
నాందేడ్: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఈరోజు (మంగళవారం) భూకంపం సంభవించింది. నాందేడ్ నార్త్ సిటీ, హద్గావ్, అర్ధపూర్ తాలూకాలోని కొన్ని ప్రాంతాల్లో భూ ప్రకంపనలు కనిపించాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.8గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.
నాందేడ్ నగరానికి ఈశాన్యంగా 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న హడ్‌గావ్ తాలూకాలోని సావర్‌గావ్ గ్రామంలో భూకంప కేంద్రం ఉంది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని జిల్లా ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ అధికారి కిషోర్ కుర్హే తెలిపారు.
భారతదేశ భూకంప పటంలో నాందేడ్.. జోన్ IIలో ఉంది. ఈ ప్రాంతంలో భూకంపం సంభావ్యత తక్కువగా ఉంటుంది. ఈ నగరం మహారాష్ట్రలోని మరఠ్వాడా డివిజన్‌లో గోదావరి నదికి ఉత్తర ఒడ్డున ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ సమయంలో అక్కడ ఎలాంటి నష్టం జరగలేదు.
ఇది కూడా చదవండి: కమల ఇంటర్వ్యూ ఎడిట్ చేశారు: డొనాల్డ్ ట్రంప్