ఎన్నికల్లో పోటీకి సీఎం, మాజీ సీఎం దూరం! | Nitish kumar and Rabri Devi not to contest Bihar polls | Sakshi

ఎన్నికల్లో పోటీకి సీఎం, మాజీ సీఎం దూరం!

Published Mon, Aug 3 2015 5:16 PM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM

ఎన్నికల్లో పోటీకి సీఎం, మాజీ సీఎం దూరం! - Sakshi

ఎన్నికల్లో పోటీకి సీఎం, మాజీ సీఎం దూరం!

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి.. ఇద్దరూ రాబోయే ఎన్నికల్లో తాము పోటీ చేయబోమంటూ స్పష్టం చేశారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి.. ఇద్దరూ రాబోయే ఎన్నికల్లో తాము పోటీ చేయబోమంటూ స్పష్టం చేశారు. తాను ఎన్నికల్లో పోటీ చేయబోవట్లేదని.. పూర్తిగా ప్రచారం మీదే దృష్టి పెడతానని సీఎం నితీష్ కుమార్ చెప్పారు. జేడీ(యూ), ఆర్జేడీ, ఎన్సీపీల కూటమి తరఫున ఉమ్మడి సీఎం అభ్యర్థిగా నితీష్కుమార్ను ఎంచుకున్న విషయం తెలిసిందే. అయితే తాను పోటీ చేయట్లేదని.. ప్రచారాన్ని మాత్రం ముందుండి నడిపిస్తానని అసెంబ్లీ బయట విలేకరులతో మాట్లాడుతూ ఆయన చెప్పారు.

ఇక బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి కూడా తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోవట్లేదని సోమవారమే ప్రకటించారు. అయితే తన ఇద్దరు కొడుకులు తేజ్ ప్రతాప్, తేజస్వి యాదవ్ మాత్రం పోటీ చేస్తారని ఆమె చెప్పారు. రబ్రీదేవి 1997 నుంచి 2005 వరకు బీహార్కు తొలి మహిళా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ సంవత్సరం చివర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement