Committee Elections
-
జితేందర్‌రెడ్డి వర్సెస్ చాముండేశ్వరనాథ్
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ విరామం.. కోర్టు వివాదాలు ముగిసిన తర్వాత తెలంగాణ ఒలింపిక్ సంఘం (టీఓఏ) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 21న ఒలింపిక్ భవన్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లోనే ఎన్నికల కోసం నోటిఫికేషన్ ఇచ్చినా, వేర్వేరు కారణాలతో ఈ ప్రక్రియ కోర్టుకు చేరింది. ఇప్పుడు అన్నీ చక్కబడటంతో రాష్ట్రంలోని వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు బరిలో నిలిచారు. మొత్తం 68 మంది ఓటర్లు ఉండగా, ముగ్గురికి ఓటింగ్ అర్హత లేదని రిటరి్నంగ్ అధికారి ప్రకటించారు. దీంతో 65 ఓట్ల నుంచే విజేత ఎవరో తేలనుంది. ప్రధానంగా అధ్యక్ష పదవిపైనే పోటీ నెలకొంది.రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఢిల్లీలో కేబినెట్ హోదాలో ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న ఏపీ జితేందర్‌రెడ్డి (రోయింగ్ సంఘం) అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘంలో కూడా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతోపాటు క్రీడా సంఘాల్లో తనకున్న పరిచయాలు గెలిపిస్తాయని ఆయన నమ్ముతున్నారు. అయితే మరోవర్గం నుంచి ఆంధ్ర మాజీ క్రికెటర్, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు వి.చాముండేశ్వరనాథ్ ప్రత్యర్థిగా ఉన్నారు.ఓటింగ్‌కంటే ముందే జితేందర్‌ను పోటీ నుంచి తప్పించి తాను గెలిచేందుకు చాముండి ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి కీలకాంశాన్ని ఆయన భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) దృష్టికి తీసుకెళ్లారు. 70 ఏళ్లు దాటిన జితేందర్‌రెడ్డి పోటీకి అనర్హుడన్నారు. పైగా ఓటర్ల జాబితాలో పలు తప్పులు జరిగినట్టు ఆయన చెబుతున్నారు. నిజానికి తెలంగాణ ఒలింపిక్ సంఘంలో కొంతకాలంగా వివాదాలు సాగుతున్న నేపథ్యంలో అక్కడి పరిస్థితులను సమీక్షించే ఒక నివేదిక ఇవ్వాల్సిందిగా వీఏ షియాద్తో ఐఓఏ ఏకసభ్య కమిటీని నియమించింది. దీనికి 10 డిసెంబర్ వరకు గడువు ఇచ్చింది.కాబట్టి ఈ నివేదిక వచ్చే వరకు ఎన్నికలను నిలిపి వేయాల్సిందిగా చాముండి కోరుతున్నారు. అయితే తాను నామినేషన్ వేసిన సమయంలో 70 ఏళ్లలోపే ఉన్నానని, కోర్టుల కారణంగా ఆలస్యమైతే అది తనకు వర్తించదని జితేందర్ స్పష్టం చేశారు. ప్రధాన కార్యదర్శి పదవి కోసం పి.మల్లారెడ్డి (సైక్లింగ్ సంఘం), సి.బాబూరావు (బాక్సింగ్), కోశాధికారి పదవికి సతీశ్ గౌడ్ (తైక్వాండో), ప్రదీప్‌కుమార్ (కయాకింగ్ అండ్ కనోయింగ్) పోటీ పడుతున్నారు. అధ్యక్ష, కార్యదర్శి పదవులకు మినహా మిగతా అన్ని పదవులకు ఏకగ్రీవ ఎంపిక జరగడం ఖాయమైంది. -
విశాఖలో కూటమి ‘మహా’ కుట్ర
సాక్షి, విశాఖపట్నం: మహా విశాఖ నగర పాలక సంస్థలో జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో టీడీపీ కూటమి కుట్ర రాజకీయాలకు తెరతీసింది. కూటమి కార్పొరేటర్లకు జీవీఎంసీ కమిషనర్ సంపత్‌కుమార్ మద్దతు పలుకుతూ.. చెల్లని ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకుని.. 10కి 10 స్థానాల్లోనూ టీడీపీ విజయం సాధించినట్లు ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక తొలిసారిగా జీవీఎంసీలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో.. టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కార్పోరేటర్లను బలవంతంగా లాక్కెళుతున్న పోలీసులుకుట్రలు చేసైనా విజయం సాధించాలనే ఉద్దేశంతో.. కార్పొరేటర్లకు రూ.5 లక్షల వరకూ డబ్బులిచ్చి మరీ ఓట్లు బహిరంగంగానే కొనుగోలు చేశారు. తమకు మద్దతిస్తున్న కార్పొరేటర్లను భీమిలిలోని రిసార్టులో మంగళవారం రాత్రి మొత్తం అక్కడే బస చేయించి.. ఉ.11 గంటల సమయంలో ఓటింగ్‌కు బస్సులో తీసుకొచ్చారు. మరోవైపు.. టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు కొందరు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు నేరుగా ఫోన్లుచేసి డబ్బులు పంపిస్తున్నట్లు చెప్పి ఓట్లు కొనుగోలు చేశారు. కన్నీటి పర్యంతమవుతున్న వైఎస్సార్సీపీ కార్పోరేటర్ రోహిణిబ్యాలెట్ పేపర్లపై కలర్ పెన్సిళ్లతో గుర్తులు..ఇక డబ్బులు తీసుకున్న వారు తమకు ఓట్లు వేశారా లేదా అనేది తెలుసుకునేందుకు కలర్ పెన్సిళ్లతో బ్యాలెట్ పేపర్‌పై అనధికారికంగా గీతలు గీశారు. వాస్తవానికి.. బ్యాలెట్ పేపర్‌పై పెన్ను, పెన్సిల్, స్కెచ్ గీతలుంటే కచ్చితంగా ఆ ఓట్లు చెల్లుబాటు కావన్న నిబంధనలున్నా కమిషనర్ మాత్రం పూర్తిగా పక్కా టీడీపీ కార్యకర్తలా వ్యవహరించారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఆ ఓట్లు చెల్లుబాటు కావని చెబుతున్నా బేఖాతరు చేస్తూ టీడీపీ కార్పొరేటర్లు 10 మందీ విజయం సాధించినట్లు ప్రకటించారు.దీంతో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు కమిషనర్ తీరుపై మండిపడ్డారు. పోర్టికోలో బైఠాయించారు. ముందుగానే కుట్ర పన్ని గెలుపొందాలని స్కెచ్ వేసిన టీడీపీ పెద్దఎత్తున పోలీసు బలగాల్ని రంగంలోకి దించి.. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను జీవీఎంసీ నుంచి బయటికి పంపించేశారు. అక్రమంగా విజయం సాధించిన టీడీపీ వ్యవహారం, కమిషనర్ వ్యవహరించిన తీరుపై న్యాయపోరాటం చేస్తామని మేయర్ గొలగాని హరివెంకటకుమారి, డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్, కటుమూరి సతీష్, ఫ్లోర్‌లీడర్ బానాల శ్రీను, ఇతర కార్పొరేటర్లు తెలిపారు. -
సింగరేణి: ఎన్నికల నిర్వహణలో అలసత్వం
సాక్షి, రామకృష్ణాపూర్: సింగరేణి కాలరీస్‌లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు గుదిబండై కూర్చున్నాయా..? చుట్టూ అల్లుకున్న విమర్శలు.. వైఫల్యాల నుంచి బయట పడాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందా..? కావాలనే ఎన్నికల నిర్వహణ ప్రక్రియను జాప్యం చేస్తోందా..? అంటే అవుననే అంటున్నారు జాతీయ కార్మిక సంఘాల నేతలు. గుర్తింపు కార్మిక సంఘం కాలపరిమితి ముగిసి ఆర్నెళ్లు కావస్తున్నా.. ఇప్పటివరకు ఎన్నికల ఘట్టానికి సన్నాహాలు మొదలు పెట్టక పోవడాన్ని దీనికి కారణంగా చూపిస్తున్నారు. ఇప్పుడున్న సమస్యలకు తోడు పాలకులు ఇచ్చిన హామీల వ్యవహారం కూడా “ఎక్కడ వేసిన గొంగలి అక్కడే’ అన్న చందంగా మారడం మరో కారణంగా చెబుతున్నారు. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం కాలపరిమితి ఈ ఏడాది ఏప్రిల్ 16 నాటికి ముగిసిపోయింది. గత ఎన్నికల్లో టీబీజీకేఎస్ (తెలంగాణా బొగ్గు గని కార్మిక సంఘం) విజయం సాధించిన విషయం తెల్సిందే. కాలపరిమితి ముగిసిన వెంటనే గుర్తింపు సంఘం తప్పుకోవాలి. అదే సమయంలో ఎన్నికల ప్రక్రియ మొదలు కావాలి. ఈ లెక్కన ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ జారీతోపాటు ఎన్నికల ఘట్టం కూడా పూర్తికావాల్సి ఉంది. కానీ.. ఆరునెలలు గడుస్తున్నా.. ఎన్నికల దిశగా అడుగు కూడా ముందుకు పడకపోవడం గమనార్హం. వాస్తవానికి ఏప్రిల్ 16కు ముందునుంచే వివిధ ఎన్నికల సన్నాహాలను సింగరేణి యాజమాన్యం చేపట్టాల్సి ఉంది. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో యాజమాన్యం ముందుకు రాలేదని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికలకు సుముఖత చూపకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. సింగరేణి బాండ్ల తనఖా ఇప్పటికిప్పుడు ఎన్నికల నిర్వహణ అంటే అటు సింగరేణి కాలరీస్ సంస్థకు ముచ్చెమటలు పట్టించే చర్యగా కార్మిక సంఘాల నాయకులు అభిప్రాయ పడుతున్నారు. వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో యాజమాన్యం ఎన్నికలు నిర్వహించడానికి చేతులెత్తేసే గడ్డుస్థితిలోకి జారిపోయింది. వివిధ రకాల ఆర్థిక సంక్షోభాలే ఇందుకు కారణమని చెబుతున్నారు. లాభాల బాటలో ఉన్న సంస్థ ఆదాయాన్ని వివిధ రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకుందని సమాచారం. అలాగే సంస్థకు చెందిన పలు బాండ్లను కూడా అవసరాల నిమిత్తం తనఖా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కార్మికులు, ఉద్యోగులకు కనీసం వేతనాలు చెల్లించడానికి కూడా యాజమాన్యం ముప్పుతిప్పలు పడాల్సిన దుస్థితి పట్టింది. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణ అంత సులువైన పని కాదని ఉన్నతాధికారులకు తేలిపోయింది. అందుకే ఎన్నికలకు సాహసించడం లేదని నాయకులు కరాఖండిగా చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏడాదైనా ఎన్నికలకు ముందుకొచ్చే పరిస్థితి లేకపోవచ్చన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. వివిధ హామీలతోనే పరేషాన్..! ఆర్థిక పరమైన అంశాలను పక్కన పెడితే.. వివిధ కారణాల రీత్యానూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియపై ఆచీతూచీ అడుగేస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. సీఎంగా బాధ్యతలు చేపట్టాక కేసీఆర్ తొలుత సింగరేణి సంస్థపై అనేక వరాలు కురిపించారు. సంస్థలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని, 25 కొత్త బొగ్గు బ్లాకులు తెరిపిస్తామని, కొత్త భూగర్భగనులు ప్రారంభించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అప్పట్లో ప్రకటించారు. ఇవేవీ ఆచరణలో పెట్టలేదన్న అపవాదు ప్రభుత్వంపై ఉంది. కారుణ్య నియామకాల తతంగం ఓ ఫార్స్‌గా నడుస్తున్నదన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. ఈ కారణాలతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు సుముఖంగా లేదని నాయకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో 65వేల మంది ఉన్న ఉద్యోగుల సంఖ్య నేడు 45 వేలకు చేరింది. కొత్త గనులు కనుచూపు మేరలోనూ లేకుండా పోయాయన్న వేదన కార్మికుల్లో, కార్మిక కుటుంబాల్లో రగులుతోంది. ఇప్పటికే ఆరు నెలల జాప్యం.. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ఇప్పటికే ఆరు నెలలు జాప్యం అయిపోయింది. 2017 అక్టోబర్ 5న జరిగినప్పటికీ టీబీజీకేఎస్‌లోని గ్రూపు తగాదాల కారణంగా గుర్తింపు సంఘ బాధ్యతల్ని ఆలస్యంగా చేపట్టింది. అక్టోబర్ 2017లో ఎన్నికలు జరిగితే 2018 ఏప్రిల్ 16న బాధ్యతలు తీసుకుంది. ఈ లెక్కన తీసుకున్నా ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఆరు నెలల జాప్యాన్ని అటు సింగరేణి యాజమాన్యం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శించాయి. ఆరు నెలలు ఆలస్యంగా బాధ్యతలు చేపట్టామని జాప్యం చేస్తున్నారా..? లేదంటే ఇరుపక్షాలపై ముసురుకుంటున్న విమర్శల నేపథ్యంలో పట్టనట్లు వ్యవహరిస్తున్నారా..? అనేది తేలాల్సి ఉంది. ఏదేమైనా ఎన్నికల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించడం తమకు మరిన్ని ఇబ్బందులను తెచ్చిపెట్టినట్లేనని కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. -
కందుకూరు పీఏసీఎస్ కమిటీ ఎన్నిక
కందుకూరు పీఏసీఎస్‌లో సాఫీగా కొనసాగిన తంతు హాజరైన పది మంది డైరెక్టర్లు కందుకూరు: కందుకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) చైర్మన్‌గా మండల కేంద్రానికి చెందిన మీర్ఖాన్పేట డైరెక్టర్ సరికొండ మల్లేష్, వైస్ చైర్మన్‌గా నేదునూరుకు చెందిన డైరెక్టర్ సర్గారి బాల్‌రెడ్డి ఎనిమిది మంది సభ్యుల మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో పీఏసీఎస్ పీఠాన్ని ఎట్టకేలకు టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నట్లయింది. గురువారం జరిగిన కార్యక్రమానికి డివిజనల్ కో ఆపరేటీవ్ అధికారి శ్రీనివాస్‌రావు, సబ్ డివిజన్ కో-ఆపరేటీవ్ అధికారి నర్సింహారెడ్డి ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. వారి సమక్షంలో మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నిక నిర్వహించగా చైర్మన్‌గా సరికొండ మల్లేష్‌ను లేమూరు డైరెక్టర్ కొండారెడ్డి ప్రతిపాదించగా కందుకూరు డైరెక్టర్ హరికిషన్‌రెడ్డి బలపర్చారు. వైస్ చైర్మన్‌గా సర్గారి బాల్‌రెడ్డిని ఆకులమైలారం డైరెక్టర్ జంగయ్య ప్రతిపాదించగా, దెబ్బడగూడ డైరెక్టర్ రాములు బలపర్చడంతో డైరెక్టర్లు యాదయ్య, బాల్‌రాజ్, లక్ష్మమ్మ, యాదమ్మ మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఇద్దరి ఎన్నిక సాఫీగా జరిగింది. అనంతరం వారిద్దరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్, వైస్ చైర్మన్ మాట్లాడుతూ.. తమ ఎన్నికకు కారణమైన ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో పాటు డైరెక్టర్లు, నాయకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సొసైటీ అభివృద్ధికి తమ శాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు. -
కొనసాగుతున్న హై డ్రామా!
అంతా అనుకున్నట్టే జరిగింది. టీడీపీ అర్బన్, రూరల్ జిల్లా అధ్యక్ష పదవుల ఎన్నిక వ్యవహారం హైడ్రామాను తలపించింది. అధ్యక్షుల ఎంపిక విషయంలో ఇన్చార్జి మంత్రి ఎదుట మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయగా, నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన అభిప్రాయ సేకరణ మొక్కుబడి తంతుగా సాగింది. ఒక దశలో జిల్లా పార్టీ ప్రాంగణంలోనే కార్యకర్తలు బాహాబాహీకి దిగడం పరిస్థితికి అద్దంపట్టింది. అర్బన్ జిల్లా వరకు ఒక నిర్ణయానికి వచ్చినప్పటికీ రూరల్ జిల్లా అధ్యక్ష ఎంపిక విషయంలో మాత్రం ఉదయం నుంచి రాత్రివరకు చర్చోపచర్చలు సాగించినా ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. చివరకు చేసేది లేక తుది నిర్ణయం అధిష్టానానికి వదిలేశారు. - అర్బన్ అధ్యక్షునిగా మరోసారి వాసుపల్లి - ప్రతిపాదించిన మెజార్టీ ఎమ్మెల్యేలు - రూరల్ అధ్యక్షునిపై కుదరని ఏకాభిప్రాయం - అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఆనంద్, ముత్తంశెట్టి - షీల్డ్ కవర్లో పేర్లు..నేడు అధికారిక ప్రకటన నేటి సాయంత్రం అధ్యక్షుల ఖరారు అభిప్రాయ సేకరణ ముగిసిన అనంతరం ఆదివారం రాత్రి మంత్రి యనమల రామకృష్ణుడు విలేకరులతో మాట్లాడారు. టీడీపీ నగర, జిల్లా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి నాయకులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకున్నామని, ఆ మేరకు కొన్ని పేర్లను పార్టీ అధిష్టానానికి పంపామని చెప్పారు. వీటని పార్టీ అధిష్టానం పరిశీలించి హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం పేర్లు వెల్లడిస్తుందని తెలిపారు. సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అర్బన్, రూరల్ జిల్లా కమిటీ ఎన్నికల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ముఖ్యంగా అధ్యక్ష పదవుల కోసం మంత్రులు గంటా-అయ్యన్న వర్గాల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు పరాకాష్టకు చేరుకుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలంతా ఎవరికి వారే యమునా తీరే అన్నటుగా వ్యవహరించడంతో పరిశీలకులకు తలనొప్పిగా మారింది. జిల్లా ఇన్చార్జి మంత్రి హోదాలో యనమల రామకృష్ణుడుకు ఈ ఎన్నికల నిర్వహణ సవాల్‌గా మారాయి. యనమలతో పాటు పరిశీలకులుగా కంభంపాటి రామ్మోహనరావు, ఎస్విఎస్ఎన్ వర్మలు నియోజక వర్గాల వారీగా వచ్చిన ఎమ్మెల్యేలు, నేతల నుంచి అభిప్రాయాలు సేకరించారు. అర్బన్ జిల్లా అధ్యక్ష ఎంపికలో ఒకటి రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నాయకులు విబేధించినా సిటీ పరిధిలోని మెజార్టీ ఎమ్మెల్యేలు ప్రస్తుత అధ్యక్షుడు, దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ను కొనసాగించాలనే ఏకాభిప్రాయానికి వచ్చారు. మంత్రి గంటా, మాజీ ఎంపీ ఎంవిఎస్ మూర్తి ఆశీస్సులతో అధ్యక్ష రేసులో నిలిచిన మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహ్మాన్ పేరు అభిప్రాయ సేకరణ లో ఎక్కడా వినిపించలేదు. సిటీ పరిధిలో తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మినహా మిగిలిన ఎమ్మెల్యేలంతా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సమావేశానికి వెలగపూడి అనుచరులు మాత్రం పీలా శ్రీనివాస్ పేరును ప్రతిపాదించినట్టు సమాచారం. మిగిలిన ఎమ్మెల్యేలంతా వాసుపల్లి అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. రూరల్ జిల్లా అధ్యక్ష ఎంపిక విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. రూరల్ ఎమ్మెల్యేల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మంత్రి అయ్యన్న స్థానికంగా మకాం వేస్తే ఇన్చార్జి మంత్రి హోదాలో కడప వెళ్లిన మంత్రి గంటా ఫోన్లో రాజకీయం నెరిపారు. జెడ్పీ చైర్పర్సన్ లాలం భవాని భర్త భాస్కర్‌ను గంటా ప్రతిపాదించగా మెజార్టీ ఎమ్మెల్యేలు భాస్కర్‌ను విభేదించారు. తాను బలపర్చిన భాస్కర్‌ను మెజార్టీ నేతలు వ్యతిరేకించడంతో అనూహ్యంగా తన అనుచరుడైన విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు కుమారుడు ఆడారి ఆనంద్ పేరును తెరపైకి తీసుకొచ్చారు. ఆనంద్‌ను పెందుర్తి, యలమంచలి, పాయకరావుపేట ఎమ్మెల్యేలు బలపర్చినట్టు తెలిసింది. అధ్యక్షుడ్ని మార్చాల్సి వస్తే ఆనంద్‌కు ఇవ్వాలని.. లేకుంటే గవిరెడ్డిని కొనసాగించాలని చోడవరం ఎమ్మెల్యే సూచించినట్టు చెబుతున్నారు. అనకాపల్లి ఎమ్మెల్యే కూడా రూరల్ జిల్లా అధ్యక్షుడ్ని మార్చాల్సిందేనని స్పష్టం చేశారు. పార్టీకి ఎమ్మెల్యేలు లేని మాడుగుల, అరకు, పాడేరు నియోజకవర్గానికి చెందిన సీనియర్లు మాత్రం గవిరెడ్డికు మద్దతు పలికినట్టు తెలిసింది. గంటా అనుచరుడైన అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేరును అనకాపల్లితో పాటు పలువురు ఎమ్మెల్యేలు ప్రత్యామ్నాయంగా సూచించినట్టు సమాచారం. కార్యకర్తల బాహాబాహీ అభిప్రాయాలు చెప్పిన తర్వాత బయటకొచ్చిన మాడుగుల కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. గవిరెడ్డికి వ్యతిరేకంగా రమణమ్మ అనే కార్యకర్త తన అభిప్రాయాన్ని చెప్పడంతో నేతలంతా ఆమెపై విరుచుకుపడ్డారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నువ్వు అభిప్రాయం చెప్పేందుకు ఎలా వచ్చావంటూ మండిపడ్డారు. ఈ దశలో కార్యాలయంలో ఎం జరుగుతుందో తెలియని గందర గోళ పరిస్థితి నెలకొంది. గవిరెడ్డి కోసం అయ్యన్న మంత్రాంగం : మంత్రి అయ్యన్న తన అనుచరుడైన గవిరెడ్డి కోసం మంత్రాంగం జరిపారు. తొలుత ఉదయం సర్క్యూట్ గెస్ట్‌హౌస్‌లో మంత్రి యనమలను కలిసి జిల్లా పరిస్థితిని వివరించిన అయ్యన్న ఆ తర్వాత అభిప్రాయసేకరణ పూర్తయ్యే వరకు కార్యాలయంలోనే మకాం వేసి మంత్రాంగం నెరిపారు. మధ్యాహ్నం ఎమ్మెల్యేలతో పరిశీలకులు కంభంపాటి, వర్మలు భేటీ కాగా, అయ్యన్నను స్వయంగా పిలిపించుకుని యనమల సుదీర్ఘంగా చర్చించారు. సిటీ అధ్యక్ష ఎన్నిక కొలిక్కి వచ్చినప్పటికీ రూరల్ అధ్యక్ష ఎన్నిక విషయంలో ఏకాభిప్రాయం కుదరక పోవడంతో రెండింటి ప్రకటన వాయిదావేయకతప్పలేదు. అర్బన్‌కు వాసుపల్లి గణేష్‌కుమార్, రూరల్‌కు గవిరెడ్డితో పాటు ఆనంద్, అవంతి శ్రీనివాసరావు, లాలం భాస్కర్ పేర్లను అధిష్టానానికి యనమల పంపారు. సోమవారం అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నట్టు పార్టీ వర్గాలు చెప్పాయి.