
నేపాల్‌లో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. శుక్రవారం రాత్రి సంభవించిన భూకంపంలో 157 మందికి పైగా జనం మృత్యువాత పడ్డారు. తాజాగా ఆదివారం(ఈరోజు) నేపాల్‌లో 3.6 తీవ్రతతో మరోసారి భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
ఖాట్మండుకు వాయువ్యంగా 169 కి.మీ దూరంలో 10 కి.మీ లోతులో ఆదివారం తెల్లవారుజామున 4.38 గంటలకు భూప్రకంపనలు సంభవించనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. అయితే ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం చోటుచేసుకోలేదని పేర్కొంది. దీనికి ముందు శనివారం మధ్యాహ్నం కూడా 3.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని తెలిపింది.
శుక్రవారం రాత్రి నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపంలో 157 మంది మృతి చెందారు. గడచిన ఎనిమిదేళ్లలో నేపాల్‌లో సంభవించిన అత్యంత భారీ భూకంపం ఇది. 2015లో నేపాల్‌లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపంలో సుమారు తొమ్మిది వేల మంది మృతి చెందగా, 22 వేల మంది గాయాలపాలయ్యారు.
ఇది కూడా చదవండి: ఢిల్లీ సహా ఉత్తర భారతంలోనూ భారీగా భూప్రకంపనలు
Comments
Please login to add a commentAdd a comment