ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్–ఇ– ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ చీఫ్‌గా గోహర్ అలీ ఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ ఎన్నికల గుర్తుగా ‘బ్యాట్’ కొనసాగాలంటే సంస్థాగత ఎన్నికలు జరపాల్సిందేనన్న ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఈ ఎన్నిక జరిగినట్లుగా భావిస్తున్నారు.
గోహర్ పేరును ఇమ్రాన్ ప్రతిపాదించారు. శనివారం జరిగిన ప్రత్యేక సమావేశంలో గోహర్(45) పార్టీ అధ్యక్ష పదవికి పోటీ లేకుండా ఎన్నికైనట్లు డాన్ పత్రిక తెలిపింది. తోషఖానా అవినీతి కేసు సహా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇమ్రాన్ సెప్టెంబర్ నుంచి జైలులో∙ఉన్నారు. అందుకే, సంస్థాగత ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేకపోయారు.
Comments
Please login to add a commentAdd a comment