ఉ.కొరియా ‘అణు భూకంపం’? | Earthquake near nuclear testing center | Sakshi
Sakshi News home page

ఉ.కొరియా ‘అణు భూకంపం’?

Published Sun, Sep 24 2017 3:19 AM | Last Updated on Sun, Sep 24 2017 9:09 AM

Earthquake near nuclear testing center

బీజింగ్‌: ఉత్తరకొరియాలోని అణు పరీక్ష కేంద్రం సమీపంలో 3.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అమెరికాకు చెందిన భూకంప శాస్త్రవేత్తలు వెల్లడించారు. అణు పరీక్ష కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలోనే ఈ భూకంపం సంభవించిందని అమెరికా జియోలాజికల్‌ సర్వే తేల్చింది. ‘అణు పరీక్షలు జరిపిన ప్రాంతంలోనే భూకంపం సంభవించింది. అది సహజ భూకంపమా,  పరీక్షల కారణంగా వచ్చిన భూకంపమా అనేది ధ్రువీకరించలేం’ అని తెలిపింది.   ‘అనుమానాస్పద పేలుడు’ వల్లే ఈ భూకంపం సంభవించినట్లు చైనా భూకంప నెట్‌వర్క్‌ కేంద్రం తెలిపింది. అయితే దక్షిణ కొరియా మాత్రం దీన్ని విభేదిస్తూ సహజ భూకంపమేనని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement