ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేల కోటాలో నాలుగు శాసన మండలి స్థానాలకు జరగాల్సిన ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. అధికార టీడీపీ తరపున ప్రతిభా భారతి, ఎంఏ షరీఫ్, మిత్రపక్షం బీజేపీ తరపున సోము వీర్రాజు, ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ సీపీ తరపున గోవింద రెడ్డి ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి సోమవారం మధ్యాహ్నంతో గడువు ముగిసింది. నాలుగు స్థానాలకు నాలుగే నామిషేన్లు దాఖలు కావడంతో ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి