్థానాలను, బీఎస్పీ 1 స్థానాన్ని కోల్పోయింది. ప్రస్తుతం యూపీ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో బీజేపీకి చెందిన నీరజ్ శేఖర్, అరుణ్ సింగ్, గీతా షాఖ్య, హరిద్వార్ దూబే, బ్రిజ్‌లాల్, బీఎల్ వర్మ, సీమా ద్వివేదీ ఉన్నారు. ఎస్పీ నుంచి రామ్‌గోపాల్ యాదవ్, బీఎస్పీ నుంచి రామ్‌జీ గౌతమ్ కూడా ఎన్నికయ్యారు. ఉత్తరాఖండ్ నుంచి బీజేపీ తరఫున నరేశ్ బస్వాల్ ఎన్నికయ్యారు. -
హాంకాంగ్‌పై మరింత పట్టు
బీజింగ్: హాంకాంగ్‌పై మరింత పెత్తనం చెలాయించేందుకు ఉద్దేశించిన వివాదాస్పద జాతీయ భద్రతా బిల్లును చైనా పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇవి అమల్లోకి వస్తే హాంకాంగ్ ప్రాదేశిక స్వతంత్ర ప్రతిపత్తి, పౌరులకున్న రాజకీయ స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు ప్రమాదంలో పడతాయని విమర్శకులు అంటున్నారు. ప్రధాన వాణిజ్య కేంద్రాల్లో ఒకటిగా హాంకాంగ్‌కున్న పేరు మరుగున పడుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చైనా ప్రభుత్వం రూపొందించిన ఈ ప్రతిపాదనలను నామమాత్రంగా ఉండే పార్లమెంట్(నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్, ఎన్పీసీ) ఏకగ్రీవంగా ఆమోదించింది. వీటిని హాంకాంగ్ పార్లమెంట్ ఆమోదిస్తే వచ్చే ఆగస్టు కల్లా చట్టరూపం దాల్చుతుంది. ప్రజాస్వామ్య హక్కులు, చైనా నుంచి మరింత స్వతంత్ర ప్రతిపత్తి కోసం గత ఏడాది ప్రజాస్వామ్య వాదులు చేపట్టిన ఆందోళనలతో హాంకాంగ్ అట్టుడికింది. తీవ్ర హింసాత్మక ఘటనలు చెలరేగాయి. వాణిజ్య కార్యకలాపాలు స్తంభించాయి. ఈ పరిణామాలను చైనా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. హాంకాంగ్‌పై మరింత పట్టు సాధించడం ద్వారా వీటికి చెక్ పెట్టాలని నిర్ణయించుకుంది. -
ఏకగ్రీవాలు
-
‘మార్క్‌ఫెడ్’ ఎన్నికలు ఏకగ్రీవం
సాక్షి, హైదరాబాద్: మార్క్‌ఫెడ్ డైరెక్టర్ల పదవులు ఏకగ్రీవమయ్యాయి. శనివారం నామినేషన్లు సమర్పించాల్సి ఉండగా, ఒక్కో డైరెక్టర్ పదవికి ఒకరే నామినేషన్ వేయడంతో వారిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సహకార ఎన్నికల అథారిటీ ప్రకటించింది. మొత్తం ఏడు డైరెక్టర్ పదవులకుగాను, ఆరింటికి మాత్రమే ఒక్కో నామినేషన్ దాఖలయ్యాయి. మరో డైరెక్టర్ పదవికి ఎవరూ నామినేషన్ వేయలేదు. దీంతో ఆరు డైరెక్టర్ పదవులను ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. రేకుల గంగాచరణ్, ఎస్. జగన్ మోహన్‌రెడ్డి, బొర్రా రాజశేఖర్, మర్రి రంగారావు, మార గంగారెడ్డి, ఎన్.విజయ్‌కుమార్‌లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఏకగ్రీవాలతో తప్పిన ఎన్నికల నిర్వహణ డైరెక్టర్ పదవులు ఏకగ్రీవం కావడంతో ఆ రోజు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేకుండా పోయింది. ఒకవేళ ఒక్కో డైరెక్టర్ పదవికి రెండు అంతకుమించి నామినేషన్లు దాఖలైనట్లయితే, ఈ నెల పదో తేదీన ఎన్నికలు నిర్వహించేవారు. ఏకగ్రీవంగా ఎన్నికైన డైరెక్టర్లు ఈ నెల 11న చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. వారి మధ్య పోటీ నెలకొంటే ఎన్నిక నిర్వహిస్తారు. లేకుంటే ఆ రెండు పదవులు కూడా ఏకగ్రీవమయ్యే అవకాశముంది. ఒక డైరెక్టర్ పదవికి ఒకరు నామినేషన్ వేయడానికి మార్క్‌ఫెడ్‌కు రావడంతో ఘర్షణ నెలకొందని, దీంతో అతను నామినేషన్ వేయకుండానే వెళ్లినట్లు కొంతమంది చెబుతున్నారు. తమ ప్రాంగణంలో ఎటువంటి ఘర్షణ, గొడవలు జరగలేదని ఎన్నికల అధికారులు తెలిపారు. -
మెజారిటీ ఏకగ్రీవాలు టీఆర్ఎస్లోకే
సాక్షి, హైదరాబాద్: సహకార ఎన్నికల నామినేషన్లు, ఉప సంహరణ ప్రక్రియ సోమవారం ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థులు మంగళవారం నుంచి ప్రచారంపై దృష్టి సారించారు. ఈ నెల 15న ఆయా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్) పరిధిలోని డైరెక్టర్ స్థానాలకు పోలింగ్ జరగనుండగా, అదేరోజు మధ్యాహ్నం నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో 904 పీఏసీఎస్‌ల పరిధిలోని 11,653 డైరెక్టర్ స్థానాలకు సహకార ఎన్నికల అథారిటీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో రాష్ట్రంలోని 156 పీఏసీఎస్‌ల పరిధిలోని డైరెక్టర్ స్థానాలన్నీ ఏకగ్రీవమయ్యాయి. అత్యధికంగా ఖమ్మంలో.. అత్యధికంగా ఖమ్మంలో 34, నిజామాబాద్‌లో 26 సొసైటీల పరిధిలో డైరెక్టర్ స్థానాలన్నీ ఏకగ్రీవ మయ్యాయి. కామారెడ్డిలో 12, ఆదిలాబాద్‌లో 11, సూర్యాపేటలో 9, సంగారెడ్డిలో 8, మంచిర్యాల, జగిత్యాల, మెదక్ జిల్లా పరిధిలో ఐదేసి సొసైటీల చొప్పున ఏకగ్రీవమయ్యాయి. కుమరంభీమ్ ఆసిఫాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, వికారాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లో మూడు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్, వరంగల్ అర్బన్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ రూరల్, ములుగు జిల్లాలో రెండేసి సొసైటీల చొప్పున ఏకగ్రీవమయ్యాయి. నిర్మల్, కరీంనగర్, నాగర్‌కర్నూలు, వనపర్తి, నారాయణపేట, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాలో ఒక్కో సొసైటీ ఏకగ్రీవం కాగా, జోగుళాంబ గద్వాల, యాదా ద్రి భువనగిరి, మేడ్చల్ మల్కా జిగిరి జిల్లాల్లో మాత్రం అన్ని సొసైటీల పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తంగా 5,387 డైరెక్టర్ స్థానాల్లో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు సహకార ఎన్నికల అథారిటీ ప్రకటించింది. లెక్కలు వేసుకుంటున్న టీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికలు మొదలుకుని గతేడాది జరిగిన గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఈ ఏడాది ఆరంభంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన టీఆర్ఎస్ సహకార ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పీఏసీఎస్‌ల పరిధిలో వీలైనంత మేర డైరెక్టర్ స్థానాలు ఏకగ్రీవమయ్యేలా చూడటం ద్వారా అనుచరులకు పదవులు దక్కేలా చూడటంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దృష్టి సారించారు. కొన్నిచోట్ల కాంగ్రెస్ మద్దతుదారులకు ఒకటి రెండు డైరెక్టర్ స్థానాలివ్వడం ద్వారా మొత్తం సొసైటీ పరిధిలో ఏకగ్రీవమయ్యేలా పావులు కదిపారు. మెజారిటీ పీఏసీఎస్‌లో డైరెక్టర్, చైర్మన్ పదవులు దక్కేలా టీఆర్ఎస్ ప్రయత్నాలు సాగిస్తోంది. జిల్లాల వారీగా ఏకగ్రీవంగా ఎన్నికైన డైరెక్టర్, పీఏసీఎస్‌లపై నివేదిక ఇవ్వాల్సిందిగా పార్టీ ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు అందాయి. దీంతో జిల్లాల వారీగా ఏకగ్రీవమైన డైరెక్టర్ స్థానాలకు సంబంధించి పార్టీల వారీగా వివరాలు సేకరించి నివేదికలు సమర్పించారు. డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవులు ఆశిస్తున్న టీఆర్ఎస్ నేతలు పూర్వపు జిల్లా పరిధిలో పర్యటిస్తూ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. -
రిజర్వేషన్ల బిల్లుకు పార్లమెంటు ఆమోదం
న్యూఢిల్లీ: లోక్‌సభ, అసెంబ్లీల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను పొడిగించే బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. ఎస్సీ, ఎస్టీలకు చట్టసభల్లో రిజర్వేషన్లను మరో పదేళ్లు పొడిగించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ 126వ సవరణ బిల్లు గురువారం రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఎస్సీ, ఎస్టీలు ఇంకా వెనకబడే ఉన్నందున, వారిలో క్రీమీలేయర్‌ను వర్తింపజేయాల్సిన అవసరం లేదని తాము భావిస్తున్నామన్నారు. ఈ సవరణ ద్వారా 2030, జనవరి 25 వరకు రిజర్వేషన్లను పొడిగిస్తారు. ఈ బిల్లును 10వ తేదీన లోక్‌సభ ఆమోదించింది. చర్చ సందర్భంగా రవిశంకర్ ప్రసాద్‌కు, విపక్ష నేత గులాంనబీ ఆజాద్‌కు మధ్య వాగ్యుద్ధం చోటు చేసుకుంది. అనంతరం కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం, చైర్మన్ వెంకయ్యనాయుడు విజ్ఞప్తి మేరకు వారు సభకు తిరిగివచ్చారు. -
బీసీసీఐ ఎన్నికలు ఏకగ్రీవమే!
ముంబై: సుదీర్ఘ విరామం తర్వాత బీసీసీఐలో జరగబోతున్న ఎన్నికలు పూర్తిగా ఏకగ్రీవం కాబోతున్నాయి. ఈ నెల 23న బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) నిర్వహిస్తారు. అదే రోజు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే అపెక్స్ కౌన్సిల్‌లోని ఎనిమిది స్థానాలకు చివరి రోజు సోమవారం ఎనిమిది మంది మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో పోటీ లేకుండా వీరందరూ ఎన్నిక కావడం ఖాయమైపోయింది. అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ, కార్యదర్శిగా జై షా ఎన్నిక కానున్నారు. 23న వీరంతా అధికారికంగా బాధ్యతలు స్వీకరిస్తారు. అట్టహాసంగా... చివరి రోజైన సోమ వారమే గంగూలీ, జై షా తమ నామినేషన్లు దాఖలు చేశారు. గంగూలీ వెంట బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్, మాజీ కార్యదర్శి నిరంజన్ షాతో పాటు రాజీవ్ శుక్లా కూడా ఉన్నారు. అయితే గంగూలీ వెళ్లిన సమయంలో ఎన్నికల అధికారి ఎన్.గోపాలస్వామి అక్కడ లేరు. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఆయన రాకపోవడంతో సౌరవ్ అక్కడి అధికారులకు తమ నామినేషన్ పత్రాలు అందించి వెనుదిరిగారు. బీసీసీఐ అధ్యక్ష పదవికి గంగూలీ పేరును ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) అధ్యక్షుడు శరత్ చంద్రారెడ్డి ప్రతిపాదించారు. ఈ మేరకు నామినేషన్ పత్రంలో ఆయన సంతకం చేశారు. ఏసీఏ కోశాధికారి గోపీనాథ్ రెడ్డి, భారత మాజీ క్రికెటర్ వేణుగోపాలరావు కూడా వీరి వెంట ఉన్నారు. సౌరవ్ గంగూలీ (అధ్యక్షుడు): భారత క్రికెట్ మాజీ కెప్టెన్. కెరీర్లో 113 టెస్టులు, 311 వన్డేలు ఆడిన అనుభవం. ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. మహిమ్ వర్మ (ఉపాధ్యక్షుడు): ఉత్తరాఖండ్ క్రికెట్ సంఘం కార్యదర్శి. జయేష్ జార్జ్ (సంయుక్త కార్యదర్శి): కేరళ క్రికెట్ సంఘం అధ్యక్షుడు. ఖైరుల్ జమీల్ మజుందార్ (గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు); ప్రభ్‌జోత్ సింగ్ భాటియా (కౌన్సిలర్). బ్రిజేశ్ పటేల్ (ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు): మాజీ క్రికెటర్. భారత్ తరఫున 21 టెస్టులు, 10 వన్డేలు ఆడారు. కర్ణాటక సంఘం నుంచి ప్రాతినిధ్యం. అరుణ్ సింగ్ ధుమాల్ (కోశాధికారి): కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, బోర్డు మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సోదరుడు. హిమాచల్ మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ ధుమాల్ కుమారుడు. హిమాచల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నాడు. జై షా (కార్యదర్శి): కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు, వ్యాపారవేత్త. ఇటీవలి వరకు గుజరాత్ క్రికెట్ సంఘం సంయుక్త కార్యదర్శిగా ఉన్నాడు. -
ఖేల్‌రత్న బజరంగ్
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి రెజ్లర్ బజరంగ్ పూనియా అత్యున్నత క్రీడాపురస్కారమైన ‘రాజీవ్ ఖేల్‌రత్న’ అవార్డుకు ఎంపికయ్యాడు. 2018 ఆసియా గేమ్స్ (జకార్తా), కామన్వెల్త్ గేమ్స్ (గోల్డ్‌కోస్ట్) చాంపియన్ అయిన పూనియాను 12 మంది సభ్యులు గల అవార్డుల కమిటీ ఏకగ్రీవంగా నామినేట్ చేసింది. రిటైర్డ్ జస్టిస్ ముకుందకం శర్మ నేతృత్వంలోని ఈ కమిటీలో భారత క్రీడా దిగ్గజాలు బైచుంగ్ భూటియా, మేరీకోమ్ తదితరులున్నారు. ఈ కమిటీ రెండు రోజుల సమావేశం శుక్రవారం మొదలైంది. తొలిరోజే చాంపియన్ రెజ్లర్‌ను నామినేట్ చేయగా, శనివారం మరొకరిని ఈ ‘ఖేల్‌రత్న’కు జతచేసే అవకాశాల్ని కమిటీ పరిశీలిస్తుంది. గతేడాది అత్యున్నత క్రీడాపురస్కారానికి తనను గుర్తించకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన పూనియా కోర్టును కూడా ఆశ్రయించాడు. చివరకు మెగా ఈవెంట్లలో అతని బంగారు ప్రదర్శనను గుర్తించిన కమిటీ ఖేల్‌రత్నకు ఎంపిక చేయడం విశేషం. ఎట్టకేలకు తన ఘనతలకు గుర్తింపు దక్కినందుకు స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా హర్షం వ్యక్తం చేశాడు. వచ్చే నెలలో కజకిస్తాన్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ముందు అవార్డుకు ఎంపిక కావడంకంటే కూడా తన శక్తి, సామర్థ్యాలే తనకు స్ఫూర్తి, ప్రేరణ అని చెప్పుకొచ్చాడు. మొత్తం మీద అవార్డుల కమిటీ... అర్జున, ద్రోణాచార్య అవార్డులకు ఎంపికైన అథ్లెట్లు, కోచ్‌లను నేడు ఖరారు చేసి భారత ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. అనంతరం క్రీడాశాఖ అధికారికంగా జాబితాను విడుదల చేస్తుంది. దివంగత హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ జయంతి, జాతీయ క్రీడా దినోత్సవమైన ఆగస్టు 29న అవార్డుల్ని అందజేస్తారు. -
రవిశాస్త్రినే రైట్
ఓ ఎంపిక తంతు ముగిసింది...! టీమిండియా ప్రధాన కోచ్‌గా మళ్లీ రవిశాస్త్రికే అవకాశం దక్కింది. ప్రతిష్టాత్మక ప్రపంచ కప్ సాధించలేకపోయినా... జట్టు కూర్పులో విమర్శలెదుర్కొన్నా... కెప్టెన్ విరాట్ కోహ్లి అండదండలు సమృద్ధిగా ఉన్న అతడు... అందరినీ తోసిరాజంటూ మరో రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నాడు. హెడ్‌కోచ్ ఎంపిక కోసం శుక్రవారం ముంబైలో సమావేశమైన దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)... రవిశాస్త్రి నియామకానికి ఏకగీవ్రంగా అంగీకరించింది. కుదించిన జాబితాలో శాస్త్రి సహా మొత్తం ఆరుగురు ఉండగా, వీరిలో చివరి దశకు ముగ్గురే మిగిలారు. అందులోంచి అంతా అనుకుంటున్నట్లుగా... ముందే నిర్ణయించేసినట్లుగా... ‘రవి భాయ్’కే పట్టం కట్టారు. ముంబై: పెద్దగా మలుపులేం లేవు. అనూహ్యమేమీ జరగలేదు. అంచనాలకు తగ్గట్లే, కెప్టెన్ కోహ్లి మనోగతానికి అనువుగానే అంతా సాగిపోయింది. భారత జాతీయ పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి పదవి 2021 టి20 ప్రపంచకప్ వరకు పదిలమైంది. తాము ప్రామాణికంగా నిర్దేశించుకున్న శిక్షణా రీతులు, అనుభవం, సాధించిన ఘనతలు, సమాచారం వినియమం, ఆధునిక శిక్షణా పరిజ్ఞానం అనే ఐదు అంశాలకు శాస్త్రినే తగినవాడంటూ కపిల్, మాజీ కోచ్ అన్షుమన్ గైక్వాడ్, మహిళల జట్టు మాజీ కెప్టెన్ శాంత రంగస్వామితో కూడిన సీఏసీ సభ్యులు నిర్ణయం వెలువరించారు. ఈ పదవికి దరఖాస్తు చేసిన న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెసన్, శ్రీలంకకు కోచ్‌గా పనిచేసిన టామ్ మూడీ 2, 3 స్థానాలతో సరిపెట్టుకున్నారు. శుక్రవారం రోజంతా సమావేశమైన కపిల్ బృందం... వీరితోపాటు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ రాబిన్‌సింగ్, జట్టు మాజీ మేనేజర్ లాల్‌సింగ్ రాజ్‌పుత్‌లను ఇంటర్వ్యూ చేసింది. మరో దరఖాస్తుదారు ఫిల్ సిమన్స్ (వెస్టిండీస్) మాత్రం అంతకుముందే తప్పుకొన్నాడు. హెసన్, రాబిన్‌సింగ్, రాజ్‌పుత్ నేరుగా హాజరై తమ ప్రణాళికలు వివరించారు. మూడీ, ప్రస్తుతం భారత జట్టుతో కరీబియన్ దీవుల పర్యటనలో ఉన్న రవిశాస్త్రి టెలి కాన్ఫరెన్స్ ద్వారా ప్రక్రియలో పాల్గొన్నారు. 2017 జులైలో శాస్త్రిని హెడ్ కోచ్‌గా అప్పటి సీఏసీ సభ్యులు సచిన్, గంగూలీ, లక్ష్మణ్ ఎంపిక చేశారు. అప్పట్లో అతడి నియామకంపై వీరంతా కెప్టెన్‌గా కోహ్లి అభిప్రాయాన్ని తీసుకు న్నారు. ఇప్పుడు మాత్రం అదేమీ లేకుండానే నిర్ణయం తీసుకున్నామని కపిల్ తెలిపాడు. డైరెక్టర్‌గా వచ్చి... కోచ్‌గా పాతుకుపోయాడు 2014 వరకు పూర్తిస్థాయి వ్యాఖ్యాతగా ఉన్న రవి ఆ ఏడాది ఇంగ్లండ్‌లో భారత్ టెస్టు సిరీస్‌లో ఘోరంగా ఓడటంతో వన్డే సిరీస్‌కు టీమ్ డైరెక్టర్‌గా ప్రత్యేక పరిస్థితుల్లో నియమితుడయ్యాడు. నాటి కోచ్ డంకన్ ఫ్లెచర్ ఉండగానే డైరెక్టర్‌గా కీలక బాధ్యతలు చూశాడు. ఫ్లెచర్ 2015 ప్రపంచ కప్ అనంతరం వైదొలిగాక, 2016 జూన్‌లో మేటి స్పిన్నర్ అనిల్ కుంబ్లే కోచ్‌గా వచ్చేవరకు డైరెక్టర్ కమ్ కోచ్‌గా వ్యవహరించాడు. 2017 జూలైలో కోహ్లితో విభేదాల కారణంగా కుంబ్లే తప్పుకోవడంతో ప్రధాన కోచ్ అయ్యాడు. తాజా ఎంపికకు అతడి ఆధ్వర్యంలో జట్టు సాధించిన విజయాలు ఓ కారణంగా చెబుతున్నారు. శాస్త్రి హయాంలో భారత్ 2017–18 మధ్య కాలంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లలో టెస్టు విజయాలు సాధించింది. ఆస్ట్రేలియాలో తొలిసారి టెస్టు సిరీస్ నెగ్గింది. ఇటీవలి వన్డే ప్రపంచ కప్‌లో లీగ్ దశలో టాప్‌లో నిలిచి సెమీస్ చేరింది. మధ్యలో ఆసియా కప్ వంటి చిన్నాచితక టోర్నీలు, స్వదేశంలో సిరీస్‌లు గెలుచుకుంది. ఇప్పుడు 2021 వరకు ఎంపిక చేసినందున బహుశా భారత క్రికెట్ చరిత్రలో ఎక్కువ కాలం కోచ్‌గా పనిచేసినవాడిగా రికార్డులకెక్కుతాడు. కోహ్లి వ్యాఖ్యల ప్రభావం లేదు ‘కోచ్ ఎంపికలో మేం కోహ్లి వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోలేదు. ఒకవేళ అలానే చేసి ఉంటే... మిగతా జట్టు సభ్యులందరి అభిప్రాయాలు తీసుకునేవారం. ఈ విషయంలో మేమెవరినీ సంప్రదించలేదు. అసలు అందుకు అవకాశమే లేదు. ప్రపంచ కప్ సాధించనంత మాత్రాన వేటు వేయాలని ఏమైనా ఉందా? మీరు మొత్తం విజయాలను చూడండి. వారి ప్రజంటేషన్‌నే మేం చూశాం. దాని ప్రకారమే వెళ్లాం. అందరూ నిపుణులే అయినా కమ్యూనికేషన్ స్కిల్స్ రవిశాస్త్రిని ముందంజలో నిలిపాయి’ – రవిశాస్త్రి ఎంపికపై కపిల్ స్పందన -
భారత ‘తాత్కాలిక’ అభ్యర్థిత్వానికి మద్దతు
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతామండలిలో తాత్కాలిక సభ్యదేశాలను ఎంపిక చేసేందుకు నిర్వహించే ఎన్నికల్లో ఇండియా అభ్యర్థిత్వానికి 55 దేశాలతో కూడిన ఆసియా–పసిఫిక్ బృందం ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. చైనా, పాకిస్తాన్‌లు కూడా ఈ ఆసియా–పసిఫిక్ దేశాల బృందంలో ఉండటం గమనార్హం. భద్రతామండలిలో ఐదు దేశాలకు శాశ్వత సభ్యత్వం ఉండగా, మరో పది దేశాలకు తాత్కాలిక సభ్యత్వం కల్పిస్తారు. ఎన్నికలను నిర్వహించడం ద్వారా ఆ పది తాత్కాలిక సభ్య దేశాలను ఎన్నుకుంటారు. ప్రతి ఏడాదీ ఎన్నిక నిర్వహించి ఐదు దేశాలను ఎంపిక చేస్తారు. ఒకసారి ఎన్నికైతే ఆ దేశాలకు రెండేళ్లపాటు భద్రతామండలిలో తాత్కాలిక సభ్యత్వం లభిస్తుంది. 2021– 22 సంవత్సరాలకుగాను తాత్కాలిక సభ్యత్వం పొందే దేశాలను ఎంపిక చేసేందుకు వచ్చే ఏడాది జూన్‌లో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లోనే ఇండియా పోటీ చేయనుండగా, భారత అభ్యర్థిత్వాన్ని ఆసియా–పసిఫిక్ బృందంలోని మొత్తం దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఈ విషయాన్ని ఐరాసలో భారత శాశ్వత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ మంగళవారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. భారత అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన దేశాల్లో చైనా, పాకిస్తాన్, నేపాల్, జపాన్, ఇరాన్, టర్కీ, మలేసియా, ఇండోనేసియా, శ్రీలంక, సిరియా, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, యూఏఈ, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, వియత్నాం, మాల్దీవులు, మయన్మార్, కిర్గిజ్స్తాన్ తదితర దేశాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఇక ఇప్పటికే భారత్ ఏడుసార్లు ఐరాస భద్రతామండలిలో తాత్కాలిక సభ్యదేశంగా ఉంది. చివరిసారిగా 2011–12 సంవత్సరాల్లో భద్రతామండలిలో ఇండియా తాత్కాలిక సభ్యదేశ హోదాను పొందింది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో విజయం సాధిస్తే పదేళ్ల తర్వాత మళ్లీ ఆ హోదా దక్కనుంది. భద్రతామండలిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యాలకు శాశ్వత సభ్యత్వం ఉండటం తెలిసిందే. 21వ శతాబ్దపు రాజకీయ, భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఇండియాకు కూడా శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. -
స్పీకర్‌గా బిర్లా ఏకగ్రీవం
న్యూఢిల్లీ: పదిహేడవ లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీకి చెందిన ఓం బిర్లా ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. రాజస్తాన్‌లోని కోటా నియోజక వర్గం నుంచి పార్లమెంటుకు ఎన్నికయిన బిర్లా అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి, డీఎంకే ఎంపీ టీఆర్ బాలు, తృణమూల్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ తదితరులు మద్దతు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల బరిలో బిర్లా ఒక్కరే ఉండటంతో ఆయనను స్పీకర్‌గా ఎంపికచేస్తూ ప్రధాని మోదీ తీర్మానం ప్రవేశపెట్టారు. దానిని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం బిర్లా లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయినట్టు ప్రొటెం స్పీకర్ వీరేంద్ర ప్రకటించారు. ప్రధాని మోదీ స్వయంగా బిర్లాను స్పీకర్ కుర్చీ దగ్గరకు తీసుకెళ్లారు. పార్టీలకతీతంగా పలువురు ఎంపీలు పోడియం వద్దకు వచ్చి కొత్త స్పీకర్‌ను అభినందించారు. సభను నిష్పక్షపాతంగా నిర్వహించాలని ప్రతిపక్షాలు నూతన స్పీకర్‌కు విజ్ఞప్తి చేశాయి. ‘సభ నిర్వహణలో మీకు పూర్తిగా సహకరిస్తామని ప్రభుత్వం, అధికార పక్షం తరఫున నేను హామీ ఇస్తున్నాను. సభలో మీ మాటే చెల్లుతుంది. మా వాళ్లతో సహా ఎవరు హద్దుమీరినా మీరు కఠిన చర్య తీసుకోవాలి’ అని మోదీ అన్నారు. తనను స్పీకర్‌గా ఎన్నుకున్నందుకు బిర్లా అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సభను నిష్పక్షపాతంగా నిర్వహిస్తానని, సభ్యులందరికీ సమాన అవకాశాలు ఇస్తానని అన్నారు. సభను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని, ప్రజా సమస్యలను సభలో లేవనెత్తేందుకు విపక్షాలకు తగినంత సమయం ఇవ్వాలని కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ కొత్త స్పీకర్‌ను కోరారు. స్పీకరే సభకు అధిపతి అని, దేశ స్వాతంత్య్రానికి, జాతికి ఆ పదవి ప్రతిబింబమని నెహ్రూ చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు. ఇంతవరకు లోక్‌సభ చాలా తక్కువ బిల్లులనే స్థాయీ సంఘానికి సిఫారసు చేస్తూ వస్తోందని, ఇకనైనా ఆ తీరు మారాలన్నారు. బీజేడీ ఎంపీ పినాకి మిశ్రా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. చర్చల్లో ప్రాంతీయ, చిన్న పార్టీల సభ్యులకు తగినంత సమయం కేటాయించాలని అకాలీదళ్ ఎంపీ సుఖ్బీర్సింగ్ బాదల్, ఆప్నాదళ్ ఎంపీ అనుప్రియ పటేల్ సూచించారు. -
గగ్గనపల్లి ఎంపీటీసీ ఏకగ్రీవం చెల్లదు
సాక్షి, హైదరాబాద్: నాగర్‌కర్నూల్ జిల్లా గగ్గన్నపల్లి ఎంపీటీసీ స్థానంకు జరిగిన ఏకగ్రీవ ఎన్నిక చెల్లదని, దీనికి చట్టబద్ధత లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి ప్రకటించారు. మరోసారివిడిగా నోటిఫికేషన్ జారీచేసి ఈ స్థానంలో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. టీఆర్ఎస్ నేత దొడ్ల ఈశ్వరరెడ్డి తనను బెదిరించి రూ.10 లక్షలు ఇచ్చి ప్రలోభాలకు గురిచేసి ఎన్నికను ఏకగ్రీవానికి తనపై ఒత్తిడి తెచ్చినట్లు గగ్గనపల్లి ఎంపీటీసీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న దొడ్ల వెంకటనారాయణరెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై పత్రికల్లో వచ్చిన కథనాలపై ఎన్నికల కమిషన్ స్పందించి, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎన్నికల అధికారుల నుంచి నివేదిక తెప్పించినట్టు పేర్కొన్నారు. వెంకటనారాయణరెడ్డి నామినేషన్ ఉపసంహరణ వెనుక డబ్బు ప్రలోభాలతో పాటుగా ప్రత్యర్థిపార్టీ నేతల ఒత్తిళ్లు పనిచేసినట్లు స్పష్టమైం దని ఆయన తెలిపారు. దీంతో ఈ ఏకగ్రీవ ఎన్నికను రద్దు చేస్తున్నట్లు శనివారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం లోని నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. నివేదికలో నారాయణరెడ్డిపై దాడికి దిగినట్టుగా ఎక్కడా నిరూపితం కాలేదన్నారు. కలెక్టర్ల నివేదిక తర్వాతే ఏకగ్రీవాలు.. నామినేషన్లు వేయకుండా బెదిరింపులు, డబ్బుతో ప్రలోభపరచి సీట్ల వేలం మొదలుకుని నామినేషన్ల ఉపసంహరణకు ఒత్తిళ్లు పనిచేస్తున్నాయని గతంలో వచ్చిన వార్తల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ గత జనవరిలోనే ఏకగ్రీవాలపై జిల్లా కలెక్టర్ల నివేదికలు వచ్చాకే వాటిని ప్రకటించాలని నోటిఫికేషన్‌ను ఇచ్చిందని నాగిరెడ్డి తెలిపారు. దీంతో పాటు ఏకగ్రీవాలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు జిల్లా కలెక్టర్లకు నివేదికలు పంపించి, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారుల నుంచి క్లియరెన్స్ వచ్చాకే జెడ్పీటీసీ,ఎంపీటీసీ అభ్యర్థుల ఏకగ్రీవా లను ప్రకటించాలని ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఆదేశాలిచ్చిందన్నారు. -
సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం
వీణవంక (హుజూరాబాద్): తనను ఏకగ్రీవంగా సర్పంచ్ పదవికి ఎంపిక చేస్తామని మొదట ప్రకటించి.. తీరా మరొకరిని బరిలో దింపారంటూ మనస్తాపంతో కరీంనగర్ జిల్లా వీణవంక మం డలం హిమ్మత్‌నగర్ గ్రామానికి చెందిన అంగిడి రాధ అనే మహిళ క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. వివరాలు.. హిమ్మత్‌నగర్ పంచాయతీ ఎస్టీ మహిళకు రిజర్వ్ అయింది. ఈ పంచాయతీకి మూడో విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దీంతో గ్రామానికి చెందిన అంగిడి రాధను బరిలో నిలపాలని టీఆర్ఎస్ మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు సూచించారు. కూలీ పనులు చేసుకునే రాధ ఇందుకు ఒప్పుకుంది. రాధను ఏకగ్రీవం చేయాలని పార్టీ కార్యకర్తలతోపాటు కులసంఘాలు తీర్మానించారు. నామినేషన్ సమయంలో అదే సామాజికవర్గానికి చెందిన మరో మహిళతో నామినేషన్ వేయించారు. తనను ఏకగ్రీవం చేస్తామని చెప్పి మరో అభ్యర్థిని బరిలో నిలపడంతో విషయాన్ని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లింది. కానీ.. పార్టీ కార్యకర్తలు, స్థానిక పెద్దలు రాధకు బదులు మరో అభ్యర్థికి ప్రచారం చేస్తుండటంతో మనస్తాపానికి గురైన ఆమె ఆదివారం ఇంట్లోనే క్రిమిసంహారక మందు తాగింది. ఇది గమనించిన చుట్టుపక్కలవారు ఆమెను జమ్మికుంటలోని ఓ ప్రైవేటు ఆసుప్రతికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంధువులు తెలిపారు. -
ఊహించని వరం ఊరికి నేతృత్వం!
కాకా రుద్రజారాణి సాధారణ విద్యార్థిని. ఎలాంటి రాజకీయ వాసనలు, వారసత్వాలు లేని కుటుంబం. తండ్రి (ఇప్పుడు లేరు), తల్లి, అన్న.. గౌరారంలో ఇదీ ఆమె కుటుంబం. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గౌరారం గ్రామ పంచాయతీ ఇటీవలే ఎస్టీ స్థానంగా రిజర్వ్ అయింది. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో వీళ్లదొక్కటే గిరిజన కుటుంబం. తల్లి అంగన్వాడీ కార్యకర్త కావడంతో ఎస్టీ మహిళ కోటాలో గౌరారం సర్పంచ్ అయ్యే అవకాశం రాణికే వచ్చింది. రుద్రజారాణి పెనుబల్లిలో డిగ్రీ పూర్తి చేసి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో బీఈడీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. డిగ్రీ పూర్తయ్యాక పిల్లలకు పాఠాలు బోధించాల్సిన రుద్రజారాణికి డిగ్రీ కాకుండానే గ్రామాన్ని ఏలి, అభివృధ్ధి చేసుకునే అదృష్టం ఇలా అనుకోకుండా వరించింది. గ్రామ పంచాయతీలో ఒకే గిరిజన (కోయ తెగకు) కుటుంబం ఉండటంతో పోటీ అనేది లేకుండా పోయింది. ఏకగ్రీవం కావడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం నుండి ఈ గ్రామానికి పది లక్షల నజరానా దక్కనుంది. గ్రామస్థాయిలో అత్యున్నత పదవి అయిన సర్పంచ్ పీఠం ఆమెకు అనుకోని బహుమతిలా లభించినందుకు తల్లి కాకా సుజాత, సోదరుడు రాణా ప్రతాప్ సంతోషపడుతుండగా, గ్రామస్తులు కూడా ఆమె అదృష్టాన్ని చూసి హర్షాతిరేఖలు వ్యక్తం చేస్తున్నారు. విడిపోవడం వరమైంది గతంలో గౌరారం గ్రామ పంచాయతీలో పార్థసారథిపురం, ఉప్పల చెలక గ్రామాలు ఉండేది. అయితే ఇటీవల గ్రామ పంచాయతీల పెంపులో భాగంగా ప్రభుత్వం రెండింటిని విడదీసి రెండు గ్రామ పంచాయతీలుగా చేసింది. గతంలో గిరిజన కుటుంబాల వారే ఈ పంచాయతీని ఏలేవారు. ప్రస్తుతం గౌరారం విడిపోయి 997 ఓటర్లు ఉన్న గ్రామ పంచాయతీగా అవతరించింది. నేషనల్ హైవేకు ఆనుకొని ఉన్న ఈ పంచాయతీ పరిధిలో ఉప్పలచలక, వావిలపాడు గ్రామాలున్నాయి. ఇక్కడ 270 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ కాకా సుజాతకు చెందిన గిరిజన కుటుంబమే ఉంది. ఫలితంగా ఆ కుటుంబానికి చెందిన రుద్రజారాణికే సర్పంచ్ పదవి దక్కింది. ఫలించిన తండ్రి కల రుద్రజారాణి తండ్రి కాకా వెంకటేశ్వర్లు పెనుబల్లి మండలం లింగగూడెం వీఆర్వోగా పనిచేసేవారు. అనారోగ్యం కారణంగా గత ఏడాది మృతి చెందారు. దీంతో ఆ ఉద్యోగంకుమారుడు రాణాప్రతాప్‌కు వచ్చింది. అంగన్ వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న తన భార్యను ఎలాగైనా గ్రామ పంచాయతీ సర్పంచ్ చేయాలని భర్త వెంకటేశ్వర్లు బతికున్న రోజుల్లో ఎన్నో కలలు కన్నాడు. ఆ కల ఇప్పుడు తన కూతురి రూపంలో నిజమైంది. ఎలాంటి పోటీ లేకుండానే సర్పంచ్ పీఠం కూతురికి దక్కింది. – ఎం.ఏ.సమీర్, సాక్షి నాన్న కోరిక నేను నెరవేరుస్తా అమ్మను సర్పంచ్ చేయాలని నాన్న ఎప్పుడూ అనేవారు. కానీ అప్పట్లో నాన్న కోరిక నెరవేరలేదు. నేను నాన్న కల నిజం చేస్తున్నాను. బీఈడీ అభ్యసిస్తూనే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా. గ్రామ అభివృద్ధికి పాటు బడతా. నాకు రాజకీయాలు తెలియవు. అయినా ఏ సమస్యలు ఉన్నా పరిష్కారానికి నావంతు కృషి చేస్తా. – రుద్రజారాణి -
జస్టిస్ జోసెఫ్ పేరు మళ్లీ కేంద్రానికి!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్‌ను సుప్రీంకోర్టు జడ్జిగా నియమించేలా కేంద్రానికి మరోసారి సిఫారసు చేసేందుకు సుప్రీంకోర్టు కొలీజియం ఏకగ్రీవంగా అంగీకరించింది. ప్రస్తుతం వివిధ హైకోర్టుల్లో జడ్జీలుగా ఉన్న వారినీ సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించేందుకు సిఫారసు చేయాలనీ, వారి పేర్లతోపాటే జస్టిస్ జోసెఫ్ పేరును కేంద్రానికి పంపాలని కొలీజియం శుక్రవారం తీర్మానించింది. ఏపీæ–తెలంగాణ ఉమ్మడి హైకోర్టు, రాజస్తాన్, కలకత్తా హైకోర్టుల న్యాయమూర్తుల పేర్లూ సిఫార్సుచేయొచ్చని సమాచారం. ఎవరి పేర్లను సిఫార్సు చేయాలనే దానిపై నిర్ణయించేందుకు సీజేఐ జస్టిస్ మిశ్రా, జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌ల కొలీజియం మే 16న సాయంత్రం భేటీ కానుంది. ఇదీ నేపథ్యం.. 2016లో ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని నిర్ణయించింది. ఆ నిర్ణయాన్ని జస్టిస్ జోసెఫ్ నేతృత్వంలోని ఉత్తరాఖండ్ హైకోర్టు కొట్టేసింది. తర్వాత జస్టిస్ కేఎం జోసెఫ్‌ను సుప్రీం జడ్జిగా నియమించాలని కొలీజియం ఈ ఏడాది జనవరిలో సిఫారసు చేయగా, కేంద్రం ఆ ప్రతిపాదనను తోసిపుచ్చింది. సిఫార్సు నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కేంద్రం అప్పట్లో సుప్రీం జడ్జీలను కోరింది. సుప్రీంకోర్టు జడ్జిగా ఉండటానికి అవసరమైన ప్రమాణాలు, అనుభవం జస్టిస్ జోసెఫ్‌కు లేవనీ కొలీజియం సిఫారసును కేంద్రం తిరస్కరించింది. తర్వాత జస్టిస్ జోసెఫ్ విషయంపై చర్చించేందుకు కొలీజియం సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా జస్టిస్ చలమేశ్వర్ సీజేఐకి మే 9న లేఖ రాయగా కొలీజియం శుక్రవారం భేటీ అయ్యి పై నిర్ణయం తీసుకుంది. జస్టిస్ జోసెఫ్ పేరును తిరస్కరిస్తూ న్యాయశాఖ మంత్రి రవిశంకర్ లేవనెత్తిన అన్ని అంశాలతో జస్టిస్ చలమేశ్వర్ విభేదించారు. కొలీజియం సిఫారసులను కేంద్రం ఒకసారి తిరస్కరించాక రెండోసారి కూడా కొలీజియం అదే న్యాయమూర్తి పేరునే సిఫారసు చేస్తే మరోసారి తిరస్కరించే అవకాశం కేంద్రానికి లేదు. కొలీజియం సిఫారసులను ఆమోదించి ఆ వ్యక్తిని సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాల్సిందే. -
క్యూబా అధ్యక్షుడిగా డియాజ్ కానెల్
హవానా: క్యూబా నూతన అధ్యక్షుడిగా కమ్యూనిస్ట్ అగ్రనేత మిగ్వెల్ డియాజ్ కానెల్(58) ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. క్యాస్ట్రో కుటుంబేతర వ్యక్తి ఈ పదవికి ఎన్నికవడం ఆరు దశాబ్దాల కాలంలో ఇదే తొలిసారి. కానెల్ 2013 నుంచి క్యూబాకు తొలి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. బుధవారం ఆయన్ని జాతీయ అసెంబ్లీ ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకుంది. ఫిడేల్ అనారోగ్యానికి గురికావడంతో 2006లో రౌల్ అధికారం చేపట్టారు. అయితే క్యూబా కమ్యూనిస్ట్ పార్టీ అధినేతగా కొనసాగనున్న రౌల్ పర్యవేక్షణలోనే కానెల్ పాలించే వీలుంది. చిన్నచిన్న ప్రైవేట్ సంస్థలను దేశంలోకి ఆహ్వానించడం, చిరకాల ప్రత్యర్థి అమెరికాతో సంబంధాల పునరుద్ధరణ ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడం ఆయన ముందున్న సవాళ్లు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత కానెల్ కొంతకాలం ఓ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేశారు. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. మితవాద భావాలతో ప్రశాంతంగా కనిపించే కానెల్..క్యూబా రెబెల్స్, అమెరికాపై మాత్రం తీవ్ర స్వరంతో స్పందించేవారు. -
11న రాహుల్ పట్టాభిషేక ప్రకటన
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీని ప్రకటించేందుకు రంగం సిద్ధమైంది. ఏఐసీసీ అధ్యక్ష పదవికి నామినేషన్ల ఉపసంహరణ గడువు 10వ తేదీతో ముగియనుంది. రాహుల్ నామినేషన్ ఒక్కటే దాఖలు కావడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు 11వ తేదీన ప్రకటించనున్నారు. దీంతోపాటు గుజరాత్ ఎన్నికలు ముగిసిన వెంటనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం కొత్త అధ్యక్షుడి నేతృత్వంలో జరుగుతుంది. ఈ సమావేశంలోనే ఏఐసీసీ ప్లీనరీ తేదీని నిర్ణయిస్తారు. ప్లీనరీకి నెల ముందుగానే నోటీసులు జారీ చేస్తారు. ప్లీనరీలో రాహుల్ ఎన్నికను లాంఛనంగా ప్రకటిస్తారు. ఈ సందర్భంగా సీడబ్ల్యూసీకీ ఎన్నికలు జరుపుతారు. ఈ కమిటీలో ఉండే 20 మందిలో పది మందిని నామినేట్ చేస్తారు. మిగతా వారిని ఏఐసీసీ ప్రతినిధులు ఎన్నుకుంటారు. పార్టీలో నూతనోత్సాహం నింపేందుకు కొత్తగా బాధ్యతలు చేపట్టబోయే రాహుల్ సిద్ధమవుతున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. సంక్రాంతి తర్వాత.. రాష్ట్రాల స్థాయిలో పీసీసీలు, డీసీసీలను పునర్వ్యవస్థీకరిస్తారని తెలుస్తోంది. చాలా రాష్ట్రాల పీసీసీలు అంతర్గత కలహాలతో నిస్తేజంగా, నామమాత్రంగా మారాయని, 2014 ఎన్నికల తర్వాత ఏఐసీసీ కూడా సంస్థాగతంగా బలహీనపడిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. దీనిపై ఫిర్యాదులతో తనను కలిసిన కొందరు నేతలతో రాహుల్.. సోనియా మేడమ్ వద్దకు వెళ్లండని చెబుతుండగా.. సోనియా వద్దకు వెళ్లిన వారికి కూడా రాహుల్‌ను కలవండనే సమాధానం ఎదురైంది. దీంతో ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో చాలా పీసీసీలు ఉన్నాయి. ఇన్నాళ్లూ.. ఇలాగే కాలం గడిచినా ఇకపై పరిస్థితి మారుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సమస్యలను ప్రజాస్వామ్యయుతంగా పరిష్కరించటంతోపాటు, అందరినీ కలుపుకుని పోగల నేత రాహుల్ అని అంటున్నారు. సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకోవటంతో రాష్ట్ర విభాగాలకు మరింత స్వేచ్ఛ ఇచ్చే అవకాశాలున్నాయని సమాచారం. ఇదే సమయంలో సీనియర్ నేతలకు సముచితస్థానం కల్పిస్తారని భావిస్తున్నారు. యువ నేతలకు ప్రోత్సాహం, సీనియర్లకు సముచిత స్థానం కల్పిస్తూ రాహుల్ పార్టీని ఐక్యంగా ముందుకు తీసుకెళ్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఏఐసీసీ నుంచి వైదొలుగుతున్న సోనియా గాంధీ ఇకపై యూపీఏ సారథ్య బాధ్యతలను చేపడతారని భావిస్తున్నారు. భాగస్వామ్య పక్షాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ, కూటమిని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. -
మళ్లీ సీతమ్మకే పగ్గాలు
ఏలూరు (ఆర్ఆర్ పేట): తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా ప్రస్తుత అధ్యక్షురాలు తోట సీతారామలక్షి్మని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు జిల్లా ఇన్చార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. సోమవారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలో వివిధస్థాయిల కమిటీలను ఎంపిక చేశామని, జిల్లా కమిటీ నాయకులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని 15 నియోజకవర్గాల నాయకులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారన్నారు. ఈ మేరకు తోట సీతారామలక్షి్మని ఎన్నుకున్నామని, ఆమెతో పాటు జిల్లా కమిటీలోని ఇతర పదవులకు, అనుబంధ కమిటీలకు నాయకులను ఎన్నుకున్నామని చెప్పారు. జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శులుగా ఉప్పాల జగదీష్‌బాబు, చెలికాని సోంబాబు, పార్టీ జిల్లా కార్యాలయ కార్యనిర్వహక కార్యదర్శిగా పాలి ప్రసాద్, కోశాధికారిగా శ్రీకాకుళపు వెంకట నరసింహరావును ఎన్నుకున్నామన్నారు. జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలుగా గంగిరెడ్ల మేఘాలాదేవి, ప్రధాన కార్యదర్శులుగా భైరెడ్డి ఆదిలక్ష్మి, బెజ్జం అచ్చాయమ్మ, తెలుగు రైతు అధ్యక్షులుగా పసల అచ్యుత సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా దొంగ నాగరాజు, బీసీ అధ్యక్షులుగా కొనుకు జనార్దన్, ప్రధాన కార్యదర్శిగా షేక్ మీరా, జిల్లా మైనార్టీ అధ్యక్షులుగా మహబూబ్ ఆలీఖాన్ (జాని), ప్రధాన కార్యదర్శులుగా అల్తాఫ్, సుభానీని ఎన్నుకున్నామని చెప్పారు. ఎస్సీ అధ్యక్షులుగా దాసరి ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి పీతల శ్రీనివాస్, లీగల్ సెల్ అధ్యక్షులుగా పేరాబతి్తన సాయిరమేష్, వాణిజ్య సెల్ అధ్యక్షులుగా పాట్రు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా చుండూరి సత్యనారాయణ, టీఎన్టీయూసీ అధ్యక్షులుగా ఆసన సుబ్రహ్మణ్యం, సాంస్కృతిక విభాగం అధ్యక్షులుగా మారిశెట్టి వేణుగోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసనాయుడు, టీఎన్టీఎస్ఎఫ్ అధ్యక్షులుగా మద్దిపాటి ధర్మేంద్ర, చేనేత విభాగం అధ్యక్షులుగా అందే వీరభద్రం, క్రిస్టియన్ విభాగం అధ్యక్షులు గేదెల జాన్, వైద్య విభాగం అధ్యక్షులుగా సుంకర సుధీర్, ప్రధాన కార్యదర్శిగా ఎన్.స్లీవ్రాజును ఎన్నుకున్నారు. మంత్రులు కొల్లు రవీంద్ర, కేఎస్ జవహర్, పితాని సత్యనారాయణ, పార్టీ సంస్థాగత ఎన్నికల పరిశీలకుడు చిక్కాల సూర్యనారాయణ, ఏలూరు ఎంపీ మాగంటి బాబు, హస్తకళాభివృద్ధి సంస్థ చైర్మన్ పాలి ప్రసాద్, మాజీ మంత్రి పీతల సుజాత, ఎమ్మెల్యేలు బడేటి బుజ్జి, నిమ్మల రామానాయుడు, వేటుకూరి శివరామరాజు పాల్గొన్నారు. -
సామాజిక న్యాయ జేఏసీ చైర్మన్‌గా జస్టిస్ చంద్రకుమార్
హైదరాబాద్: సామాజిక న్యాయ ఐక్య కార్యాచరణ కమిటీ సారధిని ఎన్నుకు న్నారు. చైర్మన్‌గా జస్టిస్ బి.చంద్రకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. గురువారం హైదరాబాద్‌లోని సుందర య్య విజ్ఞాన కేంద్రంలో సామాజిక న్యాయ ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటు సమా వేశం జరిగింది. ఈ సందర్భంగా కొత్త కమిటీని ఎన్నికున్నారు. కో–చైర్మన్‌గా ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్ రావు, కన్వీనర్లుగా సోయం బాబూ రావు, భారత్ వాగ్మా రే, ప్రొఫెసర్ తిరుమలి, మురళీ మనోహర్, మన్నారం నాగరాజు, ఎంఎ.ము జీబ్, సొగరా బేగం, కార్యదర్శులుగా ఎన్ శ్రీనివాస్‌యాదవ్, టి. విష్ణు, బిక్షపతిలను ఎన్ను కున్నారు. అనంతరం జస్టిస్ చంద్ర కుమార్ మాట్లాడుతూ.. సామా జిక న్యాయం, ప్రజాస్వా మ్య స్థాపనే లక్ష్యంగా ఐక్య కార్యా చరణ కమిటీ ఏర్పడిందన్నారు. తెలంగాణ వస్తే ఆత్మగౌరవం దక్కుతుందని భావించా మని, కాని ఇప్పటికీ అదే వివక్ష కొనసా గుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక త్యాగాలతోనే రాష్ట్రం ఏర్పడిందని, కాని లబ్ధి పొందుతున్నది మాత్రం ఒక్క టీఆర్ఎస్ పార్టీయేనని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని వివరించారు. -
ఎమ్మెల్సీగా చిక్కాల ఏకగ్రీవం
ధ్రువీకరణ పత్రం అందజేసిన రిటర్నింగ్ అధికారి కాకినాడ సిటీ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా తెలుగుదేశం అభ్యర్థి చిక్కాల రామచంద్రరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. ఈ మేరకు కలెక్టరేట్లో ఎన్నికల ప్రత్యేకాధికారి కరికాల వల్లభన్ సమక్షంలో ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని చిక్కాలకు అందజేశారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, జిల్లా రెవెన్యూ అధికారి బీఎల్. చెన్నకేశవరావు, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, డీసీసీబీ చైర్మన్ వరుపులరాజా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎన్.వీర్రెడ్డి, పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు పాల్గొన్నారు. ఎన్నికల ధ్రువీకరణ పత్రం అందుకున్న అనంతరం చిక్కాల రామచంద్రరావు కలెక్టరేట్ నుంచి పార్టీ జిల్లా కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనకు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. చిక్కాలకు డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప స్వీట్ తినిపించి అభినందించారు. -
ఆరుగురు ఏకగ్రీవం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పశ్చిమగోదావరి జిల్లాలో మంతెన సత్యనారాయణ, అంగర రామ్మోహన్, తూర్పుగోదావరి జిల్లాలో చిక్కాల రామచంద్రరావు, అనంతపురం జిల్లాలో దీపక్‌రెడ్డి, చిత్తూరు జిల్లాలో దొరబాబు, శ్రీకాకుళం జిల్లా శత్రుచర్ల విజయరామరాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. స్వతంత్ర అభ్యర్థులు ఈరోజు నామినేషన్లను విత్‌డ్రా చేసుకోవడంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది. మరోవైపు నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ నెలకొంది. -
ఎమ్మెల్సీగా జాఫ్రీ ఎన్నిక ఏకగ్రీవం
హైదరాబాద్: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన సయ్యద్ అమీన్-ఉల్- జాఫ్రీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి అద్వైతకుమార్ సింగ్ శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. ఈ ఎమ్మెల్సీ స్థానానికి అధికార టీఆర్ఎస్ మద్దతుతో ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా జాఫ్రీ నామినేషన్ దాఖలు చేశారు. ఇతర పార్టీల నుంచి ఎవరూ పోటీ లేకపోవడంతో జాఫ్రీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించి సర్టిఫికెట్‌ను అందజేశారు. ఎన్నికల పరిశీలకుడు వి.ఎన్.విష్ణు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మోజం ఖాన్ హాజరయ్యారు. -
‘ఏకగ్రీవ’ ఎత్తుగడ
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఏకగ్రీవానికి అధికార పార్టీ అడ్డదారులు ఇతరులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న నాయకులు కలెక్టరేట్ ఎదుటే స్వతంత్ర అభ్యర్థులపై దాడులు మాట వినని వారిని కిడ్నాప్ చేసి బెదిరింపు ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్న జిల్లా టీడీపీ నేతలు చిత్తూరు, సాక్షి: జిల్లానుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు అధికార పార్టీ దౌర్జన్యకాండకు దిగింది. స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏకగ్రీవం కావాలని చేసిన ప్రయత్నంలో విజయం సాధించినా ప్రజాస్వామ్యం మాత్రం అపహాస్యం పాలైంది. దీనిపై ‘మునుపెన్నడూ నేను ఇలాంటి సంఘటనలు చూడలేదు’ అని స్వయంగా ఎన్నికల పరిశీలనాధికారి అనంతరాములు వ్యాఖ్యానించడం విశేషం. ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం కావడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డదారులు తొక్కారు. కొంతమందిపై భౌతికదాడులకు పాల్ప డ్డారు. ఒక్క నామినేషన్ కూడా పడకూడదనే లక్ష్యంతో ఇద్దరిని కిడ్నాప్ చేశారు. మరో ఇద్దరిపై బెదిరింపులకు పాల్పడ్డారు. మంగళవారం ఉదయం నామినేషన్ వేయడానికి వచ్చిన పెద్దమండ్యం ఎంపీపీ ప్రసాద్‌రెడ్డిని డీఎస్పీ, సీఐ, ఎస్ఐల సమక్షంలోనే టీడీపీ నాయకులు కిడ్నాప్ చేశారు. పోలీసుల రక్షణలో నామినేషన్ వేసేందుకు వచ్చిన వెదురుకుప్పం జెడ్పీటీసీ సభ్యుడు మాధవరావుపై దాడిచేశారు. నామినేషన్ పత్రాలు చింపేశారు. ఈ దాడిలో పోలీసు వాహనం అద్దం కూడా పగిలిపోయింది. తిరుపతికి వెళ్లే సమయంలో ఆయనను కిడ్నాప్ చేశారు. పీలేరు నుంచి నామినేషన్ వేయడానికి వచ్చిన భానుప్రకాష్ అనే అభ్యర్థి నుంచి పోలీసుల ముందే నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కున్నారు. నామినేషన్ పత్రాలు లేకపోవడంతో భానుప్రకాష్‌ను పోలీసులు రిటర్నింగ్ ఆఫీసులోకి అనుమతించలేదు. భానుప్రకాష్ విద్యార్హత పత్రాలు కూడా టీడీపీ నాయకులు చింపేశారు. సామాన్యులపై కూడా ప్రతాపం.. టీడీపీ కార్యకర్తలు సామాన్యులనూ వదిలిపెట్టలేదు. అధికారులతో కలవడానికి వచ్చిన వారిచేతిలో సంచి ఉంటే చాలు గుంజుకుని పరిగెత్తారు. పౌరసరఫరాల శాఖ అధికారులను కలవడానికి పీలేరు నుంచి వచ్చిన గౌరయ్య అనే డీలరు చేతిలో సంచి ఉండటంతో గుంజుకుని ఆయనపై దాడికి పాల్పడ్డారు. సంచిలో ఉన్న ఈ–పాస్ మిషన్‌ను పగులగొట్టారు. పట్టభద్రుల అభ్యర్థులకు కలెక్టరేట్లో సమావేశం ఉండటంతో కరీముల్లా అనే వ్యక్తి వచ్చారు. ఆయన చేతిలోని కాగితాలను నామినేషన్ పత్రాలుగా భావించి వాటిని చింపేశారు. వాటిలో విద్యార్హత పత్రాలు ఉండటంతో లబోదిబోమనడం కరీముల్లా వంతయింది. ఈ సంఘటనలన్నీ పోలీసుల కళ్లెదుటే జరుగుతున్నా వారు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించడంతో సామాన్యులు ఇబ్బందుల పాలయ్యారు. బరిలో టీడీపీ అభ్యర్థి ఒక్కరే జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో టీడీపీ అభ్యర్థి దొరబాబు ఒక్కరే మిగిలారు. అధికార పార్టీ నాయకుల దౌర్జన్యకాండతో చిత్తూరులో కలెక్టరేట్ వద్దకు వెళ్లాలంటేనే భయపడే వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో టీడీపీ అభ్యర్థి కాకుండా మరో నలుగురు మాత్రమే నామినేషన్లు వేశారు. వారిలో స్వతంత్ర అభ్యర్థులు మస్తాన్‌రెడ్డి, చంద్రమౌళి తమ నామినేషన్లను బుధవారం ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల పరిశీలనలో భాగంగా అఫిడవిట్‌పై జుడిషియల్ స్టాంప్ లేకపోవడంతో వెదురుకుప్పం జెడ్పీటీసీ సభ్యుడు మాధవరావు నామినేషన్‌ను, ఫామ్26ను సరిగా పూర్తి చేయకపోవడంతో వెంకటరామి రెడ్డి నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. దీంతో టీడీపీ అభ్యర్థి దొరబాబు మాత్రమే బరిలో నిలిచారు. -
ఏకగ్రీవాలకు నజరానా
ఆలేరు : ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు శుభవార్త. నజరానాల కోసం కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న పంచాయతీలకు ప్రభుత్వం ఎట్టకేలకు మూడు రోజుల క్రితం నిధులు మంజూరు చేసింది. దీంతో ఆ గ్రామాలు ప్రగతిబాట పట్టనున్నాయి. 2013 జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రోత్సాహకాలు అందిస్తామని అప్పటి ఉమ్మడి సర్కార్ పేర్కొంది. ఎన్నికలను ఏకగ్రీవం చేస్తే భారీగా నిధులు ఇస్తామని అప్పటి సర్కార్ ప్రకటించడంతో రాజకీయాలను పక్కన పెట్టి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1176 గ్రామపంచాయతీలున్నాయి. జిల్లాల విభజనలో భాగంగా జనగామ జిల్లాకు 17 వెళ్లాయి. ఏకగ్రీవ పంచాయతీల్లో 15వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ. 7లక్షలు, 15వేలకు పైబడి జనాభా ఉన్న పంచాయతీలకు రూ. 20 లక్షలు అందిస్తామని ప్రకటించింది. 2013 జూలైలో ఎన్నికలు జరిగాయి. అయితే 2006లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అప్పటి సమైక్య రాష్ట్ర ప్రభుత్వం రూ. 5లక్షల చొప్పున ప్రోత్సాహకం అందించింది. తరువాత ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని పెంచింది. ఈ నిధులతో తక్కువ ఆదాయ వనరులు ఉన్న పంచాయతీలు అభివృద్ధి చెందనున్నాయి. గ్రామంలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం లభించనుంది. ఈ నిధులతో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులు, సీసీరోడ్లు, అంతర్గత రహదారుల నిర్మాణం, గ్రామపంచాయతీ భవనాలు తదితర పనులకు నిధులు ఖర్చు చేయనున్నారు. దీంతో గ్రామపంచాయితీల్లో కనీస వసతులు మెరుగుపడనున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇలా.. తిరుమలగిరి మండలంలో–1, నడిగూడెం–3, డిండి–1, చందంపేట–2, దేవరకొండ–1, పెద్దవూర–6, భూదాన్‌పోచంపల్లి–2, మునుగోడు–1, నాంపల్లి–3, చండూరు–1, బీబీనగర్–7, భువనగిరి–3, ఆత్మకూరు(ఎం)–5, చౌటుప్పల్–1, నారాయణపురం–3, తుంగతుర్తి–2, పీఏపల్లి–2, మోత్కురు–2, తుర్కపల్లి–1, యాదగిరిగుట్ట–2, హాలియా–5, రాజాపేట–1, చివ్వెంల–3, దామరచర్ల–7, గుర్రంపోడు–2, మేళ్లచెర్వు–1, త్రిపురారం–7, తిప్పర్తి–1, వేములపల్లి–2, బొమ్మలరామారం–3, అర్వపల్లి–1, నూతనకల్లు–3, చిలుకూరు–1,నిడమనూరు–5, మఠంపల్లి–1 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. నిధుల కేటాయింపు ఇలా.. యాదాద్రి భువనగిరి జిల్లాలో 334 గ్రామపంచాయతీలు ఉండగా 26 ఏకగ్రీవం అయ్యాయి. రూ. 1.82కోట్ల నిధులు మంజూరయ్యాయి. -
ఎమ్మెల్సీగా ఫరీదుద్దీన్ ఎన్నిక ఏకగ్రీవం
సాక్షి, హైదరాబాద్ : శాసన మండలిలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి మహ్మద్ ఫరీదుద్దీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం నామినేషన్ల ఉపసంహరణల గడువు ముగిసింది. అయితే, ఈ పదవి కోసం ఒకే ఒక నామినేషన్ దాఖలు కావడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ కార్యదర్శి రాజసదారాం ఫరీదుద్దీన్‌కు ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు ధ్రువీకరణ ప్రతం అందజేశారు. -
రాష్ట్ర ఎక్సైజ్ కార్యవర్గంలో ఇద్దరికి చోటు
చిత్తూరు (అర్బన్): రాష్ట్ర ఆబ్కారి శాఖ సంఘ ఎన్నికల్లో జిల్లాకు చెందిన ఇద్దరు ఉద్యోగులకు పదవులు లభించాయి. జిల్లా ఆబ్కారి శాఖ కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ల సంక్షేమ శాఖలో ఉపాధ్యక్షులుగా ఉన్న టివి.సుబ్రమణ్యంకు రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా, జిల్లా కార్యదర్శిగా ఉన్న రామచంద్రయ్యకు రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శిగా ఏకగ్రీవంగా రాష్ట్ర కమిటీఎన్నుకుంది. శనివారం వీళ్లిద్దరూ అబ్కారి జిల్లా ఉప కమిషనరు ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. -
టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడిగా తుమ్మ శ్రీధర్‌రెడ్డి
న్యూశాయంపేట : జిల్లా టీయూడబ్ల్యూజే(ఐజే యూ) అధ్యక్షుడిగా తుమ్మ శ్రీధర్‌రెడ్డిని ఏకగ్రీవం గా ఎన్నుకున్నట్లు ఎన్నికల పరిశీల కుడు, సంఘం రాష్ట్ర ఉపా««దl్యక్షుడు కరుణాకర్ తెలిపారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నట్లు ఆయన చెప్పారు. విభాగం కార్యదర్శిగా కంకణాల సంతోష్, కోశాధికారిగా సుధాకర్‌రావు ఎన్నికయ్యారన్నారు. వీరితో పాటు ఉపాధ్యక్షులు, జాయింట్ సెక్రెటరీలు, ప్రచార కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. జిల్లాకు చెందిన గుంటి విద్యాసాగర్‌ను రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యుడిగా తీసుకోవాలని నిర్ణయించామన్నారు. సమావేశంలో రాష్ట్ర పరిశీలకులు రాజేష్, గోపిరెడ్డి, సంపత్, జాతీయ, రాష్ట్ర నాయకులు దాస రి కృష్ణారెడ్డి, డి.రమేష్, వి.వెంకటరమణ, కె.కుమారస్వామి, యాదగిరి, నారాయణరెడ్డి, జి.మధు, బుచ్చిరెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల అధికారిగా దుర్గాప్రసాద్ వ్యవహరించారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని అధ్యక్షుడు టి.శ్రీధర్‌రెడ్డి ఈసందర్భంగా తెలిపారు. డెస్క్ జర్నలిస్ట్‌లతో పాటు, అర్హులైన అందరికి అక్రెడిటేషన్లు, ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. -
ఆకుపాముల ఉప ఎన్నిక ఏకగ్రీవం
–సర్పంచ్‌గా లిక్కి రామరాజు మునగాల: ఈ నెల 8న మండలంలోని ఆకుపాముల మేజర్ గ్రామపంచాయతీకి జరగాల్సిన ఉప ఎన్నికల్లో భాగంగా శనివారం నామినేషన్ల ఉపసంహారణకు తుది గడువు కావడంతో పోటీలో ఉన్న ఐదుగురు అభ్యర్థులు ఉపసంహారించుకున్నారు. దీంతో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు సర్పంచ్‌గా లిక్కి రామరాజు ఎన్నికైనట్లు ఎన్నికల అధికార్లు ఎన్.నాగేశ్వరరావు, బొడ్ల శ్రీనివాస్‌లు శనివారం తెలిపారు. ఆకుపాముల సర్పంచ్ లిక్కి నాగేశ్వరరావు గత సెప్టెంబర్‌లో గుండెపోటుతో ఆకస్మిక మృతిచెందారు. కాగ ఈ ఉప ఎన్నికకు నలుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులతో పాటు దివంగత సర్పంచ్ నాగేశ్వరరావు భార్య పూలమ్మ, పెద్ద కుమారుడు లిక్కి రామరాజులు నామినేషన్లు దాఖలు చేశారు. రామరాజు ఏకగ్రీవ ఎన్నికకు సహాకరించిన అన్ని రాజకీయ పార్టీలకు టీఆర్ఎస్ కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి కె.శశిధర్‌రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడంతో టీఆర్ఎస్ శ్రేణులు మునగాలలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు కందిబండ సత్యనారాయణ, తుపాకుల భాస్కర్, మండల పార్టీ అ««ధ్యక్షురాలు కోదాటి అరుణ, నాయకులు వేమూరి సత్యనారాయణ, పొనుగోటి రంగా తదితరులు పాల్గొన్నారు. -
ఏకగ్రీవమైన వార్డులు
కందుకూరు: మండల పరిధిలోని మురళీనగర్ 6వ వార్డు, లేమూరు 3వ వార్డుకు నిర్వహిస్తున్న ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ శనివారంతో ముగిసింది. మురళీనగర్ నుంచి 6వ వార్డుకు వాంక్డావత్ లలిత మాత్రమే బరిలో ఉండటంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎంపీడీఓ అనూరాధ ప్రకటించారు. లేమూరు 3వ వార్డుకు నలుగురు రంగంలో ఉండగా మంచాల అంజమ్మ నామినేషన్ ఉపసంహరించుకుంది. దీంతో ముగ్గురు బరిలో నిలవడంతో అక్కడ ఎన్నిక అనివార్యమైయింది. పోటీలో ఉన్న మంచాల సునీతకు గ్యాస్‌స్టవ్, ముచ్చర్ల సంధ్యారాణికి హార్మోనియం, మంచాల భాగ్యమ్మకు విద్యుత్ స్తంభం గుర్తును కేటాయించారు. ఈనెల 8న ఎన్నిక జరగనుంది. పెద్దేముల్ 4వ వార్డు ఏకగ్రీవం పెద్దేముల్: మూడు రోజుల నుంచి ఉత్కంఠం రేపిన పెద్దేముల్ గ్రామ పంచాయతీ 4వ వార్డు ఎన్నిక ఏకగ్రీవమైంది. మొత్తం ముగ్గురు నిమినేషన్ వేశారు. శనివారం పడగళ్ల చంద్రమ్మ, దాసరి నర్సమ్మ విత్ డ్రా చేసుకోవడంతో నత్తి నర్సమ్మ ఏకగ్రీవంగా ఎంపికైనట్లు ఎన్నికల అధికారి రాములు తెలిపారు. అనంతరం నర్సమ్మకు నియామక పత్రాన్ని అందచేశారు. దీంతో టీఆర్ఎస్ గ్రామ, మండల నాయకులు నర్సమ్మను అభినందించారు. -
కందుకూరు పీఏసీఎస్ కమిటీ ఎన్నిక
కందుకూరు పీఏసీఎస్‌లో సాఫీగా కొనసాగిన తంతు హాజరైన పది మంది డైరెక్టర్లు కందుకూరు: కందుకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) చైర్మన్‌గా మండల కేంద్రానికి చెందిన మీర్ఖాన్పేట డైరెక్టర్ సరికొండ మల్లేష్, వైస్ చైర్మన్‌గా నేదునూరుకు చెందిన డైరెక్టర్ సర్గారి బాల్‌రెడ్డి ఎనిమిది మంది సభ్యుల మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో పీఏసీఎస్ పీఠాన్ని ఎట్టకేలకు టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నట్లయింది. గురువారం జరిగిన కార్యక్రమానికి డివిజనల్ కో ఆపరేటీవ్ అధికారి శ్రీనివాస్‌రావు, సబ్ డివిజన్ కో-ఆపరేటీవ్ అధికారి నర్సింహారెడ్డి ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. వారి సమక్షంలో మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నిక నిర్వహించగా చైర్మన్‌గా సరికొండ మల్లేష్‌ను లేమూరు డైరెక్టర్ కొండారెడ్డి ప్రతిపాదించగా కందుకూరు డైరెక్టర్ హరికిషన్‌రెడ్డి బలపర్చారు. వైస్ చైర్మన్‌గా సర్గారి బాల్‌రెడ్డిని ఆకులమైలారం డైరెక్టర్ జంగయ్య ప్రతిపాదించగా, దెబ్బడగూడ డైరెక్టర్ రాములు బలపర్చడంతో డైరెక్టర్లు యాదయ్య, బాల్‌రాజ్, లక్ష్మమ్మ, యాదమ్మ మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఇద్దరి ఎన్నిక సాఫీగా జరిగింది. అనంతరం వారిద్దరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్, వైస్ చైర్మన్ మాట్లాడుతూ.. తమ ఎన్నికకు కారణమైన ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో పాటు డైరెక్టర్లు, నాయకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సొసైటీ అభివృద్ధికి తమ శాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు. -
ఏకగ్రీవం...
’ జీహెచ్ఎంసీలో ఐదుగురు కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తి ’ మైనార్టీల నుంచి ఇద్దరు... ’ మున్సిపల్ నిపుణులు..మేధావుల నుంచి ముగ్గురు సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక మంగళవారం పూర్తయింది. ఏకగ్రీవంగా ఐదుగురు సభ్యులను ఎన్నుకున్నారు. మైనార్టీ వర్గాల నుంచి ఇద్దరు, మునిసిపల్ వ్యవహారాల్లో నిపుణులు.. మేధావి వర్గంనుంచి ముగ్గుర్ని కో ఆప్షన్ సభ్యులుగా సభ్యుల ఆమోదం మధ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరి ఎన్నికకు సంబంధించి మంగళవారం జరిగిన జీహెచ్ఎంసీ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో తొలుత మైనార్టీ వర్గాల నుంచి ఇద్దరిని ఎన్నుకున్నారు. అనంతరం కొంత సేపు విరామంతో మునిసిపల్ వ్యవహారాల్లో నిపుణులు.. మేధావి వర్గంనుంచి ముగ్గురిని ఎన్నుకున్నారు. మైనార్టీ వర్గాల నుంచి రోడా విద్యా స్రవంతి, మహ్మద్ హుస్సేన్, మునిసిపల్ వ్యవహారాల్లో నిపుణులు.. మేధావుల నుంచి గొట్టిముక్కల జ్యోతి, ఎం.రాజీవ్‌గుప్తా, సి.నర్సింహారావులు ఎన్నికయ్యారు. వీరిలో తొలుత విద్యాస్రవంతి పేరును వెంకటేశ్వరనగర్ కార్పొరేటర్ మన్నె కవిత ప్రతిపాదించగా, అంబర్‌పేట కార్పొరేటర్ పులి జగన్ సమర్ధించారు. మహ్మద్ హుస్సేన్ పేరును దూద్‌బౌలి కార్పొరేటర్ గఫార్ ప్రతిపాదించగా, అహ్మద్‌నగర్ కార్పొరేటర్ అయేషా రూబినా సమర్ధించారు. గొట్టిముక్కల జ్యోతి పేరును పద్మావతి ప్రతిపాదించగా, గోపు సరస్వతి సమర్థించారు. రాజీవ్‌గుప్తా పేరును మేక రమేశ్ ప్రతిపాదించగా, రావుల విజయ సమర్ధించారు. నర్సింహారావు పేరును సంజయ్‌గౌడ్ ప్రతిపాదించగా, సామల హేమ సమర్థించారు. ఉన్న స్థానాలకు మించి వేరెవరూ పోటీలో లేకపోవడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కార్యక్రమాలకు అధ్యక్షత వహించిన మేయర్ బొంతు రామ్మోహన్ ప్రకటించారు. వెంటనే వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. మేయర్ రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి వారికి నియామకపత్రాలు అందజేశారు. ప్రత్యేక సమావేశానికి నగరానికి చెందిన ఇద్దరు మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావులతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. కుదిరిన సయోధ్య.. అధికార టీఆర్ఎస్, ఎంఐఎంల మధ్య కుదిరిన సయోధ్యతో ఈ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. రెండు పార్టీల మధ్య సయోధ్య కుదరకపోవడంతో గతంలో మైనార్టీల నుంచి జరగాల్సిన కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక కార్యక్రమాన్ని వాయిదా వేశారు. వాయిదా పడేందుకు తగినంతమంది సభ్యులు హాజరుకాక, కోరం లేదనే కారణం చూపుతూ అప్పట్లో వాయిదా వేశారు. ప్రస్తుతం ఉభయపార్టీల మధ్య తగిన ఒప్పందంతోనే ఇవి ఏకగ్రీవమైనట్లు తెలిసింది. మాక్ సమావేశాలు..సెల్ఫీలు.. ఒక ఎన్నిక.. మరొక ఎన్నికకు మధ్య విరామ సమయంలో కొత్తగా ఎన్నికైన మహిళా కార్పొరేటర్లు వారిలో వారే మాక్ కౌన్సిల్ సమావేశం నిర్వహించడం కనిపించింది. మైకు ముందు నుంచొని ఒకరు మాట్లాతుండగా, మరొకరు ఫోటోలు తీయడం, సెల్ఫీలు తీసుకోవడం వంటి దృశ్యాలు కనిపించాయి. -
ఎమ్మెల్సీ కాటెపల్లి జనార్ధన్ రెడ్డికి మరో అవకాశం కల్పించాలి
సిటీబ్యూరో: ఎమ్మెల్సీ కాటెపల్లి జనార్ధన్ రెడ్డికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి అవకాశం కల్పించాలని పీఆర్టీయూ హైదరాబాద్ జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గానికి త్వరలో ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో పీఆర్టీయూ -టీఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ కాటెపల్లి జనార్ధన్ రెడ్డిని ప్రకటించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ రాష్ట్ర కార్యవర్గానికి అందజేశారు. సోమవారం నారాయణగూడలో పీఆర్టీయూ హైదరాబాద్ జిల్లా రెండో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా హైదరాబాద్ జిల్లాను ఇతర ప్రాంతాలతో కలిపి విభజిస్తే సర్వీస్ సమస్యలు తలెత్త అవకాశం ఉన్నందున జిల్లాను విభజించకూడదని పేర్కొన్నారు. పీఆర్సీ ఎరియర్స్‌ను జీపీఎఫ్‌లో జమ చేయాలని తీర్మానించారు. కార్యక్రమంలో నాయకులు తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆరు.. ఖరారు
♦ ఆరు వార్డుల్లో ఏకగ్రీవం ♦ ఫలించిన ‘హరీశ్’ మంత్రాంగం ♦ సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో గుబాళించిన గులాబీ ♦ సంబురాల్లో టీఆర్ఎస్ శ్రేణులు సిద్దిపేట జోన్: మున్సిపల్ ఎన్నికల్లో ముందస్తుగానే టీఆర్ఎస్ పార్టీ గుబాళించింది. నామినేషన్ల ఉపసంహరణ నాటికీ ఆరు వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు పట్టణంలో సంబరాలు జరుపుకున్నాయి. పట్టణంలోని 34 వార్డులకుగాను.. ఆయా వార్డుల్లో ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు మూడు రోజులుగా మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని కమిటీ పార్టీలోని తిరుగుబాటు అభ్యర్థులతో పలు దఫాలుగా చర్చలు జరిపింది. ఈ క్రమంలో శుక్రవారం నిర్ణీత ఉపసంహరణ సమయానికి ముందే ఆరు వార్డుల్లో ఆయా అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణంలోని 13వ వార్డులో పల్లె వెంకట్‌గౌడ్, 16వ వార్డులో కడవేర్గు రాజనర్సు, 19వ వార్డులో పూజల లత , 18వ వార్డులో నల్లా విజయనరేందర్రెడ్డి, 21వ వార్డుల్లో మంతేన జ్యోతిరాజన రేందర్, 24వ వార్డులో బూర శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికైన్నట్లు మున్సిపల్ ఎన్నికల అధికారి రమణాచారి అధికారికంగా ప్రకటించారు. అనంతరం వారికి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. మరోవైపు పట్టణంలోని 9, 15, 17, 34 వార్డుల్లో ద్విముఖ పోటీ, 14, 25, 28 వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ త్రిముఖ పోటీని ఎదుర్కోనుంది. 166 మంది ఉపసంహరణ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉదయం 11 నుంచి మద్యాహ్నం 3 వరకు కొనసాగింది. స్క్రూటినీ నిర్ణీత సమయం ముగిసే సరికి 166 మంది పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఎన్నికల అధికారులకు ఉపసంహరణ పత్రాలను అందజేశారు. దీంతో 34 వార్డులకు సంబంధించి ఆరు వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 28 వార్డుల్లో 146 మంది పోటీలో ఉన్నారు. వీరిలో టీఆర్ఎస్-28, టీడీపీ-12, కాంగ్రెస్-15, బీజేపీ-14, ఎంఐఎం-5, సీపీఎం-2తో పాటు మరో 70 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. ఏ వార్డులో ఎంతమంది? 1వ వార్డు-5, 2వ వార్డు-6, 3వ వార్డు-5, 4వ వార్డు-4, 5వ వార్డు-4, 6వ వార్డు-6, 7వ వార్డు-4, 8వ వార్డు-5, 9వ వార్డు-2, 10వ వార్డు-13, 11వ వార్డు-7, 12వ వార్డు-5, 14వ వార్డు-3, 15వ వార్డు-2, 17వ వార్డు-2, 20వ వార్డు-5, 22వ వార్డు-4, 23వ వార్డు-7, 25వ వార్డు-3, 26వ వార్డు-10, 27వ వార్డు-5, 28వ వార్డు-3, 29వ వార్డు-8, 30వ వార్డు-8, 31వ వార్డు-6, 32వ వార్డు-4, 33వ వార్డు-8, 34వ వార్డు-2 చొప్పున అభ్యర్థులు పోటీలో నిలిచారు. టీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక పూర్తి టీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసింది. వివరాలిలా ఉన్నాయి. 8వ వార్డు-బండారి నర్సయ్య, 15వ వార్డు-మరుపల్లి భవాని శ్రీను, 22వ వార్డు-కెమ్మెసారం దుర్గయ్య, 26వ వార్డు-తేల్జీర్ శ్రీనివాస్, 31వ వార్డు-జంగిటి కవిత, 33వ వార్డు-ఫరీరోద్దీన్, 2వ వార్డు-కొర్తివాడ లలితరాము, 29వ వార్డు-గురజాడ ఉమారాణి, 18వ వార్డు-నల్లా విజయలక్ష్మి, 5వ వార్డు-గౌటి రేణుక, 10వ వార్డు- మచ్చవేణుగోపాల్‌రెడ్డి, 34వ వార్డు-బోనాల భావన, 11వ వార్డు-గ్యాదరి రవీందర్, 3వ వార్డు-జూలూరి నటరాజ్, 9వ వార్డు-మామిడాల ఉమారాణి, 20వ వార్డు-జావేద్. కొనసాగిన చేరికల పర్వం శుక్రవారం టీడీపీ, కాంగ్రెస్, బీజేపీతో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్న పలువురు మంత్రి హరీష్‌రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. నరుకుల పద్మ (2వ వార్డు, కాంగ్రెస్), రచ్చ సంగీత (4వ వార్డు, టీడీపీ), చెప్యాల స్వప్న (9వ వార్డు, బీజేపీ), రుద్రోజు లత (15వ వార్డు, బీజేపీ), మల్లవ్వ (19వ వార్డు, టీడీపీ), లక్ష్మి (29వ వార్డు, టీడీపీ) పోటీ నుంచి తప్పుకుని టీఆర్ఎస్లో చేరారు. -
బీజేపీ నగర అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవం
డాబాగార్డెన్స్: భారతీయ జనతాపార్టీ నగర అధ్యక్ష ఎన్నికకు ఒకే ఒక నామినేషన్ దాఖలైంది. అధ్యక్ష స్థానానికి ఎం.నాగేంద్ర ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. బీజేపీ నగర కార్యాలయంలో అధ్యక్ష ఎన్నికకు నాగేంద్ర ఆదివారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్ పత్రాల స్క్రూటినీ అనంతరం సోమవారం ఎంవీపీ డబుల్‌రోడ్డులో ఉన్న ఐఐఏఎమ్ సెంటర్లో ఉదయం 10 గంటలకు జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో నగర అధ్యక్షునిగా ప్రకటించనున్నారు. ఎన్నికల అధికారిగా పైడా కృష్ణమోహన్, సహాయ ఎన్నికల అధికారిగా ఎస్విఎస్ ప్రకాష్‌రెడ్డి వ్యవహరించారు. కార్యక్రమంలో బీజేపీ నగర అధ్యక్షుడు పి.వి.నారాయణరావు, నగర ప్రధాన కార్యదర్శులు అప్పలకొండ యాదవ్, విల్లూరి మోహనరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నరేంద్ర ప్రకాష్, నగర కార్యదర్శి గుండు రఘుబాబు, ఉపాధ్యక్షులు దుర్గరాజు, వేదుల దక్షిణామూర్తి, దుర్గారావు, బొడ్డేటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. నాగేంద్ర బీజేపీలో గత 15 ఏళ్లుగా క్రియాశీలకంగా పనిచేస్తూ పార్టీలో అనేక పదవులు చేపట్టారు. బీజేపీ విశాఖ నగర కోశాధికారిగా, ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కౌన్సిల్ సభ్యునిగా పనిచేశారు. 2010-12 ఏడాదికి నగర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. -
ప్రత్యేక హోదా తీర్మానానికి సభ ఏకగ్రీవ ఆమోదం
-
ఇక లాంఛనమే..
- తిరుగుబాటుదారులు వెనకడుగు - డమ్మీల నామినేషన్లు ఉపంసహరణ - ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం - పెద్దల సభకు మాజీ ఎంపీలు పప్పల, మూర్తి సాక్షి, విశాఖపట్నం: ఊహించినట్టుగానే నామినేటెడ్ పదవుల ఎరతో రెబల్స్ వెనక్కు తగ్గారు. మరో రోజు గడువుండగానే రెబల్‌తో పాటు డమ్మీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. రెండుస్థానాల్లో ఒక్కో అభ్యర్థి మాత్రమే బరిలో మిగలడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మాజీ ఎంపీలు పప్పల చలపతిరావు, ఎంవీవీఎస్ మూర్తిలు పెద్దల సభలో అడుగుపెట్టేందుకు మార్గం సుగమమైంది. నామినేషన్ల ఘట్టం పూర్తికాకుండానే ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. క్యాంపు రాజకీయాలకు ఆస్కారంలేకుండానే ఎన్నికలు చివరిదశకు చేరుకున్నాయి. తొలుత సింగిల్ బ్యాలెట్ పద్ధలో ఎన్నికలు జరుగుతాయన్న భావనతో మాజీ ఎంపీ పప్పల చలపతిరావును పార్టీఅధినాయకత్వం ఎంపికచేసింది. రెండుస్థానాలకు వేర్వేరు బ్యాలెట్లలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో టీడీపీ రెండోస్థానం కోసం అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలు పడింది. రూరల్ మాజీ అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు లేదా టీడీపీలోకి వచ్చేందుకు ఆసక్తిచూపుతున్న గండి బాబ్జిల్లో ఎవరో ఒకరికి ఇవ్వాలని మంత్రి అయ్యన్న పట్టుబట్టగా, మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజుకు ఇవ్వాలని గంటా పట్టుబట్టారు. ఎస్టీ కోటాలో తమకుఇవ్వాలని మాజీమంత్రి మణికుమారితో పాటుమాజీ జెడ్పీచైర్‌పర్శన్ వంజంగి కాంతమ్మ, ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే కంభం రవిబాబులు కూడా ఒత్తిడి తీసు కొచ్చారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తికి సీటు కట్టబెట్టడంతో అసంతృప్తి జ్వాలలు పెల్లు బికాయి. మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు ఏకంగా రెండుస్థానాలకు నామినేషన్లు దాఖలు చేసి పార్టీ అధినేతలు సవాల్ విసరగా, రామానాయుడుతో పాటు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జిలు నామినేషన్ వేసేందుకు సిద్దపడి చివరకు మంత్రి అయ్యన్నతో గవిరెడ్డి, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఒత్తిడితో బాబ్జిలు వెనక్కి తగ్గారు. బరిలో నిలిచిన కన్నబాబు రాజుతో పాటు గవిరెడ్డిని హైదారబాద్ తీసుకెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వారా మంత్రులు నామినేటెడ్ పదవుల ఎర చూపారు. దీంతో శాంతించిన కన్నబాబురాజు గురువారం నామి నేషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో నామినేషన్ల ఘట్టం ముగిసినట్ట య్యింది. మాజీ ఎంపీలు పప్పల, ఎంవీవీఎస్ల ఎన్నిక ఇక లాంఛనం కానుంది. అయితే వీరు ఎమ్మెల్సీలుగా పిలిపించు కునేందుకు మరో ఇరవై రోజులు ఆగాల్సిందే. ఓట్ల లెక్కింపు రోజైన జూలై-7వ వీరికి అధికారిక ధ్రువీకరణ పత్రాలు అందజేయనున్నారు. ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన రాష్ర్ట ప్రాధమిక విద్యాశాఖ కార్యదర్శి ఆర్.పి. సిసోడియం గురు వారం నగరానికి చేరుకున్నారు. -
ఏపీలో ఎమ్మెల్సీలు ఏకగ్రీవం.. తెలంగాణలో పోటీ
-
ఏపీలో ఎమ్మెల్సీలు ఏకగ్రీవం.. తెలంగాణలో పోటీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేల కోటాలో నాలుగు శాసన మండలి స్థానాలకు జరగాల్సిన ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. అధికార టీడీపీ తరపున ప్రతిభా భారతి, ఎంఏ షరీఫ్, మిత్రపక్షం బీజేపీ తరపున సోము వీర్రాజు, ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ సీపీ తరపున గోవింద రెడ్డి ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి సోమవారం మధ్యాహ్నంతో గడువు ముగిసింది. నాలుగు స్థానాలకు నాలుగే నామిషేన్లు దాఖలు కావడంతో ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. కాగా ఫలితాలను అధికారికంగా ప్రకటించాల్సివుంది. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు అనివార్యంగా మారాయి. ఎమ్మెల్యేల కోటాలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా ఏడుగురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. టీఆర్ఎస్ తరపున ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, యాదవ రెడ్డి పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆకుల లలిత, టీడీపీ-బీజేపీ కూటమి నుంచి వేంనరేందర్ రెడ్డి బరిలో నిలిచారు. అధికార టీఆర్ఎస్ ఐదో అభ్యర్థిని రంగంలో దించడంతో పోటీ తప్పనిసరిగా మారింది. -
ఎనిమిదోసారి ఏకగ్రీవం
టీఆర్ఎస్ అధ్యక్షునిగా కేసీఆర్ పార్టీ నేతల అభినందనల జల్లు.. కార్యకర్తల సంబరాలు హైదరాబాద్: టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కె.చంద్రశేఖరరావు ఎనిమిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ పార్టీ ఎన్నికల అధికారి నాయిని నర్సింహారెడ్డి శుక్రవారమిక్కడ ప్లీనరీ వేదికపై అధికారికంగా ఈ ప్రకటన చేశారు. ‘మన కల నిజమైంది. తెలంగాణ తల్లిని బంధ విముక్తిని చేసేందుకు 2001లో కేసీఆర్‌ను అధ్యక్షునిగా చేసిన రోజే మన పంట పండింది. 14 ఏళ్లుగా ఎన్నో కష్టాలు.. ఇబ్బందులను ఎదురొడ్డి కేసీఆర్ నాయకత్వాన్ని కాపాడుకున్నాం. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. ఇది సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన చరిత్ర. ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీకి ఎన్నికలు నిర్వహించాం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ అధ్యక్షులు, స్టీరింగ్ కమిటీ మెంబర్ల నుంచి అయిదు సెట్ల నామినేషన్లు వచ్చాయి. వీటన్నింటా కేసీఆర్ నామినేషన్ ఒక్కటే దాఖలైంది. అందుకే ఆయనను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తున్నా’ అని చెప్పారు. వెంటనే వేదికపై ఉన్న మంత్రులు, పార్లమెంటరీ కార్యదర్శులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలందరూ కేసీఆర్‌కు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. వేదికపై పూలవర్షం కురిపించారు. ఎల్బీ స్టేడియం వెలుపలా కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. డప్పు మోగించిన కేసీఆర్ హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ నిర్ణీత సమయం కంటే గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఉదయం 12 గంటలకు ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్లీనరీ వేదికపైకి చేరుకున్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అక్కడే ఏర్పాటు చేసిన తెలంగాణ అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్లీనరీ ప్రారంభ సూచికగా కేసీఆర్ డప్పు మోగించారు. తెలంగాణలోని పది జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో ప్లీనరీకి తరలి వచ్చాయి. పార్టీ అడ్హాక్ కమిటీ కన్వీనర్ పల్లా రాజేశ్వరరెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, జిల్లాల వారీగా సంస్థాగత ఎన్నికలకు సంబంధించిన నివేదికను చదివి వినిపించారు. అనంతరం పార్టీ సెక్రటరీ జనరల్, ఎంపీ కేశవరావు తొలి పలుకులు వినిపించారు. పునర్నిర్మాణ యజ్ఞం: పల్లా రాజేశ్వరరెడ్డి ప్రజలు, ప్రభుత్వానికి మధ్య పార్టీ కార్యకర్తలు వారధిగా పని చేయాలని పార్టీ అడ్హాక్ కమిటీ కన్వీనర్ పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. ‘టీఆర్ఎస్ కార్యకర్తలంటే తెలంగాణ సమాజాన్ని జాగృతపరిచిన స్వయం సేవకులు. తెలంగాణ సమాజమంతా టీఆర్ఎస్, కేసీఆర్ వైపు చూస్తోంది. అందుకే తెలంగాణ పునర్నిర్మాణంలో పాలుపంచుకునే బాధ్యత మనందరిపై ఉంది. ఇది పవిత్ర యజ్ఞం. ఉద్యమంలో ఎన్నో కష్టనష్టాలు చవిచూసిన కార్యకర్తలు పునర్నిర్మాణంలోనూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’ అని అభిప్రాయపడ్డారు. ఉద్యమకారుడే పాలకుడైన సందర్భం చరిత్రలో కొత్త అధ్యాయానికి తెర లేపిందన్నారు. కేసీఆరే అసలైన లీడర్: ఎంపీ కేశవరావు గత పది నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ప్రగతి దేశంలో ఎక్కడా జరగలేదని పార్టీ సెక్రెటరీ జనరల్ కేశవరావు అన్నారు. ‘తెలంగాణ వచ్చింది.. నా జీవితం ధన్యమైంది. నేను పాటలు రాసుకుంటూ ఉండొచ్చు. ఇంతకంటే పరిపూర్ణత ఏముంది.. అని ఇటీవల కళాకారుల సదస్సులో సీఎం కేసీఆర్ అన్నట్లు టీవీలో చూశాను. తెలంగాణ సాధించిన తర్వాత పీడిత సమాజానికి విముక్తి కల్పించాలనేదే ఆయన తపన. రాష్ట్రం వచ్చేది నిజమే. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు కావాలా..? అని నేను కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే కేసీఆర్ ఒకసారి అడిగారు. మీరే కావాలని నేను చెప్పాను. ఆయన చాలాసార్లు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరించారు. ఆ విషయంలో ఆయన ఓడిపోయారు గానీ.. తెలంగాణ గెలిచింది. తెలంగాణకు కావాల్సిన నాయకత్వం దొరికింది’ అని కేకే అన్నారు. -
ఇక సమరమే..
బరిలో 13 మంది అభ్యర్థులు చివరివరకు టీడీపీ బేరసారాలు ఫలించని ఏకగ్రీవం యత్నాలు సానుభూతిపైనే సుగుణమ్మ ఆశలు వ్యతిరేకత కలిసొస్తుందని కాంగ్రెస్ అంచనా తిరుపతి: ఉప ఎన్నికలో పోటీ అనివార్యమైంది. ఏకగ్రీవం కోసం తెలుగుదేశం పడరాని పాట్లు పడింది. అభ్యర్థులను పోటీ నుంచి ఉపసంహరించేందుకు బేరసారాలకు దిగింది. అన్ని ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో పోటీలో తలపడక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు 13 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. పలువురు అభ్యర్థులు నామినేషన్ వేశాక ఆసక్తికర పరిమాణాలు చోటుచేసుకున్నాయి. ఏకగ్రీవం కోసం నేరుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితోనే కొంతమంది రహస్య మంతనాలు జరిపారు. దీనిని ముందే పసిగట్టిన మాజీ ఎంపీ చింతామోహన్ తన నివాసం నుంచి పార్టీ అభ్యర్థి ఎక్కడికి వెళ్లకుండా కట్టుదిట్ట ఏర్పాట్లు చేసుకోవడంతో దేశం ఆశలు గల్లంతయ్యాయి. ఓ దశలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్‌కు ముందే భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేసినట్లు సమాచారం. మొదట దీనిని తేలికగా తీసుకున్నా పార్టీ అభ్యర్థి బరిలో దిగిన తరువాత తెలుగుదేశం పార్టీ అందోళనకు గురై బేరసారాలకు ప్రయత్నించింది. దీనికితోడు కొంత మంది తెలుగు దేశం నేతలు సైతం ఎన్నికల ఖర్చు భరిస్తామని పోటీ నుంచి ఉపసంహారించుకోవద్దని స్వతంత్ర అభ్యర్థులను ప్రలోభ పెట్టినట్లు తెలిసింది. దీన్ని బట్టే టీడీపీ అభ్యర్థిపై పార్టీలో ఎంత వ్యతిరేఖత వ్యక్తమయ్యేదీ అర్థమైపోతోంది. సానుభూతిపైనే ఆశలు.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సానుభూతిపైనే ఆశలు పెట్టుకొంది. పార్టీలో అసమ్మతి అభ్యర్థికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. పార్టీలో గ్రూపు తగాదాలు ఎక్కడ పుట్టి ముంచుతాయోనని అధిష్టానం అందోళన చెందుతోంది. గత ఎన్నికల కంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్ల శాతం పెరిగితే ప్రభుత్వం వ్యతిరేకత వ్యక్తమవుతోందనే సంకేతాలు వెళతాయని దేశం పార్టీ ముఖ్య నేతలు సైతం హైరానా పడుతున్నట్లు పార్టీవర్గాలే పేర్కొంటున్నాయి. ఉపఎన్నిక గండం నుంచి గట్టేక్కెదెలా అని అధిష్టానం తల పట్టుకుంటున్నట్లు సమాచారం కాంగ్రెస్‌లో అసమ్మతి.. కాంగ్రెస్ అభ్యర్థిని సైతం అసమ్మతి వెంటాడుతూనే ఉంది. మాజీ ఎంపీ చింతామోహన్ తప్ప ఆమెకు ఎవరూ సహకరించడం లేదు. దీంతో అభ్యర్థికి ఒంటరి పోరు తప్పడం లేదు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ప్రజల్లోని ప్రభుత్వ వ్యతిరేకతపై ఆశలు పెట్టుకుంది. డ్వాక్రా రుణాల మాఫీ కాకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఆ అంశం కలసి వస్తుందని అంచనా వేస్తోంది. -
ఏకగ్రీవంపై ఉత్కంఠ
తిరుపతి ఉప ఎన్నికపై వీడని సస్పెన్స్ నామినేషన్ వేసిన అధికార పార్టీ అభ్యర్థి సుగుణమ్మ పోటీకి దూరమని ప్రకటించిన వైఎస్సార్సీపీ ఎటూ తేల్చని కాంగ్రెస్, సీపీఎం నామినేషన్లు వేసిన లోక్‌సత్తా, జనసంఘ్ ఇప్పటికే మొత్తం 9 మంది నామినేషన్లు చిత్తూరు: తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ఏకగ్రీవంపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికను ఏకగ్రీవం చేసుకునేందుకు అధికార పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కొలిక్కి రాలేదు. ఏకగ్రీవానికి సహకరించాలని టీడీపీ అభ్యర్థి సుగుణమ్మతో పాటు ఆ పార్టీ ముఖ్యనేతలు పలు దఫాలుగా అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. చర్చలు సైతం జరిపారు. టీడీపీ అభ్యర్థనతో ఉప ఎన్నికల బరి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పుకుంది. జిల్లా నేతలతో చర్చించిన అధినేత జగన్మోహన్రెడ్డి ఆ పార్టీ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఈ మేరకు స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. దీంతో అధికార పార్టీ ఊపిరి పీల్చుకుంది. ఉపఎన్నికలో కచ్చితంగా పోటీ చేస్తామంటూ తొలుత ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఆ తరువాత కొంత వెనక్కు తగ్గింది. పార్టీ అధిష్టానం నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని చెప్పింది. పోటీ విషయమై పార్టీ అధిష్టానం ఇప్పటికీ ఎటూ తేల్చలేదు. పోటీలో ఉండాలని కొందరు, పోటీకి దూరంగా ఉండాలని మరికొందరు పట్టుబడుతుండడంతో ఆ పార్టీ ఇప్పటికీ ఎటూ తేల్చలేకపోతోంది. ఇక ఉపఎన్నికల బరిలో నిలుస్తామని సీపీఎం ప్రకటించింది. ఈ మేరకు పార్టీలో చర్చించింది. కానీ ఇంకా నిర్ణయం వెలువరించలేదు. పోటీ చేసే అవకాశం ఎక్కువని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇక నామినేషన్‌కు మూడు రోజులు మాత్రమే గడువు ఉంది. ఇప్పటికే లోకసత్తా,జనసంఘ్ తదితర పార్టీల అభ్యర్థులతో పాటు మొత్తం 9 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్,సీపీఎంతో పాటు మిగిలిన వారు పోటీలో నిలిచే పక్షంలో తిరుపతి అసెంబ్లీకి ఉపఎన్నిక రసకందాయంలో పడనుంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో రాజకీయ పార్టీల్లో ఎన్నికల వేడి రగిలింది. మున్ముందు ఎవరు బరిలో నిలుస్తారో...? ఆయా రాజకీయ పార్టీలు ఏమీ నిర్ణయం తీసుకుంటాయన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తిరుపతికి మూడోసారి ఉపఎన్నిక తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇప్పటికీ రెండుమార్లు ఉపఎన్నికలు జరిగాయి. 1983లో ఎన్టీఆర్ తిరుపతితో పాటు కృష్ణా జిల్లా గుడివాడ నుంచి గెలుపొందారు. ఆయన గుడివాడ వైపు మొగ్గు చూపడంతో తిరుపతి స్థానానికి ఉప ఎన్నిక తప్పలేదు. ఆ తరువాత 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలుపొందిన చిరంజీవి ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో తిరుపతికి ఉపఎన్నిక జరిగింది. తాజాగా వెంకటరమణ మృతితో తిరుపతికి మూడోసారి ఉపఎన్నిక జరుగుతోంది. ఉపఎన్నికకు సంబంధించి ఎన్నికల కమిషన్ జనవరి 12 షెడ్యూల్ విడుదల చేసింది. జనవరి 19న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల నామినేషన్ల దాఖలుకు 27వ తేదీ తుది గడువు, 28న నామినేషన్ల పరిశీలన, 30న ఉపసంహరణ ఉంటుంది. ఫిబ్రవరి 13న పోలింగ్ జరగనుంది, 16న ఓట్ల లెక్కింపు తంతు ముగియనుంది. 18 నాటికి ఎన్నికల కోడ్ ముగియనుంది. -
డీపీసీ ‘మంత్రాంగం’
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా ప్రణాళిక కమిటీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం సాయంత్రం ముగిసింది. మొత్తం 24 సభ్యులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 10 గ్రామీణ మంది సభ్యులను జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు ఎన్నుకోనుండగా, 14 మంది పట్టణ సభ్యులను మున్సిపల్ కౌన్సిలర్లు ఎన్నుకోనున్నారు. ఈ క్రమంలో పోటీ చేసే అభర్థుల నామినేషన్ల దాఖలుకు శుక్రవారం గడువు విధించ గా.. సమయం ముగిసేనాటికి గ్రామీణ కేటగిరీలో 11 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, పట్టణ కేటగిరీలో 25 మంది సభ్యులు నామినేషన్లు వేశారు. ఏకగ్రీవం కోసం.. డీపీసీ సభ్యుల ఎన్నికలో ప్రస్తుతం పోటీ తీవ్రంగానే ఉంది. గ్రామీణ కేటగిరీలో బీసీ మహిళ కోటాలో ఒక సీటుకు ఇద్దరు అభ్యర్థులు పోటీ పడుతుండగా.. మిగతా స్థానాలన్నీ ఏకగ్రీవం కానున్నాయి. అదేవిధంగా పట్టణ కేటగిరీలో బీసీ మహిళ కోటా మినహా మిగతా అన్నింటా పోటీ ఉంది. ఎన్నికల్లో నామినేషన్లు సమర్పించిన అభ్యర్థుల జాబితాను శుక్రవారం సాయంత్రం జిల్లా పరిషత్ కార్యాలయంలో అందుబాటులో ఉంచారు. మరోవైపు ఎన్నికల ప్రక్రియలో పోటీ లేకుండా ఎన్నికలు ఏకగ్రీవం చేసేందుకు పార్టీలు రంగంలోకి దిగాయి. పోటీ పడుతున్న అభ్యర్థులను బుజ్జగించి నామినేషన్లను ఉపసంహరింపజేసేందుకు కీలక నేతలు రంగంలోకి దిగారు. అలా ముందుకెళ్దాం.. జిల్లా పరిషత్‌లో సింగిల్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేదు. ప్రస్తుతం టీడీపీ సభ్యుల మద్దతుతోనే జెడ్పీలో పాలకవర్గం ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో గ్రామీణ సభ్యుల ఎన్నికలు సైతం లాంఛనమే కానున్నాయి. పది స్థానాలకు గాను ఒకచోట మాత్రమే ఇద్దరు పోటీ పడుతుండగా.. ఇప్పటికే ఆయా పార్టీల నేతలు బుజ్జగింపులకు దిగారు. మరోవైపు మున్సిపాలిటీ పరిధిలోని ఒక స్థానం మినహా మిగతా అన్నిచోట్ల పోటీ ఉంది. రంగంలోకి దిగిన రాజకీయ పార్టీలు పట్టణ కోటా సీట్లలోనూ ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ మేరకు పార్టీల నేతలు అంతర్గతంగా సీట్ల సంఖ్యను ఖరారు చేసుకుంటున్నారు. మొత్తంగా ఈనెల 16తో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. దీంతో ఆలోపు మంత్రాంగం పూర్తిచేసేందుకు నేతలు వ్యూహాలకు పదునుపెట్టారు. -
ఏకగ్రీవం దిశగా డీపీసీ
సాక్షి, సంగారెడ్డి: జిల్లా ప్రణాళిక కమిటీ (డీపీసీ) ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ దిశగా మంత్రి హరీష్‌రావు చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. డీపీసీ ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు వీలుగా హరీష్‌రావు కాంగ్రెస్, టీడీపీ ఇతర పార్టీల నేతలతో చర్చలు జరిపినట్లు సమాచారం. డీపీసీ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం నామినేషన్లు స్వీకరించారు. నాలుగు అర్బన్ స్థానాలకు గాను మొత్తం 10 నామినేషన్లు వచ్చాయి. బీసీ మహిళ స్థానానికి ఒకే ఒక్క నామినేషన్ రావటంతో ఆ స్థానం ఏకగ్రీవం కానుంది. ఇక 20 రూరల్ స్థానాలకు గాను మొత్తం 42 నామినేషన్లు వచ్చాయి. టీఆర్ఎస్, ఆ పార్టీకి మద్దతుగా ఉన్న జెడ్పీటీసీలు 24 మంది నామినేషన్లు దాఖలు చేయగా, కాంగ్రెస్ పార్టీ నుంచి 16 మంది నామినేషన్లు వేశారు. టీడీపీ నుంచి గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు జెడ్పీటీసీలు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లును సోమవారం పరిశీలించి అదే రోజు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. మంత్రి మంత్రాంగం జిల్లా ప్రణాళిక కమిటీని ఏకగ్రీవం చే సేందుకు అధికార పార్టీ యోచిస్తోంది. ఈ దిశగా ఆ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. జిల్లా మంత్రి హరీష్‌రావు జిల్లా ప్రణాళిక కమిటీని ఎన్నికను ఏకగ్రీవంగా ఎన్నుకునేలా పావులు కదుపుతున్నట్లు సమాచారం. శుక్రవారం సంగారెడ్డికి వచ్చిన ఆయన ఇదే విషయమై జెడ్పీ చైర్పర్సన్ రా జమణి, ఇతర నాయకులతో చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్, టీడీపీ నేతలతోనూ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. మున్సిపాలిటీల్లో ప్రాతినిథ్యం ఉన్న బీజేపీ, ఎంఐఎం పార్టీలతోనూ మంత్రి హరీష్‌రావు మంతనాలు జరిపి డీపీసీ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. డీపీసీలో మెజార్టీ సభ్యుల సంఖ్య టీఆర్ఎస్ వారు ఉండేలా జాగ్రత్త వహించటంతోపాటు ప్రతిపక్ష పార్టీలకు స్థానం కల్పించామన్న సందేశం వెళ్లేలా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే డీపీసీలో కాంగ్రెస్, టీడీపీ నుంచి సభ్యులు ఉండేలా టీఆర్ఎస్ జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తుతం ఆరు నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్‌కు జెడ్పీటీసీలు ఉన్నారు. దీంతో నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఆరుగురు జెడ్పీటీసీలకు డీపీసీలో స్థానం ఇవ్వాలని టీఆర్ఎస్ యోచిస్తున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ నాయకులు మాత్రం 8 స్థానాలు కోరుతున్నట్లు తెలుస్తోంది. మున్సిపాలిటీల నుంచి ప్రాతినిథ్యం వహించే కౌన్సిలర్ స్థానాల ఏకగ్రీవం పై సోమవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
ఏకగ్రీవానికి 'ప్లానింగ్'
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా ప్రణాళిక కమిటీ (డీపీసీ) సభ్యుల ఎన్నిక ప్రక్రియ ఏకగ్రీవం కానుంది. ఈ మేరకు కాంగ్రెస్, టీఆర్ఎస్ ఓ అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తం 24 మంది సభ్యుల ఎన్నిక కోసం శుక్రవారం నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. అయితే ఒప్పందం కుదిరిందని, దాదాపు ఎన్నిక ఏకగ్రీవమేనని రెండు పార్టీల వర్గాలంటున్నాయి. డీపీసీలో ఉండాల్సిన 20 మంది జెడ్పీటీసీసభ్యుల్లో ఆరుగురు లేదా ఏడుగురిని టీఆర్ఎస్ నుంచి తీసుకునేందుకు కాంగ్రెస్ అంగీకరించిందని సమాచారం. ఈ వ్యవహారంలో సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి చక్రం తిప్పగా, జిల్లాకు చెందిన మంత్రి జగదీష్‌రెడ్డిని కలిసి జెడ్పీచైర్మన్ బాలునాయక్, వైస్‌చైర్మన్ కర్నాటి లింగారెడ్డిలు చర్చలు జరిపారు. దీంతో ఎన్నిక ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. ముగ్గురికి ఒకటి చొప్పున.. జిల్లాలో మొత్తం 59 మంది జెడ్పీటీసీ సభ్యులుండగా, డీపీసీలో 20 మందికి చోటు దక్కనుంది. అంటే ప్రతి ముగ్గురు జెడ్పీటీసీ సభ్యుల్లో ఒకరికి అవకాశం వస్తుంది. ఇందులోనూ రిజర్వేషన్ల పద్ధతి ఉన్నందున అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం దక్కనుంది. ప్రతి ముగ్గురికి ఒకరు చొప్పున టీఆర్ఎస్కున్న 13 మంది జెడ్పీటీసీలకుగాను ఐదుగురికి అవకాశం రానుంది. అయితే, కొన్ని సమీకరణల నేపథ్యంలో తమకు మరో రెండుస్థానాలు ఎక్కువ కావాలని టీఆర్ఎస్ ప్రతిపాదించడంతో కాంగ్రెస్ నేతలు కూడా ఇందుకు అం గీకరించినట్టు సమాచారం. మంత్రి, జెడ్పీచైర్మన్, వైస్‌చైర్మన్ బుధవారం హైదరాబాద్‌లో భేటీ అయి దీనిపై చర్చించారని తెలుస్తోంది. అయితే, రిజర్వేషన్లతో కొన్ని సమస్యలు వస్తున్నాయని, రిజర్వేషన్ల వారీగా పంపకాలు చేసుకోవాలంటే ఒకే నియోజకవర్గం నుంచి ఇద్దరు. ముగ్గురికి కూడా డీపీసీలో స్థానం ఇవ్వాల్సి వస్తుందనే చర్చ భేటీలో వచ్చినా... పార్టీల వారీ విభజన ఉంటుంది కనుక ఇబ్బంది లేదనే అభిప్రాయానికి నేతలు వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగే నామినేషన్ల ప్రక్రియలో 20 మంది జెడ్పీటీసీ సభ్యులు, నలుగురు మున్సిపల్ కౌన్సిలర్లు మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది. కౌన్సిలర్ల కోటాలో కూడా టీఆర్ఎస్కు ఒకస్థానం లభించవచ్చని తెలుస్తోంది. నియోజకవర్గానికి ఒకటి..కాంగ్రెస్ ప్లాన్ జెడ్పీలో బలమున్నా, రాష్ట్రంలో అధికారంలో లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ కూడా డీపీసీ వ్యవహారంలో రాజీ ధోరణితోనే వెళ్లాలని నిర్ణయించింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో ముగ్గురు సీనియర్లు, రాష్ట్రస్థాయి నేతలు, అయినా అధికారపక్షంతో గిల్లికజ్జాలు పెట్టుకోవడం ఎందుకులే అనే ఆలోచనతో డీపీసీ ఎన్నిక ఏకగ్రీవమయ్యేందుకు కాంగ్రెస్ సహకరిస్తోందనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. అయితే, తమకు లభించే సీట్లలో మాత్రం ప్రతి నియోజకవర్గానికి అవకాశం కల్పించాలని, 12 నియోజకవర్గాల నుంచి 12 మందికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు యోచిస్తున్నట్టు సమాచారం. ‘ఈ డీపీసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన పనిలేదు. భవిష్యత్ అభివృద్ధి, నిధుల మంజూరు లాంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని అధికార పార్టీ టీఆర్ఎస్తో సఖ్యతతో వెళితేనే మంచిది. జెడ్పీలో తగినంత బలమున్నా ప్రయోగాలకు వెళ్లకుండా ఉండడమే మంచిది’. అని ఓ సీనియర్ కాంగ్రెస్‌నేత వ్యాఖ్యానించడం గమనార్హం. -
ఏకగ్రీవం దిశగా..!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా పరిషత్ ప్రణాళిక కమిటీ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. జెడ్పీతోపాటు, జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ మెజారిటీ ఉంది. కాంగ్రెస్, టీడీపీ సభ్యుల సంఖ్య నామమాత్రంగా ఉండటంతో డీపీసీ ఎన్నిక లాంఛనం కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. ఈ పదవుల కోసం టీఆర్ఎస్లోనే అంతర్గత పోటీ తీవ్రంగా ఉంది. దీంతో ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై ఆ పార్టీ జిల్లా ముఖ్యనేతలు గురువారం సాయంత్రం సమావేశమయ్యే అవకాశాలున్నాయి. జిల్లా మంత్రి జోగు రామన్న, జెడ్పీ చైర్పర్సన్ శోభాసత్యనారాయణగౌడ్, సీనియర్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు ఇతర ఎమ్మెల్యేలు ఈ ఎన్నిక విషయమై సమాలోచనలు జరపాలని నిర్ణయించారు. జిల్లాలోని పది నియోజకవర్గాలకు ఈ కమిటీలో ప్రాతినిధ్యం ఉండేలా.. ఆయా రిజర్వేషన్లను ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశాలున్నాయని పార్టీ ముఖ్యనేత ఒకరు అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థలకు వచ్చే నిధుల కేటాయింపులు, అభివ ృద్ధి పనుల ఎంపిక వంటి అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం కలిగిన ఈ ప్లానింగ్ కమిటీలో సభ్యులుగా నియామకమయ్యేందుకు టీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆసక్తి చూపుతున్నారు. ఈ పదవులను ఆశిస్తున్న నేతలు ఇప్పటికే ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలను ఆశ్రయిస్తున్నారు. తమకు ఎలాగైనా ఈ పదవులు దక్కేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో అధికార పార్టీలోనే ఈ పదవుల కోసం పోటాపోటీ నెలకొంది. ఒకవేళ టీఆర్ఎస్లో సఖ్యత లోపించి, నిర్ణీత సభ్యులకంటే అధిక నామినేషన్లు దాఖలైన పక్షంలో మాత్రం ఎన్నిక అనివార్యం కానుంది. పార్టీల బలాబలాలు ఇవి... జెడ్పీలో తెలుగుదేశం పార్టీకి కేవలం ఇద్దరు జెడ్పీటీసీలు మాత్రమే ఉన్నారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో అయితే అసలు ఆ పార్టీ ఉనికే లేదు. ఒక్క బెల్లంపల్లి బల్దియాలోనే ఐదుగురు కౌన్సిలర్లు ఉన్నారు. దీంతో టీడీపీ ఈ డీపీసీ పదవులపై ఆశలు వదులుకుంది. ఇక కాంగ్రెస్ కూడా దాదాపు చేతులెత్తేసింది. ఆ పార్టీకి జిల్లా పరిషత్‌లో పది మంది జెడ్పీటీసీలు మాత్రమే ఉన్నారు. ఈ పది మందిలో కూడా కొందరు టీఆర్ఎస్తో చేతులు కలిపారు. ఇక జిల్లాలో ఆరు మున్సిపాలిటీల పరిధిలో 51 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. దీంతో డీపీసీ రూరల్ నియోజకవర్గం నుంచి గానీ, అర్బన్ నియోజకవర్గం నుంచి గానీ ప్లానింగ్ కమిటీ సభ్యులుగా ఆ పార్టీ ప్రాతినిధ్యం ఉండే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ.. డీపీసీలో మొత్తం 24 మంది సభ్యులుంటారు. ఇందులో నలుగురు అర్బన్ నియోజకవర్గం (కౌన్సిలర్ల నుంచి ఎన్నికయ్యే వారు) సభ్యులు కాగా, మిగిలిన 20 మంది సభ్యులు రూరల్ నియోజకవర్గం (జెడ్పీటీసీల తరపున ఎన్నికవుతారు) నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు ఉంటాయి. నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 15న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 16న సాయంత్రం 5 గంటలకు బరిలో ఉండే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 16వ తేదీ సాయంత్రం 5 గంటల సమయం వరకు ఉంటుం ది. 24 కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలైన పక్షంలో ఈనెల 17న ఉదయం10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగే అవకాశాలున్నాయి. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు, తర్వాత ఫలితాల ప్రకటన ఉంటుంది. -
ఎన్నికా..ఏకగ్రీవమా?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా ప్రణాళిక కమిటీ (డీపీసీ) ఎన్నికపై రాజకీయపక్షాలు దృష్టి సారించాయి. డీపీసీ సభ్యుల నియామకానికి షెడ్యూల్ వెలువడడం, 12న నామినేషన్లు వేయాల్సి ఉండడంతో ఏం చేయాలన్న దానిపై అటు అధికార టీఆర్ఎస్, ఇటు విపక్ష కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతున్నాయి. జిల్లాపరిషత్‌లో కాంగ్రెస్‌కు భారీ మెజార్టీ ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలో అధికారపక్షం ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండేలా మంత్రి జగదీష్‌రెడ్డి పావులు కదుపుతున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ నేతలు కూడా తమ అనుచర జెడ్పీటీసీ సభ్యులకు డీపీసీలో చోటు దక్కేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఎన్నిక జరిగితే పెద్దఎత్తున రాజకీయ సమీకరణలు చేయాల్సి ఉంటుందని, మిగిలిన పార్టీలకు జెడ్పీలో పెద్దగా బలం లేకపోవడంతో ‘రాజీ’ మార్గంలో పదవులు పంచుకుంటే సరిపోతుందనే యోచనలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలున్నట్టు తెలుస్తోంది. నామినేషన్లకు మరో రెండు రోజుల సమయమున్న నేపథ్యంలో డీపీసీకి ఎన్నిక అనివార్యమవుతుందా? లేక ‘రాజీ’కుదిరి ఏకగ్రీవమవుతుందా అనేది బుధవారం రాత్రికి తేలే అవకాశముంది. పంపకాలు ఎలా? వాస్తవానికి జిల్లా పరిషత్ లో కాంగ్రెస్‌కు 43 మంది సభ్యుల బలముంది. టీఆర్ఎస్ పక్షాన 13, టీడీపీకి 2, సీపీఐకి 1 సభ్యుడున్నారు. దీంతో జెడ్పీటీసీ సభ్యుల తరఫున ఎన్నుకునే 20 మంది సభ్యుల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ప్రాతినిధ్యం దక్కే అవకాశముంది. అయితే, టీఆర్ఎస్కు కూడా 13 మంది సభ్యులు ఉండడంతో తమకు కూడా డీపీసీలో ప్రాతినిధ్యం కావాల్సిందేనని ఆ పార్టీ నేతలు పట్టుపడుతున్నారు. ఇరుపార్టీలు కచ్చితంగా ఒక అవగాహనకు వస్తేనే ఇది సాధ్యమవుతుంది. దీనికి తోడు ఎన్నిక జరిపిన దాని కన్నా రెండు పార్టీల ఏకాభిప్రాయంతో డీపీసీ ఎన్నికను ఏకగ్రీవం చేస్తేనే మంచిదనే యోచనలో జెడ్పీ చైర్మన్ బాలునాయక్ ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు మంత్రితో పాటు కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలతో కూడా ఆయన ఇప్పటికే ప్రాథమిక సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ సంప్రదింపులు ఫలిస్తే టీఆర్ఎస్కు జెడ్పీటీసీ సభ్యుల నుంచి 5-8, కౌన్సిలర్ల నుంచి 2 స్థానాలు ఇస్తామనే ప్రతిపాదనలు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి వస్తున్నాయని సమాచారం. అయితే, ఇందులో మంత్రి నిర్ణయమే కీలకం కానుంది. కాంగ్రెస్ ప్రతిపాదించిన విధంగా ఆయన అంగీకరిస్తారా లేక ఎక్కువ స్థానాల కోసం పట్టుబట్టి ఎన్నికలకు వెళ్లి రాజకీయ ‘సమీకరణ’లు మారుస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఆయన కూడా డీపీసీ సభ్యుల ఎన్నిక, రిజర్వేషన్ల కేటాయింపుపై పార్టీనేతలు, అధికారులతో మంగళవారం చర్చించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలంతా ఏకాభిప్రాయానికి వచ్చి పదవుల పంపకాలకు అంగీకరిస్తారా? టీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉండబోతోంది? డీపీసీ సభ్యుల ఎన్నిక అనివార్యమవుతుందా? ఏకగ్రీవమవుతుందా? అనేది జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. -
ఏకగ్రీవం లాంఛనమే!
సాక్షి, కర్నూలు/ఆళ్లగడ్డ : ఆళ్లగడ్డ చరిత్రలో ఓ సరికొత్త రికార్డు నమోదు కాబోతోంది. ఐదు దశాబ్దాల కాలంలో మొదటి సారిగా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఏకగ్రీవం కానుంది. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు సంప్రదాయానికి మద్దతుగా పోటీకి దూరం కావడంతో ఏకగ్రీవానికి మార్గం సుగమమైంది. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా భూమా అఖిలప్రియ నామినేషన్ దాఖలు చేయగా.. ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే స్వతంత్రులు నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉండటంతో ఎన్నిక ఏకగ్రీవమని అధికారికంగా ప్రకటించడం ఇక లాంఛనం కానుంది. ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం 1962లో ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ స్థానానికి 16 సార్లు ఎన్నికలు నిర్వహించగా ప్రధాన పార్టీలన్నీ పోటీ చేశాయి. 1967 నుంచి ఎస్వీ, భూమా కుటుంబీకులకు, గంగుల కుటుంబీకుల మధ్యే రాజకీయం పోటీ సాగుతోంది. ఇప్పటి వరకు 8 సార్లు భూమా కుటుంబీకులు గెలవగా, ఎస్వీ సుబ్బారెడ్డి ఒకసారి విజయం సాధించారు. ఐదు సార్లు గంగుల కుటుంబీకులు పైచేయి సాధించారు. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలుపు బావుటా ఎగురవేశారు. కాగా.. 2014 మే నెలలో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా శోభా నాగిరెడ్డి పోటీ చేశారు. అయితే ఏప్రిల్ 24న ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అప్పటికే ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఆమె పేరును ఈవీఎంల నుంచి తొలగించలేదు. ఆమె అభ్యర్థిగానే పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి విజయం సాధించింది. అమె మృతిచెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి 92,108 ఓట్లు సాధించగా.. ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి గంగుల ప్రభాకర్‌రెడ్డికి 74,180 ఓట్లు పోలయ్యాయి. దీంతో 17,928 ఓట్లతో శోభా నాగిరెడ్డి గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే ఎన్నికల ముందే ఆమె ప్రమాదంలో మృతి చెందడం వల్ల ఆమె గెలుపు చెల్లదంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆళ్లగడ్డ ఉప ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ నంద్యాల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందిస్తూ చట్టపరంగా ఎన్నికల నిర్వహణ చేపట్టాలంటూ ఆదేశించింది. ఆ వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడంతో ఆళ్లగడ్డలో ఎన్నికల సందడి మొదలైంది. కాగా శాససభ్యులు ఎవరైనా మరణిస్తే వారి స్థానంలో కుటుంబ సభ్యులు పోటీ చేస్తే ఇతర పార్టీలు పోటీ పెట్టరాదనే సంప్రదాయం ఉంది. ఆళ్లగడ్డ ఉప ఎన్నికల బరిలో నుంచి తెలుగుదేశం, కాంగ్రెస్ అభ్యర్థులు మొదట నిలవాలని యోచించినా.. సంప్రదాయానికి భిన్నంగా వెళ్లరాదన్న ఆయా పార్టీల అధిష్టానం ఆదేశాల మేరకు పోటీ నుంచి తప్పుకున్నారు. ఇదే ప్రకారం సీపీఎం, సీపీఐ, బీజేపీ, ఎంఐఎం తదితర పార్టీలు తమ అభ్యర్థులను పోటీకి పెట్టలేదు. ప్రధాన పార్టీలు పోటీ పెట్టకపోవడంతో ఉప ఎన్నిక నామమాత్రం కానుంది. ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా నామినేషన్ల ఉపసంహరణ రోజు విత్‌డ్రా చేసుకుంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఆళ్లగడ్డ ఉప ఎన్నిక ఏకగ్రీవం!
సాక్షి, కర్నూలు : ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఏకగ్రీవానికి మార్గం సుగమమైంది. ఈ ఉప ఎన్నిక బరిలో నుంచి టీడీపీ తప్పుకున్నట్లు సోమవారం ప్రకటించింది. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇదే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి మేరకు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మంగళవారం అధికారికంగా ప్రకటించనున్నారు. దీంతో ఈ ఉప ఎన్నిక ఏకగీవ్రం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏప్రిల్ 24న రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అప్పుడు నిర్వహించిన ఎన్నికల్లో అమె మరణానంతరం గెలిచినట్లు ప్రకటించారు. దాంతో ఆ స్థానానికి నవంబరు 8న ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆళ్లగడ్డ అసెంబ్లీ నియాజకవర్గానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భూమా అఖిలప్రియ నామినేషన్ దాఖలు చేశారు. శాసనసభ్యులు మృతి చెంది.. పోటీలో వారి కుటుంబసభ్యులే నిలబడితే ఇతర పార్టీలు పోటీ చేయకూడదన్న సాంప్రదాయాన్ని అన్ని పార్టీలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన నందిగామ ఉప ఎన్నికలో టీడీపీ కూడా సాంప్రదాయాన్ని కొనసాగించాలంటూ చేసిన విజ్ఞప్తి మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ అభ్యర్థిని పోటీలో నిలబెట్టడం లేదని తక్షణమే ప్రకటించారు. ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన వెంటనే.. అందరూ అక్కడ పోటీ ఉండదని, ఏకగ్రీవం తప్పదని భావించారు. అయితే ఆళ్లగడ్డకు చెందిన టీడీపీ నేతలు నందిగామ ఎన్నికకు, ఆళ్లగడ్డ ఎన్నికకు సారూప్యత లేదని.. విశాఖపట్నం నుంచి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తిరిగి వచ్చిన వెంటనే దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరుతామని అన్నారు. ఆళ్లగడ్డ బరిలో ఉంటామని గత వారం రోజులుగా ఇదే విషయాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు కూడా మీడియా సమావేశాల్లో వెల్లడించారు. టీడీపీ అధినేత తనయుడు లోకేష్ వద్ద ఇదే అభిప్రాయాన్ని పార్టీ నేతలు వెల్లడించిన సంగతి కూడా తెలిసిందే. సాంప్రదాయాన్ని కొనసాగించే అంశంపై అన్ని పార్టీల నేతలతో చర్చించేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ సీనియర్ నేతలైన ఎంవీ మైసూరరెడ్డి, ధర్మాన ప్రసాదరావులతో ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ కమిటీ నేతలు అన్ని పార్టీల నాయకులతో ఆళ్లగడ్డ ఉప ఎన్నిక అంశంపై చర్చించారు. హుదూద్ తుపాన్‌తో ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న చంద్రబాబు ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్నాక పార్టీ నేతలతో ఈ విషయమై చర్చించి.. సంప్రదాయానికి సానుకూలంగా స్పందించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్న విషయం తెలిసిందే. సోమవారం ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించడంతో గత నెల రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా తమ అభ్యర్థిని బరిలో నిలిపేందుకు సుముఖంగా లేన్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీకి చెందిన జిల్లా నేతలు కూడా సాంప్రదాయం వైపే మొగ్గుచూపుతూ నిర్ణయాన్ని పీసీసీ అధ్యక్షుడికి వదిలేశారు. కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి సతీమణి డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఈ మేరకు సోమవారం సాయంత్రం మీడియాకు స్పష్టం చేశారు. -
ఆళ్ళగడ్డ ఉపఎన్నికను ఏకగ్రీవం చేసే దిశగా..
-
'ఆళ్లగడ్డ ఉప ఎన్నిక ఏకగ్రీవానికి ప్రయత్నిస్తాం'
హైదరాబాద్: ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో తమ పార్టీ తరఫున దివంగత శోభానాగిరెడ్డి కుమార్తె అఖిల ప్రియ పోటీ చేయనున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎం.వి. మైసూరారెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మైసూరారెడ్డి మాట్లాడుతూ... ఆ ఉప ఎన్నికల్లో మిగిలిన రాజకీయ పార్టీలు పోటీ పెట్టకుండా ఉండే సంప్రదాయాన్ని అనుసరించాలని సదరు పార్టీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదే విషయంపై ఈ నెల 15న టీడీపీ నేతలను కలుస్తామన్నారు. అలాగే మిగిలిన రాజకీయ పార్టీల నేతలతో కూడా చర్చలు జరుపుతున్నామన్నారు. ఆయా పార్టీలు తమ పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతామన్నాయని ఆయన వివరించారు. ఇటీవల జరిగిన నందిగామ ఉప ఎన్నిక సమయంలో తాము ఇదే సంప్రదాయం పాటించామని మైసూరారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
‘స్థాయీ’ ఏకగ్రీవం
జెడ్పీ ఏడు కమిటీలు, సభ్యుల ఎన్నిక కొన్నింటికి చైర్మన్‌గా భవాని అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం విశాఖ రూరల్: జిల్లా పరిషత్ స్థాయీ సంఘం కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కీలకమైన ఏడు కమిటీలకు చైర్మన్‌తోపాటు, సభ్యుల ఎన్నిక విషయంలో అధికార పార్టీ, విపక్ష సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. తొలుత జెడ్పీ చైర్పర్సన్,జెడ్పీటీసీలు, ఎమ్మెల్యే, ఎంపీలు చర్చించి కమిటీలో ఎవరెవరు ఉండాలన్నదానిపై ఒక నిర్ణయానికి వచ్చారు. రెండు కమిటీల్లో వైఎస్సార్సీపీకి ప్రాతినిథ్యం నామమాత్రంగా ఉండడంతో వారు కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే వాటిల్లో మార్పులు చేసి వైఎస్సార్ సీపీ సభ్యులను కూడా చేర్చారు. దీంతో ఏడు కమిటీల సభ్యుల ఎన్నిక ఏకగ్రీవ మైనట్లు జెడ్పీ సీఈవో మహేశ్వరరె డ్డి ప్రకటించారు. కొన్ని కమిటీలకు చైర్మన్‌గా వ్యవహరించే జెడ్పీ చైర్పర్సన్ లాలం భవాని మాట్లాడుతూ కమిటీల ఎన్నిక ఏకగ్రీం కావడం సంతోషదాయకమన్నారు. పార్టీలకు అతీతంగా జెడ్పీటీసీ సభ్యులు, అధికారులు కుటుంబ సభ్యుల్లా ఉంటూ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిద్దామన్నారు. మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి జెడ్పీ మంచి కార్యక్రమాలు, నిర్ణయాలు చేయాలని సూచించారు. ప్రస్తుతం జిల్లాలో కరువు, మంచినీరు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు మాట్లాడుతూ డీడీఆర్సీని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో జెడ్పీలోనే సమస్యలపై విస్తృతంగా చర్చించి వాటిని పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు, తదితరులు పాల్గొన్నారు. ప్లానింగ్ అండ్ ఫైనాన్స్ కమిటీకి చైర్మన్‌గా జెడ్పీ చైర్పర్సన్ లాలం భవాని,ఇతర సభ్యులుగా రాష్ర్ట విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, రావికమతం జెడ్పీటీ సీ రాజాన శ్రీవాణి(టీడీపీ), నాతవరం జె డ్పీటీసీ సత్యనారాయణ(టీడీపీ), జి.మాడుగుల జెడ్పీటీసీ ఎస్.ఆదినారాయణ(టీడీపీ), కోటవురట్ల జెడ్పీటీసీ వంతర వెంకటలక్ష్మి(వైఎస్సార్సీపీ) ఎన్నికయ్యారు. గ్రామీణాభివృద్ధి : అరకు ఎంపీ కొత్తపల్లి గీత, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి, చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.రాజు, భీమిలి జెడ్పీటీసీ ఎస్.అప్పారావు(టీడీపీ), కో-ఆప్షన్ సభ్యుడు గూనూరు జోసెఫ్ సత్యశ్రీరామ మూర్తి(టీడీపీ), ఆనందపురం జెడ్పీటీసీ మారికనూకరాజు (టీడీపీ), పాడేరు జెడ్పీటీసీ పొలుపర్తి నూకరత్నం (వైఎస్సార్ సీపీ), చింతపల్లి జెడ్పీటీసీ మంచాన పద్మకుమారి(వైఎస్సార్ సీపీ)లను ఎన్నుకున్నారు. వ్యవసాయం : ఈ కమిటీకి జెడ్పీ వైస్ చైర్మన్, అనంతగిరి జెడ్పీటీసీ కొట్యాడ అప్పారావు(టీడీపీ) చైర్మన్‌గా ఎన్నికయ్యారు. సభ్యులుగా విశాఖ ఎంపీ కె.హరిబాబు, ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్.శర్మ, ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, అనంతగిరి జెడ్పీటీసీ కె.అప్పారావు(టీడీపీ), కొయ్యూరు జెడ్పీటీసీ గాదె శ్రీరామమూర్తి(టీడీపీ), యలమంచిలి జెడ్పీటీసీ మట్టా రాజవేణి( వైఎస్సార్ సీపీ), కో-ఆప్షన్ సభ్యుడు కొప్పిశెట్టి కొండబాబు(టీడీపీ)లు ఎన్నికయ్యారు. విద్య, వైద్యం : ఈ కమిటీకి ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు, బుచ్చెయ్యపేట జెడ్పీటీసీ మామిడి సురేంద్ర(టీడీపీ), గొలుగొండ జెడ్పీటీసీ చిటికెల తారక వేణుగోపాల్(టీడీపీ), మునగపాక జెడ్పీటీసీ డి.లక్ష్మీ సత్యనారాయణ(టీడీపీ), మాకవరపాలెం జెట్పీడీసీ కాశీపల్లి కుమారి(టీడీపీ), డుంబ్రిగుడ జెడ్పీటీసీ కె.కుజ్జమ్మ( వైఎస్సార్ సీపీ), జి.కె.వీధి జెడ్పీటీసీ గంటా నళినీ కృష్ణ( వైఎస్సార్ సీపీ), వి.మాడుగుల గొల్లవిల్లి ప్రభావతి( వైఎస్సార్ సీపీ)లు వ్యవహరించనున్నారు. మహిళా సంక్షేమం : ఈ కమిటీకి చైర్మన్‌గా దేవరాపల్లి జెడ్పీటీసీ గాలి వరలక్ష్మి(టీడీపీ), సభ్యులు గా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూ డి అనిత, దేవరాపల్లి జెడ్పీటీసీ గాలి వరలక్ష్మి(టీడీపీ), రోలుగుంట జెడ్పీటీసీ బోణంగి రామలక్ష్మి(టీడీపీ), అనకాపల్లి జెడ్పీటీసీ పాలెళ్ల గంగాభవాని(టీడీపీ), పెందుర్తి జెడ్పీటీసీ కె.సూర్యమణి (టీడీపీ), హుకుంపేట జెడ్పీటీసీ సాగరి వ సంతకుమారి (వైఎస్సార్ సీపీ), కె.కోటపాడు జెడ్పీటీసీ దాసరి గురయ్య (వైఎస్సార్ సీపీ), పాయకరావుపేట జెడ్పీటీసీ చిక్కాల రామారావు(వైఎస్సార్ సీపీ)లు ఏకగ్రీవమయ్యారు. సాంఘిక సంక్షేమం : కశింకోట జెడ్పీటీసీ ఎం.కాసులమ్మ చైర్మన్‌గా, చోడవరం జెడ్పీటీసీ కనిశెట్టి సన్యాసిరావు(టీడీపీ), సబ్బవరం జెడ్పీటీసీ గేదెల సత్యనారాయణ(టీడీపీ), నక్కపల్లి జెడ్పీటీసీ రాగిన వెంకటరమణ(టీడీపీ), అరకు జెడ్పీటీసీ కూన వనజ( వైఎస్సార్ సీపీ), నర్సీపట్నం జెడ్పీటీసీ చదలవాడ సువర్ణలత( వైఎస్సార్ సీపీ), పెదబయలు జెడ్పీటీసీ జర్సింగి గంగాభవాని( వైఎస్సార్ సీపీ), ముంచింగపుట్ కె.కాసులమ్మ( వైఎస్సార్ సీపీ) సభ్యులుగా వ్యవహరించనున్నారు. వర్క్స్ కమిటీ : ఈ కమిటీలో పంచాయతీరాజ్ మంత్రి సి.హెచ్.అయ్యన్నపాత్రుడు, అనకాపల్లి ఎమ్మెల్యేల పీలా గోవింద సత్యనారాయణ, యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, ఎస్.రాయవరం జెడ్పీటీసీ బొట్టా లక్ష్మి(టీడీపీ), పరవాడ జెడ్పీటీసీ పైల జగన్నాథరావు(టీడీపీ), అచ్యుతాపురం జెడ్పీటీసీ జనపరెడ్డి శ్రీనివాసరావు(టీడీపీ), పద్మనాభం జెడ్పీటీసీ కాశిరెడ్డి దామోదరరావు(టీడీపీ), చీడికాడ జెడ్పీటీసీ పులపర్తి సత్యవతి(వైఎస్సార్ సీపీ)లు సభ్యులుగా ఎన్నికయ్యారు. -
అందరూ ఏకగ్రీవమే!
బెంగళూరు: కర్ణాటక శాసనమండలి సభ్యుల ఎన్నిక, ఈ రాష్ట్రానికి సంబంధించి రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం కానున్నాయి. రాజ్యసభలో నాలుగు స్థానాలు, శాసన మండలిలో ఏడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ నెల 19న ఎన్నికలు జరగవలసి ఉంది. అయితే సోమవారం నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసే సమయానికి ఖాళీలకు సరిపోను సభ్యులే నామినేషన్లు దాఖలు చేశారు. దాంతో రెండు ఎగువ సభలు రాజ్యసభ, శాసన మండలికి జరగాల్సిన ద్వైవార్షిక ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. రాజ్యసభకు కాంగ్రెస్ నుంచి ఇద్దరు, బీజేపీ, జేడీఎస్‌లకు చెందిన ఒక్కొక్కరు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. శాసన మండలికి కాంగ్రెస్ నుంచి నలుగురు, బీజేపీ, జేడీఎస్‌ల నుంచి ఒక్కొక్కరు, మరో ఇండిపెండెంట్ మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. అందువల్ల అందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే. అయితే ఈ విషయం అధికారికంగా ప్రకటించవలసి ఉంది. -
ప్రాదేశిక సమరం
ఒంగోలు, న్యూస్‌లైన్: ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఈనెల 6, 11 తేదీల్లో రెండు విడతలుగా జరగనున్న ఈ ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే జిల్లా యంత్రాంగం మొత్తం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. అవసరమైన సిబ్బంది నియామకం, బ్యాలెట్ పత్రాల ముద్రణ, ఓటర్ల జాబితా సవరణ వంటివి పూర్తిచేశారు. రేపే తొలివిడత: ఎంపీటీసీ, జెడ్పీటీసీ తొలిదశ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి బ్రేక్ పడింది. 6వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి. తొలిదశ ఎన్నికలు చీరాల, పర్చూరు, అద్దంకి, మార్కాపురం, వై.పాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లో నిర్వహించనున్నారు. రెండు దశల్లో కలిపి 21 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా అందులో 14 స్థానాలు తొలివిడత ఎన్నికలకు సంబంధించినవి కావడం గమనార్హం. వీటిలో వైస్సార్సీపీకి చెందిన ఆరుగురు సభ్యులు, స్వతంత్ర అభ్యర్థిగా ఏకగ్రీవమైన మరో వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడితో కలిపి వైఎస్సార్ సీపీ ఏకగ్రీవాల సంఖ్య 7కు చేరింది. టీడీపీ రెండో స్థానంలో నిలిచింది. స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరున్నారు. మిగిలిన 385 ఎంపీటీసీ స్థానాలకుగాను 1056 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక జెడ్పీటీసీకి సంబంధించి 28 స్థానాల్లో ఎన్నికలు ఈనెల 6న జరుగుతున్నాయి. వాటిలో 28 స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు పోటీ చేస్తుండగా రాచర్ల మినహా మిగిలిన వాటిలో టీడీపీ పోటీ చేస్తోంది. వైఎస్సార్సీపీ తరఫున జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా భావిస్తున్న డాక్టర్ నూకసాని బాలాజీ పోటీ చేస్తున్న పుల్లలచెరువు జెడ్పీటీసీ స్థానం కూడా తొలి దశ ఎన్నికల్లోనే ఉంది. టీడీపీ తరఫున చైర్మన్ అభ్యర్థులుగా బరిలో ఉన్న ఈదర హరిబాబు, మన్నం రవీంద్రలు పోటీ చేస్తున్న స్థానాలు రెండో విడతలో ఉండడం గమనార్హం. ఈ ఎన్నికల్లో మొత్తం 19,63,911 మంది ఓటర్లుండగా తొలిదశలో 10,21,189 మంది అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 131 పోలింగ్ స్టేషన్లలో వెబ్ కెమెరాలు: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి తొలిదశ పోలింగ్‌లో 131 పోలింగ్స్టేషన్లలో వెబ్‌కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. చీరాల, పర్చూరు, అద్దంకి, యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గాల్లోని 28 మండలాల్లో 131 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించి వాటిలో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. యర్రగొండపాలెం 9, పుల్లలచెరువు 4, త్రిపురాంతకం 8, పెద్దారవీడు 2, సంతమాగులూరు 4, బల్లికురవ 4, మార్టూరు 13, యద్దనపూడి 3, పర్చూరు 4, ఇంకొల్లు 8, జే.పంగులూరు 9, అద్దంకి 11, కంభం 7, కొనకనమిట్ల 2, పొదిలి 1, కొరిశపాడు 10, చీరాల 11, వేటపాలెం 8, చినగంజాం 4, బేస్తవారిపేట 3, రాచర్ల 2, గిద్దలూరు మండలంలో 4 పోలింగ్ కేంద్రాల్లో ఈ వెబ్ కెమెరాలు అందుబాటులో ఉంటాయి. బరిలో 170 మంది విద్యావంతులు: ప్రాదేశిక ఎన్నికల బరిలో వివిధ పార్టీల తర ఫున ఈనెల 6, 11వ తేదీల్లో జరిగే రెండు దశల ఎన్నికల్లో కలిపి 170 మంది ఉన్నత విద్యావంతులు బరిలో ఉన్నారు. వీరిలో 129 మంది ఎంపీటీసీలకు పోటీపడుతుండగా 41 మంది జెడ్పీటీసీలకు పోటీపడుతున్నారు. జెడ్పీటీసీలకు సంబంధించి డిగ్రీ 22, బీఎల్/ఎల్ఎల్బీ 6, ఎంబీబీఎస్ 1, ఎంఎస్సీ 2, బీసీఏ 2, బీటెక్ 3, బీఈడీ 2, బీఫార్మసీ 1తోపాటు ఎంఫిల్, పీహెచ్డీ చేసిన వారు ఇద్దరు బరిలో ఉన్నారు. ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి బీఏ 60, ఎంఎస్సీ 18, బీటెక్ 13, పీహెచ్డీ 1, ఎంసీఏ 1, పాలిటెక్నిక్ 2, బీఈడీ 25, బీఎస్సీ నర్సింగ్ 1, బీఎల్ 3, ఎం.ఫార్మసీ 2, బీసీఏ 1, ఎంబీఏ చదివిన వారు ఇద్దరు ఉన్నారు. వీరు కాకుండా దాదాపు 300 మంది వరకు నిరక్షరాశ్యులు కూడా బరిలో ఉన్నారు. మొదటి విడత స్థానిక ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలకు పోలీస్ యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఎన్నికల జరగనున్న మండలాల పరిధిలోని పోలీస్ సర్కిల్ కార్యాలయాలకు పోలీస్ బలగాలు చేరుకున్నాయి. ఎస్పీ పి.ప్రమోద్‌కుమార్ ఆధ్వర్యంలో అదనపు ఎస్పీ బి.రామానాయక్ పర్యవేక్షణలో ఎన్నికల బందోబస్తు కోసం మొత్తం 3,500 అధికారులు, సిబ్బందిని కేటాయించారు. మొదటి విడతగా ఎన్నికలు జరుగుతున్న ఏడు పోలీస్ సర్కిల్ కార్యాలయాల పరిధిలో బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేశారు. చీరాల సర్కిల్ పరిధిలో చీరాల డీఎస్పీ నరహర, ఇంకొల్లు సర్కిల్ పరిధిలో ఒంగోలు డీఎస్పీ పి.జాషువా, అద్దంకి పరిధిలో దర్శి డీఎస్పీ లక్ష్మినారాయణ, పొదిలి పరిధిలో ఏఆర్ ఏఎస్పీ జె. కృష్ణయ్య, మార్కాపురం పరిధిలో అక్కడి డీఎస్పీ రామాంజనేయులు, గిద్దలూరు పరిధిలో కందుకూరు డీఎస్పీ శంకర్, యర్రగొండపాలెంలో ఒంగోలు డీటీసీ డీఎస్పీ అశోక్‌కుమార్ బందోబస్తును పర్యవేక్షిస్తారు. మొత్తం 137 రూట్ మొబైల్ టీంలు గస్తీ తిరుగుతాయి. 28 స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు, 7 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు ఎన్నికలు జరిగే ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటాయి. మొత్తం 38 మంది సీఐలు, 125 మంది ఎస్సైలు, 150 మంది మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది మొదటి విడత ఎన్నికల్లో బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్నారు. -
నాలుగు ఎంపీటీసీలు ఏకగ్రీవం
చేవెళ్ల రూరల్/యాలాల/బంట్వారం, న్యూస్‌లైన్: ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది. దీంతో బరిలో ఎవరున్నారో తేలిపోయింది. జిల్లాలో రెండు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన గండు అంతమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ ఎంపీటీసీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో గ్రామస్తులంతా కలిసి ఆమె ఒక్కరితోనే నామినేషన్ వేయించారు. ఇక యాలాల మండలం అగ్గనూరు ఎంపీటీసీగా జంగం కమలాక్షి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ స్థానానికి నామినేషన్లు వేసిన మిగితా ఇద్దరూ బరిలోంచి తప్పుకున్నారు. దీంతో కమలాక్షి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండల రిటర్నింగ్ అధికారి శోభారాణి ప్రకటించారు. యాలాల మండల పరిధిలోని కోకట్ ఎంపీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆవుటి శంకర్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బంట్వారం మండలం సల్బత్తాపూర్ ఎంపీటీసీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి చిప్పే సుజాత సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ నుండి బద్రప్ప, టీఆర్ఎస్ నుంచి లచ్చమ్మ, స్వతంత్ర అభ్యర్థులుగా చంద్రమౌళి, బస్వరాజులు నామినేషన్లు వేయగా, వీరంతా సోమవారం బరిలోంచి తప్పుకున్నారు. దీంతో తిప్పే సుజాత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వేణుగోపాల్, ఎంపీడీఓ సుధారాణిలు వెల్లడించారు. -
కోకట్ ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవం!
యాలాల, న్యూస్‌లైన్: మండల పరిధిలోని కోకట్ ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవమైంది. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆవుటి శంకర్ ఏకగ్రీవ ఎంపిక దాదాపు ఖరారైంది. కోకట్ ఎంపీటీసీ స్థానానికి ఇటీవల ఈడ్గి అశోక్ (కాంగ్రెస్), రామకృష్ణ (కాంగ్రెస్), ఆవుటి శంకర్ (స్వతంత్ర అభ్యర్థి)నామినేషన్లు వేశారు. అయితే వీరిలో ఈడ్గి అశోక్, రామకృష్ణలు ఆదివారం నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ఆవుటి శంకర్ ఏకగ్రీవ ఎన్నిక ఖరారైంది. సోమవారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో అదేరోజు సాయంత్రం మూడు గంటల తర్వాత ఆవుటి శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారికంగా ధ్రువీకరిస్తామని మండల అసిస్టెంట్ ఎన్నికల అధికారి భాగ్యవర్థన్ ఆదివారం ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఇదిలా ఉండగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన తనను గ్రామస్తులు ఏకగ్రీవం చేయడం సంతోషంగా ఉందని, ఎంపీటీసీగా గ్రామాభివృద్ధికి పాటుపడతానని ఆవుటి శంకర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన గ్రామపెద్దలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, యువకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.