ఆకుపాముల ఉప ఎన్నిక ఏకగ్రీవం
–సర్పంచ్‌గా లిక్కి రామరాజు
మునగాల: ఈ నెల 8న మండలంలోని ఆకుపాముల మేజర్ గ్రామపంచాయతీకి జరగాల్సిన ఉప ఎన్నికల్లో భాగంగా శనివారం నామినేషన్ల ఉపసంహారణకు తుది గడువు కావడంతో పోటీలో ఉన్న ఐదుగురు అభ్యర్థులు ఉపసంహారించుకున్నారు. దీంతో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు సర్పంచ్‌గా లిక్కి రామరాజు ఎన్నికైనట్లు ఎన్నికల అధికార్లు ఎన్.నాగేశ్వరరావు, బొడ్ల శ్రీనివాస్‌లు శనివారం తెలిపారు. ఆకుపాముల సర్పంచ్ లిక్కి నాగేశ్వరరావు గత సెప్టెంబర్‌లో గుండెపోటుతో ఆకస్మిక మృతిచెందారు. కాగ ఈ ఉప ఎన్నికకు నలుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులతో పాటు దివంగత సర్పంచ్ నాగేశ్వరరావు భార్య పూలమ్మ, పెద్ద కుమారుడు లిక్కి రామరాజులు నామినేషన్లు దాఖలు చేశారు. రామరాజు ఏకగ్రీవ ఎన్నికకు సహాకరించిన అన్ని రాజకీయ పార్టీలకు టీఆర్‌ఎస్ కోదాడ నియోజకవర్గ ఇన్‌చార్జి కె.శశిధర్‌రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడంతో టీఆర్‌ఎస్ శ్రేణులు మునగాలలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు కందిబండ సత్యనారాయణ, తుపాకుల భాస్కర్, మండల పార్టీ అ««ధ్యక్షురాలు కోదాటి అరుణ, నాయకులు వేమూరి సత్యనారాయణ, పొనుగోటి రంగా తదితరులు పాల్గొన్నారు.