నరరూప రాక్షసులు: కిడ్నాప్‌ చేసి మానభంగం, ఆపై.. | Women Rights Group Detailing Congo Woman Story AT UN Security Council | Sakshi
Sakshi News home page

వాళ్లు నరరూప రాక్షసులు: కిడ్నాప్‌ చేసి మానభంగం, ఆపై మనిషి మాంసాన్ని..

Published Thu, Jun 30 2022 9:46 AM | Last Updated on Thu, Jun 30 2022 9:53 AM

Women Rights Group Detailing Congo Woman Story AT UN Security Council - Sakshi

న్యూయార్క్‌: మానవ హక్కుల ఉల్లంఘనలో హేయనీయమైన ఘటనలు వెలుగులోకి రావడం కొత్తేం కాదు. కానీ, ప్రపంచమంతా ఉలిక్కిపడేలా దారుణాతిదారుణాలు ఆఫ్రికన్‌ దేశం కాంగోలో చోటుచేసుకుంటున్నాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో  బుధవారం ఓ మహిళ కథ.. అక్కడి రెబల్‌ గ్రూప్‌ల అరాచకాలను బయటపెట్టడంతో పాటు సభ్య దేశ్యాలను నివ్వెరపోయేలా చేసింది.

డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో పరిస్థితులపై భద్రతా మండలిలో సాధారణ సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా.. సోఫెపడి హక్కుల సంఘం అధ్యక్షురాలు, న్యాయవాది జూలియెన్నె లుసెంగె.. తూర్పు కాంగోలో తనకు తారసపడ్డ ఓ మహిళ కథను మండలికి వినిపించగా.. ఆమె ప్రసంగిస్తున్నంత సేపు అక్కడ నిశబ్ద వాతావరణం నెలకొంది. 

కాంగోలో ప్రభుత్వం, రెబెల్‌ గ్రూప్స్‌ మధ్య అంతర్యుద్ధం.. ఈ మే నెలలో తారాస్థాయికి చేరింది. ఆ పరిస్థితులు కాస్త తీవ్ర హింసకు దారి తీశాయి. ఈ తరుణంలో.. కోడ్‌కో అనే మిలిటెంట్‌ గ్రూప్‌ ఓ కుటుంబం నుంచి ఓ మహిళను ఎత్తుకెళ్లింది. పలుమార్లు ఆమెపై మానభంగానికి పాల్పడ్డారు ఆ గ్రూప్‌ సభ్యులు. ఆపై ఓ వ్యక్తిని ఆమె కళ్లెదుటే గొంతు కోసి హత్య చేశారు. ఆ శవం నుంచి పేగులు బయటకు లాగేసి.. వాటిని వండాలంటూ ఆమెకు ఆదేశించారు. రెండు కంటెయినర్ల నీళ్లు తెచ్చి.. భోజనం సిద్ధం చేయమన్నారు. ఆపై ఆమెతో మనిషి పచ్చి మాంసం బలవంతంగా తినిపించారు’ అంటూ భావోద్వేగంగా జూలియెన్నె ఆ ఘటనలను వినిపించారు. 


 
కొన్నిరోజుల తర్వాత ఆమెను విడిచిపెట్టింది ఆ గ్రూప్‌. కానీ, ఇంటికి వెళ్తున్న దారిలో ఆమెను మరొక మిలిటెంట్‌ ఎత్తుకెళ్లింది. పలుమార్లు మానభంగం చేశారు ఆ గ్రూప్‌సభ్యులు. అక్కడ ఆమెకు అలాంటి రాక్షస అనుభవమే ఎదురైంది. ఆ పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు ఆమె తన ప్రాణాలనే పణంగా పెట్టుకుంది.. అని జూలియెన్నెకు భద్రతా మండలికి వినిపించారు. 

ఈ ఘటనను మండలి సంయుక్తంగా ఖండించింది. ఇలాంటి ఘటనలను నిలువరించాల్సిన అవసరం ఉందని, మానవ హక్కుల్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని ప్రకటించింది.  ఇదిలా ఉంటే.. ఈ ఆరోపణలపై కోడ్‌కో మిలిటెంట్‌ గ్రూప్‌గానీ, ఇతర సంస్థలుగానీ స్పందించలేదు. అంతర్యుద్ధంతో కాంగో నెత్తుటి నేలను తలపిస్తున్న వేళ.. గత 20 ఏళ్లుగా ఐరాస ప్రతినిధులు కాంగోలో శాంతి స్థాపనకు ప్రయత్నిస్తున్నా అది వీలుపడడం లేదు.

Disclaimer: ఇందులోని కంటెంట్‌ ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి కాదు.. కేవలం పరిణామాలను తెలియజేయడానికే!.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement