
పట్నా: బిహార్ శాసనమండలి సభ్యులుగా సీఎం నితీశ్ కుమార్, మాజీ సీఎం రబ్డీ దేవి సహా 10 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆర్జేడీకి చెందిన రబ్డీ దేవి శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.
కేబినెట్ మంత్రి సంతోష్ సుమన్ కూడా మండలికి ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో ఉన్నారు. జేడీయూ చీఫ్ కూడా అయిన నితీశ్ కుమార్ గురువారం పార్టీ నాయకులతో శాసనమండలి సెక్రటేరియట్‌కు చేరుకుని ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందుకున్నారు.