earthquak
-
మహారాష్ట్ర: నాందేడ్‌లో భూకంపం.. 3.8 తీవ్రత నమోదు
నాందేడ్: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఈరోజు (మంగళవారం) భూకంపం సంభవించింది. నాందేడ్ నార్త్ సిటీ, హద్గావ్, అర్ధపూర్ తాలూకాలోని కొన్ని ప్రాంతాల్లో భూ ప్రకంపనలు కనిపించాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.8గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.నాందేడ్ నగరానికి ఈశాన్యంగా 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న హడ్గావ్ తాలూకాలోని సావర్గావ్ గ్రామంలో భూకంప కేంద్రం ఉంది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని జిల్లా ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ అధికారి కిషోర్ కుర్హే తెలిపారు.భారతదేశ భూకంప పటంలో నాందేడ్.. జోన్ IIలో ఉంది. ఈ ప్రాంతంలో భూకంపం సంభావ్యత తక్కువగా ఉంటుంది. ఈ నగరం మహారాష్ట్రలోని మరఠ్వాడా డివిజన్లో గోదావరి నదికి ఉత్తర ఒడ్డున ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ సమయంలో అక్కడ ఎలాంటి నష్టం జరగలేదు. ఇది కూడా చదవండి: కమల ఇంటర్వ్యూ ఎడిట్ చేశారు: డొనాల్డ్ ట్రంప్ -
భారత్ పొరుగు దేశాల్లో మరోమారు భూ ప్రకంపనలు
భారత్ పొరుగు దేశాల్లో మరోసారి భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈసారి ఏకకాలంలో మూడు దేశాల్లో భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున పాకిస్తాన్, చైనా, పాపువా న్యూ గినియాలో భూకంపం సంభవించింది. ప్రజలు భయాందోళనలకు గురయ్యాయి. భూకంపం వచ్చిన వెంటనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతానికి ఈ మూడు దేశాల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. పాపువా న్యూ గినియాలో అత్యధిక తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, పాకిస్థాన్‌లో ఈరోజు(మంగళవారం) తెల్లవారుజామున 03:38 గంటలకు భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.2గా నమోదయ్యింది. పాకిస్థాన్‌లో భూకంపం కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం చైనాలోని జిజాంగ్‌లో నేటి తెల్లవారుజామున 03:45 గంటలకు రిక్టర్ స్కేలుపై 5.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. అదే సమయంలో పాపువా న్యూ గినియాలోని న్యూ గినియా ఉత్తర తీరంలో తెల్లవారుజామున 03:16 గంటలకు 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ ఈ మూడు చోట్లా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇది కూడా చదవండి: జన్మాష్టమి, రక్షాబంధన్, శ్రీరామనవమి, శివరాత్రి సెలవులు రద్దు! -
నేపాల్‌లో మళ్లీ భూప్రకంపనలు..
నేపాల్‌లో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. శుక్రవారం రాత్రి సంభవించిన భూకంపంలో 157 మందికి పైగా జనం మృత్యువాత పడ్డారు. తాజాగా ఆదివారం(ఈరోజు) నేపాల్‌లో 3.6 తీవ్రతతో మరోసారి భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఖాట్మండుకు వాయువ్యంగా 169 కి.మీ దూరంలో 10 కి.మీ లోతులో ఆదివారం తెల్లవారుజామున 4.38 గంటలకు భూప్రకంపనలు సంభవించనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. అయితే ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం చోటుచేసుకోలేదని పేర్కొంది. దీనికి ముందు శనివారం మధ్యాహ్నం కూడా 3.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని తెలిపింది. శుక్రవారం రాత్రి నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపంలో 157 మంది మృతి చెందారు. గడచిన ఎనిమిదేళ్లలో నేపాల్‌లో సంభవించిన అత్యంత భారీ భూకంపం ఇది. 2015లో నేపాల్‌లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపంలో సుమారు తొమ్మిది వేల మంది మృతి చెందగా, 22 వేల మంది గాయాలపాలయ్యారు. ఇది కూడా చదవండి: ఢిల్లీ సహా ఉత్తర భారతంలోనూ భారీగా భూప్రకంపనలు -
ఇంకా ముప్పు తప్పలేదు: నేపాల్‌కు శాస్త్రవేత్తల హెచ్చరిక!
నేపాల్‌లో సంభవించిన భూకంపంలో 132 మంది మృతి చెందారు. లెక్కకు మించిన జనం గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భూకంపం ప్రభావం ఢిల్లీ-ఎన్సీఆర్తో పాటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్‌తో సహా అనేక ఇతర రాష్ట్రాల్లో కనిపించింది. నెల రోజుల వ్యవధిలో నేపాల్‌లో ఇది మూడో భూకంపం. భూకంపం ముప్పు ఇంకా తప్పలేదని, అందుకే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. నేపాల్‌లో మరోమారు భూకంపం సంభవించవచ్చని వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ మాజీ భూకంప శాస్త్రవేత్త అజయ్ పాల్ హెచ్చరించారు. గతంలోనూ పలువురు శాస్త్రవేత్తలు హిమాలయ ప్రాంతంలో ఎప్పుడైనా భారీ భూకంపం సంభవించవచ్చని అంచనా వేశారు. భారత టెక్టోనిక్ ప్లేట్ ఉత్తర దిశగా కదులుతుండటంతో అది యురేషియన్ ప్లేట్‌ను ఢీకొననుంది. ఫలితంగా హిమాలయాలపై ఒత్తిడి ఏర్పడి, అనేక భూకంపాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే రాబోయే భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై ఎనిమిది కంటే ఎక్కువగా ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది ఎప్పుడు సంభవిస్తుందో చెప్పలేమని అంటున్నారు. ఇది కూడా చదవండి: నేపాల్‌లో తరచూ భూకంపాలు ఎందుకు వస్తాయి? -
మూమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్ అంటే ఏమిటి? రిక్టర్ స్కేల్ కన్నా ఎంత ఉత్తమం?
భూకంపాల తీవ్రతను రిక్టర్ స్కేల్‌తో కొలుస్తారు. రిక్టర్ స్కేల్‌ను చార్లెస్ ఫ్రాన్సిస్ రిక్టర్ 1935లో అభివృద్ధి చేశారు.అయితే దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇది భారీ భూకంపాలు సంభవించినప్పుడు దాని తీవ్రతను ఖచ్చితంగా కొలవలేదు. ఈ నేపధ్యంలోనే 1970లలో రిక్టర్ స్కేల్ స్థానంలో మూమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్ (ఎంఎంఎస్) ఆవిష్కృతమయ్యింది. ఇది భారీ భూకంపాల తీవ్రతను మరింత విశ్వసనీయంగా అంచనా వేస్తుంది. అయితే నేటికీ భూకంప తీవ్రతను రిక్టర్ స్కేలుపై గుర్తించినట్లు రాస్తున్నారు. అందుకే ఇప్పుడు రిక్టర్ స్కేల్, మూమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్ మధ్యగల తేడాలను, ఉపయోగాలను తెలుసుకుందాం. 2023, ఫిబ్రవరి 8న టర్కీలోని ఆగ్నేయ ప్రాంతంలో, సిరియా సరిహద్దుకు సమీపంలో భూకంపం సంభవించినప్పుడు మూమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్ సహాయంతో తీవత్రను కొలవగా 10కి 7.8గా నమోదయ్యింది. మూమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్ అనేది భూకంపం ద్వారా విడుదలయ్యే మొత్తం శక్తిని కొలిచే సంవర్గమాన ప్రమాణం. ఇది అతిపెద్ద భూకంపాలను (అంటే 8 తీవ్రత కంటే ఎక్కువ) ఖచ్చితంగా కొలవగల ఏకైక స్కేల్. మూమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్‌ను 1970లలో జపనీస్ భూకంప శాస్త్రవేత్త హిరో కనమోరియాండ్, అమెరికన్ భూకంప శాస్త్రవేత్త థామస్ సి. హాంక్స్ సంయుక్తంగా అభివృద్ధి చేశారు. మొమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్ భూకంపం సంభవించిన క్షణంలో దాని తీవ్రతను అంచనావేస్తుంది. రిక్టర్ స్కేల్‌ను 1935లో చార్లెస్ ఎఫ్. రిక్టర్ అభివృద్ధి చేశారు. దీనిలో భూకంపం సంభవించిన సమయంలో విడుదలయ్యే శక్తిని కొలిచేందుకు ఉపయుక్తమవుతుంది. రిక్టర్ స్కేల్ అనేది బేస్-10 లాగరిథమిక్ స్కేల్. 5 కంటే తక్కువ తీవ్రత గల భూకంపాలను గుర్తించడంలో ఇది అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. భూకంప మూలం నుండి నిర్దిష్ట దూరంలో నమోదయిన అతిపెద్ద తరంగం వ్యాప్తిని రిక్టర్ స్కేలు గుర్తిస్తుంది. అయితే రిక్టర్ స్కేల్ భూకంప నష్టాన్ని అంచనా వేయలేదు. అందుకే ప్రస్తుతం భూకంపాలను తీవ్రతను సమగ్రంగా తెలుసుకునేందుకు మూమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్ వినియోగిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఆసియాను కుదిపేసిన 10 భారీ భూకంపాలివే.. -
ఆసియాను కుదిపేసిన 10 భారీ భూకంపాలివే..
భూకంపం.. నివారించడం సాధ్యం కాని విపత్తు. అందుకే జాగ్రత్త, అప్రమత్తతే దీనికి పరిష్కారం. ముందస్తుగా సన్నద్ధం కాగలిగితే భూకంపాల తరహా విపత్తుల వల్ల కలిగే నష్టాన్ని కొంత వరకు నివారించవచ్చు. తాజాగా నేపాల్‌లో సంభవించిన భూకంపం కారణంగా వందలాదిమంది మృతి చెందారు. ఈ నేపధ్యంలో ఆసియా ఖండంలో సంభవించిన పది అతిపెద్ద భూకంపాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో తరచూ విపత్తులకు గురయ్యే ఆసియాఖండంలో భూకంపాలు అత్యంత ప్రమాదకర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. యూఎన్ ఇంటర్నేషనల్ స్ట్రాటజీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్ (యూఎన్‌ఐఎస్‌డీఆర్) తెలిపిన వివరాల ప్రకారం ఆసియాలోని చైనా, భారత్, ఇండోనేషియా, మయన్మార్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ అత్యంత భూకంప ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి. ఆసియాలోని నగరాలు చాలా వరకు ప్రణాళికాబద్ధంగా లేవు. అవి నిర్మితమైనప్పుడు లోపభూయిష్టంగా ఉన్నాయని బ్యాంకాక్‌లోని ఆసియన్ డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ సెంటర్ అర్బన్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ డైరెక్టర్ అరంబెపోలా గతంలో తెలిపారు. కాగా యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) తెలిపిన వివరాల ప్రకారం ఆసియాలో సంభవించిన పది అత్యంత భారీ భూకంపాలు ఇవే.. 1. ఇండోనేషియా: 2004, డిసెంబరు 26న ఇండోనేషియాలోని సుమత్రాలో 9.1 తీవ్రతతో భూకంపం సంభవించినప్పుడు మొత్తం 2,27,898 మంది మరణించారు. ఆ తర్వాత వచ్చిన సునామీ 14 ఆసియా, తూర్పు ఆఫ్రికా దేశాలపై ప్రభావం చూపింది. ఇది జరిగిన మూడు నెలల తర్వాత ఉత్తర సుమత్రాలో 2005, మార్చి 28న 8.6 తీవ్రతతో మరో భూకంపం సంభవించగా, సుమారు వెయ్యి మంది మరణించారు. 2. చైనా: 2008, మే 12న తూర్పు సిచువాన్‌లో 7.9 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 87,587 మంది మృత్యువాత పడ్డారు. లక్షలమంది నిరాశ్రయులయ్యారు. 3,74,177 మంది క్షతగాత్రులయ్యారు. 3. పాకిస్తాన్: 2005, అక్టోబర్ 8న 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 86 వేల మంది మరణించారు. రాజధాని ఇస్లామాబాద్‌కు 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తర పాకిస్తాన్లో ఈ భూకంపం సంభవించింది. 4. ఇరాన్: 1990, జూన్ 21న ఉత్తర ఇరాన్లో సంభవించిన భూకంపంలో 50 వేల మందికిపైగా ప్రజలు ప్రాణాలొదిలారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.7గా నమోదయ్యింది. భూకంప తాకిడికి ఇరాన్‌లోని మంజిల్, రడ్బర్ పట్టణాలు నేలమట్టమయ్యాయి. 5. ఇరాన్: 2003, డిసెంబర్ 26న బామ్‌లో 6.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 31 వేల మంది మరణించారు. ఇది రెండు వేల సంవత్సరాలలో ఈ ప్రాంతంలో సంభవించిన అతిపెద్ద భూకంపం. ఈ భూకంపం తాకిడికి నగరంలోని 70 శాతం ధ్వంసమైందని నివేదికలు చెబుతున్నాయి. 6. జపాన్: 2011, మార్చి 11న జపాన్‌లో సంభవించిన సునామీ భూకంపంలో 20,896 మంది ప్రాణాలు కోల్పోయారు. 8.9 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. సాండియాకు 80 మైళ్ల దూరంలో ఈ భూకంపం చోటుచేసుకుంది. 7. భారతదేశం: 2001, జనవరి 26న భుజ్‌లో సంభవించిన భూకంపంలో 20,085 మంది మృతి చెందారు. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 7.6గా నమోదైంది. గుజరాత్లో దాదాపు సగం జనాభా ఈ విపత్తుకు ప్రభావితమయ్యింది. 8. టర్కీ: 1999 ఆగస్టు 17న పశ్చిమ టర్కీలోని ఇజ్మిత్‌లో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 17,118 మంది మరణించారు. ఈ భూకంపం దేశంలోని అతిపెద్ద నగరమైన ఇస్తాంబుల్‌కు గణనీయమైన నష్టాన్ని మిగిల్చింది. 9. భారతదేశం: 1993, సెప్టెంబరు 30న మహారాష్ట్రలోని లాతూర్‌లో సంభవించిన భూకంపానికి 20 వేల మంది బలయ్యారు. ఈ భూకంప తీవ్రతకు లాతూర్ పట్టణమంతా ధ్వంసమయ్యింది. 40 సెకెన్లపాటు సంభవించిన ఈ భూకంపంలో 30 వేలమందికిపైగా ప్రజలు గాయపడ్డారు. 10. ఇండోనేషియా: జావాలో 2006 మే 27న 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 5,749 మంది మృతి చెందారు. రెండేళ్ల వ్యవధిలో ఇండోనేషియాలో సంభవించిన మూడో అతిపెద్ద విపత్తు ఇది. 2009, సెప్టెంబరు 30న దక్షిణ సుమత్రాలో 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 1,117 మంది మృత్యువాత పడ్డారు. ఇది కూడా చదవండి: ఏ రకమైన భూకంపం అత్యంత ప్రమాదకరం? -
భూకంపం ఎన్ని రకాలు? ఏది అత్యంత ప్రమాదకరం?
మీకు తెలుసా? భూమిపై వేర్వేరు చోట్ల రోజూ కనీసం 55 భూకంపాలు సంభవిస్తూంటాయని! ఆశ్చర్యంగా ఉన్న ఇది వాస్తవమే. భూమి పొరల్లో నిత్యం జరిగే కదలికలు ఒక దశ దాటినప్పుడు పుట్టే భూకంపం విపరీతమైన ఆస్తి, ప్రాణ నష్టాలకు కారణమవుతోంది. నేపాల్ శనివారం తెల్లవారుజామున 6.4 తీవ్రతతో ఏర్పడ్డ భూకంపం కూడా వందల మందిని బలితీసుకుంది. ఈ నేపధ్యంలో భూకంపం అంటే ఏమిటి? ఇవి ఎన్ని రకాలు? ఆసక్తికరమైన ఈ వివరాలు మీ కోసం... మన భూమి మొత్తం మూడు పొరలుగా ఉంటుందని..పై భాగాన్ని క్రస్ట్, రెండో పొరను మాంటెల్.. మధ్యభాగంలోని భాగాన్ని కోర్ అంటారని భౌగోళిక శాస్త్రం చెబుతుంది. క్రస్ట్ భాగానికి వస్తే.. ఇది జిగ్సా పజిల్ మాదిరిగా ముక్కలు ముక్కలుగా ఉంటుంది. ఈ ముక్కలనే మనం టెక్టానిక్ ప్లేట్లు అంటాం. పైగా ఈ ముక్కలు చాలా నెమ్మదిగా కదులుతూంటాయి కూడా. ఈ కదలికల కారణంగా రెండు లేదా అంతకంటే ఎక్కువ టెక్టానిక్ ప్లేట్లు ఒకదానితో ఒకటి ఢీకొంటూంటాయి. కొన్నిసార్లు ఒక ప్లే ఇంకోదాని కిందకు జరిగిపోతూంటాయి. ఈ క్రమంలో అక్కడ పేరుకుపోయిన ఒత్తిడి అకస్మాత్తుగా విడుదలైతే దాన్ని మనం భూకంపం అని పిలుస్తాం. స్థూలంగా ఈ భూకంపాలు నాలుగు రకాలు... భూమి పైపొరలు కదిలితే... భూమి పైపొర క్రస్ట్‌లోని టెక్టానిక్ ప్లేట్ల ఒరిపిడి కారణంగా వచ్చేవి ఇవి. ఈ పలకలు కదిలే సమయంలో కొన్నిసార్లు ఒకదానికిందకు ఒకటి వెళ్లిపోతాయి. లేదా దూరంగా జరుగుతాయి. ఇంకొన్నిసార్లు దగ్గరకు వస్తూంటాయి. ప్లేట్లు వేగంగా కదిలినప్పుడు ఒకదానితో ఒకటి ఢీకొని ప్రెషర్ విడుదలవుతుంది. అంటే భూకంపం వస్తుందన్నమాట. వీటిని టెక్టానిక్ భూకంపాలని పిలుస్తారు. భూకంపాలు చాలా వరకు ఈ రకమైనే. సాధారణ భూకంపాలు అని కూడా అంటారు. టెక్టోనిక్ ప్లేట్ల కదలిక ఎక్కువ వేగం ఉంటే వచ్చే భూకంపం క్షణాల్లో ఎంతటి నగరాన్నయినా ధ్వంసం చేస్తుంది. జనావాసాలు లేని, సముద్రాల్లో వచ్చే భూకంపాలతో నష్టం తక్కువ. జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న చోట్ల వస్తే మాత్రం ఆస్తి, ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుంది. అగ్నిపర్వత ప్రాంతాల్లో ఒత్తిడి తీవ్రమైతే... అగ్నిపర్వతాలకూ టెక్టానిక్ ప్లేట్లకూ మధ్య కొంత సంబంధం ఉంది. టెక్టానిక్ ప్లేట్ల సరిహద్దుల వద్ద అంటే రెండు ప్లేట్లు కలుసుకునే చోట భూమి లోపలి పొరల్లో ఉండే లావా వంటి పదార్థం బయటకు వచ్చే మార్గాలీ అగ్ని పర్వతాలు. భూమ్మీద ఉన్న అత్యధిక శాతం అగ్ని పర్వతాలు ప్లేట్ల సరిహద్దుల్లోనే ఉన్నాయి. టెక్టానిక్ ప్లేట్లు కదులుతూ ఉంటాయని ఇంతకుముందే చెప్పుకున్నాం కదా... ఆ కదలికల కారణంగా అగ్నిపర్వతాల దిగువన కూడా ఒత్తిడి, రాపిడి పెరిగిపోతుంది. ఈ క్రమంలో అప్పుడప్పుడు భూమి పై పొర (క్రస్ట్) చిరిగిపోయి లోపలి లావా, కరిగిన రాయి పైకి ఎగజిమ్ముతుంది. దాన్నే మనం అగ్నిపర్వత భూకంపం అని పిలుస్తాం. 18వ శతాబ్దంలో శాస్త్రవేత్తలు భూకంపాలకు అగ్నిపర్వతాలు ప్రధాన కారణమని అనుకునేవారు. కానీ ఇది సరికాదని నిరూపించడానికి, శాస్త్రవేత్తలు ప్రయత్నించి అసలు విషయం తెలుసుకున్నారు. అగ్నిపర్వతం పేలినప్పుడు భూమి లోపలి భాగంలో శూన్యత ఏర్పడుతుందని, ఈ శూన్యతను పూరించడానికి, అంతర్గత శిలలు లోనికి జారుతాయని తెలిపారు. అప్పుడు భూకంపం ఏర్పడుతుందని తేల్చారు. అయితే సాంకేతిక అభివృద్ధి ఈ భావన నిరాధారమని నిరూపించింది. హిమాలయ ప్రాంతంలో గత వందేళ్లలో అగ్నిపర్వత విస్ఫోటన సంకేతాలు లేనప్పటికీ ఈ ప్రాంతంలో భూకంపాలు తలెత్తుతూనే ఉన్నాయి. ఇది అగ్ని పర్వతాల కారణంగా భూకంపాలు సంభవిస్తాయనే వాదనను తోసిపుచ్చింది. అయితే అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల సంభవించే భూకంప ప్రభావిత ప్రాంతం చాలా పరిమితంగా ఉంటుందని కూడా శాస్త్రవేత్తలు గమనించారు. కుప్పకూలినా... భూకంపమే! భూమిలోపలి నిర్మాణాలు (గుహలు, గనులు సొరంగాలు) కుప్పకూలినప్పుడు పుట్టే భూకంపాలు ఇవి. వీటి తీవ్రత తక్కువే. ప్రభావం కూడా తక్కువ ప్రాంతంలో కనిపిస్తుంది. కొలాప్స్ భూకంపాలు చాలా వరకూ మానవ చర్యల ఫలితంగానే వస్తూంటాయి. 2010లో కోపియాపో గనుల వద్ద, 2019లో రిడ్జ్‌క్రెస్ట్ (కాలిఫోర్నియా, అమెరికా) ఇలాంటి భూకంపాలు నమోదయ్యాయి. అణ్వస్త్ర, రసాయన ఆయుధాల పేలుళ్లు కూడా భూకంపాలకు కారణమవుతాయి. భారీ స్థాయి గని పేలుళ్లు కూడా! వీటిని పేలుళ్లకు సంబంధించిన భూకంపాలు ఇంగ్లీషులో చెప్పాలంటే ఎక్స్ప్లోషన్ ఎర్త్‌క్వేక్స్ అని పిలుస్తారు. వీటితో విధ్వంసం తక్కువ. కాకపోతే ప్రకపంపలు చాలా దూరం ప్రయాణించగలవు. 1945లో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్‌లోని హిరోషిమాపై అణుబాంబు పడినప్పుడు, లెబనాన్‌లో 2020లో జరిగిన పేలుడు ఓ మోస్తరు స్థాయిలో భూకంపాలు పుట్టించాయి. ఇది కూడా చదవండి: నేపాల్‌లో భారీ భూకంపం.. 128 మంది మృతి -
పాకిస్తాన్‌కు భారీ భూకంపం ముప్పు? వణికిపోతున్న జనం?
పాక్‌లో భారీ భూకంపానికి సంబంధించిన అంచనాలు వెలువడిన నేపధ్యంలో పాకిస్తాన్ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. నెదర్లాండ్స్‌కు చెందిన ఒక పరిశోధనా సంస్థ నుండి వచ్చిన సోషల్ మీడియా పోస్ట్ పాకిస్తాన్లో రాబోయే 48 గంటల్లో సంభవించే విధ్వంసక భూకంపానికి సంబంధించిన అంచనాను వెల్లడించింది. ఈ వార్త విన్నప్పటి నుంచి పాక్ పౌరులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. సోలార్ సిస్టమ్ జామెట్రీ సర్వే (ఎస్‌ఎస్‌జీఈఓఎస్)కు చెందిన ఒక పరిశోధకుడు.. పాకిస్తాన్, దాని చుట్టుపక్కల ప్రాంతాలలో బలమైన వాతావరణ హెచ్చుతగ్గులు గమనించామని, ఇది రాబోయే బలమైన భూకంపాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. ఈ వార్త దేశంలో దావానలంలా వ్యాపించింది. రానున్న 48 గంటల్లో దేశంలో పెను భూకంపం వచ్చే అవకాశం ఉందంటూ వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రచారం జరుగుతోంది. డచ్ శాస్త్రవేత్త ఫ్రాంక్ హూగర్బీట్స్ ఈ విషయాన్ని తెలియజేశారంటూ ప్రచారం జరుగుతోంది. అతను గతంలో టర్కీ, సిరియాలో ప్రమాదకరమైన భూకంపాలను అంచనా వేయడానికి గ్రహాల అమరికను అధ్యయనం చేశారు. మరో 48 గంటల్లో పాకిస్థాన్‌లో బలమైన భూకంపం వస్తుందని ఈ శాస్త్రవేత్త అంచనా వేసినట్లు ఈ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో పాక్ ప్రజలు భయాందోళనలకు లోనవుతున్నారు. ప్రాణాలను దక్కించుకునేందుకు ఏం చేయాలంటూ అధికారుల సలహాలు తీసుకుంటున్నారు. ఇది కూడా చూడండి: అతి చిన్న స్వయం ప్రకటిత దేశం ఏది? జనాభా ఎంత? On 30 September we recorded atmospheric fluctuations that included parts of and near Pakistan. This is correct. It can be an indicator of an upcoming stronger tremor (as was the case with Morocco). But we cannot say with certainty that it will happen. https://t.co/B6MtclMOpe — Frank Hoogerbeets (@hogrbe) October 2, 2023 -
ప్రపంచాన్ని వణికించిన 10 భూకంపాలు
భూకంపం.. నివారించడం సాధ్యం కాని పెనువిపత్తు. దీనికి జాగ్రత్త, అప్రమత్తత ఒక్కటే పరిష్కారం. ముందస్తుగా సన్నద్ధం కావడం వల్ల భూకంపాలు వంటి విపత్తుల వల్ల కలిగే వినాశనం నుంచి కొంత వరకు కాపాడుకోవచ్చు. ఆఫ్రికాలోని మొరాకోలో సెప్టెంబర్ 8వ తేదీ రాత్రి సంభవించిన విధ్వంసకర భూకంపం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ భూకంపం కారణంగా రెండు వేల మందికి పైగా ప్రజలు మరణించినట్లు నిర్ధారించారు. మొరాకో కంటే ముందుగా ప్రపంచంలోని అనేక దేశాలలో భూకంపాలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. ఇప్పుడు మనం ప్రపంచంలో సంభవించిన పది భారీ భూకంపాల గురించి తెలుసుకుందాం. 1. ప్రిన్స్ విలియం సౌండ్, అలాస్కా 1964, మార్చి 28న అమెరికాలోని అలాస్కాలో సంభవించిన భూకంప తీవ్రత 9.2గా అంచనా వేశారు. ఆ సమయంలో కెనడా సహా పరిసర ప్రాంతాల్లో భూకంప ప్రకంపనలు వచ్చాయి. ఆ సమయంలో భూమి సుమారు మూడు నిమిషాల పాటు కంపించింది. 250 మందికిపైగా ప్రజలు మరణించగా, వేల మంది గల్లతయ్యారు. 2. వాల్డివియా, చిలీ 1960, మే 22న చిలీలో సంభవించిన భూకంపం 1655 మందిని సమాధి చేసింది. సుమారు మూడు వేల మంది క్షతగాత్రులయ్యారు. భూకంపం కారణంగా దాదాపు రెండు లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. విపత్తు కారణంగా చిలీ సుమారు 550 అమెరికా మిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది. భూకంప తీవ్రత 9.5గా నమోదైంది. 3. గుజరాత్, భుజ్ 2001లో భారతదేశంలోని గుజరాత్‌లోని భుజ్‌లో సంభవించిన భూకంప తీవ్రత 7.7గా అంచనా వేశారు. ఈ భూకంపం కారణంగా నగరం మొత్తం శిథిలాల కుప్పగా మారిపోయింది. కచ్, భుజ్లలో ముప్పై వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. భూకంపం కారణంగా 1.5 లక్షల మందికి పైగా ప్రజలు నష్టపోయారు. 4. పాకిస్తాన్, క్వెట్టా 2005, అక్టోబర్ 8న పాకిస్తాన్‌లోని క్వెట్టాలో సంభవించిన భూకంపంలొ 75 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 80 వేల మంది గాయపడ్డారు. ఈ భూకంప తీవ్రత 7.6గా నమోదైంది. 5. ఇండోనేషియా, సుమత్రా 2012 ఏప్రిల్ 11న ఇండోనేషియాలోని సుమత్రాలో సంభవించిన భూకంప తీవ్రత 8.6గా నమోదైంది. ఈ భూకంపం భారీ విధ్వంసాన్ని సృష్టించింది. ఈ భూకంపంలో 2,27,898 మంది మరణించారు. 6. జపాన్, ఫుకుషిమా 2011 మార్చి 11న జపాన్‌లోని ఫుకుషిమాలో సంభవించిన భూకంపంలొ 18 వేల మందికి పైగా మరణించారు. ఆ సమయంలో జపాన్ విపత్తులను ఎదుర్కొంటోంది. భూకంపం వచ్చిన వెంటనే జపాన్‌లో సునామీ సంభవించింది, ఇది కొన్ని మిలియన్ల ప్రజలను ప్రభావితం చేసింది. 7. ఫ్రాన్స్, హైతీ 2019 జనవరి 13న ఫ్రాన్స్‌లోని హైతీలో సంభవించిన భూకంప తీవ్రత 7.0గా నమోదయ్యింది. ఈ భూకంపంలో దాదాపు 3 లక్షల 16 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో భూకంపం కారణంగా 80 వేల భవనాలు ధ్వంసమయ్యాయి. 8. నేపాల్ 2015, ఏప్రిల్ 25న సంభవించిన భూకంపం ఎనిమిది వేల మంది ప్రాణాలను బలిగొంది. భూకంప తీవ్రత 8.1గా నమోదయ్యింది. ఈ భూకంప ప్రకంపనలు భారతదేశం, దాని పొరుగు దేశాలలో కూడా కనిపించాయి. 9. దక్షిణ అమెరికా, చిలీ 1060 మే 22న చిలీలో బలమైన భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత 9.5గా నమోదైంది. ఇది ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన భూకంపంగా పరిగణిస్తారు. ఈ ఘటనలో సుమారు ఎనిమిది లక్షల మంది మరణించారు. 10. దక్షిణ ఆఫ్రికా, మొరాకో 2023, సెప్టెంబరు 8న ఆఫ్రికాలోని మొరాకోలో సంభవించిన భూకంపం కారణంగా ఇప్పటివరకు రెండు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని సమాచారం. అయితే ఈ గణాంకాలు ఇంకా పూర్తిగా స్పష్టం కాలేదు. ఇది కూడా చదవండి: తొలినాళ్లలో మనిషి ఏనుగులను తినేవాడా? -
ఇంకా 1000మంది జాడ తెలియదు
పలూ: గతవారం ఇండోనేసియా దేశాన్ని కుదిపేసిన భారీ భూకంపం, సునామీ విలయంలో ఇంకా జాడ తెలియని వారి సంఖ్య వెయ్యిమందికి పైగా ఉన్నట్లు తాజాగా తేలింది. తీవ్ర భూకంపంతో పాటుగా సునామీ ధాటికి సులావేసి ద్వీపంలోని పలు నగరంలో మరణించిన వారి సంఖ్య 1,558కు చేరుకుంది. అక్కడి నివాస గృహాలు, వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో చాలామంది ప్రజలు ఆ ప్రాంతంను వదిలి వెళ్ళిపోయారు. ఈమేరకు శుక్రవారం ఇండోనేసియా ప్రభుత్వ ఉన్నతాధికారులు మీడియాకు వెల్లడించారు. సునామీ ఘటనలో మరణించిన వారికి బలరోవా ప్రాంతంలో ప్రభుత్వమే సామూహిక అంత్యక్రియలను నిర్వహించింది. -
తేరుకోని ఇండోనేసియా
ఇండోనేసియాలో భూకంపం, సునామీ ధాటికి పూర్తిగా ధ్వంసమై మరుభూమిని తలపిస్తున్న పలూ పట్టణం. ఈ ప్రకృతి విలయంలో సజీవసమాధి అయినవారి సంఖ్య తాజాగా 1,200కు చేరిందని అనధికార వార్తలొచ్చాయి. దాదాపు 1,91,000 మంది తక్షణ అవసరం కోసం ఎదురుచూస్తున్నారని సోమవారం ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. సహాయకచర్యలను ముమ్మరంచేశారు. మరోవైపు, అసువులుబాసిన వందలాది మందిని ఒకేచోట ఖననంచేసేందుకు పలూ పట్టణంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
సునామీ బీభత్సం.. 800కు చేరిన మృతుల సంఖ్య
జకార్తా : సునామీ దాటికి దీవుల దేశం ఇండోనేషియా చిగురుటాకులా వణికుతోంది. శుక్రవారం సంభవించిన భారీ భూకంపంతోపాటు, సునామీ ప్రకంపనలకు మృతుల సంఖ్య 800 మందికి చేరినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎక్కువగా సులవేసి సమీపంలోని పలూ పట్టణంలో అత్యధికంగా ప్రజలు మరణించినట్లు అధికారులు తెలిపారు. పలూ పట్టణంలో వీదేశి పర్యాటకులు బీచ్ ఫెస్టివల్‌కు సిద్దమవుతున్న తరుణంలోనే సునామీ రావడంతో ప్రాణ నష్టం భారీ సంఖ్యలో వాటిల్లింది. సునామీ ధాటికి వేల మంది గల్లంతయ్యారని, వారి సమాచారం ఇంకా తెలియాల్సి ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. క్షతగాత్రులను పునరావాస కేంద్రాలకు తరలిస్తూ.. హెలికాఫ్టర్లు, సైనిక దళాల సహాయంతో చర్యలు చేపడుతున్నారు. సునామీ ధాటికి రోడ్లు, భవనాలు, తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రకృతి ప్రతాపానికి అనేక మంది ప్రజలు నిరాశ్రయులైనారు. కాగా ఇండోనేషియాను భారత్ తరఫున తగిన సహాయం అందిస్తామని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఐక్యరాజ్య సమితి వేదికగా ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఉ.కొరియా ‘అణు భూకంపం’?
-
మెక్సికోలో మళ్లీ భూకంపం
మెక్సికో సిటీ: మెక్సికోను భూకంపం మరోసారి వణికించింది. ఇటీవలే రెండు శక్తిమంత భూకంపాలతో కుదేలైన ఆ దేశాన్ని శనివారం రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో ప్రకంపనలు కలవరపాటుకు గురిచేశాయి. తాజా భూకంప కేంద్రం ఒవాక్సాకా రాష్ట్రంలోని మాటియాస్ రొమెరోకు 18 కి.మీ దూరంలో ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది. గత వారం సంభవించిన భూకంప తదనంతర ప్రకంపనలే ఇవి అని తెలిపింది. తాజా భూకంపానికి భయపడి మెక్సికో సిటీలో వందలాది మంది ప్రజలు బయటికి పరుగులు పెట్టారు. ఇంటి నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఇద్దరు వృద్ధులు గుండెపోటుకు గురై మృతిచెందారు. గత భూకంప బాధితులను కాపాడేందుకు కొనసాగుతున్న సహాయక చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఒవాక్సాకాలో కూడా స్వల్పంగా నష్టం చోటుచేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. -
ఉ.కొరియా ‘అణు భూకంపం’?
బీజింగ్: ఉత్తరకొరియాలోని అణు పరీక్ష కేంద్రం సమీపంలో 3.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అమెరికాకు చెందిన భూకంప శాస్త్రవేత్తలు వెల్లడించారు. అణు పరీక్ష కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలోనే ఈ భూకంపం సంభవించిందని అమెరికా జియోలాజికల్ సర్వే తేల్చింది. ‘అణు పరీక్షలు జరిపిన ప్రాంతంలోనే భూకంపం సంభవించింది. అది సహజ భూకంపమా, పరీక్షల కారణంగా వచ్చిన భూకంపమా అనేది ధ్రువీకరించలేం’ అని తెలిపింది. ‘అనుమానాస్పద పేలుడు’ వల్లే ఈ భూకంపం సంభవించినట్లు చైనా భూకంప నెట్వర్క్ కేంద్రం తెలిపింది. అయితే దక్షిణ కొరియా మాత్రం దీన్ని విభేదిస్తూ సహజ భూకంపమేనని పేర్కొంది. -
భూప్రకంపనలతో అలజడి
ఎచ్చెర్ల/లావేరు/సంతకవిటి: వరుస భూప్రకంపనలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎచ్చెర్ల, పొందూరు, లావేరు, రణస్థలం తదితర ప్రాంతాల్లో బుధవారం రాత్రి 8.10 గంటల సమయంలో రెండుసార్లు భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కేశవరావుపేట, ఎస్ఎం.పురం తదితర చోట్ల గ్రామస్తులు రోడ్లపైకి చేరుకున్నారు. అయితే ఎటువంటి నష్టం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. గత ఏడాది డిసెంబర్లో 24, 27, 28, 29, 31, ఈ ఏడాది జనవరిలో 3, 4, 8వ తేదీల్లో, ఫిబ్రవరి 14న, మార్చి 7న, ఇదే నెల 5న స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. లావేరు మండలంలోని బుడుమూరులో బుధవారం రాత్రి భూమి స్వల్పంగా కంపించడంతో గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సంతకవిటి మండలంలోని మండాకురిటి గ్రామంలోనూ భూప్రకంపనలతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. ఇళ్లలోని వస్తు సామగ్రి కింద పడిందని గ్రామస్తులు తెలిపారు. -
అండమాన్
అండమాన్ : అండమాన్ నికోబార్ దీవుల్లో మంగళవారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్కర్ స్కేల్‌పై 5.5గా నమోదు అయ్యింది. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. కాగా సునామీ హెచ్చరికలు లేవని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.