ఉత్తర కొరియా క్షిపణి పరీక్షను ఖండించిన ఐరాస | UN condemns N Korea missile tests | Sakshi
Sakshi News home page

ఉత్తర కొరియా క్షిపణి పరీక్షను ఖండించిన ఐరాస

Published Wed, Aug 30 2017 1:38 PM | Last Updated on Sun, Sep 17 2017 6:09 PM

ఉత్తర కొరియా క్షిపణి పరీక్షను ఖండించిన ఐరాస

ఉత్తర కొరియా క్షిపణి పరీక్షను ఖండించిన ఐరాస

ఐక్యరాజ్య సమితి: ఉత్తర కొరియా తాజాగా జపాన్‌ మీదుగా నిర్వహించిన క్షిపణి పరీక్షను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ముక్తకంఠంతో ఖండించింది. ఇటువంటి చర్యలకు మళ్లీ దిగితే కఠిన చర్యలు తప్పవని సమితి హెచ్చరించింది. ఇటువంటి చర్యల వల్ల ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొంది. అంతేకాక ప్రపంచ ప్రజలు తీవ్రమైన అభద్రతాభావానికి లోనయ్యే అవకాశమేందని పేర్కొంది. సమస్యకు శాంతియుత, దౌత్యపర, రాజకీయ పరిష్కార మార్గాన్ని అన్వేషించాలని ఐక్యరాజ్య సమితి ఉత్తర కొరియాకు సూచించింది. 
 
తమ దేశంపై ఉత్తర కొరియా క్షపణి పరీక్షను నిర్వహించడంతో ఆగ్రహించిన జపాన్‌, దక్షిణ కొరియాలు సమితిని సంప్రదించాయి. తక్షణం భద్రతామండలిని సమావేశ పరచి ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని ఆ దేశాలు కోరాయి. ఉత్తర కొరియా తన వద్దనున్న న్యూక్లియర్‌ వెపన్స్‌ని తక్షణమే నిర్వీర్యం చేయాలని ఈ సందర్భంగా సెక్యూరిటీ కౌన్సెల్‌ డిమాండ్‌ చేసింది. అంతేకాక ప్రస్తుతం నిర్వహిస్తున్న అణు పరీక్షలను తక్షణం ఆపేయాలని సెక్యూరిటీ కౌన్సెల్‌ పేర్కొంది.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement