కందుకూరు పీఏసీఎస్ కమిటీ ఎన్నిక
కందుకూరు పీఏసీఎస్‌లో సాఫీగా కొనసాగిన తంతు
హాజరైన పది మంది డైరెక్టర్లు
కందుకూరు: కందుకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) చైర్మన్‌గా మండల కేంద్రానికి చెందిన మీర్‌ఖాన్‌పేట డైరెక్టర్ సరికొండ మల్లేష్, వైస్ చైర్మన్‌గా నేదునూరుకు చెందిన డైరెక్టర్ సర్గారి బాల్‌రెడ్డి ఎనిమిది మంది సభ్యుల మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో పీఏసీఎస్ పీఠాన్ని ఎట్టకేలకు టీఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకున్నట్లయింది. గురువారం జరిగిన కార్యక్రమానికి డివిజనల్ కో ఆపరేటీవ్ అధికారి శ్రీనివాస్‌రావు, సబ్ డివిజన్ కో-ఆపరేటీవ్ అధికారి నర్సింహారెడ్డి ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. వారి సమక్షంలో మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నిక నిర్వహించగా చైర్మన్‌గా సరికొండ మల్లేష్‌ను లేమూరు డైరెక్టర్ కొండారెడ్డి ప్రతిపాదించగా కందుకూరు డైరెక్టర్ హరికిషన్‌రెడ్డి బలపర్చారు. వైస్ చైర్మన్‌గా సర్గారి బాల్‌రెడ్డిని ఆకులమైలారం డైరెక్టర్ జంగయ్య ప్రతిపాదించగా, దెబ్బడగూడ డైరెక్టర్ రాములు బలపర్చడంతో డైరెక్టర్లు యాదయ్య, బాల్‌రాజ్, లక్ష్మమ్మ, యాదమ్మ మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఇద్దరి ఎన్నిక సాఫీగా జరిగింది. అనంతరం వారిద్దరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్, వైస్ చైర్మన్ మాట్లాడుతూ.. తమ ఎన్నికకు కారణమైన ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో పాటు డైరెక్టర్లు, నాయకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సొసైటీ అభివృద్ధికి తమ శాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు.