scale
-
ఎవరీ విశ్వనాథ్ కార్తికే..? జస్ట్ 16 ఏళ్లకే..!
దక్షిణ అమెరికాలోని ఎత్తైన శిఖరం అకాన్కాగువా (22,837 అడుగులు)ను అధిరోహించి మరో సారి చరిత్ర సృష్టించాడు హైదరాబాద నగరానికి చెందిన 16 ఏళ్ల బాలుడు పడకంటి విశ్వనాథ్ కార్తికే. ఇప్పటికే వివిధ ఖండాల్లోని ఎత్తైన పర్వతాలు, శిఖరాగ్రాలను చేరుకుని భారతీయ జెండాను సగర్వంగా ఎగురవేసిన విశ్వనాథ్ కార్తికే తన ఖాతాలో మరో ప్రపంచ ఎత్తైన పర్వతాన్ని చేర్చాడు. నగరంలోని రెసొనెన్స్ జూనియర్ కళాశాలలో 11వ తరగతి చదువుతున్న విశ్వనాథ్ కార్తికే, అనుభవజ్ఞుడైన పర్వతారోహకుడు భరత్ తమ్మినేని, భారత సైనిక అధికారి లెఫ్టినెంట్ రోమిల్ బారాత్వల్ మార్గదర్శకత్వంలో నాలుగు సంవత్సరాలుగా ఎత్తైన పర్వతారోహణకు కఠిన శిక్షణ పొందుతున్నాడు. ఈ ప్రయత్నంలో భాగంగానే బూట్స్– క్రాంపన్స్ బృందంతో పాటుగా అకాన్కాగువా పర్వతాన్ని అధిరోహించి సురక్షితంగా బేస్ క్యాంప్‌కు తిరిగి చేరుకున్నాడు. 22,837 అడుగుల (6,961 మీటర్లు) ఎత్తులో ఉన్న అకాన్కాగువా పర్వతం ఆసియా వెలుపల ఎత్తైన పర్వతంగా గుర్తింపు పొందింది. అక్కడి వాతావరణం విపత్కంగా ఉండటంతో పాటు అధిక గాలులు, విపరీతమైన చలి తన లక్ష్యానికి కఠిన సవాలుగా నిలిచిందని విశ్వనాథ్ తెలిపాడు. అర్జెంటీనాలోని ఆండీస్ పర్వత శ్రేణిలోని ఈ శిఖరం భూతలానికి అత్యంత ఎత్తైన శిఖరం. ఖండాంతరాలను దాటి.. మౌంట్ అకాన్కాగువానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎత్తైన పర్వతాలు.. డెనాలి (ఉత్తర అమెరికా), ఎల్బ్రస్ (యూరప్), కిలిమంజారో (ఆఫ్రికా), కోస్కియుస్కో (ఆ్రస్టేలియా), విన్సన్ మాసిఫ్ (అంటార్కిటికా), ఐస్లాండ్ పీక్ (నేపాల్), భారత్‌లోని కాంగ్ యాట్సే 1, 2 పర్వతాలతో పాటు డిజో జోంగో, ఫ్రెండ్షిప్ పీక్, కాలా పత్తర్, ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వంటి వాటిని ఇప్పటికే అధిరోహించి చరిత్ర సృష్టించాడు. తన తదుపరి లక్ష్యం ఎవరెస్ట్ పర్వతం (29,032 అడుగులు)అని, ఈ లక్ష్యాన్ని ఈ ఏడాది మేలో పూర్తిచేయడానికి సన్నద్ధమవుతున్నానని పేర్కొన్నాడు. ఈ లక్ష్యాన్ని చేరుకుని యువ సాహాసికులకు విశ్వనాథ్ స్ఫూర్తిగా నిలవనున్నాడని శిక్షకులు భరత్ తమ్మినేని సంతోషం వ్యక్తం చేశారు. (చదవండి: వయసుకే వృద్ధాప్యం.. ! నవ యవ్వనంగా వయోధికులు..) -
చలికి ‘పట్టు’ తప్పుతోంది
తళుక్కున మెరవాల్సిన ‘పట్టు’..మార్కెట్లో వెలవెలబోతోంది. చలి తీవ్రతకు పట్టుగూళ్లకు సన్నపుకట్టు తెగులు సోకుతుండగా నాణ్యత తగ్గి ధరపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకుని పట్టుగూళ్లు ఉత్పత్తి చేసిన రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారు.హిందూపురం: పట్టుగూళ్ల మార్కెట్‌కు సత్యసాయి జిల్లా హిందూపురం ఆసియాలోనే పేరుగాంచింది. మిగతా మార్కెట్లతో పోలిస్తే అధిక ధరలు దక్కుతుండటంతో హిందూపురం, మడకశిర, గుడిబండ, సోమందేపల్లి, లేపాక్షితోపాటు కర్ణాటక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా వందలాది మంది రైతులు పట్టుగూళ్లను ఇక్కడి తీసుకువచ్చి విక్రయాలు చేస్తుంటారు. అందువల్లే హిందూపురం పట్టుగూళ్ల మార్కెట్‌కు రోజూ 6 వేల క్వింటాళ్లకుపైగా పట్టుగూళ్లు వస్తుంటాయి. కానీ ప్రస్తుతం పట్టుగూళ్ల ఉత్పత్తిపై చలి ప్రభావం తీవ్రంగా చూపుతోంది. అంతేకాకుండా పట్టుగూళ్లకు సున్నపుకట్టు తెగులు సోకడంతో దిగుబడి తగ్గుతోంది. ప్రస్తుతం మార్కెట్‌కు 3 వేల క్వింటాళ్లలోపే పట్టుగూళ్లు వస్తున్నాయి. ముందుకురాని రీలర్లు దిగుబడి అంతంతమాత్రమే ఉండగా మార్కెట్లో మంచి ధర పలకాలి. కానీ పట్టుగూళ్ల కొనుగోళ్లకు రీలర్లు ముందుకురాకపోవడంతో ఆశించిన ధరలు రావడం లేదు. ఓ రీలర్ టెండర్ వేస్తే దాన్ని మించి కనీసం రూ.5 ఇచ్చేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. ఈనెల 15వ తేదీన కిలో బైవోల్టీన్ రకం పట్టుగూళ్లు రూ.750 పలకగా, కనిష్టంగా రూ.552 మాత్రమే పలికాయి. అలాగే 19 తేదీన గరిష్టంగా రూ.744, కనిష్టంగా రూ.567, 20న గరిష్టంగా రూ.751, కనిష్టంగా రూ.620, 21వతేదీన కిలో గరిష్టంగా రూ.748, కనిష్టంగా రూ.544 మాత్రమే పలికాయి. దీంతో ఎంతో ఆశతో ఇక్కడివరకూ వస్తున్న రైతులు కనీసం రవాణా చార్జీలు దక్కక నష్టాలపాలవుతున్నారు. ఉష్ణోగ్రత తగ్గకుండానే చూసుకోవాలి పట్టుగూళ్లు షెడ్లలో ఉష్ణగ్రతలు తగ్గకుండా చూసుకోవాలని ఉద్యానశాఖ అధికారులు సూచిస్తున్నారు. లేకపోతే పట్టుగూళ్లు సున్నపుకట్టు బారిన పడి దిగుబడి పూర్తిగా తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు. షెడ్లులో రాత్రిళ్లు కనీసం 20 డిగ్రీలు తగ్గకుండా ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. కొందరు రైతులు షెడ్లలో వేడికోసం 200 వాల్టల బల్పులు పెడుతున్నా, దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదన్నారు. షెడ్లలో బొగ్గుల కుంపటి పెట్టి వేడిని పెంచుకోవాలన్నారు. మార్కెట్‌కు గూళ్లు తెచ్చే ముందు కూడా ఆ రోజు చివరగా అల్లిన గుడ్డులో పురుగు ప్యూపా అయిందో లేదో చూసి పూర్తిగా ప్యూపా దశలో ఉంటేనే మార్కెట్‌కు తీసుకువస్తే ఆశించిన ధర లభిస్తుంది. ధర పెరిగితేనే గిట్టుబాటు చలి ప్రభావంతో పట్టుగూళ్ల ఉత్పత్తి చాలా ఇబ్బందికరంగా మారుతోంది. వ్యయప్రసాలకోర్చి గూళ్లను మార్కెట్‌కు తీసుకువస్తే సరైన ధర దక్కక నష్టపోవాల్సి వస్తోంది. ప్రస్తుత ‘పురం’ మార్కెట్లో క్వింటా బైవోల్ట్న్ రకం పట్టుగూళ్లు రూ.700 వరకు పలుకుతున్నాయి. క్వింటా కనీసం రూ.800పైగా పలికితే నష్టాలు ఉండవు. లేకపోతే రైతుల రెక్కల కష్టం వృథా కావడం ఖాయం. – వీరాంజినేయ, పావగడరీలర్లు ముందుకు రావడం లేదు పట్టుగూళ్ల కొనుగోలుకు రీలర్లు ముందుకు రావడం లేదు. ఒక రీలర్ టెండరు వేస్తే దానిపైన రూ.5 పెంచేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. వ్యయ ప్రయాసల కోర్చి పట్టుగూళ్లును మార్కెట్‌కు తెస్తున్న రైతులకు నిరాశే మిగులుతోంది. కనీసం క్వింటా పట్టుగూళ్లు రూ.750పైబడి పలికితే రైతులకు ఇబ్బందులు ఉండవు. ప్రసుత్తం ఆ మేర ధర పలకడం లేదు. – హర్షవర్థన్‌రెడ్డి, వైబీ హళ్లి -
శిఖరాలు ఆశీర్వదించాయి..!
నిరాశ అనేది పరాజయాలకు ‘సుస్వాగతం’ బోర్డ్లాంటిది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం అనేది అన్వీష్ వర్మ కల. అయితే వివిధ కారణాల వల్ల రెండు సార్లు తన కలను నెరవేర్చుకోవడంలో విఫలం అయ్యాడు. అయినా సరే...పట్టువదలని అన్వీష్ వర్మ మూడో ప్రయత్నంలో తన కల నెరవేర్చుకున్నాడు. ఆ తరువాత ఏడు ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను అధిరోహించాడు....తాజాగా ప్రపంచంలో కొందరికి మాత్రమే సాధ్యం అయ్యే ప్రపంచంలో ఎత్తైన పర్వతాల అథిరోహణలో సత్తా చాటుతున్నాడు మధురవాడకు చెందిన అన్వీష్వర్మ(Anmish Varma). ట్రెక్కింగ్ తన జీవితాశయంగా గత పదేళ్ల నుంచి దేశ, విదేశాల్లో ప్రయాణం సాగిస్తున్నాడు. చిన్నప్పటి నుంచే పర్వతారోహణ, సాహస క్రీడలు అంటే అన్వీష్కు ఇష్టం. స్నేహితులతో కలిసి సింహాచలం కొండ ఎక్కేవాడు. ఆ సమయంలోనే భూమి మీద ఎత్తైన శిఖరాలను ఎక్కాలనే లక్ష్యానికి బీజం పడింది.మార్షల్ ఆర్ట్స్ టు మౌంట్ ఎవరెస్ట్మార్షల్ ఆర్టిస్ట్ అయిన అన్వీష్ వరల్డ్ బాక్సింగ్, కరాటే అసోసియేషన్ గ్రీస్, ఆస్ట్రేలియాలో నిర్వహించిన పోటీల్లో విజేతగా నిలిచాడు. మార్షల్ ఆర్టిస్ట్‌గా రాణిస్తూనే పర్వతారోహణపై దృష్టి సారించాడు. ఎవరెస్ట్ ఎంత ఎత్తు, ఎలా ఎక్కాలి, ఎంత ఖర్చు అవుతుందో కూడా తెలియదు. అయితే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం అనేది ఎంతో కష్టం, ఖర్చుతో కూడుకున్నదనే విషయం అర్థమైంది. ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలనుకునే వారి కోసం వెలువడిన నోటిఫికేషన్ పర్వతారోహణ వైపు తొలి అడుగు వేసేలా చేసింది. విజయవాడ బీఆర్ ఆకాడమీలో సెలక్షన్స్ జరగగా నలభై మంది ఎంపికయ్యారు. అందులో అన్వీష్ ఒకరు. డార్జిలింగ్‌లో ఉన్న హిమాలయ మౌంటెనరీ ఇనిస్టిట్యూట్‌లో బేసిక్ మౌంటెనరీ ట్రైనింగ్ తీసుకున్నాడు.మూడో ప్రయత్నంలో కల నిజమైంది!2018లో అయిదు మంది ఎవరెస్ట్ అధిరోహించే క్రమంలో రాంబాబు అనే వ్యక్తికి తలలో బ్లడ్ క్లాట్ అవడంతో కుప్ప కూలిపోయాడు. అతడిని రక్షించడం కోసం వెనక్కి వచ్చేశారు. 2021లో రెండోసారి 8,500 మీటర్లు డెత్ జోన్‌కి చేరుకునేసరికి తనకి సహాయంగా వచ్చిన షెర్ప్ అనారోగ్యానికి గురికావడంతో రెండో సారి కూడా వెనక్కి రావాల్సి వచ్చింది. రెండు సార్లు విఫలం కావడంతో నిరాశకు గురవుతారు. అయితే వివిధ కారణాల వల్ల ఎవరెస్ట్‌ను అధిరోహించకపోయినా నిరాశను దరి చేరనివ్వకుండా మూడో ప్రయత్నంలో తన కల నెరవేర్చుకున్నాడు. ఈ విజయంతో తన మీద తనకు నమ్మకం రెట్టింపు అయ్యింది. అలా తన జైత్రయాత్ర మొదలైంది. నాకు ఏమీ తెలియదు...నేనేం చేయగలను అనుకుంటే ఉన్నచోటే ఉండిపోతాం. తెలుసుకోవాలనే తపన ఉంటే ఎన్ని విజయాలు అయినా సాధించవచ్చు. ఎవరెస్ట్‌కు ముందు పర్వతారోహణ గురించి నాకు పెద్దగా తెలియదు. అయితే ముందుకు వెళుతున్న కొద్దీ ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాను. నా కలను నిజం చేసుకున్నాను.– అన్వీష్ వర్మ ఆఫ్రికాలోని కిలిమంజారో నుంచి యూరప్‌లోని మౌంట్ ఎల్బ్రస్ వరకు మొదటి ప్రయత్నంలోనే ఏడు ఖండాల్లో ఎత్తైన శిఖరాల అధిరోహణను మూడేళ్లలోనే ఆ పని పూర్తి చేశాడు. తాజాగా ప్రపంచంలో ఎత్తైన అగ్నిపర్వతం మౌంట్ ఓజోస్ డెల్స్ సలెడో(చిలీ) అధిరోహించాడు. అన్వీష్ వర్మ మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. – రామునాయుడు, సాక్షి, మధురవాడ, విశాఖపట్నం(చదవండి: సక్సెస్‌ని ఒడిసిపట్టడం అంటే ఇదే..!) -
మూమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్ అంటే ఏమిటి? రిక్టర్ స్కేల్ కన్నా ఎంత ఉత్తమం?
భూకంపాల తీవ్రతను రిక్టర్ స్కేల్‌తో కొలుస్తారు. రిక్టర్ స్కేల్‌ను చార్లెస్ ఫ్రాన్సిస్ రిక్టర్ 1935లో అభివృద్ధి చేశారు.అయితే దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇది భారీ భూకంపాలు సంభవించినప్పుడు దాని తీవ్రతను ఖచ్చితంగా కొలవలేదు. ఈ నేపధ్యంలోనే 1970లలో రిక్టర్ స్కేల్ స్థానంలో మూమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్ (ఎంఎంఎస్) ఆవిష్కృతమయ్యింది. ఇది భారీ భూకంపాల తీవ్రతను మరింత విశ్వసనీయంగా అంచనా వేస్తుంది. అయితే నేటికీ భూకంప తీవ్రతను రిక్టర్ స్కేలుపై గుర్తించినట్లు రాస్తున్నారు. అందుకే ఇప్పుడు రిక్టర్ స్కేల్, మూమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్ మధ్యగల తేడాలను, ఉపయోగాలను తెలుసుకుందాం. 2023, ఫిబ్రవరి 8న టర్కీలోని ఆగ్నేయ ప్రాంతంలో, సిరియా సరిహద్దుకు సమీపంలో భూకంపం సంభవించినప్పుడు మూమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్ సహాయంతో తీవత్రను కొలవగా 10కి 7.8గా నమోదయ్యింది. మూమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్ అనేది భూకంపం ద్వారా విడుదలయ్యే మొత్తం శక్తిని కొలిచే సంవర్గమాన ప్రమాణం. ఇది అతిపెద్ద భూకంపాలను (అంటే 8 తీవ్రత కంటే ఎక్కువ) ఖచ్చితంగా కొలవగల ఏకైక స్కేల్. మూమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్‌ను 1970లలో జపనీస్ భూకంప శాస్త్రవేత్త హిరో కనమోరియాండ్, అమెరికన్ భూకంప శాస్త్రవేత్త థామస్ సి. హాంక్స్ సంయుక్తంగా అభివృద్ధి చేశారు. మొమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్ భూకంపం సంభవించిన క్షణంలో దాని తీవ్రతను అంచనావేస్తుంది. రిక్టర్ స్కేల్‌ను 1935లో చార్లెస్ ఎఫ్. రిక్టర్ అభివృద్ధి చేశారు. దీనిలో భూకంపం సంభవించిన సమయంలో విడుదలయ్యే శక్తిని కొలిచేందుకు ఉపయుక్తమవుతుంది. రిక్టర్ స్కేల్ అనేది బేస్-10 లాగరిథమిక్ స్కేల్. 5 కంటే తక్కువ తీవ్రత గల భూకంపాలను గుర్తించడంలో ఇది అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. భూకంప మూలం నుండి నిర్దిష్ట దూరంలో నమోదయిన అతిపెద్ద తరంగం వ్యాప్తిని రిక్టర్ స్కేలు గుర్తిస్తుంది. అయితే రిక్టర్ స్కేల్ భూకంప నష్టాన్ని అంచనా వేయలేదు. అందుకే ప్రస్తుతం భూకంపాలను తీవ్రతను సమగ్రంగా తెలుసుకునేందుకు మూమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్ వినియోగిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఆసియాను కుదిపేసిన 10 భారీ భూకంపాలివే.. -
ఉపాధికి ఎసరు
– జైల్‌రోడ్డులో చిరువ్యాపారులపై నగరపాలక సంస్థ యంత్రాంగం ప్రతాపం – రోడ్డు పక్కల వ్యాపారాలు చేయకూడదంటూ హుకుం – ఆశీల దోపిడీ ఆపాలని కోరిన చిరువ్యాపారులు – అది పట్టించుకోకుండా బడుగుజీవుల ఉపాధిపై వేటు – వైఎస్సార్సీపీ నేతల జోక్యంతో ఊరట సాక్షి, రాజమహేంద్రవరం: కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్న చందంగా ఉంది నగరంలోని బడుగుజీవుల పరిస్థితి. తమ వద్ద ఆశీలు కాంట్రాక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా మార్కెట్ సరిహద్దులు దాటి వచ్చి మరీ రోజుకు రూ. 20 నుంచి రూ. 40లు వసూలు చేస్తున్నారని, ఈ దోపిడీ ఆపాలని కోరిన చిరు వ్యాపారులకు నగరపాలక సంస్థ యంత్రాంగం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. నగరంలోని వై జంక్షన్ నుంచి లాలాచెరువు వరకు ఉన్న జైల్ రోడ్డుకు ఇరు వైపులా చిరు వ్యాపారులు సైకిళ్లు, మోటారు సైకిళ్లు, బుట్టలు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నారు. ఇలా కోరుకొండ రోడ్డు, ఏవీ అప్పారావు, జేఎన్ రోడ్డు, పేపర్ మిల్లు రోడ్డులు, జన సంచారం ఉన్న ప్రాంతాల్లో తిరుగుతూ వ్యాపారం చేసుకుంటున్నారు. జైల్ రోడ్డులో దాదాపు 200 మంది బడుగు జీవులు పుచ్చకాయ, బొప్పాయి, తాటిముంజలు, సపోటా తదితర ఫలాలు అమ్ముకుంటూ సాయంత్రానికి ఇంటికి వెళ్లిపోతున్నారు. వీరిలో పది మంది వికలాంగులు కూడా ఉన్నారు. వారికి ప్రభుత్వం ఎలాంటి ఉపాధి చూపకపోయినా సొంతంగా వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. నాలుగు రోజుల నుంచి నగరపాలక సంస్థ అధికారులు ఈ తరహా వ్యాపారులపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. అధికారులు, పోలీసులు వచ్చి ఈ రోడ్డుకు ఇరువైపులా వ్యాపారాలు చేయకూడదని హడలెత్తిస్తున్నారు. ‘ఈ రోడ్డు రాజవీధి లాంటిది. ఎంతో మంది రాజులు (వీఐపీలు) ఈ రోడ్డులో ప్రయాణిస్తుంటార’నే కారణం చెబుతూ హడావుడి చేస్తున్నారు. రాజధానుల్లో లేని నిబంధనలు ఇక్కడా...? వీఐపీలు తిరిగే ఈ రహదారిలో చిరువ్యాపారులు జీవనం సాగిస్తుంటే తప్పేంటని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి రాజధాని హైదారాబాద్‌లో, విజయవాడలో ముఖ్యమంత్రులు, మంత్రులు, ఉన్నతాధికారులు వచ్చీపోయే సచివాలయం ఎదుట, దేశ, విదేశాల యాత్రికులు సందర్శించే ట్యాంక్ బండ్‌పైన చిరుతిళ్ల బండ్లు, షోడా బండ్లు, జామ, పుచ్చకాయల వ్యాపారాలు చేసుకుంటూ వందలాది మంది జీవిస్తుంటారు. సచివాలయం, ట్యాంక్బండ్లు నగరంలోని జైల్‌రోడ్డు కంటే ప్రాముఖ్యమైనవి కాదా?, అక్కడ బడుగు జీవులు చిరువ్యాపారాలు చేసుకుని బతుకుతుండగా లేనిది ఇక్కడ విచిత్ర నిబంధనలు పెడుతున్నారని మండిపడుతున్నారు. ఆశీలు కాంట్రాక్టర్లు నగరంలో దొరికినకాడ దొరికినట్లు రూ.20 నుంచి రూ.40 వరకు వసూలు చేస్తుంటే పట్టించుకోని యంత్రాంగం తమ ఉపాధిని పోగొట్టేలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్సీపీ జోక్యంతో బడుగుజీవులకు న్యాయం.. తమకు న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ నేతలకు చిరువ్యాపారులు విన్నవించుకున్నారు. బుధవారం వైఎస్సార్సీపీ నేతలు కందుల దుర్గేష్, రౌతు సూర్యప్రకాశరావు, మేడపాటి షర్మిలారెడ్డి, గుత్తుల మురళీధర్‌రావు తదితరులు అధికారులతో మాట్లాడి చిరు వ్యాపారులకు అన్యాయం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. -
పర్యాటకానికి సరికొత్త విధానం
సాక్షి, సిటీబ్యూరో: రాజస్థాన్ తరహాలో గృహ పర్యాటకం (హోంస్టే) విధానాన్ని హైదరాబాద్ నగరంలో కూడా ప్రవేశ పెట్టేందుకు జీహెచ్ఎంసీ సిద్దమవుతోంది. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు హైదరాబాద్ నగర జీవన విధానం, సాంస్కృతి, సాంప్రదాయాలు తెలియజేయడం ద్వారా నగర ప్రతిష్టను మరింత పెంపొందించే వీలుగా రాష్ట్ర పర్యాటక శాఖతో కలిసి గ్రేటర్ హైదరాబాద్‌లో హోం స్టేను ప్రవేశపెట్టేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళిక రూపొందించింది. హైదరాబాద్ నగరంలో పర్యాటకుల సౌకర్యార్థం అమలు చేయనున్న హోంస్టే విధానంపై శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో పర్యాటక శాఖ కమిషనర్ సునితా భగవత్, ట్రాఫిక్ అడిషనల్ సీపీ జితేందర్, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ రామకృష్ణా రావు, యుసీడీ భాస్కరాచారి. జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, శంకరయ్య, రఘుప్రసాద్, గంగాధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ హోం స్టే ద్వారా పర్యాటకులకు నగర జీవన విధానం సాంస్కృతి, సాంప్రదాయాలు అతి దగ్గరగా పరిశీలించే అవకాశం ఏర్పడుతుందన్నారు. నగరంలో అధునిక సౌకర్యాలు, పరిశుభ్ర వాతావరణం కలిగిన గృహాలను హోంస్టేగా ఎంపిక చేయడానికి జీహెచ్ఎంసీ సహకారం కావాలన్నారు. ఇందుకు గాను ఒక రూమ్ నుంచి ఐదు రూమ్‌లు గరిష్టంగా పది పదకల ఇళ్లను హోంస్టేకు ఎంపిక చేసి వీటిలో సిల్వర్, గోల్డ్ విభాగాలుగా ప్రత్యేకించవచ్చన్నారు. ప్రస్తుత హాస్టళ్లు, గెస్ట్ హౌస్‌లు, క్లబ్‌లు, పేయింగ్ గెస్ట్‌లు నివాసాలు హోంస్టే పరిధిలోకి రావని స్పష్టం చేశారు. -
ఇలా సక్కంగా పో..
ఇలా సక్కంగా ఎంత దూరం పోవచ్చో తెలుసా? 1,675 కిలోమీటర్లు! ఇది ఆస్ట్రేలియాలోని ఏయర్ హైవే. ఎంతదూరమైనా.. తిన్నగా పోవాల్సిందే.. ఎందుకంటే ఈ మార్గంలో మీకెక్కడా మలుపులు తగలవు. ఇలా ఎక్కడా మలుపులు లేకుండా ఉన్న అతి పొడవైన రోడ్డు(తిన్నగా ఉన్నది) ఇదేనని చెబుతారు. ఈ రోడ్డు పశ్చిమ ఆస్ట్రేలియాను దక్షిణ ఆస్ట్రేలియాతో కలుపుతుంది. బల్లడోనియా నుంచి కైగూనా మధ్య ఉన్న 145.6 కిలోమీటర్ల రహదారి అయితే.. స్కేలు పెట్టి గీసినట్లు ఉంటుంది. ఈ రోడ్డులో అయితే.. చిన్న వంపు కూడా ఉండదు. ఈ రోడ్డు మార్గాన్ని 1941లో ప్రారంభించారు.