‘స్థాయీ’ ఏకగ్రీవం
- జెడ్పీ ఏడు కమిటీలు, సభ్యుల ఎన్నిక
- కొన్నింటికి చైర్మన్‌గా భవాని
- అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం
విశాఖ రూరల్: జిల్లా పరిషత్ స్థాయీ సంఘం కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కీలకమైన ఏడు కమిటీలకు చైర్మన్‌తోపాటు, సభ్యుల ఎన్నిక విషయంలో అధికార పార్టీ, విపక్ష సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. తొలుత జెడ్పీ చైర్‌పర్సన్,జెడ్పీటీసీలు, ఎమ్మెల్యే, ఎంపీలు చర్చించి కమిటీలో ఎవరెవరు ఉండాలన్నదానిపై ఒక నిర్ణయానికి వచ్చారు. రెండు కమిటీల్లో వైఎస్సార్‌సీపీకి ప్రాతినిథ్యం నామమాత్రంగా ఉండడంతో వారు కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే వాటిల్లో మార్పులు చేసి వైఎస్సార్ సీపీ సభ్యులను కూడా చేర్చారు.
దీంతో ఏడు కమిటీల సభ్యుల ఎన్నిక ఏకగ్రీవ మైనట్లు జెడ్పీ సీఈవో మహేశ్వరరె డ్డి ప్రకటించారు. కొన్ని కమిటీలకు చైర్మన్‌గా వ్యవహరించే జెడ్పీ చైర్‌పర్సన్ లాలం భవాని మాట్లాడుతూ కమిటీల ఎన్నిక ఏకగ్రీం కావడం సంతోషదాయకమన్నారు. పార్టీలకు అతీతంగా జెడ్పీటీసీ సభ్యులు, అధికారులు కుటుంబ సభ్యుల్లా ఉంటూ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిద్దామన్నారు. మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి జెడ్పీ మంచి కార్యక్రమాలు, నిర్ణయాలు చేయాలని సూచించారు.
ప్రస్తుతం జిల్లాలో కరువు, మంచినీరు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు మాట్లాడుతూ డీడీఆర్‌సీని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో జెడ్పీలోనే సమస్యలపై విస్తృతంగా చర్చించి వాటిని పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు, తదితరులు పాల్గొన్నారు.
ప్లానింగ్ అండ్ ఫైనాన్స్
కమిటీకి చైర్మన్‌గా జెడ్పీ చైర్‌పర్సన్ లాలం భవాని,ఇతర సభ్యులుగా రాష్ర్ట విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, రావికమతం జెడ్పీటీ సీ రాజాన శ్రీవాణి(టీడీపీ), నాతవరం జె డ్పీటీసీ సత్యనారాయణ(టీడీపీ), జి.మాడుగుల జెడ్పీటీసీ ఎస్.ఆదినారాయణ(టీడీపీ), కోటవురట్ల జెడ్పీటీసీ వంతర వెంకటలక్ష్మి(వైఎస్సార్‌సీపీ) ఎన్నికయ్యారు.
గ్రామీణాభివృద్ధి : అరకు ఎంపీ కొత్తపల్లి గీత, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి, చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.రాజు, భీమిలి జెడ్పీటీసీ ఎస్.అప్పారావు(టీడీపీ), కో-ఆప్షన్ సభ్యుడు గూనూరు జోసెఫ్ సత్యశ్రీరామ మూర్తి(టీడీపీ), ఆనందపురం జెడ్పీటీసీ మారికనూకరాజు (టీడీపీ), పాడేరు జెడ్పీటీసీ పొలుపర్తి నూకరత్నం (వైఎస్సార్ సీపీ), చింతపల్లి జెడ్పీటీసీ మంచాన పద్మకుమారి(వైఎస్సార్ సీపీ)లను ఎన్నుకున్నారు.
వ్యవసాయం : ఈ కమిటీకి జెడ్పీ వైస్ చైర్మన్, అనంతగిరి జెడ్పీటీసీ కొట్యాడ అప్పారావు(టీడీపీ) చైర్మన్‌గా ఎన్నికయ్యారు. సభ్యులుగా విశాఖ ఎంపీ కె.హరిబాబు, ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్.శర్మ, ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, అనంతగిరి జెడ్పీటీసీ కె.అప్పారావు(టీడీపీ), కొయ్యూరు జెడ్పీటీసీ గాదె శ్రీరామమూర్తి(టీడీపీ), యలమంచిలి జెడ్పీటీసీ మట్టా రాజవేణి( వైఎస్సార్ సీపీ), కో-ఆప్షన్ సభ్యుడు కొప్పిశెట్టి కొండబాబు(టీడీపీ)లు ఎన్నికయ్యారు.
విద్య, వైద్యం : ఈ కమిటీకి ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు, బుచ్చెయ్యపేట జెడ్పీటీసీ మామిడి సురేంద్ర(టీడీపీ), గొలుగొండ జెడ్పీటీసీ చిటికెల తారక వేణుగోపాల్(టీడీపీ), మునగపాక జెడ్పీటీసీ డి.లక్ష్మీ సత్యనారాయణ(టీడీపీ), మాకవరపాలెం జెట్పీడీసీ కాశీపల్లి కుమారి(టీడీపీ), డుంబ్రిగుడ జెడ్పీటీసీ కె.కుజ్జమ్మ( వైఎస్సార్ సీపీ), జి.కె.వీధి జెడ్పీటీసీ గంటా నళినీ కృష్ణ( వైఎస్సార్ సీపీ), వి.మాడుగుల గొల్లవిల్లి ప్రభావతి( వైఎస్సార్ సీపీ)లు వ్యవహరించనున్నారు.
మహిళా సంక్షేమం : ఈ కమిటీకి చైర్మన్‌గా దేవరాపల్లి జెడ్పీటీసీ గాలి వరలక్ష్మి(టీడీపీ), సభ్యులు గా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూ డి అనిత, దేవరాపల్లి జెడ్పీటీసీ గాలి వరలక్ష్మి(టీడీపీ), రోలుగుంట జెడ్పీటీసీ బోణంగి రామలక్ష్మి(టీడీపీ), అనకాపల్లి జెడ్పీటీసీ పాలెళ్ల గంగాభవాని(టీడీపీ), పెందుర్తి జెడ్పీటీసీ కె.సూర్యమణి (టీడీపీ), హుకుంపేట జెడ్పీటీసీ సాగరి వ సంతకుమారి (వైఎస్సార్ సీపీ), కె.కోటపాడు జెడ్పీటీసీ దాసరి గురయ్య (వైఎస్సార్ సీపీ), పాయకరావుపేట జెడ్పీటీసీ చిక్కాల రామారావు(వైఎస్సార్ సీపీ)లు ఏకగ్రీవమయ్యారు.
సాంఘిక సంక్షేమం : కశింకోట జెడ్పీటీసీ ఎం.కాసులమ్మ చైర్మన్‌గా, చోడవరం జెడ్పీటీసీ కనిశెట్టి సన్యాసిరావు(టీడీపీ), సబ్బవరం జెడ్పీటీసీ గేదెల సత్యనారాయణ(టీడీపీ), నక్కపల్లి జెడ్పీటీసీ రాగిన వెంకటరమణ(టీడీపీ), అరకు జెడ్పీటీసీ కూన వనజ( వైఎస్సార్ సీపీ), నర్సీపట్నం జెడ్పీటీసీ చదలవాడ సువర్ణలత( వైఎస్సార్ సీపీ), పెదబయలు జెడ్పీటీసీ జర్సింగి గంగాభవాని( వైఎస్సార్ సీపీ), ముంచింగపుట్ కె.కాసులమ్మ( వైఎస్సార్ సీపీ) సభ్యులుగా వ్యవహరించనున్నారు.
వర్క్స్ కమిటీ : ఈ కమిటీలో పంచాయతీరాజ్ మంత్రి సి.హెచ్.అయ్యన్నపాత్రుడు, అనకాపల్లి ఎమ్మెల్యేల పీలా గోవింద సత్యనారాయణ, యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, ఎస్.రాయవరం జెడ్పీటీసీ బొట్టా లక్ష్మి(టీడీపీ), పరవాడ జెడ్పీటీసీ పైల జగన్నాథరావు(టీడీపీ), అచ్యుతాపురం జెడ్పీటీసీ జనపరెడ్డి శ్రీనివాసరావు(టీడీపీ), పద్మనాభం జెడ్పీటీసీ కాశిరెడ్డి దామోదరరావు(టీడీపీ), చీడికాడ జెడ్పీటీసీ పులపర్తి సత్యవతి(వైఎస్సార్ సీపీ)లు సభ్యులుగా ఎన్నికయ్యారు.