
ఆరు.. ఖరారు
♦ ఆరు వార్డుల్లో ఏకగ్రీవం
♦ ఫలించిన ‘హరీశ్’ మంత్రాంగం
♦ సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో గుబాళించిన గులాబీ
♦ సంబురాల్లో టీఆర్‌ఎస్ శ్రేణులు
సిద్దిపేట జోన్: మున్సిపల్ ఎన్నికల్లో ముందస్తుగానే టీఆర్‌ఎస్ పార్టీ గుబాళించింది. నామినేషన్ల ఉపసంహరణ నాటికీ ఆరు వార్డుల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ శ్రేణులు పట్టణంలో సంబరాలు జరుపుకున్నాయి. పట్టణంలోని 34 వార్డులకుగాను.. ఆయా వార్డుల్లో ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు మూడు రోజులుగా మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని కమిటీ పార్టీలోని తిరుగుబాటు అభ్యర్థులతో పలు దఫాలుగా చర్చలు జరిపింది. ఈ క్రమంలో శుక్రవారం నిర్ణీత ఉపసంహరణ సమయానికి ముందే ఆరు వార్డుల్లో ఆయా అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణంలోని 13వ వార్డులో పల్లె వెంకట్‌గౌడ్, 16వ వార్డులో కడవేర్గు రాజనర్సు, 19వ వార్డులో పూజల లత , 18వ వార్డులో నల్లా విజయనరేందర్‌రెడ్డి, 21వ వార్డుల్లో మంతేన జ్యోతిరాజన రేందర్, 24వ వార్డులో బూర శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికైన్నట్లు మున్సిపల్ ఎన్నికల అధికారి రమణాచారి అధికారికంగా ప్రకటించారు. అనంతరం వారికి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. మరోవైపు పట్టణంలోని 9, 15, 17, 34 వార్డుల్లో ద్విముఖ పోటీ, 14, 25, 28 వార్డుల్లో టీఆర్‌ఎస్ పార్టీ త్రిముఖ పోటీని ఎదుర్కోనుంది.
166 మంది ఉపసంహరణ
నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉదయం 11 నుంచి మద్యాహ్నం 3 వరకు కొనసాగింది. స్క్రూటినీ నిర్ణీత సమయం ముగిసే సరికి 166 మంది పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఎన్నికల అధికారులకు ఉపసంహరణ పత్రాలను అందజేశారు. దీంతో 34 వార్డులకు సంబంధించి ఆరు వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 28 వార్డుల్లో 146 మంది పోటీలో ఉన్నారు. వీరిలో టీఆర్‌ఎస్-28, టీడీపీ-12, కాంగ్రెస్-15, బీజేపీ-14, ఎంఐఎం-5, సీపీఎం-2తో పాటు మరో 70 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు.
ఏ వార్డులో ఎంతమంది?
1వ వార్డు-5, 2వ వార్డు-6, 3వ వార్డు-5, 4వ వార్డు-4, 5వ వార్డు-4, 6వ వార్డు-6, 7వ వార్డు-4, 8వ వార్డు-5, 9వ వార్డు-2, 10వ వార్డు-13, 11వ వార్డు-7, 12వ వార్డు-5, 14వ వార్డు-3, 15వ వార్డు-2, 17వ వార్డు-2, 20వ వార్డు-5, 22వ వార్డు-4, 23వ వార్డు-7, 25వ వార్డు-3, 26వ వార్డు-10, 27వ వార్డు-5, 28వ వార్డు-3, 29వ వార్డు-8, 30వ వార్డు-8, 31వ వార్డు-6, 32వ వార్డు-4, 33వ వార్డు-8, 34వ వార్డు-2 చొప్పున అభ్యర్థులు పోటీలో నిలిచారు.
టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఎంపిక పూర్తి
టీఆర్‌ఎస్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసింది. వివరాలిలా ఉన్నాయి. 8వ వార్డు-బండారి నర్సయ్య, 15వ వార్డు-మరుపల్లి భవాని శ్రీను, 22వ వార్డు-కెమ్మెసారం దుర్గయ్య, 26వ వార్డు-తేల్‌జీర్ శ్రీనివాస్, 31వ వార్డు-జంగిటి కవిత, 33వ వార్డు-ఫరీరోద్దీన్, 2వ వార్డు-కొర్తివాడ లలితరాము, 29వ వార్డు-గురజాడ ఉమారాణి, 18వ వార్డు-నల్లా విజయలక్ష్మి, 5వ వార్డు-గౌటి రేణుక, 10వ వార్డు- మచ్చవేణుగోపాల్‌రెడ్డి, 34వ వార్డు-బోనాల భావన, 11వ వార్డు-గ్యాదరి రవీందర్, 3వ వార్డు-జూలూరి నటరాజ్, 9వ వార్డు-మామిడాల ఉమారాణి, 20వ వార్డు-జావేద్.
కొనసాగిన చేరికల పర్వం
శుక్రవారం టీడీపీ, కాంగ్రెస్, బీజేపీతో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్న పలువురు మంత్రి హరీష్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. నరుకుల పద్మ (2వ వార్డు, కాంగ్రెస్), రచ్చ సంగీత (4వ వార్డు, టీడీపీ), చెప్యాల స్వప్న (9వ వార్డు, బీజేపీ), రుద్రోజు లత (15వ వార్డు, బీజేపీ), మల్లవ్వ (19వ వార్డు, టీడీపీ), లక్ష్మి (29వ వార్డు, టీడీపీ) పోటీ నుంచి తప్పుకుని టీఆర్‌ఎస్‌లో చేరారు.