nuclear test
-
బలహీనులకు అణ్వస్త్రాలే బలమా?
పశ్చిమాసియా ప్రస్తుత పరిణామాల సందర్భంలో బలహీనమైన దేశాలకు అణ్వస్త్రాలే బలమా అన్న ప్రశ్న ఉదయిస్తోంది. చైనా నుంచి అణ్వస్త్ర ప్రమాదం లేనట్లయితే భారతదేశం ఆత్మరక్షణ కోసం అణ్వస్త్రాలు తయారు చేసుకునేదా? భారత్ నుంచి అదే ప్రమాదం లేనట్లయితే పాకిస్తాన్ తన అస్త్రాలు ఉత్పత్తి చేసుకునేదా? అమెరికా, రష్యాల అణు ప్రమాదం లేని పక్షంలో చైనా గానీ, అమెరికా ప్రమాదం లేని స్థితిలో సోవియెట్ యూనియన్ గానీ అణ్వాయుధాలు చేసేవా? వియత్నాం వద్ద అణ్వాయుధ శక్తి ఉండి ఉంటే, మొదట ఫ్రాన్స్, తర్వాత అమెరికా ఆ చిన్న దేశాన్ని ఏళ్ళ తరబడి ధ్వంసం చేసేందుకు సాహసించేవా? సూటిగా అడగాలంటే, పాలస్తీనాకు అణ్వస్త్ర శక్తి ఉండినట్లయితే ఇజ్రాయెల్ ఈ తరహా యుద్ధానికి పాల్పడి ఉండేదా?బలహీనమైన దేశాలకు బలవంతుల నుంచి ఆత్మరక్షణకు అంతిమంగా అణ్వస్త్రాలే శరణ్య మవుతాయా అన్నది ఆలోచించదగ్గ ప్రశ్న. మరీ ముఖ్యంగా తక్కిన ప్రపంచం, ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలు ప్రేక్షక పాత్ర వహిస్తు న్నప్పుడు. బలహీనమైన దేశాలకు అణ్వస్త్రాలే బలమా, రక్షణా అని పశ్చిమాసియా ప్రస్తుత పరిణామాల సందర్భంలో చర్చించటానికి ముందు... ఇపుడు ఇండియా, పాకిస్తాన్, చైనా, రష్యాలు తమ అణ్వస్త్రాలను కవచంగా మార్చుకుని ఎంత భద్రతను అనుభవిస్తున్నాయో గమనించాలి. సూటిగా అడగాలంటే, పాలస్తీనాకు అణ్వస్త్ర శక్తి ఉండినట్లయితే ఇజ్రాయెల్ వంటి శక్తిమంతమైన దేశం గాజాలో గానీ, వెస్ట్ బ్యాంక్‌లో గానీ, తాజాగా లెబనాన్‌లో గానీ ఈ తరహా యుద్ధానికి పాల్పడి ఉండేదా? ఇరాన్ నాయకత్వాన్ని హతమార్చి మొత్తం పశ్చిమాసియా స్థితి గతులనే మార్చి వేయగలమనే ఇటీవలి హెచ్చరికలను ఒకవేళ ఇరాన్ ఇప్పటికే అణ్వాయుధాలు తయారు చేసుకుని ఉండినట్లయితే జారీ చేయగలిగేదా? ఈ ప్రశ్నలన్నింటి ఉద్దేశం ప్రపంచం అంతా అణ్వస్త్రాల మయం అయిపోవాలని సూచించటం కాదు. అవెంత వినాశనకరమైనవో అమెరికన్ల హిరోషిమా, నాగసాకి ప్రయోగాల అనుభవం తర్వాత ఎవరికీ చెప్పనక్కర లేదు. ఉద్దేశపూర్వకంగా కాకున్నా ప్రమాదవ శాత్తునో, ఏదైనా యాంత్రికపరమైన పొరపాటు వల్లనో ఏ అగ్రరాజ్య శిబిరం వైపు నుంచో అణు ప్రయోగం జరిగి మరుక్షణం ఎదుటి శిబిరం కూడా వాటిని ప్రయోగించటం జరిగితే పరిస్థితి ఏమిటని? అసలు అణ్వస్త్రాలు అన్నవే మొత్తం మానవాళికి ఒక భయంకర స్థితి అనటంలో ఎటువంటి సందేహాలు లేవు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధానికి, అణ్వస్త్ర దేశాల వద్ద గల అణ్వాయుధాల పరిమితికి, కొత్తగా అణు పరీక్షలపై నియంత్రణకు, రోదసీలో అస్త్రాల మోహరింపుపై నిషేధానికి అనేక ఒప్పందాలు జరిగాయి. కానీ వాటన్నింటి ఉల్లంఘనలు జరుగు తున్నాయన్నది గమనించవలసిన విషయం.పాలస్తీనా వంటి ఒక అతి చిన్న దేశం వద్ద, ఇరాన్ వంటి ఒక మధ్యమ స్థాయి దేశం వద్ద అణ్వస్త్ర శక్తి ఉండి ఉంటే, పాలస్తీనా సమస్య 1948లోనే పరిష్కారమయ్యేదని కాదనగలమా? అందుకు ఇజ్రాయెల్‌తో పాటు అమెరికన్ శిబిరం అంగీకరించేవని చెప్పలేమా? ఈ పరిణామాల మధ్య మరొకవైపు ఏమవుతున్నదో గమనించండి. ఇరాన్ వద్ద అణ్వస్త్రాల ఉత్పత్తికి తగిన సామర్థ్యంతోపాటు, అవస రమైన సామగ్రి అంతా ఉన్నది. కానీ అణ్వస్త్రాలు ఇస్లాంకు విరుద్ధమైన వని అంటూ వాటి తయారీని ఇరాన్ అధిపతి అలీ ఖమేనీ బహిరంగంగా నిషేధించారు. శాంతియుత వినియోగానికి మాత్రమేనని చెబుతూ వారు ఆ శక్తిని అభివృద్ధి పరుస్తున్నారు. దానిని కూడా సహించని అమెరికా ఇరాన్‌పై అనేక ఆంక్షలు విధించింది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అనేక తనిఖీలు జరిపింది. నెతన్యాహూ గత వారం ఒక రికార్డెడ్ వీడియో విడుదల చేశారు. అందులో రెండు గమనార్హమైన హెచ్చరికలున్నాయి. హమాస్, హిజ్బుల్లా తరహాలో ఇరాన్ నాయకత్వాన్ని కూడా అంతం చేసి ఇరాన్ ప్రజలను విముక్తం చేయగలమన్నది ఒకటి. మొత్తం పశ్చిమాసియాలో ఏ ప్రాంతం కూడా తమ శక్తికి అతీతమైనది కాదని, తాము క్రమంగా మొత్తంగానే ఆ ప్రాంతపు రూపును, స్థితిగతులను మార్చివేయనున్నా మనేది రెండోది.దీనంతటి మధ్య మరొక గమనించదగ్గ ఘటన చోటు చేసుకుంది. ఇరాన్‌లోని సెమ్నాన్ ప్రాంతంలో కొద్ది రోజుల క్రితం 4.4 మాగ్ని ట్యూడ్తో భూకంపం సంభవించింది. దాని ప్రభావంతో ఆ ప్రాంతంలోని అరదాన్ పట్టణంతో పాటు టెహరాన్ నగరంలోని ఒక భాగంలో కూడా ప్రకంపనలు వచ్చాయి. ఇంతకూ అది నిజంగా భూకంపమా లేక భూగర్భ అణ్వస్త్ర ప్రయోగ ఫలితమా అన్న చర్చలు బయటి ప్రపంచంలో సాగుతున్నాయి. పాశ్చాత్య నిఘా సంస్థలు కూడా ఇంతవరకు నిర్ధారణగా ఏమీ చెప్పలేదు. సెమ్నాన్ ప్రాంతానికి సమీపంలోనే ఇరాన్ అణుశక్తి పరీక్షల ప్రధాన కేంద్రాలైన నాతాంజ్, ఫొర్దోవ్లు ఉండటం గమనించదగ్గది. ఒకవేళ రహస్యంగా అణ్వస్త్ర పరీక్షలు జరిగి ఉంటే భూప్రకంపనలు రావటం సహజం. భారత ప్రభుత్వం రాజ స్థాన్ ఎడారిలోని పొఖారణ్ వద్ద పరీక్షలు నిర్వహించినప్పుడు ఇదే జరిగింది. ఒకవేళ ఇరాన్ పరీక్షలు నిజమనుకుంటే, దేశాధిపతి తన నిషేధాన్ని సడలించి ఉంటారా అన్నది ఒక ప్రశ్న. ఇజ్రాయెల్ హెచ్చరి కలతో నాయకుల ప్రాణాలు, దేశ రక్షణ ప్రమాదంలో పడినపుడు, బయటకు చెప్పకుండా ఎందుకు సడలించరాదన్నది మరొక ప్రశ్న. మరొకవైపు, పోయిన ఆగస్టు చివరలో ఖమేనీ తమ ప్రధానికి ఒక ఆదేశాన్ని బహిరంగంగా ఇచ్చారు. ఒకవేళ తాము అణ్వస్త్రాలు ఉత్పత్తి చేయరాదంటే తమకు ఎటువంటి రక్షణలు కల్పించగలరో, పశ్చిమా సియాలోని వివిధ పరిస్థితుల గురించి ఏమి హామీలివ్వగలరో బైడెన్‌తో చర్చించాలని! అటువంటి చర్చలు ఇంతవరకేమీ జరగలేదు గానీ ఈ లోపల యుద్ధ రీత్యా అనేక పరిణామాలు చోటు చేసుకుంటూ పరిస్థితి దాదాపు చేయి దాటింది. వచ్చే నెల అమెరికా ఎన్నికలు న్నాయి. ఈ దశలో ఇక అటువంటి చర్చలకు అవకాశం లేదు. ఎన్ని కలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడే సరికి ఇక్కడ గాజా, లెబనాన్, ఇరాన్లలో ఏమైన జరగవచ్చు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని ఇరాన్ నాయకత్వం తమ అణు విధానాన్ని రహస్యంగా సడలించు కున్నదేమో తెలియదు.ఇంతకూ ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేయాలని ఇజ్రా యెల్ నిర్ణయించినా ఆ పని ఎంతవరకు సాధ్యమనే ప్రశ్న కూడా ఒకటున్నది. ఆ కేంద్రాలు ఇరాన్ తూర్పు ప్రాంతంలో ఏదో ఒక చోట కాకుండా విస్తరించి ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి నాతాంజ్, ఫొర్దోవ్లు. వాటి పరిశోధనాగారాలు భూగర్భంలో చాలా లోతున దుర్భేద్యమైన రక్షణలో ఉన్నాయి. ఇవన్నీ ఇజ్రాయెల్ నుంచి వెయ్యి మైళ్ళకు పైగా దూరం. అంతవరకు వచ్చి దాడి చేయాలంటే సుమారు వంద యుద్ధ విమానాలు అవసరమని, అవి ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలను, యుద్ధ విమానాల ఎదురుదాడులను దాటుకుంటూ రావాలన్నది అమెరికాయే ఒకప్పుడు వేసిన అంచనా. ఇది ఒక సమస్య అయితే, ఎంతో లోతున గల అణు కేంద్రాలను దెబ్బతీసే శక్తి అమెరి కన్ బంకర్ బస్టర్లకు తప్ప ఇజ్రాయెల్‌కు లేదు. మరి అమెరికా ఆ సహాయం చేస్తుందా? దీనంతటిలో అనిశ్చితి ఉంది. ఒకవేల పరిస్థి తులు ఇరాన్ ఆశించినట్లుగానే లేనట్లయితే? అందుకే ఇరానియన్ రిపబ్లిక్ అధికారులు, రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్లు ఇటీవల, పరిస్థి తులు ఈ విధంగానే కొనసాగితే తమ సైనిక రక్షణ విధానాన్ని మార్చు కొనక తప్పదని తరచూ ప్రకటిస్తున్నారు.ఇదంతా ఏమి చెప్తున్నది? మొదటి నుంచి కూడా బలవంతులదే రాజ్యం అన్నట్లు ఉన్న ప్రపంచ పరిస్థితులు ఇప్పటికీ అదే విధంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ సంస్థలు, చర్చలు, ఒప్పందాల వంటివన్నీ బలవంతుల ఉల్లంఘనలకు గురవుతున్నాయి. ఆయుధ బలం, ధన బలం మాత్రమే రాజ్యమేలుతున్నాయి. న్యాయాన్యాయాలు, ధర్మాధర్మాలు, నీతి అవినీతుల ప్రసక్తే లేదు. అణ్వస్త్రాల మాట కూడా అందులో భాగమే. అంతెందుకు, జపాన్ వద్ద బాంబులు ఉండినట్ల యితే వారిపై మొదటి అణ్వస్త్ర ప్రయోగం జరిగేదా? ఇప్పుడు ఉత్తర కొరియా వద్ద అవి ఉన్నందుకే గదా అమెరికా వెనుకాడుతున్నది? ఉక్రెయిన్ యుద్ధంలో అణుప్రయోగ ప్రస్తావనలు ఎందుకు వస్తున్నాయి? ఇట్లా చెప్తూ పోవాలంటే రెండవ ప్రపంచ యుద్ధానంతర కాలంలో అనేక ఉదాహరణలున్నాయి. అందువల్లనే, బలహీన దేశాల రక్షణకు అణ్వస్త్రాలే బలమా అనే ప్రశ్న వస్తున్నది. అదెంత ప్రమాద కరమైనది, అవాంఛనీయమైనది అయినా. చర్చకోసం.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
అణు డ్రోన్‌ను పరీక్షించిన ఉత్తరకొరియా
సియోల్: ఉత్తరకొరియా అణ్వాయుధాల సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. తాజాగా పశ్చిమ సముద్ర జలాల్లో అణు దాడి చేసే సామర్థ్యమున్న డ్రోన్‌ను పరీక్షించినట్లు శుక్రవారం ప్రకటించింది. పోర్టులు, యుద్ధ నౌకలను ధ్వంసం చేసే సామర్థ్యం ఈ డ్రోన్‌కు ఉందని తెలిపింది. దక్షిణ కొరియా, అమెరికా, జపాన్‌లు కలిసి ఈ వారంలో జెజు దీవికి సమీపంలో చేపట్టిన భారీ సైనిక విన్యాసాలకు స్పందనగానే తామీ పరీక్ష జరిపినట్లు చెప్పుకుంది. గత ఏడాది మొదటిసారిగా ఈ డ్రోన్‌ను పరీక్షించినట్లు తెలిపింది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెంచుతూ రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తే తీవ్ర పర్యవసానాలుంటాయని హెచ్చరించింది. -
The Reverse Swing: Colonialism to Cooperation: పీవీ నుంచి వాజ్‌పేయీకి రహస్య చీటీ!
న్యూఢిల్లీ: దిగ్గజ నేత అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సమయంలో మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత పీవీ నరసింహా రావు ఆయనకు ఓ చీటీ అందించారని తాజాగా విడుదలైన ఒక పుస్తకం ద్వారా వెల్లడైంది. వివరాల్లోకి వెళ్తే.. వాజ్‌పేయీ ప్రధానిగా కొనసాగిన కాలంలో అంటే 1998–2004 కాలంలో అశోక్ టాండన్ అనే అధికారి ప్రధానమంత్రి కార్యాలయంలో మీడియా వ్యవహారాల ఇన్చార్జ్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన రాసిన ‘ది రివర్స్ స్వింగ్: కలోనియలిజం టు కోఆపరేషన్’ అనే పుస్తకంలో ఇటీవల విడుదలైంది. దానిని పెట్రోలియం, సహజవాయు, గృహ, పట్టణవ్యవహారాల కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ ఢిల్లీలో ఆవిష్కరించారు. ఆ పుస్తకంలో మాజీ ప్రధాని వాజ్‌పేయీ గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలను టాండన్ పంచుకున్నారు. రాష్ట్రపతిభవన్‌లో ప్రమాణస్వీకారం వేళ వాజ్‌పేయీ ప్రధానమంత్రి పదవి చేపట్టినపుడు అదే సమయంలో అక్కడే ఉన్న మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు ఒక చీటీని వాజ్‌పేయీకి రహస్యంగా అందించారు. ‘అంసంపూర్తిగా మిగిలిపోయిన ఒక పనిని మీరు పూర్తిచేయాలి’ అని ఆ చీటిలో రాసి ఉందట. 1996 సంవత్సరంలో ఈ ఘటన జరిగిందని పుస్తకంలో పేర్కొన్నారు. ‘ పీవీ తాను ప్రధానిగా కొనసాగిన కాలంలో అమెరికా నుంచి తీవ్ర ఒత్తిళ్ల కారణంగా అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించలేకపోయారు. ఆ బాధ్యతలను పీవీనే స్వయంగా వాజ్‌పేయీకి అప్పగించి ఉంటారు’ అని ఆ పుస్తకంలో టాండర్ రాసుకొచ్చారు. 1996లో వాజ్‌పేయీ ప్రధాని పదవి చేపట్టడం 13 రోజులకే ప్రభుత్వం కూలడం, 1998లో ప్రధాని పగ్గాలు చేపట్టి విజయవంతంగా ఐదేళ్ల పాలన వాజ్‌పేయీ పూర్తిచేసుకోవడం తెల్సిందే. 1996లో అణుపరీక్షలకు ప్రయతి్నంచి విఫలమైన ప్రభుత్వం 1998లో పోఖ్రాన్లో విజయవంతంగా పూర్తిచేసి అమెరికాను సైతం విస్మయానికి గురిచేసిన సంగతి తెల్సిందే. రాష్ట్రపతి పదవి తిరస్కరణ! 2002 సంవత్సరంలో ప్రధాన మంత్రిగా దిగిపోయి రాష్ట్రపతి పదవి చేపట్టాలని వాజ్‌పేయీకి సూచనలు వచ్చాయని, కానీ వాజ్‌పేయీ అందుకు ససేమిరా అన్నారని పుస్తకంలో ఉంది. ప్రధానిగా వాజ్‌పేయీ దిగిపోతే ఆ బాధ్యతలు అద్వానీకి అప్పగించాలని చూశారని పేర్కొన్నారు. ‘ ప్రధానిగా ఉన్న వ్యక్తి వెంటనే రాష్ట్రపతి పదవి చేపడితే అది ప్రజాస్వామ్య దేశానికి ఎంతమాత్రం మంచిదికాదు. పరిణామాలు దారుణంగా ఉంటాయి’ అని తన తోటి మంత్రులతో వాజ్‌పేయీ అన్నారట. 1996 తర్వాత మెజారిటీ ప్రభుత్వం అమెరికాకు నచ్చలేదట పుస్తకంలో పీవీ ఆలోచనలనూ పొందుపరిచారు. ‘ 1996 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇండియాలో పటిష్టమైన ప్రభుత్వం ఏర్పడటం అమెరికాకు ఇష్టంలేదట. వాజ్‌పేయీ ప్రధాని కావడం అమెరికాకు ఇష్టం లేదనుకుంటా. వాజ్‌పేయీ ముక్కుసూటి తనం, ఆయన వ్యవహార శైలి చూస్తుంటే ఆయన అణుపరీక్షలకు పచ్చజెండా ఊపేలా ఉన్నారని అమెరికా ప్రభుత్వానికి ఢిల్లీలోని ఆ దేశ రాయబారి సమాచారం చేరవేశారు’ అని పీవీ అప్పట్లో అన్నట్లు పుస్తకంలో పేర్కొన్నారు. -
మళ్లీ అణు పరీక్షల బాటలో రష్యా!
మాస్కో: ఉక్రెయిన్‌తో యుద్ధం ఇప్పటికే దీర్ఘకాలిక పోరుగా మారిపోయిన నేపథ్యంలో ఆ దేశానికి పాశ్చాత్య దేశాల సాయానికి అడ్డుకట్టే వేసేందుకు అవసరమైతే అణు పరీక్షలు జరిపేందుకు రష్యా సిద్ధమవుతోందా? తాజా పరిణామాలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. అంతర్జాతీయ సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందానికి ఆమోదాన్ని వెనక్కు తీసుకునేందుకు ఉద్దేశించిన బిల్లుకు రష్యా పార్లమెంట్ డ్యూమా దిగువ సభ తుది ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన సమావేశంలో చట్టసభ సభ్యులంతా ఏకగ్రీవంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆ బిల్లు వచ్చే వారం ఎగువ సభ అయిన ఫెడరేషన్ కౌన్సిల్ ముందుకు వెళ్లనుంది. 2000 నాటి ఈ ఒప్పందం నుంచి తప్పుకుంటామని పుతిన్ ఇటీవలే ప్రకటించడం తెల్సిందే. 1996లో తెరపైకి వచి్చన ఈ ఒప్పందం ఏ దేశమూ ప్రపంచంలో ఎక్కడా అణు దాడులు చేయకూడదు. అయితే ఈ ఒప్పందం పూర్తిస్థాయిలో అమల్లోకి రాలేదు. రష్యా మాత్రమే దీనికి పూర్తి ఆమోదం తెలిపింది. అమెరికా, భారత్, పాకిస్థాన్, ఉ.కొరియా తదితర దేశాలేవీ దీనికి ఆమోదం తెలపలేదు. రష్యా వీలైనంత త్వరగా మళ్లీ అణు పరీక్షలకు దిగి సత్తా చాటాలని ఆ దేశ రాజకీయ వర్గాల నుంచి పుతిన్‌పై ఒత్తిడి పెరిగిపోతోంది. -
‘ఆపరేషన్ శక్తి’ సాగిందిలా!
పోఖ్రాన్ పరీక్షలు.. భారతదేశం తన అణు పాటవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన సందర్భమది. తొలిసారి 1974లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో పోఖ్రాన్–1 పేరిట ‘స్మైలింగ్ బుద్ధ’ అనే కోడ్‌తో అణు పరీక్షలు నిర్వహించగా, 1998లో ప్రధాని వాజ్‌పేయి ఆదేశాలతో ఆపరేషన్ శక్తి(పోఖ్రాన్–2) పేరుతో అణు పరీక్షలు నిర్వహించారు. కానీ 1974తో పోల్చుకుంటే 1998లో అణు పరీక్షల నిర్వహణకు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. అమెరికా నిఘా సంస్థ సీఐఏకు చెందిన శక్తిమంతమైన ఉపగ్రహాలు ఈ ప్రాంతంలో నిఘా పెట్టడంతో వ్యూహాత్మకంగా వాటిని బురిడీ కొట్టిస్తూ అధికారులు పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. పోఖ్రాన్–2 అణు పరీక్షలు జరిపి 20 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ ఆపరేషన్‌లో కీలకంగా వ్యవహరించిన 58వ ఇంజనీరింగ్ రెజిమెంట్ కమాండర్ కల్నల్ (రిటైర్డ్) గోపాల్ కౌశిక్ , చేతన్ కుమార్‌లను టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూ చేసింది. నాటి ఆపరేషన్ సందర్భంగా తీసుకున్న జాగ్రత్తలపై తమ అనుభవాలను వీరిద్దరూ మీడియాతో పంచుకున్నారు. ఎన్నో జాగ్రత్తలు.. ఈ విషయమై కల్నల్ గోపాల్ కౌశిక్ మాట్లాడుతూ.. ‘1974తో పోల్చుకుంటే 1998లో ఆపరేషన్ శక్తి సందర్భంగా భారత్ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చి ంది. ఎందుకంటే తొలిసారి అణు పరీక్షలు నిర్వహించినప్పుడు భారత్ సామర్థ్యం, ఉద్దేశం గురించి ఎవ్వరికీ తెలియదు. అలాగే అణు బాంబును ఎక్కడ పరీక్షిస్తున్నారో ఎవ్వరికీ తెలియదు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు దేశాల కార్యకలాపాలపై దృష్టి సారించేందుకు అవసరమైనన్ని ఉపగ్రహాలు అమెరికా వద్ద అప్పట్లో లేవు. కానీ 1998 నాటికి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఎందుకంటే 1995–96లో భారత్ అణు పరీక్షలకు రహస్యంగా చేస్తున్న ఏర్పాట్లు బయటకు పొక్కడంతో అమెరికా సహా అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి ఎదురైంది. దీంతో పరీక్షల్ని తాత్కాలికంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అంతేకాకుండా పోఖ్రాన్ గురించి ప్రపంచం మొత్తానికి తెలియడంతో శక్తిమంతమైన అమెరికా నిఘా ఉపగ్రహాలు ఈ ప్రాంతంపై ఎప్పుడూ తిరుగుతూనే ఉండేవి’ అని తెలిపారు. ఎదురైన సవాళ్లు ఎన్నో.. అణు పరీక్షల ఏర్పాట్ల సందర్భంగా ఎదురైన ప్రతికూల పరిస్థితులపై కౌశిక్ స్పందిస్తూ.. ‘ఈ పరీక్షల ఏర్పాట్లలో శాస్త్రవేత్తలు, అధికారులకు వాతావరణం ప్రధాన సవాలుగా నిలిచింది. వేసవిలో ఇక్కడ ఉష్ణోగ్రత 51 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటే శీతాకాలంలో ఉష్ణోగ్రత మైనస్ 3 డిగ్రీలకు పడిపోయేది. అంతేకాకుండా ఈ ప్రాంతమంతా విషపూరితమైన పాములు, తేళ్లు ఉండేవి. దీంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చేది. దీంతోపాటు అణు బాంబుల్ని భూమిలోపల అమర్చేందుకు తవ్విన ఆరు గుంతల్లో నీటి ధార రావడం మరో తలనొప్పిగా మారింది. విపరీతమైన వేడి ఉన్న ఈ ప్రాంతంలో వర్షపు కోట్ ధరించి అణు బాంబును అమర్చేందుకు తవ్విన గుంతల్లో దిగి పనిచేయడం శాస్త్రవేత్తలు, సైనికులకు ఇబ్బందికరంగా తయారైంది. అలాగే వీటిలో అమర్చిన లోహపు పరికరాలు నీటి ప్రభావంతో తుప్పుపట్టడం మొదలుపెట్టాయి. దీంతో నీటిని బయటకు తోడేద్దామని తొలుత అనుకున్నాం. అయితే నీటి ప్రభావంతో మారిపోయే ఇసుక రంగును, అక్కడ మొలిచే పచ్చికను సైతం విదేశీ నిఘా ఉపగ్రహాలు గుర్తించే వీలు ఉండటంతో మరో మార్గాన్ని అన్వేషించాం. దూరంగా ఉన్న ఇసుకలో పైపుల్ని లోతుగా పూడ్చి వాటిద్వారా నీటిని పంపింగ్ చేసేవాళ్లం. దీంతో పైకి కన్పించకుండానే నీళ్లు పూర్తిగా ఇంకిపోయేవి’ అని అన్నారు. ‘తవ్విన గుంతల్లో అణు బాంబుల్ని అమర్చిన అనంతరం వాటిని ఇసుక బస్తాలతో నింపడం మరో సవాలుగా నిలిచింది. ఇసుక బస్తాలను పైనుంచి విసిరేస్తే అణు బాంబులు దెబ్బతినే ప్రమాదం ఉండటంతో పరిష్కారం కోసం శాస్త్రవేత్తలు, అధికారులు చురుగ్గా ఆలోచించారు. ఓ జాలీ లాంటి పరికరంతో బ్యాగుల్ని జారవిడిచే అంశాన్ని పరిశీలించారు. కానీ ఇలా 6,000 ఇసుక బస్తాలను జారవిడిచేందుకు వారం పట్టే అవకాశం ఉండటంతో ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు. చివరికి బిలియర్డ్స్ ఆటలో వినియోగించే క్యూ స్టిక్స్‌తో సరికొత్త ఆలోచన వచ్చింది. గుంతల్లో పైపుల్ని ఒకదానిపక్కన మరొకటి అమర్చిన అధికారులు, వాటిపై ఇసుక బస్తాలను జారవిడిచారు. ఈ వ్యూహం పనిచేయడంతో ఏర్పాట్లు పూర్తిచేసి 1998 మే 11 నుంచి 13 మధ్య ఐదు అణు పరీక్షల్ని విజయవంతంగా నిర్వహించాం’ అని తమ అనుభవాలను పంచుకున్నారు. పగలు క్రికెట్.. రాత్రి ఏర్పాట్లు ‘అమెరికా నిఘా ఉపగ్రహాల్ని పక్కదారి పట్టించేందుకు వినూత్నంగా ఆలోచించాం. పోఖ్రాన్ ప్రాంతంలో ఆర్మీ అధికారులు, శాస్త్రవేత్తలు పగటిపూట క్రికెట్ ఆడేవారు. దీంతో చుట్టుపక్కల ఉండే జనాలు బాగా గుమిగూడేవారు. జనసంచారం ఉండటంతో విదేశీ నిఘా వర్గాలు పోఖ్రాన్లో రహస్య కార్యకలాపాలు జరుగుతున్నాయని ఎంతమాత్రం అనుమానించలేదు. సాధారణ సైనికులే అక్కడ ఉన్నారని భావించాయి. కేవలం రాత్రిపూట మాత్రమే ప్రయోగ పనుల్ని చేపట్టేవారు. అణుశక్తి కమిషన్ మాజీ చైర్మన్ ఆర్.చిదంబరం, బార్క్ మాజీ చీఫ్ అనీల్ కకోద్కర్, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం సహా 100 మంది శాస్త్రవేత్తలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. శాస్త్రవేత్తల కదలికల్ని నిఘా ఉపగ్రహాలు గుర్తించకుండా వారందరూ సైనిక దుస్తులు ధరించేవారు. అబ్దుల్ కలామ్‌ను మేజర్ జనరల్ పృథ్వీరాజ్ అని, చిదంబరాన్ని మేజర్ నటరాజ్‌గా వ్యవహరించేవారు’ అని కౌశిక్ చెప్పారు. -
భారత్ శక్తిని చాటిచెప్పిన రోజది..
సాక్షి, సినిమా : భారత్ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన సంఘటన అది. భారీ ఎత్తున అంతర్జాతీయ ఒత్తిళ్లు ఉన్నా తలొగ్గక దేశానికి అణు సామర్ధ్యాన్ని సాధించుకున్న పోఖ్రాన్ అణు పరీక్షలపై నిర్మించిన చిత్రం పరమాణు-ది స్టోరీ ఆఫ్ పోఖ్రాన్. సహనిర్మాతల న్యాయపోరాటాల అనంతరం ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. పరమాణులో జాన్ అబ్రహం కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను యూనిట్ గురువారం విడుదల చేసింది. భారత తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ స్వతంత్రం అనంతరం జాతిని ఉద్దేశించి ‘ట్రైస్ట్ విత్ డెస్టినీ’ అనే పేరుతో చేసిన ప్రసంగంతో టీజర్ ప్రారంభం అవుతుంది. బొమన్ ఇరానీ వాయిస్ ఓవర్‌తో భారత్ ఘనతలను వరుసగా చూపించారు. 1998లో ‘ఆపరేషన్ శక్తి’ పేరుతో పోఖ్రాన్లో జరిపిన అణు పరీక్షలను పూర్తి చేయడంలో కీలకంగా ఉన్న ఆర్మీ ఆఫీసర్‌గా జాన్ అబ్రహం కనిపించారు. అభిషేక్ శర్మ దర్శకత్వం వహించిన పరమాణు వచ్చే నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
`పరమాణు-ది స్టోరీ ఆఫ్ పోఖ్రాన్' మూవీ టీజర్
-
షాకింగ్: 'అణు' పేలుడు.. 200 మంది మృతి!
ప్రపంచ దేశాల హెచ్చరికలు బేఖాతరు చేస్తూ.. ఉత్తర కొరియా ఇటీవల హైడ్రోజన్ బాంబును పరీక్షించిన సంగతి తెలిసిందే. హైడ్రోజన్ బాంబు పరీక్ష సందర్భంగా సమీపంలోని ఓ సొరంగం కుప్పకూలి.. 200 మంది చనిపోయినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉత్తర కొరియా ఈశాన్య ప్రాంతమైన పంగ్యే-రీ ప్రాంతంలో గత నెల కిమ్ జాంగ్ ఉన్ సర్కారు హైడ్రోజన్ అణుబాంబు పరీక్షించింది. కొరియా చేపట్టిన ఆరో అణ్వాయుధ పరీక్షల్లో భాగంగా సెప్టెంబర్ 3న దాదాపు వందకిలోల హైడ్రోజన్ బాంబ్‌ను పేల్చింది. అత్యంత శక్తిమంతమైన ఈ పేలుడు ధాటికి ఆ దేశం పెద్ద మూల్యమే చెల్లించుకుంది. పేలుడు ధాటికి పరీక్ష జరిగిన ప్రాంతమంతా తీవ్ర ప్రభావానికి లోనై.. సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ సొరంగం కుప్పకూలిందని జపాన్‌కు చెందిన ఆసహి టీవీ చానెల్ తెలిపింది. ఈ ప్రమాదంలో సొరంగం నిర్మాణంలో పాలుపంచుకుంటున్న వందమంది కార్మికులు చనిపోయారని మొదట భావించారని, కానీ, సహాయక చర్యలు ముగిసిన తర్వాత మృతుల సంఖ్య 200కు చేరుకుందని తేలిందని కొరియా వర్గాలను ఉటంకిస్తూ ఆ చానెల్ వెల్లడించింది. 1945లో హిరోషిమాపై అమెరికా వేసిన అణుబాంబు కంటే ఏడురెట్లు పెద్దదైన ఈ హైడ్రోజన్ బాంబు పరీక్ష వల్ల అక్కడి భూభాగం మెత్తబడి ఈ ప్రమాదం చోటుచేసుకొని ఉంటుందని భావిస్తున్నారని ఆ చానెల్ పేర్కొంది. అత్యంత శక్తివంతమైన ఈ హైడ్రోజన్ బాంబు పేలుడుతో ఆ ప్రాంతంలోని పర్వతం అడుగుభాగంలో 60 నుంచి 100 మీటర్ల అగ్నిగుండం ఏర్పడిందని కొరియా వాతావరణశాఖ ఇప్పటికే వెల్లడించింది. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో మరిన్ని అణుబాంబు పరీక్షలు నిర్వహిస్తే.. వాతావరణంలోకి రేడియోధార్మిక కణాలు లీక్ అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. -
ఉ.కొరియా ‘అణు భూకంపం’?
-
ఉ.కొరియా ‘అణు భూకంపం’?
బీజింగ్: ఉత్తరకొరియాలోని అణు పరీక్ష కేంద్రం సమీపంలో 3.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అమెరికాకు చెందిన భూకంప శాస్త్రవేత్తలు వెల్లడించారు. అణు పరీక్ష కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలోనే ఈ భూకంపం సంభవించిందని అమెరికా జియోలాజికల్ సర్వే తేల్చింది. ‘అణు పరీక్షలు జరిపిన ప్రాంతంలోనే భూకంపం సంభవించింది. అది సహజ భూకంపమా, పరీక్షల కారణంగా వచ్చిన భూకంపమా అనేది ధ్రువీకరించలేం’ అని తెలిపింది. ‘అనుమానాస్పద పేలుడు’ వల్లే ఈ భూకంపం సంభవించినట్లు చైనా భూకంప నెట్వర్క్ కేంద్రం తెలిపింది. అయితే దక్షిణ కొరియా మాత్రం దీన్ని విభేదిస్తూ సహజ భూకంపమేనని పేర్కొంది. -
అణు పరీక్షలు జరిపిన ఉత్తరకొరియా
-
అణు పరీక్ష.. ఐరాస ఎమర్జెన్సీ మీటింగ్
సాక్షి, వాషింగ్టన్: ఉత్తర కొరియా అణు పరీక్ష నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి స్పందించింది. సోమవారం ఉదయం 10 గంటలకు భద్రతా మండలి అత్యవసరంగా భేటీ అయ్యింది. ఖండాత్గర క్షిపణి పేరిట కిమ్ జంగ్ నియంతృత్వ ప్రభుత్వం హైడ్రోజన్ బాంబును పరీక్షించిన విషయం తెలిసిందే. వణికిన ఉత్తర కొరియా ఈ మేరకు ఐరాస రాయబారి నిక్కీ హలె తన ట్విట్టర్ లో భేటీ అంశాన్ని ధృవీకరించారు. అమెరికాతోపాటు జపాన్, ఫ్రాన్స్; యూకే, దక్షిణ కొరియాలు భేటీలో పాల్గొని ఉత్తర కొరియా అణు పరీక్ష పై చర్చించనున్నట్లు ఆమె తెలిపారు. తమతోపాటు మిత్రపక్షాల జోలికి వస్తే భారీ సైనికచర్యకు దిగాల్సి ఉంటుందని అమెరికా సైన్యాధికారి జేమ్స్ మట్టిస్ తీవ్రంగా హెచ్చరించారు కూడా. ఇంకోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉ.కొ. ఓ మూర్ఖపు దేశమంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆరోసారి అణు పరీక్షలను నిర్వహించిన ఉత్తర కొరియాపై ప్రపంచ దేశాలన్నీ మండిపడుతున్నాయి. భారత్ కూడా తీవ్ర స్థాయిలో మండిపడింది. అణ్వాయుధాల విషయంలో అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించి ఉ.కొ. పెద్ద తప్పు చేసిందంటూ భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన వెలువరించింది కూడా. ప్రస్తుతం బ్రిక్స్ సమావేశంలో ఈ అంశం హాట్ హాట్‌గా మారింది. ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలు విధించాల్సిందేనని భద్రతా మండలికి బ్రిటీష్ ప్రధాని థెరెసా విజ్ఞప్తి చేస్తుండగా, అవి ఎలాంటి ప్రభావం చూపబోవంటూ రష్యా పరోక్షంగా ఉత్తర కొరియాకు మద్ధతునిస్తూ వస్తోంది. -
ఆరోసారి ఉత్తర కొరియా అణు పరీక్షలు
-
ఆరోసారి అణు పరీక్షలు
వెనక్కి తగ్గని ఉత్తర కొరియా టోక్యో: అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, చైనా నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతున్నా ఉత్తరకొరియా ఆరోసారి అణు పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఆరో అణు పరీక్షను విజయవంతంగా పూర్తి చేశామని, ఈసారి అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ బాంబును పరీక్షించామని ఉత్తరకొరియా ఆదివారం ప్రకటించింది. తాజాగా నిర్వహించిన ప్రయోగం పరిపూర్ణ విజయం సాధించినట్టు వెల్లడించింది. ఈ అణు పరీక్ష వాస్తవిక సామర్థ్యం ఎంత అనేదానిపై స్పష్టత రాలేదు. దక్షిణకొరియా వాతావరణ ఏజెన్సీ మాత్రం ప్రస్తుత ప్రయోగం వల్ల వచ్చిన ప్రకంపనలు గత ప్రయోగాల కంటే ఐదారురెట్లు ఎక్కువని వెల్లడించింది. దీని వల్ల చైనా, రష్యాలో పలు భవనాలు కంపించినట్టు పేర్కొంది. మండిపడిన ట్రంప్ ఉత్తరకొరియా అణు పరీక్షలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఉత్తరకొరియా ప్రకటనలు.. చేష్టలు అమెరికాకు వ్యతిరేకంగా ప్రమాదకరంగా మారాయని పేర్కొన్నారు. ఉత్తరకొరియాను వంచక దేశం(రోగ్ నేషన్)గా ట్రంప్ అభివర్ణించారు. వాణిజ్య భాగస్వామిగా ఉన్న చైనాకు ఉత్తరకొరియా ఇబ్బంది, ప్రమాదకరంగా మారిందని, చైనా సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నా.. కొంతవరకే విజయవంతమైందని వ్యాఖ్యానించారు. ఉత్తర కొరియాను బుజ్జగించే చర్యలు ఫలించవని చెపుతూ.. వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమని సంకేతాలిచ్చారు. దూకుడు నిర్ణయాలు వద్దు: చైనా మరోవైపు మిత్రదేశం చైనా కూడా ఉత్తరకొరియా చర్యను ఖండించింది. దుందుడుకు చర్యలు, నిర్ణయాల వల్ల పరిస్థితి మరింత క్షిణిస్తుందని, ఇలాంటి వాటిని ఆపేయాలని, అణ్వాయుధాల నియంత్రణకు సంబంధించి చర్చలకు ముందుకు రావాలని సూచించింది. ఉత్తరకొరియా అణుపరీక్ష నేపథ్యంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ నేతృ త్వంలో జాతీయ భద్రతా మండలి సమావేశం నిర్వహించారు. ఉత్తరకొరియాపై తాజాగా ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించాలని, ఆ దేశాన్ని కట్టడి చేసేందుకు మరిన్ని అమెరికా బలగాలను దించాలని మూన్ డిమాండ్ చేశారు. జపాన్ ప్రధానమంత్రి షింజో అబే ఉత్తరకొరియా అణుపరీక్షలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఉత్తరకొరియా అణు పరీక్షల నేపథ్యంలో ట్రంప్, అబే తాజా పరిస్థితులపై ఫొన్లో మంతనాలు జరిపారు. కృత్రిమ భూకంప తీవ్రత 6.3 స్థానిక కాలమాన ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 12.29 గంటల సమయంలో గతంలో అణు పరీక్షలు నిర్వహించిన పున్ గ్యేరీ ప్రాంతంలోనే ఉత్తరకొరియా తాజా అణుపరీక్ష నిర్వహించింది. సియోల్‌లోని అధికారులు ఈ ప్రయోగం వల్ల ఏర్పడ్డ కృత్రిమ భూకంపం తీవ్రత 5.7గా ప్రకటిస్తే.. అమెరికా జియోలాజికల్ సర్వే దీని తీవ్ర తను 6.3గా వెల్లడించింది. గతంలో ఉత్తర కొరియా నిర్వహించిన అణుపరీక్షల్లో అతి ఎక్కువ భూకంపం తీవ్రత 5.3 మాత్రమే. ఈ పరీక్షలకు సంబంధించి ఉత్తరకొరియా ప్రభుత్వ టీవీ చానల్ ఆదివారం ప్రత్యేక బులెటిన్‌ను విడుదల చేసింది. అంతకు ముందు అధికార పార్టీ పత్రిక తన పతాక శీర్షికలో అణ్వాయుధాలను మోహరించిన ఖండాంతర క్షిపణిని కిమ్ పరిశీలిస్తున్న ఫొటోలను ప్రచురిం చింది. ఉత్తరకొరియా ప్రయోగించిన హైడ్రోజన్ బాంబు సామర్థ్యం 70 కిలోటన్నులు ఉంటుందని జపాన్ రక్షణ మంత్రి ఇట్సునోరి ఒనోడెరా వెల్లడించారు. గత పరీక్షల్లో ఇది 10–30 కిలో టన్నులు మాత్రమేనని అన్నారు. ఇది హైడ్రోజన్ బాంబే అనే విషయాన్ని కొట్టిపారేయలేమని, అయితే ఎక్కువ సామర్థ్యం కలిగిన ఆయుధాన్ని విజయ వంతంగా ఉత్తరకొరియా ప్రయోగించిందనేది వాస్తవమని చెప్పారు. -
కిమ్ దేశం మరో అణు పరీక్ష.
-
ఉత్తర కొరియాపై మండిపడ్డ చైనా
బీజింగ్: అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత, ఒత్తిళ్లు ఎదురవుతున్నా మొండిగా అణుపరీక్షలు నిర్వహిస్తున్న ఉత్తర కొరియాపై చైనా మండిపడింది. తాజాగా కొరియా చేపట్టిన అణ్వస్త్ర పరీక్షను బీజింగ్ తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ సమాజం నుంచి విముఖత ఎదురవుతన్నా ఉత్తర కొరియా మళ్లీ అణు పరీక్ష నిర్వహించడాన్ని చైనా ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నదని విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. గతంలో నిర్వహించిన అణు పరీక్షల కంటే ఇది అత్యంత శక్తిమంతమైనది కావడం గమనార్హం. హైడ్రోజన్ బాంబ్ పరీక్షలు నిర్వహించినట్టు ఆదివారం ఉత్తర కొరియా ప్రకటించింది. ఈ ప్రయోగం విజయవంతమైందని కిమ్ జోంగ్ ఉన్ వెల్లడించారు. -
కిమ్ దేశం మరో అణు పరీక్ష
సాక్షి, సియోల్: ఉత్తరకొరియా మరో అణు పరీక్షను నిర్వహించినట్లు దక్షిణ కొరియా ఆదివారం పేర్కొంది. అభివృద్ధి పరచిన హైడ్రోజన్ బాంబును ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ పరిశీలించినట్లు ఉత్తరకొరియా మీడియా పేర్కొన్న కొద్ది గంటల్లోపే అణు పరీక్ష జరగడం గమనార్హం. ఉత్తరకొరియాలోని ఈశాన్య ప్రాంతమైన సున్‌గ్జిబేగమ్‌లో 6.3 తీవ్రతతో పేలుడు సంభవించినట్లు పేర్కొంది. దీంతో ఉత్తరకొరియాల్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించిందని తెలిపింది. కాగా, ఉత్తరకొరియా అణు పరీక్ష నిర్వహించడంపై జపాన్, దక్షిణ కొరియాలు ఆందోళన వ్యక్తం చేశాయి. వీటిని ధృవీకరిస్తూ ఉత్తరకొరియా తాము అణు పరీక్షలు నిర్వహించినట్లు ధృవీకరించింది. ఉత్తరకొరియా ఇప్పటివరకూ నిర్వహించిన అణు పరీక్షల్లో ఇదే అత్యంత శక్తిమంతమైనది. ఉత్తరకొరియా గతేడాది రెండు సార్లు అణు పరీక్షలను నిర్వహించింది. ఇక చైనా ఉత్తర కొరియా అణు పరీక్షను తీవ్రంగా ఖండించింది. -
కిమ్ దేశం మరో అణు పరీక్ష
-
టెక్నో ఇండియా
సాంకేతిక భారతం స్వాతంత్య్రం వచ్చే నాటికి భారతదేశం రసం పీల్చేసిన చెరకు గెడ! వనరులన్నింటినీ ఊడ్చేసి పాలకులు బ్రిటన్‌కు తరలిస్తే.. మనకు మిగిలింది దరిద్రం.. ఆకలి! పాలపొడి, గోధుమలు, పోషకాహారం, టీకాలు.. ఇలా అప్పట్లో మనం దిగుమతి చేసుకోని వస్తువు లేదు. మరి ఇప్పుడు.. మన తిండి మనమే పండించుకుంటున్నాం. పాల ఉత్పత్తిలో ఒకటవ స్థానానికి ఎదిగాం. హాలీవుడ్ సినిమా బడ్జెట్ కంటే తక్కువ ఖర్చుతో కోటానుకోట్ల మైళ్ల దూరంలో ఉన్న అరుణ గ్రహాన్ని అందుకోగలిగాం! శాస్త్ర, పరిశోధన రంగాలపై నాటి పాలకులు దూరదృష్టితో పెట్టిన నమ్మకమిప్పుడు ఫలితాలిస్తోంది. ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాల జాబితాలో భారతీయ సంస్థలకు స్థానం లేకపోవచ్చునేమోగానీ... టాప్ –5 టెక్ కంపెనీలను నడుపుతున్నది మాత్రం మనవాళ్లే! అణు విద్యుత్తు... దేశ విద్యుదుత్పత్తిలో అణుశక్తి వాడకం నాలుగైదు శాతానికి మించకపోవచ్చుగానీ.. దేశ రక్షణ అవసరాల దృష్ట్యా చూస్తే ఈ రంగంలో మన సాధన ఆషామాషీ ఏం కాదు. శాంతియుత ప్రయోజనాలకు మాత్రమే అణుశక్తిని వాడతామని అంతర్జాతీయ వేదికలపై ఎన్ని వాగ్దానాలు చేసినా పాశ్చాత్య దేశాలు మనల్ని నమ్మకపోవడమే కాదు.. వీళ్ల చేతిలో అణుశక్తి పిచ్చోడి చేతిలో రాయి చందమన్న తీరులో హేళన చేసిన సందర్భాలూ అనేకం. ఈ నేపథ్యంలోనే హోమీ జహంగీర్ బాబా వంటి దార్శనికుల కృషి ఫలితంగా భారత అణుశక్తి కార్యక్రమం మొదలైంది. దేశంలో విస్తృతంగా అందుబాటులో ఉన్న థోరియం నిల్వలను సమర్థంగా వాడుకోవడం లక్ష్యంగా ఈ మూడంచెల కార్యక్రమం మొదలైంది. పరిమితస్థాయిలో ఉన్న సహజ యురేనియం నిల్వలతో ప్రెషరైజ్డ్ హెవీవాటర్ రియాక్టర్లను అభివృద్ధి చేసి విద్యుత్తు అవసరాలు తీర్చుకోవడం మొదటి దశ కాగా.. ఈ దశలో వ్యర్థంగా మిగిలిపోయే ప్లుటోనియంను మెటల్ ఆౖక్సైడ్ల రూపంలో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ల ద్వారా విద్యుదుత్పత్తికి వాడుకోవడం రెండో దశ. ప్రపంచ నిల్వలో నాలుగోవంతు ఉన్న థోరియం ఇంధనంగా పనిచేసే అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్లను అందుబాటులోకి తేవడం మూడోదశ. అణు ఒప్పందంతో ప్రస్తుతం మనకు ఇతరదేశాల నుంచి యురేనియం చౌకగా అందుతున్న నేపథ్యంలో మూడోదశ అణు కార్యక్రమం అమలయ్యేందుకు ఇంకో 15 ఏళ్లు పట్టవచ్చు. సమాచార రహదారిపై రయ్యి మంటూ.. ‘‘అరువు తెచ్చుకున్న టెక్నాలజీల ఆధారంగా గొప్ప దేశాలను తయారు చేయలేము’’ ఈ మాటన్న శాస్త్రవేత్త పేరు విజయ్ పురంధర భట్కర్! ఈయన ఎవరో మనలో చాలామందికి తెలియకపోవచ్చుగానీ.. ‘పరమ్ 8000’ పేరుతో దేశంలోనే మొట్టమొదటి సూపర్‌కంప్యూటర్‌ను తయారు చేసి ఒకరకంగా ఐటీ రంగానికి బాటలు వేసిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. 1960లలోనే పాశ్చాత్యదేశాల్లో కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చేశాయి.. మనకు మాత్రం 80లలోగానీ తెలియలేదు. అయితే ఆ తరువాతి కాలంలో మాత్రం ఈ రంగంలో మనం అపారమైన ప్రగతినే సాధించాం. 1967లో టాటా సంస్థ తొలి సాఫ్ట్వేర్ ఎగుమతుల కంపెనీని మొదలుపెట్టినా.. 1991లో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం దేశవ్యాప్తంగా సాఫ్ట్‌వర్ టెక్నాలజీ పార్కుల ఏర్పాటుతో ఐటీ ప్రస్థానం వేగమందుకుంది. 1998 నాటికి స్థూల జాతీయోత్పత్తిలో ఐటీ వాటా కేవలం 1.2 శాతం మాత్రమే ఉండగా.. 2015 నాటికి ఇది 9.5 శాతానికి పెరిగిపోయిందంటేనే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. దేశంలోని యువతకు ఈ రంగం సృష్టించిన ఉపాధి అవకాశాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అరచేతిలో ప్రపంచం.. సెల్‌ఫోన్! ఇంటికి టెలిఫోన్ కావాలంటే.. నెలల తరబడి వెయిటింగ్ లిస్ట్‌లో ఉండాల్సిన కాలం నుంచి అనుకున్నదే తడవు ప్రపంచాన్ని మన ముందు తెచ్చే సెల్ఫోన్ల వరకూ టెలికమ్యూనికేషన్ల రంగంలో దేశం సాధించిన ప్రగతి అనితర సాధ్యమంటే అతిశయోక్తి కాదు. దేశ జనాభా 130 కోట్ల వరకూ ఉంటే.. మొబైల్‌ఫోన్ కనెక్షన్లు 118 కోట్ల వరకూ ఉండటం గుర్తించాల్సిన విషయం. కేవలం సమాచార సాధనంగా మాత్రమే కాకుండా.. ఉత్పాదకతను పెంచుకునేందుకు తద్వారా ఎక్కువ ఆదాయం ఆర్జించేందుకు అవకాశం కల్పించిన సాధనంగా మొబైల్‌ఫోన్‌ను సామాన్యుడు సైతం గుర్తిస్తున్నాడు. ఆర్థిక సరళీకరణల వరకూ ప్రభుత్వం అధిపత్యంలోనే నడిచిన టెలికమ్యూనికేషన్ల శాఖ.. ఆ తరువాత కార్పొరేటీకరణకు గురికావడం.. ప్రైవేట్ సంస్థలు రంగంలోకి దిగడంతో వినియోగదారులకు మేలు జరిగింది. అంతరిక్షాన్ని జయించాం... 1963 నవంబరు 21వ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. తిరువనంతపురం సమీపంలోని తుంబా ప్రాంతంలోని ఒక చర్చి కార్యశాలగా... ఆ పక్కనే ఉన్న బిషప్ రెవరెండ్ పీటర్ బెర్నర్డ్ పెరీరియా ఇల్లే ఆఫీసుగా.. సైకిళ్లు, ఎద్దుల బండ్లే రవాణా వ్యవస్థలుగా భారత అంతరిక్ష ప్రయోగాలకు శ్రీకారం పడింది ఈ రోజునే. సాంకేతిక పరిజ్ఞానం విషయంలో విదేశీ సాయం ఏమాత్రం లేకుండా... విక్రం సారాభాయ్, ఏపీజే అబ్దుల్ కలాం వంటి దిగ్గజాలు మొదలుపెట్టిన ఈ కార్యక్రమం నేడు ఎంత బహుముఖంగా విస్తరించిందో.. విస్తరిస్తూ ఉందో మన కళ్లముందు కనిపిస్తూనే ఉంది. అంతరిక్ష ప్రయోగాలను ఆధిపత్య పోరు కోసం కాకుండా జన సామాన్యుడి అవసరాలు తీర్చేందుకు మాత్రమే ఉపయోగిస్తామన్న గట్టి వాగ్దానంతో మొదలైన ఇస్రో దశలవారీగా ఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ రాకెట్ల దశకు చేరుకుంది. టెలిఫోన్లు, టీవీ కార్యక్రమాలు, ప్రకృతి వనరుల నిర్వహణ, విపత్తు సమయాల్లో ఆదుకునేందుకు ఇలా.. అనేక రంగాల్లో అంతరిక్ష ప్రయోగాలు మనకు అక్కరకొస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. చంద్రయాన్ –1, మంగళ్యాన్ ప్రయోగాలు మరో ఎత్తు. సాంకేతిక పరిజ్ఞానం విషయంలో మనం ఎవరికీ తీసిపోమని ప్రపంచానికి చాటి చెప్పినవి ఇవే. పోఖ్రాన్ అణు పరీక్షలను నిరసిస్తూ అమెరికా క్రయోజెనిక్ ఇంజిన్ల టెక్నాలజీ మనకు దక్కకుండా రష్యాను నిలువరించినా.. కొంచెం ఆలస్యంగానైనా అదే ఇంజిన్‌ను మనం సొంతంగా అభివృద్ధి చేసుకోవడం భారతీయులుగా గర్వించదగ్గ విషయమే. హేతువుకు చోటు కావాలి! శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం సాధించిన ప్రగతి మనందరికీ గర్వకారణమే. అందులో సందేహమేమీ లేదు. అయితే అదే సమయంలో మన రాజ్యాంగం నిర్దేశించిన ఆదేశిక సూత్రాల్లో ఒకటైన శాస్త్రీయ దక్పథం లేమి పౌరులుగా మనకు అంత శోభనిచ్చేది మాత్రం కానేకాదు. భారతీయ శాస్త్రవేత్తలకు గత 85 ఏళ్లలో నోబెల్ బహుమతి రాకపోయేందుకు ఇదే ప్రధాన కారణమని పద్మభూషణ్.. దివంగత పుష్ప మిత్ర భార్గవ వ్యాఖ్యానించడం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతుంది. మనిషి తయారు చేసే కంప్యూటర్ను తొలిసారి ఆన్ చేస్తూ కొబ్బరికాయలు కొట్టడం.. రాకెట్ ప్రయోగాలకు ముందు దేవాలయాల్లో పూజలు ఈ శాస్త్రీయ దృక్పథ లేమికి అద్దం పట్టేవి. మతం ఒక విశ్వాసం. దానికి శాస్త్రాన్ని జోడించడం అంత సరికాదన్నది కొంతమంది శాస్త్రవేత్తల అభిప్రాయమైతే.. మత విశ్వాసం తమకు సానుకూల దక్పథాన్ని అలవరచి.. చేసే పని విజయవంతమయ్యేందుకు దోహదపడితే ఎలా తప్పు పడతారని ఇంకొందరు అంటూ ఉంటారు. అవయవ మార్పిడి పురాణాల్లోనే ఉందని.. కౌరవులు కుండల్లో పుట్టారు కాబట్టి.. అప్పటికే టెస్ట్‌ట్యూబ్ బేబీల టెక్నాలజీ ఉందని వాదించడం శాస్త్రీయ దృక్పథం ఎంతమాత్రం అనిపించుకోదు. పురాణ కాలంలోనే విమాన నిర్మాణ శాస్త్రం ఉందని 102వ జాతీయ సైన్స్ కాంగ్రెస్‌లో ఒక పరిశోధన వ్యాసం ప్రచురితమవడం ఎంత దుమారానికి దారితీసిందో తెలియంది కాదు. ఒకవేళ ఇవన్నీ నిజంగానే ఉన్నాయని కొందరు నమ్మితే.. వాటిని ఈ కాలపు ప్రమాణాలతో రుజువు చేయాల్సిన బాధ్యతా వారిపైనే ఉంటుంది. అలా కాకుండా కేవలం ప్రకటనలకు పరిమితమవడం.. తర్కబద్ధమైన విశ్లేషణకు తావివ్వకపోవడం సరికాదు. – ప్రణవ మహతి -
క్లింటన్ డబ్బు ఇస్తానన్నారు: నవాజ్ షరీఫ్
-
క్లింటన్ డబ్బు ఇస్తానన్నారు: నవాజ్ షరీఫ్
ఇస్లామాబాద్: ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్.. పాకిస్తాన్ అణు పరీక్షలు జరపకుండా ఉండేందుకు తనకు ఐదు బిలియన్ల డాలర్లు ఇవ్వజూపినట్లు చెప్పారు. దేశానికి విధేయుడిని కాకపోతే ఆ డబ్బు తీసుకుని అణు పరీక్షలను నిలిపివేసేవాడినని అన్నారు. పంజాబ్ ప్రావిన్సులో ఏర్పాటు చేసిన ఓ పబ్లిక్ మీటింగ్‌లో అణు పరీక్షల విషయాన్ని ప్రధాని షరీఫ్ బయటపెట్టారు. 1998లో తనను కలిసిన బిల్ క్లింటన్ అణు పరీక్షలు నిలిపివేయాలని కోరినట్లు చెప్పారు. అందుకు ప్రతిగా ఐదు బిలియన్ డాలర్లను ఇస్తానని క్లింటన్ అన్నా.. తాను లొంగలేదని అన్నారు. అవినీతి కేసులో తీవ్ర చిక్కుల్లో ఇరుకున్న నవాజ్ షరీఫ్ అందులోంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో తాను ప్రధానిగా ఉన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలను ఆయుధంగా వాడుకుంటున్నారు. పనామా పేపర్ల కుంభకోణం ప్రధాని కుర్చీని కుదిపేస్తుండటం, రాజీనామా చేయాలనే డిమాండ్ పెరుగుతుండటంతో ఆయన ఇలా చేస్తున్నారని పాకిస్తాన్ మీడియా అంటోంది. -
మళ్లీ తొడగొట్టిన ఉత్తర కొరియా!
ఏక్షణంలోనైనా అణ్వాయుధ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటన అమెరికాకు మరోసారి సవాల్ సియోల్: ఉత్తర కొరియా మరోసారి అమెరికాకు సవాల్ విసిరింది. ఏ క్షణంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా అణ్వాయుధ పరీక్ష నిర్వహిస్తామని హెచ్చరించింది. తాజా ప్రకటన కొరియా ద్వీపంలో ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోయనుందని భావిస్తున్నారు. గత కొన్నాళ్లుగా కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. సుదూర ప్రాంతాలను ఢీకొట్టగలిగే సామర్థ్యమున్న క్షిపణీని ప్రయోగిస్తామని, ఆరోదఫా అణ్వాయుధ పరీక్షలు చేపడతామని ఉత్తర కొరియా ప్రకటించడం కలకలం రేపింది. ఆరో అణ్వాయుధ పరీక్ష చేపడితే.. ప్రతిగా ఆ దేశంపై సైనిక దాడులకు దిగాల్సి ఉంటుందని అమెరికా హెచ్చరించింది. అయినా, ఉత్తర కొరియా వెనుకకు తగ్గడం లేదు. తాజాగా ఆ కొరియా విదేశాంగ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ దేశ నాయకత్వం నిర్దేశించిన మేరకు ఏ క్షణంలోనైనా, ఎక్కడైనా అణ్వాయుధ పరీక్షలు చేపడుతామని పేర్కొన్నారు. ఈ విషయంలో అమెరికా తలపెట్టే ఎలాంటి చర్యనైనా దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమని తెలిపారు. అమెరికా తన అస్త్యవ్యస్త విధానాలను మానుకోనంతవరకు తాము అణ్వాయుధ పరీక్షలు చేపడుతూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. -
అణు పరీక్షకు ఉత్తరకొరియా సిద్ధం?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దూకుడు ప్రదర్శిస్తుంటే తాను మాత్రం తక్కువ తినలేదంటూ ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కూడా అంతే దూకుడుగా ఉంటున్నారు. తాజాగా ఆయన అణ్వస్త్రాలను పరీక్షించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలిసింది.ఘిటీవల తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా ఈ విషయం వెల్లడైంది. ఉత్తరకొరియాలోని పంగ్యే -రి అనే ప్రాంతంలో దీనికి సంబంధించిన పరికరాలను ఇప్పటికే మోహరించినట్లు ఆ చిత్రాల్లో ఉంది. ఒకవేళ ఇదే నిజమై.. వాళ్లు అణ్వస్త్రాలను పరీక్షిస్తే మాత్రం 2006 తర్వాత ఈ తరహా పరీక్ష ఇది ఆరోసారి అవుతుంది. ఏప్రిల్ 12వ తేదీన తీసిన ఉపగ్రహ చిత్రాల్లో పంగ్యే- రి వద్ద ఉత్తరకొరియా సైనికుల కదలికలు ఎక్కువగా కనిపిస్తున్నాయని, ప్రధానంగా అక్కడ మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ ఏరియాలో ఎక్కువ మంది ఉంటున్నారని, సైట్‌లోని కమాండ్ సెంటర్ వద్ద కూడా కొంతమంది ఉన్నారని అమెరికాకు చెందిన 38 నార్త్ అబ్జర్వేటరీ సంస్థ తెలిపింది. అక్కడి వాతావరణాన్ని బట్టి చూస్తుంటే మాత్రం అణ్వస్త్ర పరీక్ష జరిగే అవకాశం కనిపిస్తోందని చెప్పింది. అయితే దక్షిణ కొరియా అధికారులు మాత్రం అదేమీ ఉండకపోవచ్చని కొట్టిపారేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తరకొరియా అంత సాహసం చేయకపోవచ్చని అంటున్నారు. -
ఆంక్షలు మాత్రమే సరిపోవు: చైనా
బీజింగ్: ఉత్తర కొరియా తాజా అణు పరీక్షలపై ప్రపంచ దేశాల్లో తీవ్ర స్థాయిలో ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. దీంతో.. ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలు విధించాలని అంతర్జాతీయ సమాజం భావిస్తోంది. అయితే, ఉత్తర కొరియాతో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించడంలో ముందుండే చైనా మాత్రం కేవలం ఈ ఆంక్షలతో ప్రయోజనం ఉండదంటూ చెబుతోంది. 'ఉత్తర కొరియాపై ఆంక్షల విషయంలో చైనా బాధ్యత ఎక్కువ ఉంది' అంటూ అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి యష్ కార్టర్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో చైనా స్పందించింది. కేవలం ఉత్తర కొరియాపై ఆంక్షలు విధిస్తే సరిపోదని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ సోమవారం వెల్లడించారు. ఆంక్షలతో ఉత్తర కొరియా తనంతట తానుగా అణుపరీక్షలను నిలిపివేయదన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. ముందుగా కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను తగ్గించాల్సిన అవసరముందని చున్యుంగ్ సూచించారు. ఈ విషయంలో అమెరికాకే ఎక్కువ బాధ్యత ఉందని ఆమె స్పష్టం చేశారు. దక్షిణ కొరియాలో అత్యాధునిక క్షిపణీ వ్యవస్థను అమెరికా మోహరించడం మూలంగానే ఉత్తర కొరియా అణుపరీక్షలు నిర్వహిస్తోందని చైనా వాదిస్తోంది. -
ఉత్తర కొరియా అణు పరీక్ష
-
ఉ.కొరియా అణు పరీక్ష
అణు బాంబును పరీక్షించామని ప్రకటన.. ప్రపంచ దేశాల ఖండన సియోల్: అణు బాంబును విజయవంతంగా పరీక్షించామని ఉత్తర కొరియా సంచలన ప్రకటన చేసింది. తమ దేశ ఉత్తరప్రాంతజలోని అణు పరీక్షల కేంద్రంలో కొత్తగా అభివృద్ధి చేసిన అణ్వాయుధం(వార్‌హెడ్)తో శాస్త్రవేత్తలు అణు పేలుడు జరిపారని ప్రభుత్వ టీవీ చానల్ వెల్లడించింది. దీంతో రాకెట్‌కు చిన్ని అణు వార్‌హెడ్‌ను అనుసంధానించే సామర్థ్యాన్ని సంపాదించుకున్నామని పేర్కొంది. శుక్రవారం పుంగ్యెరి అణు కేంద్రం సమీపంలో రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో కృత్రిమ భూకంపం సంభవించిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ఉ.కొరియా ఐదో అణు పరీక్ష అయిన తాజా పరీక్షపై ప్రపంచ దేశాలు భగ్గుమన్నాయి. ఉ.కొరియా జరిపిన క్షిపణి పరీక్షల్లో ఇదే పెద్దదని, దీనికి 10 కిలోటన్నుల పేలుడు పదార్థాలు వాడారని దక్షిణ కొరియా ఆరోపించింది. ఆ అధినేత కిమ్‌జోంగ్ స్వీయ వినాశనం దిశగా వెళ్తున్నారని వ్యాఖ్యానించింది. ఉ.కొరియా తీవ్ర పర్యవనాసాలను, కొత్తగా అంతర్జాతీయ ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హెచ్చరించారు. దీనిపై ఆయన దక్షిణ కొరియా అధ్యక్షురాలు గుయెన్ హె, జపాన్ ప్రధాని అబేలతో చర్చించారు. అణు పరీక్ష జరిపింది నిజమే అయితే చాలా ఆందోళనకరమని ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ అణు శక్తి సంస్థ(ఐఏఈఏ) చీఫ్ యుకియో అమానో అన్నారు. -
అవును అణుపరీక్షలే: ఉత్తరకొరియా
ప్యాంగ్యాంగ్:: అణుపరీక్షలను ధృవీకరిస్తూ ఉత్తర కొరియా ప్రకటన చేసింది. ఉత్తర కొరియా తన ఐదో అణుపరీక్షలను విజయవంతంగా నిర్వహించిందని ఆ దేశ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఉత్తర కొరియా న్యూక్లియర్ టెస్ట్ సైట్లో 5.3 తీవ్రతతో సంభవించిన భూకంపాన్ని అణుపరీక్షలుగా ప్రపంచదేశాలు అనుమానించిన నేపథ్యంలో ఉత్తర కొరియా ఈ ప్రకటనను చేసింది. ఉత్తర కొరియా నిర్వహించిన అనుపరీక్షలలో ఇదే అత్యంత శక్తివంతమైనదని దక్షిణ కొరియా వెల్లడించింది. కొత్తగా అభివృద్ధి చేసిన వార్‌హెడ్‌తో దేశ ఉత్తర ప్రాంతంలోని న్యూక్లియర్ టెస్ట్ సైట్ నుంచి శాస్త్రవేత్తలు పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వ మీడియా తెలిపింది. విజయవంతంగా పరీక్షలు నిర్వహించిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపింది. కాగా ఉత్తర కొరియా చర్యపై ప్రపంచ దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తర కొరియా స్వీయ విధ్వంసానికి పాల్పడుతోందని దక్షిణ కొరియా విమర్శించింది. -
5.3 తీవ్రతతో భూకంపం.. అణుపరీక్షలు!
సియోల్: ఉత్తర కొరియా మరోసారి అణుపరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఉత్తర కొరియా ప్రధాన న్యూక్లియర్ సైట్ సమీపంలో శుక్రవారం రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూకంపాన్ని గుర్తించినట్లు దక్షిణ కొరియా అధికారులు వెల్లడించారు. ఖచ్చితంగా అది న్యూక్లియర్ టెస్ట్ మూలంగా సంభవించిన భూకంపంగా ఉత్తర కొరియా వాతావరణ సంస్థ వెల్లడించింది. ఈ భూకంపానికి సంబంధించిన ప్రకంపనలను అమెరికా, యూరప్ భూకంప పరిశీలన కేంద్రాలు సైతం గుర్తించాయి. ఉత్తర కొరియా ఫౌండేషన్ డే సందర్భంగా ఈ పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే.. దీనిపై ఉత్తర కొరియా ఎలాంటి ప్రకటన చేయలేదు. సాధారణ భూకంపం సమయంలోని ప్రకంపనల కంటే ఉత్తర కొరియాలోని ప్యుంగీ-రీ న్యూక్లియర్ టెస్ట్ సైట్ వద్ద శుక్రవారం ఏర్పడిన ప్రకంపనలు భిన్నంగా ఉన్నాయని జపాన్ భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది. జపాన్ రక్షణ శాఖ మంత్రి ఫుమియో కిషిడా మాట్లాడుతూ.. అణు పరీక్ష నిర్థారణ జరిగితే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఈ విషయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తామని వెల్లడించారు. ఉత్తర కొరియా చర్యలను తమ సహచర దేశాలతో కలిసి పరిశీలిస్తున్నట్లు అమెరికా వెల్లడించింది. ఉత్తర కొరియా అణుపరీక్షలు జరపడం ఇది ఐదోసారి. ఇటీవల వరుస అణు పరీక్షలు, బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలతో ఉత్తర కొరియా దూకుడును ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. -
ఉత్తర కొరియాలో భూకంపం.. మళ్లీ అణుపరీక్షలు!
సియోల్: ఉత్తర కొరియాలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఉత్తర కొరియా వాయువ్య ప్రాంతంలోని సోంగ్లిమ్ పట్టణ సమీపంలో రెక్టర్ స్కేలుపై 3.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు దక్షిణ కొరియా వాతావరణ సంస్థ ప్రకటించింది. అయితే ఈ భూకంపం అణుపరీక్షల కారణంగా సంభవించినట్లు ఎలాంటి సంకేతాలు లేవని ఆ సంస్థ తెలిపింది. ఉత్తర కొరియా అణుపరీక్షలు నిర్వహించే పుంగేరీ ప్రాంతానికి భూకంప కేంద్రం దూరంగా ఉండటంతో మళ్లీ అణుపరీక్షలు జరిగినట్లు నిర్థారించలేదు. జనవరి 6న ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబు ప్రయోగం జరిపిన సమయంలో రెక్టర్ స్కేలుపై 5.1 తీవ్రతతో భూకంపం సంభవించి ప్రపంచ దేశాల్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. కొరియా ద్వీపకల్పంలో సాధారణ స్థాయి భూకంపాలు మామూలేనని నిపుణులు చెబుతున్నప్పటికీ.. ఇటీవలి కాలంలో అణ్వాయుధ పరీక్షలతో దూకుడు మీదున్న నేపథ్యంలో ఈ భూకంపంపై దక్షిణ కొరియా అనుకూల వర్గాల్లో అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దీనిపై ఉత్తర కొరియా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. -
ఉత్తర కొరియాను తప్పుబట్టిన చైనా, భారత్
బీజింగ్: ఉత్తర కొరియా అణుపరీక్ష చేయడాన్ని చైనా తీవ్రంగా తప్పుబట్టింది. ఇలాంటి చర్య ఏమాత్రం సమర్థనీయం కాదని వ్యాఖ్యానించింది. ఈశాన్య ఆసియాలో శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రతి'ఒక్క దేశంపై ఉందని పేర్కొంది. 'అణుపరీక్షలకు దూరంగా ఉండాలని ప్రపంచ దేశాలు తీసుకున్న నిర్ణయాలకు ఉత్తర కొరియా కట్టుబడి ఉండాలి. ఈశాన్య ఆసియాలో శాంతి, సుస్థిరతను కొనసాగించేందుకు అణుసంపదను దుర్వినియోగం చేసే చర్యలు మానుకోవాలి. ఈ విషయం ప్రపంచంలోని ప్రజలందరికీ ఆందోళనకరమైనదే అనే అంశాన్ని ఉత్తర కొరియా గుర్తించాలి' అని చైనా విదేశాంగా అధికార ప్రతినిథి హువా చనియింగ్ పేర్కొన్నారు. భారత్ కూడా ఉత్తర కొరియా చర్యను ఖండించింది. ఇలాంటి చర్యలు ప్రపంచ శాంతి భద్రతలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని భారత విదేశాంగ అధికారి ఒకరు అన్నారు.