ఏకగ్రీవమైన వార్డులు
కందుకూరు: మండల పరిధిలోని మురళీనగర్ 6వ వార్డు, లేమూరు 3వ వార్డుకు నిర్వహిస్తున్న ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ శనివారంతో ముగిసింది. మురళీనగర్ నుంచి 6వ వార్డుకు వాంక్డావత్ లలిత మాత్రమే బరిలో ఉండటంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎంపీడీఓ అనూరాధ ప్రకటించారు. లేమూరు 3వ వార్డుకు నలుగురు రంగంలో ఉండగా మంచాల అంజమ్మ నామినేషన్ ఉపసంహరించుకుంది. దీంతో ముగ్గురు బరిలో నిలవడంతో అక్కడ ఎన్నిక అనివార్యమైయింది. పోటీలో ఉన్న మంచాల సునీతకు గ్యాస్‌స్టవ్, ముచ్చర్ల సంధ్యారాణికి హార్మోనియం, మంచాల భాగ్యమ్మకు విద్యుత్ స్తంభం గుర్తును కేటాయించారు. ఈనెల 8న ఎన్నిక జరగనుంది.
పెద్దేముల్ 4వ వార్డు ఏకగ్రీవం
పెద్దేముల్: మూడు రోజుల నుంచి ఉత్కంఠం రేపిన పెద్దేముల్ గ్రామ పంచాయతీ 4వ వార్డు ఎన్నిక ఏకగ్రీవమైంది. మొత్తం ముగ్గురు నిమినేషన్ వేశారు. శనివారం పడగళ్ల చంద్రమ్మ, దాసరి నర్సమ్మ విత్ డ్రా చేసుకోవడంతో నత్తి నర్సమ్మ ఏకగ్రీవంగా ఎంపికైనట్లు ఎన్నికల అధికారి రాములు తెలిపారు. అనంతరం నర్సమ్మకు నియామక పత్రాన్ని అందచేశారు. దీంతో టీఆర్‌ఎస్ గ్రామ, మండల నాయకులు నర్సమ్మను అభినందించారు.