bipoll
-
మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు
-
బీజేపీకి బుద్ధి చెప్పాలనుకున్నాం.. చెప్పాం
సాక్షి, చండీగఢ్ : నియంతృత్వ పోకడలతో వ్యవహరిస్తున్న బీజేపీకి తాము బుద్ధి చెప్పాలనుకున్నామని, అనుకున్నట్లుగానే చెప్పామని బహుజన్ సమాజ్‌వాది పార్టీ అధినేత్రి మాయావతి అన్నారు. ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో తాము ఊహించినట్లుగానే బీజేపీని ఓడించామని చెప్పారు. అనూహ్యంగా ఓటమి పాలయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందస్తుగానే లోక్‌సభ ఎన్నికలకు పిలుపునిస్తుందేమోనని ఆమె అభిప్రాయపడ్డారు. ఓ ర్యాలీలో మాట్లాడిన మాయవతి కేంద్రంలో బీజేపీ నియంతలా వ్యవహరిస్తోందని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ సంస్థలను బలహీన పరుస్తోందని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు 1975లో కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీని తలపించే పరిస్థితులు మరోసారి తెరపైకి తీసుకొచ్చిందని ఆరోపించారు. 'ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి మేం ఓ గుణపాఠం చెప్పాలని అనుకున్నాం. అందుకే ఎస్పీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి వారు ఓడిపోయేలా చేశాం. ఈ ఫలితాలకు వారికి నిద్రలేకుండాపోయింది. ఈ ఫలితాలతో ముందస్తుగానే బీజేపీ లోక్‌సభ ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. మరింత ఆలస్యం చేస్తే మరింత నష్టం చవిచూడాల్సి వస్తుందని బీజేపీకి తెలుసు. మోదీ ఒకప్పుడు లంచాల విషయంలో నేను తినను.. వేరే వాళ్లను తిననివ్వను అంటూ నినాదాలు చేశారు. కానీ, కోట్ల రూపాయల విలువైన కుంభకోణాలు జరిగాయి. లలిత్ మోదీ, విజయ్ మాల్యా, నీరవ్‌మోదీ చేసినవన్నీ కూడా పెద్ద పెద్ద కుంభకోణాలే. మొత్తం మింగేయండి అనే నినాదాన్ని ఈ కుంభకోణాలు నిరూపించాయి. అవినీతి పరుల నుంచి నల్లడబ్బు లాగేశామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం దానిని పేద ప్రజలకు ఉపయోగించకుండా పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టింది. బ్లాక్‌మనీ పేరిట కేంద్రం వారికి రాజకీయంగా ఎదురుపడేవారిని లక్ష్యంగా చేసుకుంది. అదే సమయంలో సొంత పార్టీ నేతలపై వచ్చిన ఆరోపణలు మాత్రం కప్పిపుచ్చుకుంది' అని ఆమె ఆరోపించారు. -
‘కోపమొచ్చింది.. ఓడాం.. ఇదేం ట్రైలరా?’
న్యూఢిల్లీ: ఢిల్లీ ఉప ఎన్నికల్లో ఓటమిపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వివరణ ఇచ్చారు. తమ పార్టీ తీసుకున్న నిర్ణయం కారణంగా ప్రజలు నిరుత్సాహపడటం వల్లే ఫలితం అలా వచ్చిందని అన్నారు. ఢిల్లీలోని రాజౌరి గార్డెన్ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే జర్నేయిల్ సింగ్ తన పదవికి రాజీనామా చేసి పార్టీ తరుపున పంజాబ్ ఎన్నికల్లో బరిలోకి దిగారని అది ప్రజలకు నచ్చలేదని, తీవ్ర నిరుత్సాహంతో వారు తమకు ఓటమి అందించారని తెలిపారు. అయితే, ఇదేమీ ట్రైలర్‌గా భావించాల్సిన అవసరం లేదని కేజ్రీవాల్ చెప్పారు. మున్సిపల్ ఎన్నికలపై దీని ప్రభావం ఉండబోదని అన్నారు. రెండు వేర్వేరు ఎన్నికలని చెప్పుకొచ్చారు. ఇక్కడ జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రెండో స్థానంలో కాంగ్రెస్‌పార్టీ నిలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ ఉప ఎన్నికలో కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. -
ఆకుపాముల ఉప ఎన్నిక ఏకగ్రీవం
–సర్పంచ్‌గా లిక్కి రామరాజు మునగాల: ఈ నెల 8న మండలంలోని ఆకుపాముల మేజర్ గ్రామపంచాయతీకి జరగాల్సిన ఉప ఎన్నికల్లో భాగంగా శనివారం నామినేషన్ల ఉపసంహారణకు తుది గడువు కావడంతో పోటీలో ఉన్న ఐదుగురు అభ్యర్థులు ఉపసంహారించుకున్నారు. దీంతో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు సర్పంచ్‌గా లిక్కి రామరాజు ఎన్నికైనట్లు ఎన్నికల అధికార్లు ఎన్.నాగేశ్వరరావు, బొడ్ల శ్రీనివాస్‌లు శనివారం తెలిపారు. ఆకుపాముల సర్పంచ్ లిక్కి నాగేశ్వరరావు గత సెప్టెంబర్‌లో గుండెపోటుతో ఆకస్మిక మృతిచెందారు. కాగ ఈ ఉప ఎన్నికకు నలుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులతో పాటు దివంగత సర్పంచ్ నాగేశ్వరరావు భార్య పూలమ్మ, పెద్ద కుమారుడు లిక్కి రామరాజులు నామినేషన్లు దాఖలు చేశారు. రామరాజు ఏకగ్రీవ ఎన్నికకు సహాకరించిన అన్ని రాజకీయ పార్టీలకు టీఆర్ఎస్ కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి కె.శశిధర్‌రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడంతో టీఆర్ఎస్ శ్రేణులు మునగాలలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు కందిబండ సత్యనారాయణ, తుపాకుల భాస్కర్, మండల పార్టీ అ««ధ్యక్షురాలు కోదాటి అరుణ, నాయకులు వేమూరి సత్యనారాయణ, పొనుగోటి రంగా తదితరులు పాల్గొన్నారు. -
రెండు గంటల్లోనే పాలేరు భవితవ్యం!
ఖమ్మం: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక కౌంటింగ్ గురువారం ఉదయం 8గంటలకు ప్రారంభమవుతుంది. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన రెండు గంటల్లోనే అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఈ ఉప ఎన్నికలో మొత్తం 13మంది అభ్యర్థులు బరిలో నిలవగా, ప్రధానంగా టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సుచరితారెడ్డి, సీపీఎం అభ్యర్థి పోతినేని సుదర్శన్ మధ్య పోటీ నెలకొంది. ఓట్ల లెక్కింపు కోసం ఈవీఎంలను భారీ బందోబస్తు మధ్య ఖమ్మం నగరంలోని పత్తి మార్కెట్‌కు తరలించారు. ఈ మార్కెట్ యార్డులోనే ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. 243 పోలింగ్ కేంద్రాల్లో 243 ఈవీఎంలను 14 టేబుళ్లపై ఉంచి 18 రౌండ్లలో లెక్కింపు పూర్తి చేయనున్నారు. ఇందుకు తగిన యంత్రాంగాన్ని నియమించారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తాన్ని సీసీ కెమెరాల ద్వారా రికార్డు చేస్తారు. పత్తి మార్కెట్‌యార్డు ప్రాంగణమంతా కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
వరంగల్ ఓటరు ఎవరితో ఉంటాడో?
వరంగల్: వరంగల్ ఉప ఎన్నికల ప్రచార హోరు ముగిసింది. ఎన్నికల కోడ్ నిబంధన మేరకు ప్రచారం సమయం ముగిసినందున వరంగల్ లోక్‌సభ నియోజకవర్గంలో ఓటరుకానీ ప్రచార నాయకులంతా ఆయా ప్రాంతాలనుంచి వెనుదిరుగుతున్నారు. ఈ నెల 21న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కౌంటింగ్ 24న జరగనుంది. ఈ ఎన్నికల బరిలో మొత్తం 23 మంది అభ్యర్థులు ఉండగా వారిలో టీఆర్ఎస్ పార్టీ నుంచి పసునూరి దయాకర్, కాంగ్రెస్ పార్టీ తరుపున సర్వే సత్యనారాయణ, టీడీపీ-బీజేపీ కూటమి తరుపున పగిడిపాటి దేవయ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున నల్లా సూర్యప్రకాశ్, వామపక్షాల అభ్యర్థిగా గాలి వినోద్ కుమార్ తోపాటు ఇతర సభ్యులు కూడా ఉన్నారు. కాగా, వరంగల్ లోక్ సభ నియోజవర్గంలో మొత్తం 14,71,920 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో పురుష ఓటర్లు 7,33,412 మంది, మహిళలు 7,38,367 ఉన్నారు. ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఒకరి లోపాలను మరొకరు ఎత్తి చూశారు. విమర్శల దాడులు చేసుకున్నారు. అయితే, ఓటరు నాడిని ఏ నాయకుడు పట్టుకున్నాడనే విషయం ఎన్నికలు జరిగి ఫలితాలు వెలువడితే గానీ చెప్పలేని పరిస్థితి ఉందని మాత్రం చెప్పవచ్చు. బిహార్ ఎన్నికల ఫలితాల ప్రభావం ఇప్పుడు అన్ని పార్టీలను ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ను కలవరపడుతోందనే చెప్పాలి.