టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడిగా తుమ్మ శ్రీధర్‌రెడ్డి
జిల్లా టీయూడబ్ల్యూజే(ఐజేయూ) అధ్యక్షుడిగా తుమ్మ శ్రీధర్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల పరిశీల కుడు, సంఘం రాష్ట్ర ఉపాదక్షుడు కరుణాకర్ తెలిపారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నట్లు ఆయన చెప్పారు.
న్యూశాయంపేట : జిల్లా టీయూడబ్ల్యూజే(ఐజే యూ) అధ్యక్షుడిగా తుమ్మ శ్రీధర్‌రెడ్డిని ఏకగ్రీవం గా ఎన్నుకున్నట్లు ఎన్నికల పరిశీల కుడు, సంఘం రాష్ట్ర ఉపా««దl్యక్షుడు కరుణాకర్ తెలిపారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నట్లు ఆయన చెప్పారు. విభాగం కార్యదర్శిగా కంకణాల సంతోష్, కోశాధికారిగా సుధాకర్‌రావు ఎన్నికయ్యారన్నారు. వీరితో పాటు ఉపాధ్యక్షులు, జాయింట్ సెక్రెటరీలు, ప్రచార కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. జిల్లాకు చెందిన గుంటి విద్యాసాగర్‌ను రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యుడిగా తీసుకోవాలని నిర్ణయించామన్నారు. సమావేశంలో రాష్ట్ర పరిశీలకులు రాజేష్, గోపిరెడ్డి, సంపత్, జాతీయ, రాష్ట్ర నాయకులు దాస రి కృష్ణారెడ్డి, డి.రమేష్, వి.వెంకటరమణ, కె.కుమారస్వామి, యాదగిరి, నారాయణరెడ్డి, జి.మధు, బుచ్చిరెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల అధికారిగా దుర్గాప్రసాద్ వ్యవహరించారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని అధ్యక్షుడు టి.శ్రీధర్‌రెడ్డి ఈసందర్భంగా తెలిపారు. డెస్క్ జర్నలిస్ట్‌లతో పాటు, అర్హులైన అందరికి అక్రెడిటేషన్లు, ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు.