యాలాల, న్యూస్‌లైన్: మండల పరిధిలోని కోకట్ ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవమైంది. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆవుటి శంకర్ ఏకగ్రీవ ఎంపిక దాదాపు ఖరారైంది. కోకట్ ఎంపీటీసీ స్థానానికి ఇటీవల ఈడ్గి అశోక్ (కాంగ్రెస్), రామకృష్ణ (కాంగ్రెస్), ఆవుటి శంకర్ (స్వతంత్ర అభ్యర్థి)నామినేషన్లు వేశారు.
అయితే వీరిలో ఈడ్గి అశోక్, రామకృష్ణలు ఆదివారం నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ఆవుటి శంకర్ ఏకగ్రీవ ఎన్నిక ఖరారైంది. సోమవారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో అదేరోజు సాయంత్రం మూడు గంటల తర్వాత ఆవుటి శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారికంగా ధ్రువీకరిస్తామని మండల అసిస్టెంట్ ఎన్నికల అధికారి భాగ్యవర్థన్ ఆదివారం ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.
ఇదిలా ఉండగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన తనను గ్రామస్తులు ఏకగ్రీవం చేయడం సంతోషంగా ఉందని, ఎంపీటీసీగా గ్రామాభివృద్ధికి పాటుపడతానని ఆవుటి శంకర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన గ్రామపెద్దలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, యువకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కోకట్ ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవం!
Published Sun, Mar 23 2014 11:51 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement