ఎమ్మెల్సీ కాటెపల్లి జనార్ధన్ రెడ్డికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి అవకాశం కల్పించాలని పీఆర్‌టీయూ హైదరాబాద్ జిల్లా ...
సిటీబ్యూరో: ఎమ్మెల్సీ కాటెపల్లి జనార్ధన్ రెడ్డికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి అవకాశం కల్పించాలని పీఆర్‌టీయూ హైదరాబాద్ జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గానికి త్వరలో ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో పీఆర్‌టీయూ -టీఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ కాటెపల్లి జనార్ధన్ రెడ్డిని ప్రకటించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ రాష్ట్ర కార్యవర్గానికి అందజేశారు. సోమవారం నారాయణగూడలో పీఆర్‌టీయూ హైదరాబాద్ జిల్లా రెండో కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
జిల్లాల పునర్విభజనలో భాగంగా హైదరాబాద్ జిల్లాను ఇతర ప్రాంతాలతో కలిపి విభజిస్తే సర్వీస్ సమస్యలు తలెత్త అవకాశం ఉన్నందున జిల్లాను విభజించకూడదని పేర్కొన్నారు. పీఆర్‌సీ ఎరియర్స్‌ను జీపీఎఫ్‌లో జమ చేయాలని తీర్మానించారు. కార్యక్రమంలో నాయకులు తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.