నిలకడగా ‘పరమాణు’ కలెక్షన్స్‌ | Parmanu Movie Steady Collection After Four Weeks | Sakshi
Sakshi News home page

నిలకడగా ‘పరమాణు’ కలెక్షన్స్‌

Published Fri, Jun 22 2018 8:48 PM | Last Updated on Fri, Jun 22 2018 8:54 PM

Parmanu Movie Steady Collection After Four Weeks - Sakshi

జాన్‌ అబ్రహాం, డయానా పెంటీ జంటగా నటించిన పరమాణు చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటుతోంది. దర్శకుడు అభిషేక్‌ శర్మ ఈ చిత్రాన్ని పొఖ్రాన్‌ అణు పరీక్షల నేపథ్యంలో తెరకెక్కించారు. ఒక పక్క రేస్‌ 3, వీరే ది వెడ్డింగ్‌ వంటి చిత్రాలు బాక్సాఫీస్‌ కలెక్షన్‌ల వర్షం కురిపిస్తుండగా.. వాటి పోటీని తట్టుకుని ఈ చిత్రం నిలబడింది. పరమాణు చిత్ర కలెక్షన్స్‌కు సంబంధించి ప్రముఖ ట్రేడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు. ఈ చిత్రం పరిమిత థియేటర్లలో విడుదలైనప్పటికీ.. రేస్‌ 3 వంటి కమర్షియల్‌ సినిమాని తట్టుకుని  62.14 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ఆయన పేర్కొన్నారు. నాలుగు వారాలు గడిచినప్పటికి రోజు వారి కలెక్షన్స్‌లు బాగానే ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ చిత్రంలో బొమన్‌ ఇరానీ, వికాస్‌ కుమార్‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement