Veto
-
పాలస్తీనాకు శాశ్వత సభ్యత్వ తీర్మానం.. వీటో పవర్ వాడిన అమెరికా
ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వాన్ని కల్పించాలని కోరుతూ పాలస్తీనా ప్రవేశపెట్టిన తీర్మాణాన్ని అమెరికా అడ్డుకుంది. తీర్మానంపై ఓటింగ్ సమయంలో అగ్రరాజ్యం అమెరికా వీటో పవర్‌ను వినియోగించింది. 193 దేశాలు సభ్యతం గల ఐరాసలో పాలస్తీనాకు శాశ్వత సభ్యత్వం కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానంపై గురువారం భద్రతా మండలిలో ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్ సందర్భంగా 12 కౌన్సిల్ సభ్యదేశాలు పాలస్తీనా తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. ఇక.. బ్రిటన్, స్విట్జర్లాండ్ దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. అమెరికా వీటో ఉపయోగించటంతో ఈ తీర్మానం వీగిపోయింది. ‘రెండు దేశాల సమస్య పరిష్కారానికి అమెరికా ఎప్పుడూ మద్దుతు ఇస్తుంది. ఈ ఓటు పాలస్తీనా ప్రత్యేక దేశానికి వ్యతిరేకమైంది కాదు. అయితే ఇరు దేశాల మధ్య పత్యక్ష చర్చల ద్వారా మాత్రమే సమస్యకు పరిష్కారం లభిస్తుంది’ అని యూఎన్‌లో యూఎస్ డిప్యూటీ రాయబారి రాబర్ట్ వుడ్ భద్రతామండలికి తెలిపారు. తీర్మానాన్ని అమెరికా వీటో చేయటంపై పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ తీవ్రంగా ఖండించారు. ‘పాలస్తీనా శాశ్వత సభ్యత్వానికి సంబంధించిన తీర్మానాన్ని అమెరికా వీటో చేయటం చాలా అనైతికం, అన్యాయం’ అని అన్నారు. ‘ఈ తీర్మానంపై ఆమోదం పొందలేదనే విషయం పాలస్తీనా ప్రయత్నాన్ని తగ్గించదు. అదే విధంగా పాలస్తీనా సంకల్పాన్ని ఓడించదు. మా ప్రయత్నం ఆగదు’ అని యూఎన్‌లో పాలస్తీనా రాయబారి రియాద్ మన్సూర్ ఒకింత భావోద్వేగంతో అన్నారు. -
దాడులతో చెలరేగిన ఇజ్రాయెల్
డెయిర్ అల్–బాలాహ్(గాజా స్ట్రిప్): హమాస్ మెరుపుదాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ మొదలుపెట్టిన దాడులు భీకర రూపం దాలుస్తున్నాయి. గాజాలో కాల్పుల విరమణ కోరుతూ ఐక్యరాజ్యసమితి తెచ్చిన తీర్మానాన్ని అమెరికా తన వీటో అధికారంతో కాలదన్నిన దరిమిలా ఇజ్రాయెల్ ఆదివారం మరింత రెచ్చిపోయింది. అమెరికా నుంచి తాజాగా మరింతగా ఆయుధ సంపత్తి అందుతుండటంతో ఇజ్రాయెల్ భీకర గగనతల దాడులతో చెలరేగిపోతోంది. 23 లక్షల గాజా జనాభాలో దాదాపు 85 శాతం మంది బతుకుజీవుడా అంటూ స్వస్థలాలను వదిలిపోయినా సరే ఆదివారం ఇజ్రాయెల్ దాడుల తీవ్రతను తగ్గించకపోవడం గమనార్హం. దాదాపు రూ.834 కోట్ల విలువైన యుద్ధట్యాంక్ ఆయుధాలను ఇజ్రాయెల్‌కు అమ్మేందుకు అమెరికా అంగీకరించడం చూస్తుంటే ఇజ్రాయెల్ సేనల దూకుడు ఇప్పట్లో ఆగేట్లు కనిపించడం లేదు. ‘ఐరాస భద్రతా మండలిలో మాకు బాసటగా అమెరికా నిర్ణయాలు తీసుకుంటోంది. యుద్ధం కొనసాగింపునకు వీలుగా కీలక ఆయుధాలు అందేందుకు సహకరిస్తున్న అమెరికాకు నా కృతజ్ఞతలు’ అని ఆదివారం ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యానించారు. యుద్ధం ఆగదు: ఇజ్రాయెల్ ‘హమాస్‌ను ఈలోపే అంతంచేయాలని అమెరికా మాకు ఎలాంటి గడువు విధించలేదు. హమాస్ నిర్మూలన దాకా యుద్ధం కొనసాగుతుంది. హమాస్ అంతానికి వారాలు కాదు నెలలు పట్టొచ్చు. బం«దీలందర్నీ విడిపిస్తాం’’ అని ఇజ్రాయెల్ జాతీయ భద్రతా సలహాదారు టజాచీ హెనెగ్బీ శనివారం అర్ధరాత్రి తేలి్చచెప్పారు. ‘‘ గాజాలో సరైన సాయం అందక సరిదిద్దుకోలేని స్థాయిలో అక్కడ మానవ విపత్తు తీవ్రతరమవుతోంది. ఇది పశ్చిమాసియా శాంతికి విఘాతకరం’’ అని ఖతార్‌లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తంచేశారు. షిజాయాహ్, జబాలియా శరణార్థి శిబిరాల వద్ద నిరంతరం దాడుల కొనసాగుతున్నాయి. ‘‘కదిలే ప్రతి వాహనంపైనా దాడి జరుగుతోంది. శిథిలాలతో నిండిన మా ప్రాంతాలకు అంబులెన్స్‌లు రాలేకపోతున్నాయి’’ అని జబాలియా ప్రాంత స్థానికురాలు ఒకరు ఏడుస్తూ చెప్పారు. ఖాన్ యూనిస్ పట్టణ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ హమాస్, ఇజ్రాయెల్ సేనల మధ్య పరస్పర దాడులు జరుగుతున్నాయి. గంటలు నిలబడినా పిండి దొరకట్లేదు సెంట్రల్ గాజాలో ఆహార సంక్షోభం నెలకొంది. ‘‘ ఇంట్లో ఏడుగురం ఉన్నాం. ఐరాస ఆహార కేంద్రానికి రోజూ వస్తున్నా. ఆరేడు గంటలు నిలబడ్డా రొట్టెల పిండి దొరకట్లేదు. రెండు వారాలుగా ఇదే పరిస్థితి. పిండి కరువై ఉట్టిచేతుల్తో ఇంటికెళ్తున్నా’’ అని అబ్దుల్లాసలాం అల్–మజ్దాలా వాలా చెప్పారు. ఇప్పటిదాకా 17,700 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. -
కాల్పుల విరమణపై తీర్మానం..అమెరికా వీటో!
న్యూయార్క్: గాజాలో తక్షణమే కాల్పుల విరమణ అమల్లోకి రావాలంటూ శుక్రవారం ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అమెరికా మోకాలడ్డింది యుద్ధంతో అతలాకుతలమవుతున్న గాజాలో తక్షణమే కాల్పుల విరమణ జరగాలని, బందీలను హమాస్ మిలిటెంట్లు బేషరతుగా వెంటనే విడిచిపెట్టాలంటూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేసిన ప్రతిపాదనకు ఐరాసలోని 90 సభ్యదేశాలు మద్దతు పలికాయి. ఆ దేశం మండలిలో ప్రవేశపెట్టిన ఆ తీర్మానానికి మొత్తం 15 దేశాలకు గాను 13 దేశాల ప్రతినిధులు అనుకూలంగా ఓటేశారు. మరో శాశ్వత సభ్యదేశం బ్రిటన్ ఓటింగ్‌లో పాల్గొనలేదు. గాజాలో మానవతా సంక్షోభ నివారణ నిమిత్తం ఇటీవల ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్ అసాధారణ అధికారాన్ని ఉపయోగించారు. తక్షణమే మానవతా కోణంలో కాల్పుల విరమణ జరగాలని, పౌరుల రక్షణ కోసం, అత్యవసర సాయం అందజేయడానికి అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్నీ వినియోగించుకోవాలని మండలి దేశాలకు గుటెరస్ పిలుపునిచ్చారు. యూఎన్ ఛార్టర్‌లోని ఆర్టికల్ 99 కింద ప్రత్యేక అధికారంతో అంతర్జాతీయంగా ఆందోళనలను కలిగించే పరిస్థితుల్లో భద్రతా మండలిని సమావేశ పరచవచ్చు. దీనిలో భాగంగా సమావేశమైన మండలిలో యూఏఈ తీర్మానంపై ఓటింగ్ జరిగింది. మండలిలో శాశ్వత సభ్య దేశమైన అమెరికా తన వీటో అధికారంతో ఆ తీర్మానాన్ని అడ్డుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కాల్పుల విరమణను గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. అది హమాస్ పుంజుకునేందుకు ఉపయోగపడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆ దేశ ప్రతినిధి రాబర్ట్ వుడ్ మండలిలో మాట్లాడుతూ.. ‘ఈ తీర్మానం వల్ల క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రభావం ఉండదు. ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రజలు శాంతి, భద్రతల మధ్య జీవించాలని అమెరికా బలంగా కోరుకుంటోంది. అయితే, అస్థిరమైన కాల్పుల విరమణకు అంగీకరిస్తే హమాస్ మరో యుద్ధానికి ప్రణాళిక రచిస్తుంది’అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ముసాయిదాలో సవరణలు చేయాలని అమెరికా అంటోంది. మండలిలో తీర్మానాన్ని అమెరికా అడ్డుకోవడంపై యూఏఈ రాయబారి మహ్మద్ అబుషాహబ్ విచారం వ్యక్తం చేశారు. -
ఐరాసలో వీగిపోయిన తీర్మానం
ఐరాస: గాజాలోని పాలస్తీనియన్లకు మానవతా సాయం అందించేందుకు వీలుగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో బుధవారం బ్రెజిల్ ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానం వీగిపోయింది. ఇజ్రాయెల్ మిత్రదేశం అమెరికా ఈ తీర్మానాన్ని వీటో చేసింది. ఇజ్రాయెల్ ఆత్మరక్షణ హక్కు గురించి ఈ తీర్మానంలో ప్రస్తావించకపోవడం తమను అసంతృప్తికి గురి చేసిందని అమెరికా వెల్లడించింది. ముసాయిదా తీర్మానానికి అనుకూలంగా 12 దేశాలు ఓటు వేశాయి. రష్యా, బ్రిటన్ గైర్హాజరయ్యాయి. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశమైన అమెరికా వీటో చేయడంతో తీర్మానం ఆమోదం పొందలేదు. -
ఆ హోదాను తొలగించాలని ఉక్రెయిన్ పిలుపు: షాక్‌లో రష్యా
ఐక్యారాజ్యసమితి నుంచి మొత్తంగా రష్యాను తొలగించాలని ఉక్రెయిన్ మంత్రిత్వ శాఖ సోమవారం పిలుపునిచ్చింది. దురాక్రమణ యుద్ధాలకు దిగుతున్న రష్యా యూఎన్ భద్రతా మండలిలో శాశ్వత సభ్యుడిగా ఏ విధంగా తీర్మానాన్ని వీటో చేయగలదని ప్రశ్నించింది. అంతేగాదు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో రష్యా ఫెడరేషన్‌కు శాశ్వత సభ్యుడిగా ఉన్న హోదాను తొలగించడమే కాకుండా మొత్తంగా ఐక్యరాజ్యసమితి నుంచే తీసేయాలని యూఎన్‌లోని సభ్యదేశాలకు ఉక్రెయిన్ పిలుపునిచ్చింది. 1991లో సోవియట్ యూనియన్‌తో బ్రేక్అప్ అయిన తర్వాత నుంచే యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో యూఎస్ఎస్ఆర్ స్థానాన్ని చట్టవిరుద్ధంగా ఆక్రమించిందని పేర్కొంది. మాస్కో ఇతర దేశాల భూభాగాలను స్వాధీనం చేసుకుంటూ ఐక్యరాజ్యసమితిలో గత మూడు దశాబ్దాలుగా తన అక్రమ ఉనికిని చాటుకుంటుందంటూ ఉక్రెయిన్ ఆరోపణలు గుప్పించింది. వాస్తవానికి యూఎస్ సెక్యూరిటీ కౌన్సిల్‌లోని 15 సీట్లతో కూడిన ఐదుగురు శాశ్వత సభ్యులకు యూఎన్ తీర్మానాలపై వీటో అధికారం కలిగి ఉన్నారు. (చదవండి: తైవాన్‌కి చుక్కలు చూపించేలా.. జల, వాయు మార్గాల్లో చైనా సైనిక విన్యాసాలు) -
‘మీకేం వీటో పవర్ ఇవ్వలేదు’.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ(ఎల్ఏసీ)కి 100 కిలోమీటర్ల దూరంలో భారత్- అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న 18వ విడత ‘యుద్ధ అభ్యాస్’ సైనిక ప్రదర్శనను చైనా వ్యతిరేకించటాన్ని తిప్పికొట్టింది భారత్. ఇలాంటి విషయంలో మూడో దేశానికి తాము ‘వీటో’ అధికారం ఇవ్వలేదని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్-అమెరికా ప్రతిపాదనకు చైనా ‘వీటో’ పవర్ ఉపయోగించి అడ్డుకున్న విషయాన్ని సూచిస్తూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఉత్తరాఖండ్‌లోని ఔలి ప్రాంతంలో భారత్-అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘యుద్ధ అభ్యాస్’ మిలిటరీ ప్రదర్శనను బుధవారం వ్యతిరేకించింది చైనా విదేశాంగ శాఖ. భారత్-చైనా మధ్య 1993,1996లో జరిగిన సరిహద్దు నిర్వహణ ఒప్పందాన్ని ఉల్లంఘస్తున్నట్లు పేర్కొంది. దానికి కౌంటర్ ఇచ్చారు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చి. 1993, 96 ఒప్పందాలు ఈ మిలిటరీ ప్రదర్శనకు వర్తించవని స్పష్టం చేశారు. 2020, మేలో చైనా బలగాలు చేసిన ఉల్లంఘనలను గుర్తు చేసుకోవాలన్నారు. సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించటం, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయటం ద్వారా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తు చేశారు. ఇదీ చదవండి: వీడియో: గుజరాత్ భారీ రోడ్‌షో మధ్యలో ఆగిన ప్రధాని మోదీ కాన్వాయ్! ఎందుకంటే.. -
Russia-Ukraine War: ‘రష్యా రిఫరెండం’పై ఓటింగ్‌కు భారత్ దూరం
ఐక్యరాజ్యసమితి: ఉక్రెయిన్‌లోని 4 కీలక ప్రాంతాలను వీలినం చేసుకోవడమే లక్ష్యంగా రష్యా నిర్వహించి ‘చట్టవిరుద్ధ రిఫరెండం’పై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఓటింగ్ జరిగింది. భారత్ ఈ ఓటింగ్‌లో పాల్గొనకుండా దూరంగా ఉండిపోయింది. రష్యా మాత్రం వీటో చేసింది. రష్యా రిఫరెండాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా, ఆల్బేనియా దేశాలు భద్రతా మండలిలో ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. దీనిపై శుక్రవారం ఓటింగ్ నిర్వహించారు. ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్, డొనెట్స్క్, ఖేర్సన్, జపొరిజాజియాలను రష్యాలో విలీనం చేస్తూ ఒప్పంద పత్రాలపై పుతిన్ సంతకాలు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ఓటింగ్ జరగడం గమనార్హం. అయితే, భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశమైన రష్యా వీటో చేయడంతో అమెరికా, ఆల్బేనియా తీర్మానం ఆమోదం పొందలేదు. భద్రతా మండలిలో మొత్తం 15 సభ్యదేశాలు ఉండగా, 10 దేశాలు ఈ తీర్మానానికి మద్దతు పలికాయి. భారత్, చైనా, గబాన్, బ్రెజిల్ మాత్రం ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఐరాసలో భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మాట్లాడారు. ఉక్రెయిన్ పరిణామాలు భారత్‌కు అందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. ప్రజల ప్రాణాలను బలిపెట్టి శాంతిని సాధించలేరని తెలిపారు. హింసకు స్వస్తి పలికితేనే ఉక్రెయిన్–రష్యా సమస్యకు పరిష్కార మార్గం లభిస్తుందని సూచించారు. ఉక్రెయిన్‌లో రష్యా చేపట్టిన రిఫరెండం చెల్లదని ఐరాసలోని అమెరికా ప్రతినిధి లిండా థామస్–గ్రీన్‌ఫీల్డ్ తేల్చిచెప్పారు. -
చేతకాకపోతే ఐరాసనే రద్దు చేయండి: జెలెన్స్కీ
న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఆవేశపూరితంగా ప్రసంగించాడు. రష్యా సైన్యం తమ దేశంలో అత్యంత హేయమైన యుద్ధనేరాలకు పాల్పడిందని ఆరోపించిన జెలెన్స్కీ.. తక్షణమే స్పందించాలంటూ భద్రతా మండలిని కోరాడు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని ఉద్దేశించి మంగళవారం రాత్రి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. బుచాలో రక్తమోడుతూ, కాలి బుగ్గిగా మారి కనిపించిన శవాల కుప్పలకు సంబంధించిన వీడియోను ప్రదర్శించాడు జెలెన్స్కీ. తక్షణమే స్పందించాలని లేదంటే మొత్తంగా మిమ్మల్ని మీరు పూర్తిగా రద్దు చేసుకోండి అంటూ ఐరాస భద్రతా మండలిని ఉద్దేశించి ఆవేశంగా ప్రసంగించాడు జెలెన్స్కీ. ఐసిస్‌కు ఏమాత్రం తీసిపోని స్థాయిలో రష్యా బలగాలు ఉక్రెయిన్‌లో మారణహోమానికి పాల్పడ్డాయన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు.. రష్యాను వెలివేయాలని డిమాండ్ చేశాడు. తద్వారా వీటో అధికారాన్ని రష్యాకు లేకుండా చేయాలని కోరాడు. ఒకవేళ ప్రత్యామ్నాయం, ఇతర దారులు లేకుంటే గనుక.. మొత్తంగా భద్రతా మండలి, ఐక్యరాజ్య సమితిలనే రద్దు చేసుకోవాలంటూ కోరాడు జెలెన్స్కీ. రష్యా బలగాలు మారణకాండకు పాల్పడ్డాయన్న దీనిపై విచారణ జరపాలని, ఇంతటి ఘోరాలకు ఆదేశాలిచ్చిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ‘బుచాలో రష్యా దళాలు చేయని నేరం లేదు. ప్రతి పౌరున్నీ వెతికి వెతికి చంపాయి. ఉగ్రవాద సంస్థ కంటే కిరాతకంగా వ్యవహరించింది. సాక్షాత్తూ భద్రతా మండలిలో వీటో అధికారమున్న శాశ్వత సభ్య దేశం కావడం గర్హనీయం. వీటో అధికారాన్ని మమ్మల్ని చంపేందుకు హక్కుగా, ఒక లైసెన్స్‌గా రష్యా వాడుకుంటోంది. ప్రపంచ భద్రతకే ఇదో సవాలు. ఇలాంటి వాటిని అరికట్టేలా తక్షణం ఐరాస వ్యవస్థను సంస్కరించాలి’ అని వాదించారు. ఆధారాలు ఏవీ?: రష్యా ఇదిలా ఉండగా.. ఐరాసలో మాస్కో అంబాసిడర్ వసెలీ నెబెంజియా మాత్రం ఉక్రెయిన్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. నేరుగా ఉక్రెయిన్ అధ్యక్షుడిని ఉద్దేశిస్తూ.. రష్యా బలగాలు దమనకాండను పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లేవు, ఉంటే సమర్పించండి. ఇదంతా ఉక్రెయిన్ ఆడుతున్న నాటకం అంటూ ప్రత్యారోపణలు చేశారు. మరోవైపు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ భద్రతా మండలిలో తాజా పరిణామాలపై స్పందించారు. ఇప్పటికే ఈ యుద్ధం వల్ల 74 దేశాలు, బిలియన్‌న్నర మంది సంక్షోభంలోకి కూరుకుపోయారని హెచ్చరిస్తూ.. తక్షణమే ఈ యుద్ధం ఆగాలంటూ పిలుపు ఇచ్చారు. సంబంధిత వార్త: ఉక్రెయిన్‌లో ఊచకోత! లెక్కలు ఏం చెప్తున్నాయంటే.. -
ఎమర్జెన్సీ కి ప్రపంచ దేశాల పిలుపు
-
ట్రంప్‌కి అమెరికా కాంగ్రెస్ షాక్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవి వీడడానికి కొద్ది రోజుల ముందు అమెరికన్ కాంగ్రెస్ ఆయనకు గట్టి షాక్ ఇచ్చింది. ట్రంప్ వీటో అధికారాలను వినియోగించుకోవడానికి వీల్లేకుండా 74 వేల కోట్ల డాలర్ల వార్షిక రక్షణ విధాన బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. ట్రంప్ హయాంలో అధ్యక్షుడి వీటో అధికారాన్ని తోసిరాజని ఒక బిల్లు చట్ట రూపం దాల్చడం ఇదే తొలిసారి. రిపబ్లికన్ పార్టీకి బలం ఉన్న కాంగ్రెస్‌లోని ఎగువ సభ అయిన సెనేట్ కూడా ట్రంప్ అధికారాన్ని పక్కకు పెట్టి నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ (ఎన్డీఏఏ)ని 81–13 ఓట్ల తేడాతో ఆమోదించడం గమనార్హం. ఈ పరిణామంతో అధికారానికి దూరమవుతున్న క్షణాల్లో సొంత పార్టీ నుంచి కూడా ట్రంప్‌కి ఎదురు దెబ్బ తగిలిట్టనయింది. ఈ వారం మొదట్లోనే ప్రతినిధుల సభ ఈ బిల్లుని 322–87 ఓట్లతో ఆమోదించింది. ట్రంప్ రక్షణ బిల్లుని మొదట్నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఆ బిల్లులోని కొన్ని అంశాలు దేశ భద్రతకు భంగకరంగా ఉన్నాయన్నది ఆయన వాదన. కానీ అమెరికా ప్రజాప్రతినిధులు మాత్రం ఈ బిల్లుకి ఆమోద ముద్ర వేశారు. సాధారణంగా కాంగ్రెస్‌లోని రెండు సభలు బిల్లుని ఆమోదించిన తర్వాత అధ్యక్షుడు సంతకం చేస్తే అది చట్టరూపం దాలుస్తుంది. అయితే అధ్యక్షుడు తన వీటో అధికారాన్ని వినియోగించి బిల్లుని తిప్పి పంపడం అరుదుగా జరుగుతూ ఉంటుంది. అధ్యక్షుడు బిల్లుని వీటో చేసే అవకాశం లేకుండా కాంగ్రెస్ మూడింట రెండు వంతుల మెజార్టీతో బిల్లుని చట్టంగా మార్చే అవకాశం ఉంది. ట్రంప్ ఈ బిల్లుని వ్యతిరేకిస్తూ ఉండడంతో కాంగ్రెస్‌లో ఉభయ సభలు ఆయన సంతకం అవసరం లేకుండానే బిల్లుని ఆమోదించాయి. దేశ భద్రత, మిలటరీ అవసరాలు, సైనిక కుటుంబాలకు అండగా ఉండడానికి కావల్సిన నిధులను మంజూరు చేసే బిల్లు కావడంతో కాంగ్రెస్ ఎలాంటి అడ్డంకులు రాకుండా ఆమోదించింది. భారత్‌లో 19 వేల కేసులు న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 19,079 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,03,05,788కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. కోవిడ్‌తో 224 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,49,218కు చేరింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 99,06,387కు చేరిం. రికవరీ రేటు 96.12 శాతానికి చేరింది. యూకే నుంచి భారత్‌కు వచ్చిన మరో నలుగురికి బ్రిటన్ వేరియంట్ కరోనా సోకింది. దీంతో మొత్తం బ్రిటన్ వేరియంట్ పాజిటివ్ కేసుల సంఖ్య భారత్‌లో 33కు చేరింది. -
ట్రంప్‌కు ఊహించని షాక్..!
వాషింగ్టన్: అధ్యక్ష పదవి నుంచి దిగిపోయే ముందు రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్‌నకు ఘోర పరాభవం ఎదురైంది. రక్షణ రంగానికి సంబంధించిన కీలక బిల్లుపై వీటో(తిరస్కరణ) అధికారాన్ని ప్రయోగించిన ఆయనకు సెనేట్ గట్టి షాకిచ్చింది. ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 81-13 ఓట్ల తేడాతో వీటోను తిరగరాస్తూ బిల్లుకు ఆమోదం తెలిపింది. కాగా అమెరికా సైనికులకు ప్రయోజనాలు చేకూర్చేందుకు ఉద్దేశించిన 740.5 బిలియన్ డాలర్ల డిఫెన్స్ పాలసీ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, డిసెంబరు 23న ట్రంప్ ఈ బిల్లును తిరస్కరించారు. ఈ క్రమంలో అధ్యక్షుడి నిర్ణయానికి వ్యతిరేకంగా డెమొక్రాట్ల ఆధిపత్యం గల ప్రతినిధుల సభ సోమవారం బిల్లును ఆమోదించగా.. రిపబ్లికన్లు మెజారిటీగా ఉన్న సెనేట్ శుక్రవారం ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక కాంగ్రెస్ ఆమోదంతో రక్షణ విధాన బిల్లు చట్టరూపం దాల్చనుంది. (చదవండి: అమెరికా బలగాలపై దాడికి చైనా సాయం?) కాగా 2016లో అధ్యక్ష పీఠం చేపట్టిన నాటి నుంచి ట్రంప్‌నకు గతంలో ఇలాంటి అనుభవం ఎన్నడూ ఎదురుకాలేదు. పదవి నుంచి తప్పుకొనే సమయం ఆసన్నమైన నేపథ్యంలో ఆయనకు ఈ విధంగా ఊహించని షాక్ తగిలింది. ఇక ఈ విషయంపై స్పందించిన ట్రంప్.. రిపబ్లికన్ల ఆధిపత్యం కలిగిన తెలివైన నిర్ణయం తీసుకోలేక పోయిందని తనదైన శైలిలో విమర్శించారు. టెక్నాలజీ కంపెనీలకు అపరిమిత అధికారాన్ని కట్టబెట్టే సెక్షన్ 230 నుంచి విముక్తి పొందే అవకాశాన్ని కోల్పోయేలా చేసిందని మండిపడ్డారు. ఇది నిజంగా విషాదకరమైన విషయమని పేర్కొన్నారు. కాగా డిఫెన్స్ పాలసీ బిల్లు ద్వారా భారీగా ఆయుధ సంపత్తిని పెంచుకునేందుకే గాక, అమెరికా బలగాలకు హజార్డస్ డ్యూటీ పే కింద నెలకు చెల్లించే మొత్తాన్ని 250 డాలర్ల నుంచి 275 డాలర్లకు పెంచేందుకు నిధులు చేకూరనున్నాయి. (చదవండి: అమెరికన్లను శోకంలో ముంచకండి: ఇరాన్) -
‘వీటో’ మార్పులకు వ్యతిరేకం: అమెరికా
వాషింగ్టన్: ఐక్యరాజ్యసమితి (ఐరాస)లోని భద్రతా మండలి శాశ్వత సభ్యులకు మాత్రమే పరిమితమైన వీటో అధికారంలో మార్పులు చేయడం లేదా సభ్యుల సంఖ్యను మార్చడాన్ని శాశ్వత సభ్య దేశమైన అమెరికా వ్యతిరేకిస్తోంది. అయితే భద్రతా మండలిలోని తాత్కాలికమైన 15 మంది సభ్యుల సంఖ్యను పెంచేందుకు మాత్రం మద్దతు పలికినట్లు ఐరాసలో ఉన్నతాధికారి వెల్లడించారు. 21వ శతాబ్దపు వాస్తవికతకు అద్దం పట్టేలా.. ఈ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనేలా భద్రతా మండలిలో సంస్కరణలు ఉండాలని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వివరించారు. ఐరాసలో సంస్కరణలకు అమెరికా కట్టుబడి ఉందని, అంతేకాకుండా భద్రతా మండలి విస్తరణకు కూడా మద్దతు పలుకుతున్నట్లు వెల్లడించారు. అయితే వీటో అధికారంలో మార్పులు కానీ పెంపును కానీ అమెరికా వ్యతిరేకిస్తోందన్నారు. -
‘భారత్‌తో బంధం వద్దనుకుంటున్న చైనా’
సాక్షి, న్యూఢిల్లీ : మసూద్ అజర్ విషయంలో చైనా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని భారత రక్షణ శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పఠాన్‌కోట్ దాడికి సూత్రధారి అయిన మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్ ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించిన విషయం తెలిసిందే. భద్రతామండలిలోని 1267 నిషేధాల కమిటీ ముందు అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లు మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే తీర్మానాన్ని ప్రవేశపెట్టగా చైనా దానిని వరుసగా నాలుగోసారి అడ్డుకుంది. సమితిలో చైనా ప్రవర్తించిన విధానం వల్ల.. భారత్‌తో బంధాలు ప్రమాదకరస్థాయిలోకి వెళ్లే అవకాశముందని రక్షణ శాఖ నిపుణులు పీకే సింగ్ తెలిపారు. చైనా సమితిలో తనకు ఉన్న వీటో అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్‌తో బంధాన్ని చైనా కాదనుకుంటోంది అని చెప్పడానికి ఇదే నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదం విషయంలో చైనా అసుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలకు ఇదొక తార్కాణమని మరో రక్షణశాఖ నిపుణుడు రాహుల్ జలాల్ అన్నారు. మసూద్ అజర్ విషయంపై చైనా విదేశాంగ శాఖ కార్యదర్ధి హు చునియాంగ్ మాట్లాడుతూ.. మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే విషయంలో కొన్ని అభిప్రాయబేధాలున్నాయని చెప్పారు. మసూద్ అజర్‌పై భారత్ చాలా అంశాలకు వివరణ ఇవ్వలేదని ఆరోపించారు. -
‘వీటో’ను ప్రస్తావించకుంటే సభ్యత్వం
వాషింగ్టన్: ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశం హోదాను భారత్ పొందాలంటే వీటో (ఏదేనీ శాసనాన్ని తిరస్కరించడానికి గల అధికారం) అంశాన్ని ప్రస్తావించకపోవడమే మార్గమని భారత సంతతి మహిళ, ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ అన్నారు. ప్రస్తుతం ఐరాసలో శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, రష్యా, ఫ్రాన్స్, యూకే, చైనాలకు వీటో అధికారాలున్నాయి. ఈ అధికారాన్ని ఆయా దేశాలు ఇతరులతో పంచుకునేందుకు కానీ, పూర్తిగా విడిచిపెట్టేందుకు కానీ సిద్ధంగా లేవని నిక్కీ హేలీ అన్నారు. కాబట్టి వీటో అధికారాల గురించి ప్రస్తావించకపోతే భారత్‌కు భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశం హోదా లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. భద్రతా మండలిలో సంస్కరణలు రావాలని అమెరికా కోరుకుంటోందనీ, అయితే రష్యా, చైనాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని నిక్కీ హేలీ పేర్కొన్నారు. ‘అంతర్జాతీయ అంశాలపై భారత్–అమెరికా సహకారం పెంపొందించుకోవడంలో కాంగ్రెస్ పాత్ర’ అనే విషయంపై ఓ సంస్థ నిర్వహించిన సమావేశంలో నిక్కీ హేలీ ప్రసంగించారు. భద్రతా మండలి సంస్కరణల్లో కాంగ్రెస్‌కు ఎక్కువ పాత్ర ఉండదనీ, మండలిలోని సభ్య దేశాలు తమ మాట వినే స్థితిలో లేవన్నారు. సభ్యత్వం పొందేందుకు భారత్ వీలైనన్ని ఎక్కువ దేశాల మద్దతు కూడగట్టుకోవాలని సూచించారు. పాక్‌పై నిఘాకు భారత్ సాయపడగలదు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌పై కఠిన వైఖరిని అవలంబించాలని అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్న నేపథ్యంలో ఆ దేశంపై ఓ కన్నేసి ఉంచేందుకు భారత్ తమకు సహకరించగలదని నిక్కీ హేలీ అన్నారు. అఫ్గానిస్తాన్, దక్షిణాసియా ప్రాంతంలో ఉగ్రవాదంపై పోరుకు ట్రంప్ ఇటీవల కొత్త వ్యూహాన్ని ప్రకటించిన అంశాన్ని ప్రస్తావించిన ఆమె...ఆ వ్యూహంలో ఒక భాగం భారత్‌తో తమ భాగస్వామ్యాన్ని పెంచుకోవడమేనని చెప్పారు. కాగా, భారత నౌకాదళం విమాన వాహకాలను తయారుచేసేందుకు అవసరమైన ఎమల్స్ (ఎలక్ట్రోమ్యాగ్నటిక్ ఎయిర్‌క్రాఫ్ట్ లాంచ్ సిస్టం) టెక్నాలజీని భారత్‌కు అందించనున్నట్లు ట్రంప్ యంత్రాంగం చెప్పింది. దీపావళి వేడుకల్లో ట్రంప్ శ్వేతసౌధంలో దీపావళి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన కూతురు ఇవాంకా ట్రంప్ పాల్గొన్నారు. ట్రంప్ అధ్యక్షుడైన తరువాత తొలిసారి జరిగిన ఈ వేడుకల్లో ఆయన పాలనా బృందంలోని ఇండో–అమెరికన్లయిన ఐరాసలో యూఎస్ రాయబారి నిక్కీ హేలీ, మెడికేర్, మెడిక్ ఎయిడ్ సర్వీసెస్ పాలనాధికారి సీమా వర్మ, యూఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ చైర్మన్ అజిత్ పాయ్ తదితరులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమెరికాలో పలు రంగాల్లో ఇండో–అమెరికన్ల సేవలను ట్రంప్ కొనియాడారు. భారత ప్రధాని మోదీతో తనకున్న అనుబంధానికి ఎంతో విలువ ఇస్తానని చెప్పారు. -
మసూద్‌పై చైనాకు అమెరికా షాక్!
మసూద్ విషయంలో వీటోతో తమను అడ్డుకోలేరని వ్యాఖ్య ఐరాస: ఉగ్రవాదులపై ఆంక్షలు విధించకుండా కొన్ని దేశాలు వీటో అధికారాన్ని ప్రయోగించినంతమాత్రాన తాము వెనుకకు తగ్గబోమని, ఉగ్రవాదులపై చర్యలు తీసుకోని తీరుతామని అమెరికా స్పష్టం చేసింది. పాకిస్థాన్‌కు చెందిన జెషే మహహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజార్‌పై ఐక్యరాజ్యసమితిలో ఆంక్షలు విధించకుండా చైనా వీటోతో అడ్డుకుంటున్న నేపథ్యంలో అమెరికా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఉగ్రవాదులపై ఆంక్షల అంశాన్ని అమెరికా యంత్రాంగం ప్రస్తుతం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటున్నదని, ఈ విషయంలో తమ పాత్రను కచ్చితంగా పోషిస్తామని ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హెలీ తెలిపారు. ఏప్రిల్ నెలకుగాను భద్రతా మండలి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఉగ్రవాది మసూద్ విషయంలో చైనా వీటోను ప్రయోగిస్తున్న అంశాన్ని పరోక్షంగా ఉద్దేశిస్తూ దక్షిణాసియాలో ఉగ్రవాదులపై ఆంక్షలు, ఆ ఆంక్షలను అడ్డుకోవడానికి ఐరాస శాశ్వత సభ్యులు చేస్తున్న ప్రయత్నాల గురించి ఆమెను విలేకరులు ప్రశ్నించారు. దీనికి స్పందిస్తూ.. కొన్ని విషయాలలో వీటో ప్రయోగించినంత మాత్రాన ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడంలో తాము వెనుకాడబోమని నిక్కీ హెలీ పేర్కొన్నారు. -
‘వీటో’ వాడం.. శాశ్వత సభ్యత్వం ఇవ్వండి
ఐరాసకు జీ–4దేశాల ప్రతిపాదన వాషింగ్టన్: ఐక్యరాజ్యసమితిలో సంస్కరణల దిశగా క్రియాశీలక ఆలోచనలకు సిద్ధంగా ఉన్నామని జీ–4 (భారత్, జపాన్, బ్రెజిల్, జర్మనీ) దేశాలు బుధవారం ప్రకటించాయి. అయితే భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం ఇస్తే సంస్కరణల్లో మాత్రమే పాలుపంచుకుంటామని.. ‘వీటో’ పై సమీక్ష జరిగి నిర్ణయం తీసుకునేంతవరకు ఈ అధికారాన్ని (వీటోను) వాడమని ప్రతిపాదిం చాయి. భద్రతామండలిలో శాశ్వత, తాత్కాలిక సభ్యదేశాల సంఖ్యను పెంచేలా సంస్కరణలు తేవాలనే ప్రతిపాదనకు ఐరాసలో భారీ మెజారిటీతో మద్దతు లభించిందని జీ–4 దేశాల తరపున ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ చెప్పారు. కొత్త సభ్యుల వీటో పై భిన్నాభిప్రాయాలు వెల్లడైనా.. జీ–4 దేశాలు మాత్రం వీటో అధికారం (కొత్త శాశ్వత సభ్యులకు ఇవ్వటం) కన్నా మండలిలో నాణ్యత (సంస్కరణల్లో భాగం) పెరగాలని భావిస్తున్నాయన్నారు.