భూకంపాల తీవ్రతను రిక్టర్ స్కేల్‌తో కొలుస్తారు. రిక్టర్ స్కేల్‌ను చార్లెస్ ఫ్రాన్సిస్ రిక్టర్ 1935లో అభివృద్ధి చేశారు.అయితే దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇది భారీ భూకంపాలు సంభవించినప్పుడు దాని తీవ్రతను ఖచ్చితంగా కొలవలేదు. ఈ నేపధ్యంలోనే 1970లలో రిక్టర్ స్కేల్ స్థానంలో మూమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్ (ఎంఎంఎస్) ఆవిష్కృతమయ్యింది. ఇది భారీ భూకంపాల తీవ్రతను మరింత విశ్వసనీయంగా అంచనా వేస్తుంది. అయితే నేటికీ భూకంప తీవ్రతను రిక్టర్ స్కేలుపై గుర్తించినట్లు రాస్తున్నారు. అందుకే ఇప్పుడు రిక్టర్ స్కేల్, మూమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్ మధ్యగల తేడాలను, ఉపయోగాలను తెలుసుకుందాం.
2023, ఫిబ్రవరి 8న టర్కీలోని ఆగ్నేయ ప్రాంతంలో, సిరియా సరిహద్దుకు సమీపంలో భూకంపం సంభవించినప్పుడు మూమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్ సహాయంతో తీవత్రను కొలవగా 10కి 7.8గా నమోదయ్యింది. మూమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్ అనేది భూకంపం ద్వారా విడుదలయ్యే మొత్తం శక్తిని కొలిచే సంవర్గమాన ప్రమాణం. ఇది అతిపెద్ద భూకంపాలను (అంటే 8 తీవ్రత కంటే ఎక్కువ) ఖచ్చితంగా కొలవగల ఏకైక స్కేల్.
మూమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్‌ను 1970లలో జపనీస్ భూకంప శాస్త్రవేత్త హిరో కనమోరియాండ్, అమెరికన్ భూకంప శాస్త్రవేత్త థామస్ సి. హాంక్స్ సంయుక్తంగా అభివృద్ధి చేశారు. మొమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్ భూకంపం సంభవించిన క్షణంలో దాని తీవ్రతను అంచనావేస్తుంది. రిక్టర్ స్కేల్‌ను 1935లో చార్లెస్ ఎఫ్. రిక్టర్ అభివృద్ధి చేశారు. దీనిలో భూకంపం సంభవించిన సమయంలో విడుదలయ్యే శక్తిని కొలిచేందుకు ఉపయుక్తమవుతుంది.
రిక్టర్ స్కేల్ అనేది బేస్-10 లాగరిథమిక్ స్కేల్. 5 కంటే తక్కువ తీవ్రత గల భూకంపాలను గుర్తించడంలో ఇది అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. భూకంప మూలం నుండి నిర్దిష్ట దూరంలో నమోదయిన అతిపెద్ద తరంగం వ్యాప్తిని రిక్టర్ స్కేలు గుర్తిస్తుంది. అయితే రిక్టర్ స్కేల్ భూకంప నష్టాన్ని అంచనా వేయలేదు. అందుకే ప్రస్తుతం భూకంపాలను తీవ్రతను సమగ్రంగా తెలుసుకునేందుకు మూమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్ వినియోగిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఆసియాను కుదిపేసిన 10 భారీ భూకంపాలివే..
Comments
Please login to add a commentAdd a comment