పరమాణు చిత్రంలో జాన్ అబ్రహం
సాక్షి, సినిమా : భారత్ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన సంఘటన అది. భారీ ఎత్తున అంతర్జాతీయ ఒత్తిళ్లు ఉన్నా తలొగ్గక దేశానికి అణు సామర్ధ్యాన్ని సాధించుకున్న పోఖ్రాన్ అణు పరీక్షలపై నిర్మించిన చిత్రం పరమాణు-ది స్టోరీ ఆఫ్ పోఖ్రాన్.
సహనిర్మాతల న్యాయపోరాటాల అనంతరం ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. పరమాణులో జాన్ అబ్రహం కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను యూనిట్ గురువారం విడుదల చేసింది.
భారత తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ స్వతంత్రం అనంతరం జాతిని ఉద్దేశించి ‘ట్రైస్ట్ విత్ డెస్టినీ’ అనే పేరుతో చేసిన ప్రసంగంతో టీజర్ ప్రారంభం అవుతుంది. బొమన్ ఇరానీ వాయిస్ ఓవర్‌తో భారత్ ఘనతలను వరుసగా చూపించారు. 1998లో ‘ఆపరేషన్ శక్తి’ పేరుతో పోఖ్రాన్‌లో జరిపిన అణు పరీక్షలను పూర్తి చేయడంలో కీలకంగా ఉన్న ఆర్మీ ఆఫీసర్‌గా జాన్ అబ్రహం కనిపించారు.
అభిషేక్ శర్మ దర్శకత్వం వహించిన పరమాణు వచ్చే నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment