మాస్కో: ఉక్రెయిన్‌తో యుద్ధం ఇప్పటికే దీర్ఘకాలిక పోరుగా మారిపోయిన నేపథ్యంలో ఆ దేశానికి పాశ్చాత్య దేశాల సాయానికి అడ్డుకట్టే వేసేందుకు అవసరమైతే అణు పరీక్షలు జరిపేందుకు రష్యా సిద్ధమవుతోందా? తాజా పరిణామాలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. అంతర్జాతీయ సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందానికి ఆమోదాన్ని వెనక్కు తీసుకునేందుకు ఉద్దేశించిన బిల్లుకు రష్యా పార్లమెంట్ డ్యూమా దిగువ సభ తుది ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన సమావేశంలో చట్టసభ సభ్యులంతా ఏకగ్రీవంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఇక ఆ బిల్లు వచ్చే వారం ఎగువ సభ అయిన ఫెడరేషన్ కౌన్సిల్ ముందుకు వెళ్లనుంది. 2000 నాటి ఈ ఒప్పందం నుంచి తప్పుకుంటామని పుతిన్ ఇటీవలే ప్రకటించడం తెల్సిందే. 1996లో తెరపైకి వచి్చన ఈ ఒప్పందం ఏ దేశమూ ప్రపంచంలో ఎక్కడా అణు దాడులు చేయకూడదు. అయితే ఈ ఒప్పందం పూర్తిస్థాయిలో అమల్లోకి రాలేదు. రష్యా మాత్రమే దీనికి పూర్తి ఆమోదం తెలిపింది. అమెరికా, భారత్, పాకిస్థాన్, ఉ.కొరియా తదితర దేశాలేవీ దీనికి ఆమోదం తెలపలేదు. రష్యా వీలైనంత త్వరగా మళ్లీ అణు పరీక్షలకు దిగి సత్తా చాటాలని ఆ దేశ రాజకీయ వర్గాల నుంచి పుతిన్‌పై ఒత్తిడి పెరిగిపోతోంది.
Comments
Please login to add a commentAdd a comment