‘వీటో’ వాడం.. శాశ్వత సభ్యత్వం ఇవ్వండి
ఐరాసకు జీ–4దేశాల ప్రతిపాదన
వాషింగ్టన్: ఐక్యరాజ్యసమితిలో సంస్కరణల దిశగా క్రియాశీలక ఆలోచనలకు సిద్ధంగా ఉన్నామని జీ–4 (భారత్, జపాన్, బ్రెజిల్, జర్మనీ) దేశాలు బుధవారం ప్రకటించాయి. అయితే భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం ఇస్తే సంస్కరణల్లో మాత్రమే పాలుపంచుకుంటామని.. ‘వీటో’ పై సమీక్ష జరిగి నిర్ణయం తీసుకునేంతవరకు ఈ అధికారాన్ని (వీటోను) వాడమని ప్రతిపాదిం చాయి.
భద్రతామండలిలో శాశ్వత, తాత్కాలిక సభ్యదేశాల సంఖ్యను పెంచేలా సంస్కరణలు తేవాలనే ప్రతిపాదనకు ఐరాసలో భారీ మెజారిటీతో మద్దతు లభించిందని జీ–4 దేశాల తరపున ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ చెప్పారు. కొత్త సభ్యుల వీటో పై భిన్నాభిప్రాయాలు వెల్లడైనా.. జీ–4 దేశాలు మాత్రం వీటో అధికారం (కొత్త శాశ్వత సభ్యులకు ఇవ్వటం) కన్నా మండలిలో నాణ్యత (సంస్కరణల్లో భాగం) పెరగాలని భావిస్తున్నాయన్నారు.