సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల కోటాలో శాసనమండలిలోని 11 స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు మాత్రమే బరిలో మిగిలారు. పోటీ లేకపోవడంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందుకు సంబంధించిన ప్రకటనను రిటర్నింగ్ అధికారులు లాంఛనంగా జారీ చేయనున్నారు. దీంతో 58 మంది సభ్యులు ఉన్న శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ బలం 20 నుంచి 31కు పెరగనుంది.
స్థానిక సంస్థల కోటాలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు వీరే..
జిల్లా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ
విజయనగరం ఇందుకూరు రఘురాజు
విశాఖపట్నం వరుదు కళ్యాణి, వంశీకృష్ణ యాదవ్
తూర్పుగోదావరి అనంత ఉదయభాస్కర్
కృష్ణా తలశిల రఘురాం, మొండితోక అరుణ్‌కుమార్
గుంటూరు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు
ప్రకాశం తూమాటి మాధవరావు
చిత్తూరు కృష్ణ రాఘవ జయేంద్ర భరత్
అనంతపురం వై.శివరామిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment