
న్యూయార్క్:సుదీర్ఘంగా ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా తాజాగా ఆ దేశంపై సంచలన ఆరోపణలు చేసింది. సిరియాలో అంతర్యుద్ధానికి కారణమైన ఇస్లామిస్ట్ గ్రూప్ హయత్ తహ్రీర్ అల్ షామ్ రెబల్స్‌కు ఉక్రెయిన్ సాయం చేస్తోందని ఆరోపించింది. ఈ మేరకు రష్యా రాయబారి వాసిలీ నెబెంజియా ఐక్యరాజ్యసమితి(యూఎన్)లో అభ్యంతరం వ్యక్తం చేశారు.
సిరియాలో అధ్యక్షుడు బషర్ అసద్ అల్ పాలనపై తిరుగుబాటు చేస్తున్న రెబల్స్‌కు ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ అండదండలున్నాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ తమకు ఆయుధాలు సరఫరా చేస్తున్న విషయాన్ని కొంత మంది రెబల్స్ బహిరంగంగానే చెబుతున్నారని తెలిపారు.
రెబల్స్‌కు శిక్షణ కూడా ఇస్తున్నారన్నారు. కాగా,రెబల్స్ నుంచి సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి రక్షణ కల్పిస్తూ తిరుగుబాటుదారులపై రష్యా వైమానిక దాడులు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment