జకార్తా : సునామీ దాటికి దీవుల దేశం ఇండోనేషియా చిగురుటాకులా వణికుతోంది. శుక్రవారం సంభవించిన భారీ భూకంపంతోపాటు, సునామీ ప్రకంపనలకు మృతుల సంఖ్య 800 మందికి చేరినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎక్కువగా సులవేసి సమీపంలోని పలూ పట్టణంలో అత్యధికంగా ప్రజలు మరణించినట్లు అధికారులు తెలిపారు. పలూ పట్టణంలో వీదేశి పర్యాటకులు బీచ్ ఫెస్టివల్‌కు సిద్దమవుతున్న తరుణంలోనే సునామీ రావడంతో ప్రాణ నష్టం భారీ సంఖ్యలో వాటిల్లింది. సునామీ ధాటికి వేల మంది గల్లంతయ్యారని, వారి సమాచారం ఇంకా తెలియాల్సి ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
క్షతగాత్రులను పునరావాస కేంద్రాలకు తరలిస్తూ.. హెలికాఫ్టర్లు, సైనిక దళాల సహాయంతో చర్యలు చేపడుతున్నారు. సునామీ ధాటికి రోడ్లు, భవనాలు, తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రకృతి ప్రతాపానికి అనేక మంది ప్రజలు నిరాశ్రయులైనారు. కాగా ఇండోనేషియాను భారత్ తరఫున తగిన సహాయం అందిస్తామని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఐక్యరాజ్య సమితి వేదికగా ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment