
పలూ: గతవారం ఇండోనేసియా దేశాన్ని కుదిపేసిన భారీ భూకంపం, సునామీ విలయంలో ఇంకా జాడ తెలియని వారి సంఖ్య వెయ్యిమందికి పైగా ఉన్నట్లు తాజాగా తేలింది. తీవ్ర భూకంపంతో పాటుగా సునామీ ధాటికి సులావేసి ద్వీపంలోని పలు నగరంలో మరణించిన వారి సంఖ్య 1,558కు చేరుకుంది. అక్కడి నివాస గృహాలు, వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో చాలామంది ప్రజలు ఆ ప్రాంతంను వదిలి వెళ్ళిపోయారు. ఈమేరకు శుక్రవారం ఇండోనేసియా ప్రభుత్వ ఉన్నతాధికారులు మీడియాకు వెల్లడించారు. సునామీ ఘటనలో మరణించిన వారికి బలరోవా ప్రాంతంలో ప్రభుత్వమే సామూహిక అంత్యక్రియలను నిర్వహించింది.
Comments
Please login to add a commentAdd a comment