ఐక్యారాజ్యసమితి నుంచి మొత్తంగా రష్యాను తొలగించాలని ఉక్రెయిన్ మంత్రిత్వ శాఖ సోమవారం పిలుపునిచ్చింది. దురాక్రమణ యుద్ధాలకు దిగుతున్న రష్యా యూఎన్ భద్రతా మండలిలో శాశ్వత సభ్యుడిగా ఏ విధంగా తీర్మానాన్ని వీటో చేయగలదని ప్రశ్నించింది. అంతేగాదు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో రష్యా ఫెడరేషన్‌కు శాశ్వత సభ్యుడిగా ఉన్న హోదాను తొలగించడమే కాకుండా మొత్తంగా ఐక్యరాజ్యసమితి నుంచే తీసేయాలని యూఎన్‌లోని సభ్యదేశాలకు ఉక్రెయిన్ పిలుపునిచ్చింది.
1991లో సోవియట్ యూనియన్‌తో బ్రేక్‌అప్ అయిన తర్వాత నుంచే యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో యూఎస్‌ఎస్‌ఆర్ స్థానాన్ని చట్టవిరుద్ధంగా ఆక్రమించిందని పేర్కొంది. మాస్కో ఇతర దేశాల భూభాగాలను స్వాధీనం చేసుకుంటూ ఐక్యరాజ్యసమితిలో గత మూడు దశాబ్దాలుగా తన అక్రమ ఉనికిని చాటుకుంటుందంటూ ఉక్రెయిన్ ఆరోపణలు గుప్పించింది. వాస్తవానికి యూఎస్ సెక్యూరిటీ కౌన్సిల్‌లోని 15 సీట్లతో కూడిన ఐదుగురు శాశ్వత సభ్యులకు యూఎన్ తీర్మానాలపై వీటో అధికారం కలిగి ఉన్నారు.
(చదవండి: తైవాన్‌కి చుక్కలు చూపించేలా.. జల, వాయు మార్గాల్లో చైనా సైనిక విన్యాసాలు)
Comments
Please login to add a commentAdd a comment