Indo-Pak
-
త్వరలో పెళ్లి : ఇంతలోనే బ్రేకప్ ప్రకటించిన ముద్దుగుమ్మలు
ఒక్క ఫోటో షూట్‌తో ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన ఇండో-పాక్‌కు లెస్బియన్ జంట అంజలి చక్ర, సూఫీ మాలిక్ షాకింగ్ న్యూస్ చెప్పారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లైన ఈ జంట తమ ఐదేళ్ల బంధానికి స్వస్తి పలికారు. ఈ విషయాన్ని ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 2019లో సంచలన ఫోటోషూట్‌తో ఇంటర్నెట్లో హల్చల్ చేశారు అంజలి, సూఫీ జంట. భారతదేశానికి చెందిన అంజలి, పాకిస్తాన్‌కు చెందిన సూఫీ సంప్రదాయ దుస్తుల్లో, వర్షంలో డ్యాన్స్ చేస్తున్న ఫోటోలు, వీడియోలతో తమ బంధాన్ని బహిర్గతం చేశారు. అంతేకాదు న్యూయార్క్‌లోని ఐకానిక్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌లో ఎంగేజ్మెంట్ కూడా పూర్తి చేసుకున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటరనుకున్న ఈ లవ్‌బర్డ్స్ తాజాగా పెళ్లిరద్దు చేసుకోవడం హాట్ టాపిక్‌గా నిలిచింది. "ఇది షాక్‌గా అనిపించవచ్చు, కానీ మా ప్రయాణం మారుతోంది. సూఫీ చేసిన మోసి కారణంగా మేము మా పెళ్లిని రద్దు చేసుకోవాలని, మా సంబంధాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాము" అని అంజలి ఒక పోస్ట్‌లో పేర్కొంది. మరోవైపు అంజలిని మోసం చేసినట్లు సూఫీ స్వయంగా అంగీకరించింది. ‘‘నేను గుర్తించ లేనంత తప్పిదం, ద్రోహం చేశాను. మోసం చేసా. నాకు తెలియకుండానే ఆమెను విపరీతంగా బాధపెట్టాను. నా తప్పిదానికి కట్టుబడి ఉన్నా. ఆమెను క్షమాపణలు కోరుతున్నా’’ అంటూ సూఫీ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో వెల్లడించింది. 2019లొ అంజలి, సూఫీ జంట్ తమ బంధాన్ని ఒకఫోటోషూట్ ద్వారా ప్రకటించారు. టర్నెట్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. -
అసలు... ఆ రాత్రి ఏం జరిగింది?
భారత ద్వితీయ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయి. అది హత్యా? సహజ మరణమా? లేక ఇన్సైడర్ (లోపలి వ్యక్తి) పనా? అయిదు దశాబ్దాలు గడిచినా, ఏ ఇన్వెస్టిగేషన్, ఏ ఎంక్వైరీ కమిషన్‌కు నోచుకోకుండానే ఆయన మరణం దేశ చరిత్ర పుటల్లో మిస్టరీగానే మిగిలిపోయింది! 1965 భారత్–పాక్ యుద్ధానంతరం, 1966 జనవరి 4న రష్యాలోని తాష్కెంట్లో ప్రారంభమైన ఇరు దేశాల చర్చలు జన వరి 10 రాత్రి ‘నోవార్ ప్యాక్ట్ ’ అగ్రిమెంటుతో ముగిశాయి. ఆ తర్వాత తనకు ఏర్పాటు చేసిన ‘డాచా’ (గెస్ట్ హౌజ్ విల్లా)లోని విశాలమైన బెడ్ రూంలో కెళ్ళిపోయారు శాస్త్రి. భోజనానంతరం, కుక్ రావ్‌ునాథ్ తెచ్చిన గ్లాసులోని పాలు త్రాగి నిద్రకు ఉపక్రమించారు. రాత్రి 1.20 గంటలకు ప్రధాని పర్సనల్ సెక్రెటరీ జగన్నాథ్ సహాయ్ బెడ్ రూం తలుపును ఎవరో తడుతున్న చప్పుడు. తలుపులు తెరచిన ఆయనకు ఎదురుగా కుడి చేత్తో ఛాతీ వత్తుకుంటూ, ‘డాక్టర్ సాబ్ కహా హై’ వగరుస్తూ ప్రధాని ఆర్థింపు. సంగతి తెలిసిపోయింది పీఏ సహాయ్‌కి. అసిస్టెంట్లు ఇద్దరు కలిసి శాస్త్రిజీని ఆయన రూంలోకి తీసు కెళ్ళి గ్లాసులో ఆయనకు నీళ్లు ఇచ్చారు. బెడ్‌పై ఆయనను పడుకోబెట్టి, పక్కరూంలో ఉన్న ప్రధాని పర్సనల్ వైద్యుడు డాక్టర్ ఆర్ఎన్ చుఘ్కు కబురు చేశాడు పీఏ క్షణాల్లో మెడికల్ కిట్‌తో శాస్త్రీజీ రూంలో కొచ్చి ఆయన పల్స్ చెక్ చేశాడు. శ్వాస పీల్చుకోలేక, ‘మేరే రామ్’ అంటూ అవస్థ పడుతున్నారాయన. ప్రధాని గుండెపోటుకు గురయ్యారని నిర్ధారణకు వచ్చి వెంటనే ఒక ఇంజెక్షన్ చేసి ఛాతీ వత్తడం ప్రారంభించాడు డాక్టర్ అయినా శాస్త్రీజీ క్రమంగా స్పృహ కోల్పోయారు. ఆఖరు ప్రయత్నంగా మరో ఇంజెక్షన్‌ను నేరుగా శాస్త్రిజీ గుండె దగ్గరే ఇచ్చాడు చుఘ్. అయినా లాభం లేకపోయింది. ఆశ వదలుకుని, గద్గద స్వరంతో ‘బాబూజీ, ఆప్నే ముజె మౌకా నహీ దియా (నాకు మీరు తగిన సమయం ఇవ్వలేదు)’ అంటూ ఆశ్రునయనాలతో శాస్త్రీజీ పల్స్‌ను వదిలేశాడు డాక్టర్ చుఘ్. తాష్కెంట్లో అప్పుడు సమయం రాత్రి 1.32 గంటలు. ‘యువర్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ డైయింగ్’ అన్న ఒక రష్యన్ లేడీ విలేకరి మాటతో, నిద్రలో నుండి హుటా హుటిన లేచి చెప్పులు లేకుండానే తన గది నుండి ఆదుర్దాగా శాస్త్రిజీ బెడ్ రూవ్‌ు వైపు పరుగు తీశాడు ఆయన ప్రెస్ సెక్రెటరీ కులదీప్ నయ్యర్. అప్పటికే అంతా అయి పోయింది. ఆయన బెడ్ దగ్గర రష్యన్ ప్రధాని కోసిగిన్, పాక్ నేత ఆయూబ్ ఖాన్, ప్రధాని సహచరులు, మంత్రులూ అయిన స్వర్ణ సింగ్, యశ్వంత్ రావు చవాన్ దీన వదనాలతో శిల్పాల్లా నిలుచున్నారు. ఆ నిశాంత నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, పాక్ ప్రెసిడెంట్ అయూబ్ ఖాన్, కుల్దీప్ వైపు చూస్తూ ‘హియర్ ఈస్ ఏ మేన్ ఆఫ్ పీస్, హూ గేవ్ హిస్ లైఫ్ ఫర్ ఎమిటీ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్’ అంటూ వాపోయాడు. ఆ రోజు మధ్యాహ్నం 2.30 గం.కు జాతీయ జెండాలో చుట్టిన ప్రధాని పార్థివ దేహంతో సోవియట్ ఎయిరోఫ్లోట్ విమానం తాష్కెంట్ నుండి ఢిల్లీ పాలవ్ు ఎయిర్ పోర్ట్ చేరు కుంది. అక్కడి నుంచి గన్ క్యారేజ్‌లో శాస్త్రీజీ డెడ్ బాడీని ఆ సాయంత్రం 4.10 గంటలకు 10, జనపథ్‌కు చేర్చారు. రోడ్డంతా శోకసంద్రంలో మునిగిన ఢిల్లీ వాసులతో నిండింది. ఏమీ తోచని ప్రధాని కుటుంబీకులు వారిస్తున్నా ఆగమేఘాల మీద ఏ పోస్టుమార్టం లేకుండానే అదే రోజు శాంతివన్లో శాస్త్రీజీ అంత్యక్రియలు జరిపారు. ఊహించని రీతిలో నిష్క్రమించిన ప్రధాని లాల్ బహదూర్ స్థానంలో నూతన నాయకుణ్ణి ఎన్నుకోవటానికి, కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు సభ్యులు పలుమార్లు సమా వేశమయ్యారు. సీనియర్ కాంగ్రెస్ నేత మొరార్జీ దేశాయ్ ఈ పదవికి గట్టి పోటీ ఇచ్చారు. కరడు గట్టిన గాంధేయవాది అయినప్పటికీ దేశాయ్‌ది నిరంకుశ తత్వం. పార్టీ అధ్యక్షుడు కామరాజ్ నాడార్కు ఇది మింగుడు పడలేదు. చాణక్య రీతితో దేశాయ్‌ని పోటీ నుండి తప్పించి, నెహ్రూ తనయ, ఇందిరా గాంధీ పేరును పార్లమెంటరీ బోర్డు నాయకురా లిగా తెరపైకి తేగలిగారు కింగ్ మేకర్ కామరాజ్. రేపో మాపో లండన్ బ్రిటిష్ హైకమిషనర్‌గా వెళ్లవలసిన అప్పటి ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్టర్ ఇందిర చేతిలోకి 1966 జనవరి 24న నాటకీయంగా దేశ ప్రధాని పగ్గాలు వెళ్లిపోయాయి. జిల్లా గోవర్ధన్ వ్యాసకర్త విశ్రాంత ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ మొబైల్: 98190 96949 (అనూజ్ ధర్ పుస్తకం ‘యువర్ ప్రైమ్ మినిష్టర్ ఈజ్ డెడ్’, ఆధారంగా. నేడు లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి) -
‘బ్యాట్’ దాడిని తిప్పికొట్టిన సైన్యం
శ్రీనగర్: సరిహద్దుల్లోని భారత్ సైనిక పోస్టుపై పాకిస్తాన్ ప్రత్యేక దళమైన బోర్డర్ యాక్షన్ టీం (బ్యాట్’) చేసిన దొంగచాటు దాడి యత్నాన్ని భారత్ బలగాలు సమర్ధంగా తిప్పికొట్టాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు పాక్ సైనికులు హతమయ్యారు. మిగతా వారు తిరిగి పాక్‌భూభాగంలోకి పారిపోయారు. ఈ ఘటనకశ్మీర్‌లోని నౌగామ్ సెక్టార్‌లోని భారత్–పాక్ నియంత్రణ రేఖ వెంబడి శనివారం అర్ధరాత్రి జరిగింది. ‘సరిహద్దు దాటి లోపలికి వచ్చేందుకు ‘బ్యాట్’ సభ్యులు చేసిన యత్నాన్ని మన బలగాలు భగ్నం చేశాయి. పాక్ బలగాలు మోర్టార్లు, రాకెట్ లాంచర్లతో కాల్పులు జరుపుతూ రక్షణగా నిలవగా అడవి నుంచి భారత్ భూభాగంలోకి చొరబడేందుకు ‘బ్యాట్’ దళం ప్రయత్నించింది. వెంటనే భారత బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో పాక్ సైనికులుగా భావిస్తున్న ఇద్దరు చనిపోగా, మిగతా వారు పారిపోయారు’ అని సైనిక ఉన్నతాధికారి చెప్పారు. ‘ వారి వద్ద శక్తివంతమైన ఐఈడీ పేలుడు పదార్థాలు, ఆధునిక ఆయుధాలున్నాయి. దీనిని బట్టి భారత్ పోస్టుపై భారీ దాడికి ప్రణాళిక వేసుకున్నారని అర్థమవుతోంది’ అని ఆయన పేర్కొన్నారు. ఏమిటీ ‘బ్యాట్’? పాక్ సైన్యంలోని స్పెషల్ సర్వీస్ గ్రూప్(ఎస్ఎస్జీ) నిర్మించిన బోర్డర్ యాక్షన్ టీం(బ్యాట్)లో దాదాపు 8 మంది సభ్యులుంటారు. ఈ గ్రూపుల్లో సైనిక కమాండోలు, ఉగ్రవాదులు ఉంటారు. వీరు సరిహద్దుల్లోని భారత సైనికులే లక్ష్యంగా దాడులకు దిగుతుంటారు. పాక్ ఆర్మీ కమాండోలు కూడా బ్యాట్‌లో ఉన్నప్పటికీ భారత సైన్యానికి పట్టుబడినప్పుడు మాత్రం అక్కడి ప్రభుత్వం తనకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తోంది. -
భారత్ పాక్ సరిహద్దు ప్రాంతం రాజౌరీలో టెన్షన్
-
భారత్–పాక్ ఉద్రిక్తత నివారణకు కృషి చేస్తాం
న్యూయార్క్: భారత్, పాక్ వివాదాల్లో జోక్యం చేసుకోకూడదన్న అమెరికా విధానంలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ రెండు దేశాల మధ్య ఉద్రికత్తను తగ్గించేందుకు యత్నిస్తామని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ చెప్పారు. ‘ఉద్రిక్తతలను తగ్గించే యత్నాల్లో మావంతు పాత్ర ఏమిటో కనుగొనేందుకు మా ప్రభుత్వం చర్చిస్తుంది.. ఏదో ఒకటి జరిగేవరకు వేచిచూడం’ అని అన్నారు. ఈ ప్రయత్నంలో తమ దేశాధ్యక్షుడు ట్రంప్ భాగమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. ఐరాస భద్రతా మండలికి సంబంధించి ఏప్రిల్ నెలకుగాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన హేలీ మీడియాతో మాట్లాడారు. శాంతి చర్చల కోసం భారత్, పాక్‌లను అమెరికా ఒప్పిస్తుందా అని అడిగిన ప్రశ్నకు ఆమె పైవిధంగా స్పందించారు. హేలీ వ్యాఖ్యలను భారత్ తోసిపుచ్చింది. ఉగ్రరహిత వాతావరణంలో వివాదాలను పరిష్కరించుకోవడం తమ విధానమని, అయితే హింస ఇంకా కొనసాగుతూనే ఉందని విదేశాంగ ప్రతినిధి చెప్పారు. -
సరైన నిర్ణయం
చిత్తశుద్ధి, సంకల్పం ఉంటే చేయదల్చుకున్న పనికి ఎవరూ ఆటంకాలు కల్పించ లేరు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక దళ స్థావరంపై ఉగ్రవాదులు దాడి జరిపి బీభత్సాన్ని సృష్టించిన అనంతరం ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితుల నుంచి భారత్- పాకిస్తాన్‌లు రెండూ చాకచక్యంగా బయటికొచ్చి జరగాల్సిన చర్చలపై అంగీకారాని కొచ్చాయి. శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలను ‘పరస్పర అవగాహన’తో వాయిదా వేసుకున్నాయి. ‘చాలా సమీప భవిష్యత్తులోనే’ ఈ చర్చలు మొదలవుతాయని రెండు దేశాలూ ప్రకటించాయి. పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి అనంతర పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని ఈ చర్చల్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎంతో సంయమనంతో వ్యవహరించింది. ఉగ్రవాదులపై చర్యలు తీసుకునే విషయంలో పాకిస్తాన్ చిత్తశుద్ధిని శంకించడానికి కారణమేమీ కనబడటం లేదని మూడురోజులక్రితం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించినప్పుడే ఇందుకు సంబంధించిన సూచనలు కనబడ్డాయి. పఠాన్‌కోట్ దురాగతానికి సూత్రధారిగా భావిస్తున్న జైషే మహమ్మద్ సంస్థ స్థావరాలపై పాక్ భద్రతా దళాలు దాడులు చేయడం, కారకులుగా భావిస్తున్నవారిని అరెస్టుచేయడం వంటి పరిణామాలు మన దేశానికి సంతృప్తి కలిగించాయి. అయితే అలా అరెస్టయిన వారిలో సంస్థ చీఫ్ మసూద్ అజర్ ఉన్నాడని మీడియాలో వెలువడిన కథనాలపై పాక్ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఆ విషయంలో మన దేశం కూడా పట్టుబట్టలేదు. చర్చల కొనసాగింపును దానితో ముడిపెట్టలేదు. ఇప్పటి కిప్పుడు ఆ అరెస్టులపై బహిరంగ ప్రకటన చేయాలని డిమాండ్ చేయడంవల్ల మనకు ఒరిగేదేమీ ఉండదు. సరిగదా దీన్ని వక్రీకరించి భారత్ ఒత్తిళ్లకు నవాజ్ షరీఫ్ లొంగిపోతున్నారని పాక్‌లోని అతివాదులు ప్రచారం చేసే ప్రమాదం ఉంటుంది. మసూద్ అజర్ నేపథ్యం గమనిస్తే ఈ సంగతి అర్ధమవుతుంది. 1994లో కశ్మీర్లో ఉగ్రవాద ముఠాలమధ్య ఏర్పడ్డ విభేదాలను తొలగించేందుకు వచ్చిన అజర్‌ను పోలీసులు అరెస్టు చేస్తే 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని అఫ్ఘాన్‌కు దారి మళ్లించి మన ప్రభుత్వంతో బేరాలాడి అతన్ని ఉగ్రవాదులు విడిపించుకున్నారు. 2001లో మన పార్లమెంటు భవనంపై జరిగిన ఉగ్రవాద దాడి వెనక అతని హస్తమున్నదన్న ఆరోపణతో పాక్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే, సరైన సాక్ష్యాధారాలను భారత్ అందజేయలేదన్న సాకుతో ఏడాది తర్వాత అతన్ని వదిలేశారు. వాస్తవానికి ఆ దాడిలో అజర్ ప్రమేయం ఉన్నదని పాక్ పార్లమెంటులో ఆనాటి ముషార్రఫ్ సర్కారులోని మంత్రే స్వయంగా ప్రకటించారు. అయినా సైన్యం ఒత్తిళ్లతో అతన్ని విడిచిపెట్టారు. అజర్‌కు బిన్ లాడెన్, ముల్లా ఒమర్వంటి ఉగ్రవాదులతో సంబంధాలున్నా పాక్ అతన్ని అరెస్టు చేయదు. అమెరికా అందుకు పట్టుబట్టదు. ఇలాంటి పరిస్థితుల్లో జైషే మహమ్మద్ ప్రమేయాన్ని పాకిస్తాన్ అంగీకరించడంతోపాటు ఆ సంస్థ బాధ్యుల్ని అరెస్టు చేయడం మంచి పరిణామం. అందులో అజర్ ఉన్నాడా లేడా అన్నది కొద్ది రోజుల్లో తేలుతుంది. అతన్ని అరెస్టు చేయడంతోపాటు పఠాన్‌కోట్ దాడి వెనకున్న కుట్రను వెల్లడించి ప్రపంచానికి తన సచ్ఛీలతను నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు నవాజ్ షరీఫ్‌పై పడింది. ప్రధాని నరేంద్ర మోదీ గత నెలలో చడీ చప్పుడూ లేకుండా లాహోర్‌ను సందర్శించింది మొదలుకొని ఆ పర్యటన పర్యవసానంగా ఏర్పడ్డ సుహృద్భావ వాతావరణాన్ని ఎలా చెడగొట్టాలా అని ఇరు దేశాల్లోనూ రకరకాల శక్తులు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. మోదీతోపాటు వచ్చిన అనేకమంది అధికారులకు వీసాల ఊసే లేకుండా ప్రవేశం కల్పించడం ద్వారా పాకిస్తాన్ సార్వ భౌమాధికారానికి నవాజ్ షరీఫ్ మహాపచారం చేశారని అక్కడి అతివాదులు హోరెత్తించారు. మన దేశంలోనూ అలాంటి శక్తులు చురుగ్గానే పనిచేశాయి. ఉగ్రవాదానికి అండదండలివ్వడాన్ని విరమించుకుంటామన్న హామీ లేకుండా ఆ గడ్డపై మోదీ ఎలా అడుగుపెడతారని కొందరు ప్రశ్నించారు. సరిహద్దుల్లో సైనికుల తలలు తెగుతుంటే లాహోర్‌లో కులాసా కబుర్లు చెబుతారా అని నిలదీశారు. వీటన్నిటినీ దాటుకుని చర్చల తేదీలు ఖరారయ్యేసరికి ఉగ్రవాదులు యథాప్రకారం దాడులు మొదలెట్టారు. ఈసారి అఫ్ఘాన్‌లోని మన దౌత్య కార్యాలయాలపై కూడా గురిపెట్టారు. పఠాన్‌కోట్ దానికి కొనసాగింపే. ఇవి ఆగుతాయనుకోవడానికి కూడా లేదు. చర్చలకు ఎలాగైనా గండికొట్టాలన్న పట్టుదలతో ఉగ్రవాదులు మరింతగా బరితెగిస్తారు. వారి కుట్రలను వమ్ము చేయడానికి మనం అప్రమత్తంగా ఉండకతప్పదు. అదే సమయంలో ఇలాంటి చర్యలను కారణాలుగా చూపి పాకిస్తాన్‌తో సాగవలసిన చర్చలకు స్వస్తి చెప్పడం కూడా తెలివైన నిర్ణయం అనిపించుకోదు. అలా చేయడం నలుగురైదుగురు ఉగ్రవాదులు పాల్పడే మతిమాలిన చేష్టలకు ప్రాధాన్యమీయడమే అవుతుంది. వారి కోర్కెను ఈడేర్చినట్టవుతుంది. రెండు ఇరుగుపొరుగు దేశాలమధ్య సమస్యలున్నప్పుడు వాటి పరిష్కారం కోసం చర్చించడమే సరైంది. అలాగని ఆ చర్చలపై అత్యాశలు పెట్టుకోవడం కూడా మంచిది కాదు. పాక్‌లో పౌర ప్రభుత్వం ఒక వైఖరితో, సైన్యం మరో వైఖరితో వ్యవహరిస్తాయి. ప్రపంచ దేశాల ఒత్తిళ్లతో ఇప్పుడిప్పుడే ఆ స్థితి మారుతోంది. ఉగ్రవాదులను ఉపయోగించి భారత్‌ను నెత్తుటిముద్దగా మారిస్తే కశ్మీర్ విషయంలో ఆ దేశం దిగొస్తుందనే భ్రమలను వదులుకోవాలని పాక్ పౌర సమాజం అక్కడి సైన్యానికీ, ప్రభుత్వానికీ హితవు పలుకుతున్నది. ఇలాంటి సమయంలో మనవైపు మరింత సంయమనం, ఓపిక అవసరమవుతాయి. ఆచితూచి అడుగేయాల్సి ఉంటుంది. చర్చల విషయంలో మన ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఆ కోణంలో ప్రశంసనీయమైనది. -
‘పఠాన్‌కోట’ చెబుతున్నదేమిటి?
స్క్రిప్టు ఏ కొంచెమూ మారలేదు. భారత్-పాక్‌లు రెండూ చర్చలకు సిద్ధపడుతున్న సమయంలో ఉగ్రవాదులు యథాప్రకారం రెచ్చిపోయారు. ప్రధాని నరేంద్ర మోదీ లాహోర్ పర్యటనకెళ్లి పదిరోజులు కాకుండానే పాకిస్థాన్‌వైపు నుంచి మన దేశంలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు భీతావహ వాతావరణాన్ని సృష్టించారు. పంజాబ్‌లోని పఠాన్‌కోటలో ఉన్న వైమానిక దళ స్థావరంపై శనివారం తెల్లారుజామున దాడికి దిగారు. ఏడుగురు భద్రతా సిబ్బందిని కాల్చిచంపడంతోపాటు 20మంది జవాన్లను గాయపరిచారు. ఉగ్రవాది మృతదేహం వద్దనున్న గ్రనేడ్‌ను నిర్వీర్యం చేయబోతూ ఒక లెఫ్టినెంట్ కల్నల్ కన్నుమూశారు. సోమవారం కూడా వైమానిక దళ స్థావరంలో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతున్నదంటే ఇది ఏ స్థాయి దాడో అర్ధమవుతుంది. సరిగ్గా ఇదే సమయంలో అఫ్ఘానిస్థాన్లోని భారత్ కాన్సుల్ జనరల్ కార్యాలయంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. సోమవారం పంజాబ్‌లోనే మరోచోట ముగ్గురు ఉగ్రవాదులను పట్టుకుని వారినుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. దేశ రాజధాని నగరంలోకి కొందరు ఉగ్రవాదులు ప్రవేశించినట్టు ఇంటెలిజెన్స్ సమాచారం చెబుతోంది. ఈ ఉదంతాలన్నీ గమనిస్తే ఉగ్రవాదుల వ్యూహం ఎంత పకడ్బందీగా ఉన్నదో తెలుస్తుంది. దాడులకు అవసరమైన మనుషుల్ని సమీకరించి, దాడి చేయాల్సిన ప్రాంతాల వివరాలను అందజేసి, మారణాయుధాలిచ్చి పంపడం సాధారణ వ్యక్తులకూ, సంస్థలకూ సాధ్యంకాని పని. ఇరు దేశాలమధ్యా చర్చలు సాగడం ఇష్టంలేని పాకిస్థాన్ భద్రతా వ్యవస్థలోని శక్తుల ప్రమేయం లేకుండా ఇది జరిగే అవకాశం లేదు. ప్రస్తుత దాడికి కారణంగా భావిస్తున్న జైషే మహమ్మద్ సంస్థతో ఐఎస్ఐకి ఉన్న సాన్నిహిత్యం జగద్వితం. వైమానిక దళ స్థావరంపై జరిగిన దాడి అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నది. అత్యంత పటిష్టమైన భద్రత ఉంటుందనుకునే ఆ స్థావరంలోకి ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో ప్రవేశించడాన్ని తేలిగ్గా తీసుకోలేం. వాస్తవానికి డిసెంబర్ 31నాడే ఉగ్రవాదులు అక్కడికి ప్రవేశించి ఉండొచ్చునని, వారు రెండు బృందాలుగా విడిపోయి సమయం కోసం కాచుక్కూర్చున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైమానిక దళ స్థావరంలో ఉన్న అత్యంత విలువైన యుద్ధ విమానాలను ధ్వంసం చేసి, తీవ్ర నష్టం కలిగించడంతోపాటు మన నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడమే ఉగ్రవాదుల ప్రధాన లక్ష్యమని వేరే చెప్పనవసరం లేదు. దీన్ని నిలువరించడంలో మన భద్రతా బలగాలు ప్రశంసనీయమైన పాత్రే పోషించాయి. అయితే సైనిక దుస్తుల్లో ఉన్నంతమాత్రానే ఉగ్రవాదులు స్థావరంలోకి ప్రవేశించగలగడం, వారి ఆనుపానుల్ని భద్రతా బలగాలు సకాలంలో పసిగట్టలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కశ్మీర్, పంజాబ్ కలిసేచోట ఉన్న పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతం అత్యంత కీలకమైనది. ఆ ప్రాంతంలో పటిష్టమైన ఫెన్సింగ్‌తోపాటు అటు పాక్ బలగాలూ, ఇటు భారత్ బలగాలూ నిరంతరం పహరా కాస్తుంటాయి. అయినా 2013 సెప్టెంబర్‌తో మొదలుపెట్టి ఇప్పటికి అయిదుసార్లు ఆ ప్రాంతంనుంచే ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడ్డారు. పాక్ సైన్యం పుట్టించిన ఐఎస్ఐ ప్రాపకంతోనే ఇదంతా జరుగుతున్నది కనుక ఉగ్రవాదులు అటు నుంచి ఫెన్సింగ్ దాటడం కష్టమేమీ కాదు. కానీ ఇటు మన బీఎస్ఎఫ్ జవాన్ల అప్రమత్తత ఏమైపోయింది? మొదటిసారంటే తప్పిదమని సరిపెట్టుకోవచ్చు. కానీ పదే పదే అదే పునరావృతం కావడం ఆశ్చర్యకరం. ఆ సరిహద్దుల్ని సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించి అక్కడ అన్ని రకాలైన నిఘా వ్యవస్థలనూ ఏర్పాటు చేసి ఉంటే ఇది జరిగేది కాదు. ఇంతేకాదు...గురుద్వారాలో ప్రార్థనల కోసం వెళ్లి తిరిగొస్తున్న గురుదాస్‌పూర్ జిల్లా ఎస్పీ సల్వీందర్ సింగ్‌ను శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టారని తెలిసినప్పుడు వెనువెంటనే అటు పోలీసులూ, ఇటు సైన్యం అప్రమత్తం కావాల్సింది. అది జరగలేదు. తనపై ఎవరో దాడిచేసి, కొట్టి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారని ఎస్పీ చెప్పినప్పుడు ఉన్నతాధికారులకు అది నమ్మశక్యంగా కనబడలేదు. అది ఉగ్రవాదులపనేనని నిర్ధారించుకోనేసరికి దాదాపు 15 గంటల సమయం వృథా అయింది. వెంటనే ఆ పని జరిగితే పఠాన్‌కోట ఉదంతాన్ని నివారించగలిగేవారు. ఎస్పీ స్థాయి ఉన్నతాధికారే అబద్ధం చెబుతున్నారని భావించడమే కాదు...ఆయనకు వంత పాడుతున్నాడని ఎస్పీ సహాయకుడొకరిని పోలీసులు చావబాదారు! ఎస్పీ చెప్పింది నమ్మకపోవడానికి కారణమేం లేదు. మొన్న జూలై నెలలో అదే ప్రాంతంలోని పోలీస్‌స్టేషన్‌పై ఉగ్రవాదులు దాడిచేశారు. అసలు ఉగ్రవాదులు తాము కిడ్నాప్ చేసింది ఎస్పీ స్థాయి అధికారినని తెలియక వదిలేశారా లేక మరే ఇతర కారణమైనా ఉన్నదా అనే కోణంలో మాత్రం దర్యాప్తు జరగవలసి ఉంది. ఇరు దేశాలూ చర్చలకు నిర్ణయం తీసుకున్నప్పుడల్లా, అందుకు తేదీలు ఖరారైనప్పుడల్లా ఉగ్రవాదులు బరితెగించడం రివాజుగా మారింది. ఎప్పటిలానే పఠాన్‌కోట దాడిని సైతం పాక్ ఖండించింది. అయితే ఇది సరిపోదు. దాడి వెనకున్నవారి ఆచూకీని పాక్ రాబట్టగలగాలి. ఈ నెల 15, 16 తేదీల్లో జరగాల్సిన చర్చలను తక్షణం నిలిపేయాలని మన దేశంలో కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఉగ్రవాద దాడులు ఆగితే తప్ప చర్చలు సాధ్యంకాదని పాకిస్తాన్‌కు చెప్పాలని సలహా ఇస్తున్నారు. కానీ అది తెలివైన పనికాదు. నిజానికి ఇప్పుడే చర్చల అవసరం ఎక్కువుంది. దాడుల సందర్భంగా సజీవంగా పట్టుబడ్డ ఉగ్రవాదులిచ్చిన సమాచారాన్నీ, ఎస్పీ ఫోన్నుంచి పాక్‌లోని కుట్రదారులతో ఉగ్రవాదులు సాగించిన సంభాషణల్నీ, వాటికి సంబంధించిన నంబర్లనూ అందించి వాటి ఆధారంగా సూత్రధారులను పట్టుకోవాలని ఒత్తిళ్లు తీసుకురావాలి. అంతర్జాతీయంగా ఉగ్రవాద బెడద ఎక్కువైన నేపథ్యంలో ఈ విషయమై ప్రపంచ దేశాలు కూడా పాక్‌ను వదిలిపెట్టవు. ఉగ్రవాద దాడులతో చర్చలకు ఆటంకం కల్పించడంద్వారా సమస్యలు అపరిష్కృతంగా ఉండేలా...వాటి మూలాలు వెల్లడికాకుండా ఉండేలా జాగ్రత్తపడుతున్నామని పాక్ భద్రతా వ్యవస్థలోని ఒక వర్గం నమ్ముతూ ఉండొచ్చు. అలాంటి శక్తుల ఎత్తు పారకుండా చేయడమే మన లక్ష్యం కావాలి. మన ప్రధాని మోదీ అన్నట్టు ‘మానవాళికే శత్రువులు’గా పరిణమించిన ఉగ్రవాదులను తుదముట్టించడానికి ఇది చాలా అవసరం. -
'భారత్-పాక్ చర్చలు రద్దవడం దురదృష్టకరం'
న్యూఢిల్లీ: భారత్-పాకిస్తాన్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల (ఎన్ఎస్ఏ) చర్చలు రద్దవడం దురదృష్టకరం అని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈ చర్చలకు భారత్ సుముఖంగా ఉన్నా పాకిస్తాన్ రద్దు చేసుకుందన్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘింస్తూ వస్తుంది, దీన్ని పాక్ ఆపాల్సిన అవసరం ఉందని తెలిపారు. పొరుగు దేశాలతో సత్సంబంధాల కోసం భారత్ ప్రయత్నిస్తునే ఉంటుందని పునరుద్ఘాటించారు. -
మోదీ వైఫల్యంతోనే చర్చలు రద్దు: కాంగ్రెస్
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ విదేశాంగ విధానాల వైఫల్యం కారణంగానే ఎన్ఎస్ఏ చర్చలు రద్దయ్యాయని కాంగ్రెస్ ఆరోపించింది. భారత్-పాక్ ఎన్ఎస్ఏ చర్చలు రద్దు నేపథ్యంలో శనివారం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. మోదీ విదేశాంగ విధానంలో గందరగోళం, గాబరా, మొండితనం తప్ప మరేం లేదని కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఎద్దేవాచేశారు. శనివారం ఆయన ఢిల్లీలో మాట్లాడారు. సరైన అనుభవం, ముందు చూపు లేకపోవడంతో ఈ పరిస్థితి దాపురించిందన్నారు. మాటలగారడీలు కట్టిపెట్టి ప్రధాని మోదీ.. దేశ అంతర్గత, సీమాంతర ఉగ్రవాదంపై ప్రధానంగా దృష్టిపెట్టాలని హితవు పలికారు. పరిష్కారం చూపే ప్రతిపాదనలతో భద్రతా అంశాలు, శాంతియుతమైన ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడే విదేశాంగ విధానాల కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఎలాంటి ప్రయోజనం, ఫలితాలు వచ్చే వీలు లేని నేపథ్యంలో పాకిస్థాన్‌తో చర్చలు జరపడం అనవసరమని కాంగ్రెస్ సూచించింది. కచ్చితమైన ఫలితం ఉంటుందని భావిస్తేనే చర్చలు కొనసాగించాలని కాంగ్రెస్ నేత ఆనంద్‌శర్మ ఢిల్లీలో వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ హురియత్‌ను అడ్డుపెట్టుకుని చర్చలను ఉగ్రవాదం నుంచి కశ్మీర్‌వైపు మళ్లిస్తోందని భారత ప్రయోజనాలను దెబ్బతీసేందుకు వీటిని వినియోగించుకుంటోందని ఆరోపించారు. హురియత్‌కు ప్రాధాన్యత ఇవ్వవద్దన్నారు. పాకిస్థాన్ నిర్ధారించకుండానే చర్చల కోసం తేదీలను ఎలా ప్రకటించారని కేంద్రాన్ని నిలదీశారు. -
ముందు ‘వేర్పాటు’ చర్చలు!
భద్రత సలహాదారు చర్చల ముందు పాక్ కవ్వింపు * 23న భారత్ రానున్న పాక్ ఎన్ఎస్ఏ సర్తాజ్ అజీజ్ * అజీజ్‌తో భేటీకావాలని కశ్మీర్ వేర్పాటు నేతకు పాక్ హైకమిషన్ పిలుపు * ఆయన గౌరవార్థం ఇచ్చే విందుకు మితవాద నేతలకు ఆహ్వానం శ్రీనగర్: ఓపక్క భారత్‌తో చర్చలంటూనే, మరోపక్క వేర్పాటువాదులకు స్నేహహస్తం అందించే కవ్వింపు కుట్రలకు పాకిస్తాన్ మరోసారి తెరతీసింది. ఇరుదేశాల మధ్య ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న జాతీయ భద్రత సలహాదారు(ఎన్ఎస్ఏ) స్థాయి చర్చల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వస్తున్న పాక్ ఎన్ఎస్ఏ సర్తాజ్ అజీజ్‌తో భేటీకి రావాలంటూ కశ్మీర్ వేర్పాటువాద సంస్థ, అతివాద హురియత్ కాన్ఫెరెన్స్ నేత సయ్యద్ అలీ షా గిలానీకి భారత్‌లోని పాక్ హై కమిషన్ ఆహ్వానం పంపింది. అలాగే, అజీజ్ గౌరవార్థం 23న తామిచ్చే విందుకు హాజరుకావాలంటూ మితవాద హురియత్ చైర్మన్ మీర్వాయిజ్ ఉమర్ ఫారూఖ్ సహా పలువురు కశ్మీర్ మితవాద వేర్పాటు నేతలను పిలిచింది. ఈ ఆహ్వానాన్ని గిలానీ మన్నించారని, 24న సర్తాజ్ అజీజ్‌తో ఆయన సమావేశమవుతారని అతివాద హురియత్ ప్రతినిధి అయాజ్ అక్బర్ ధ్రువీకరించారు. పాక్ హై కమిషన్ ఇస్తున్న విందుకు తనతో పాటు మితవాద నేతలు హాజరవుతారని మీర్వాయిజ్ ఫారూఖ్ చెప్పారు. ఆ విందుకు హాజరయ్యే విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని జేకేఎల్ఎఫ్ నేత యాసిన్ మాలిక్ తెలిపారు. భారత్ సీరియస్! పాక్ హై కమిషన్ చర్యపై భారత్ అధికారికంగా స్పందించనప్పటికీ, వేర్పాటువాదులకు ఆహ్వానం పంపడాన్ని తీవ్రంగా తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే ప్రభుత్వం దీనిపై సరైన విధంగా స్పందిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాక్‌లోని కొన్ని వర్గాలు భారత్, పాక్ చర్చలను అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నాయని, వేర్పాటువాదులకు ఆహ్వానం అందులో భాగమేనన్నాయి. ఈ నేపథ్యంలో, భారత్ ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ బుధవారం హోమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. వేర్పాటువాద నేతలకు పాక్ హై కమిషన్ ఆహ్వానంప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. కశ్మీర్ వేర్పాటువాద నేతలకు ఆహ్వానం పంపడాన్ని భారత్‌లోని పాక్ హై కమిషన్ సమర్థించుకుంది. ‘ఇది కొత్తేం కాదు. గతంలోనే వేర్పాటువాదులను కలిశాం. ఇలాంటి భేటీలు, విందులు గతంలోనూ జరిగాయి. దీనిపై ఇంత రాద్ధాంతం ఎందుకు?’ అంటూ కమిషన్‌లోని కౌన్సెలర్(ప్రెస్) మంజూర్ మెమన్ అన్నారు. అజిత్ దోవల్‌తో సర్తాజ్ అజీజ్ చర్చలు 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇరుదేశాలు ఎన్ఎస్ఏ స్థాయి చర్చలు ప్రారంభించాలంటూ జూలై 10న రష్యాలోని ఉఫాలో భేటీ సందర్భంగా భారత్, పాక్ ప్రధానులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్ నిర్ణయించడం తెలిసిందే. రాజకీయం చేయొద్దు: మీర్వాయిజ్ పాక్ ఎంబసీ నుంచి ఆహ్వానం అందగానే, మితవాద హురియత్ కాన్ఫెరెన్స్ బుధవారం అత్యవసర కార్యనిర్వాహక భేటీని ఏర్పాటు చేసింది. అజీజ్ గౌరవార్థం ఇస్తున్న విందుకు వెళ్లాలని నిర్ణయించింది. నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్తత సడలేలా, సంపూర్ణ కాల్పుల విరమణ అమలయ్యేలా భారత్, పాక్‌లు చర్యలు తీసుకోవాలని మీర్వాయిజ్ ఫారూఖ్ సూచించారు. ‘దక్షిణాసియాలో శాంతి నెలకొనే ఒక అవకాశాన్ని గత ఏడాది కోల్పోయాం. ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. మాకు ఆహ్వానం పంపడాన్ని రాజకీయం చేయొద్దు. రాజకీయం చేసే అంశాలు వేరే ఉన్నాయి’ అన్నారు. గత ఆగస్ట్‌లో భారత్, పాక్‌ల మధ్య ప్రారంభం కానున్న విదేశాంగ కార్యదర్శుల భేటీ ఇదే కారణంతో రద్దవడం తెలిసిందే. కార్యదర్శుల సమావేశం కన్నా ముందు కశ్మీర్ వేర్పాటు వాదులతో పాక్ దౌత్యాధికారులు భేటీ కావడంపై ఆగ్రహంతో భారత్ ఆ చర్చల నుంచి వైదొలగింది. మోదీ, షరీఫ్‌ల మధ్య ఉఫాలో జరిగిన చర్చల సందర్భంగా కశ్మీర్ ప్రస్తావన లేకపోవడానికి నిరసనగా గత నెలలో పాక్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ ఇచ్చిన ఈద్ మిలన్ కార్యక్రమాన్ని అతివాద వేర్పాటు నేత సయ్యద్ అలీ షా గిలానీ బహిష్కరించారు. స్వాతంత్య్రం కోసం న్యాయ పోరాటం చేస్తున్న కశ్మీరీలను పాక్ వదిలేయబోదని గతవారం బాసిత్ అనడం గమనార్హం. దారితెన్నూ లేకుండా చర్చలా?: కాంగ్రెస్ పాక్‌తో చర్చల విషయంలో ప్రభుత్వం ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. కశ్మీర్ వేర్పాటువాద నేతలకు పాక్ దౌత్య కార్యాలయం ఆహ్వానం పంపడాన్ని తేలిగ్గా కొట్టేసిన కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ.. కశ్మీరీ వేర్పాటువాదులను ఎప్పుడో పక్కన పెట్టేసారన్నారు. మధ్యవర్తిత్వం నెరపండి * కశ్మీర్‌పై ఐరాసలో పాక్ పాతపాట న్యూయార్క్: భారత్-పాకిస్తాన్ల మధ్య ఎన్ఎస్ఏల చర్చలకు గడువు సమీపిస్తున్న కొద్దీ పాక్ కశ్మీర్‌పై తన దూకుడును పెంచింది. కశ్మీర్ అంశాన్ని పరిష్కరించటానికి ప్రపంచ శాంతి సంస్థ ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వం నెరపాలని భద్రతామండలికి మళ్లీ విజ్ఞప్తి చేసింది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ) కూడా జోక్యం చేసుకోవాలంది. సమకాలీన ప్రపంచ భద్రతా సవాళ్లపై జరిగిన చర్చలో ఐరాసలో పాక్ శాశ్వత ప్రతినిధి మలీహా లోధీ మాట్లాడుతూ 57 మంది సభ్యులున్న ఓఐసీ కూడా ప్రపంచ శాంతి సౌభ్రాతృత్వాలకు తన వంతుగా పాటుపడాలని కోరారు. అంతకు ముందు వాస్తవాధీన రేఖ వద్ద భారత్, పాకిస్తాన్‌లు పూర్తి సంయమనం పాటించాలని ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్ విజ్ఞప్తి చేశారు. కాల్పుల విరమణను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని.. దాని వల్ల త్వరలో జరగబోయే ఇరుదేశాల జాతీయ భద్రతాసలహాదారుల చర్చల్లో నిర్మాణాత్మకమైన ఫలితం వెలువడే అవకాశం ఉంటుందని అన్నారు. అవే ఉల్లంఘనలు.. పౌరులే లక్ష్యాలు జమ్మూ: పాక్ బలగాలు బుధవారం రాత్రీ జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో జనావాసాలపై కాల్పులు జరిపాయి. దీటుగా తిప్పికొట్టామని సైన్యం తెలిపింది. యథావిధిగా ఎన్ఎస్ఏల చర్చలు! కశ్మీర్ వేర్పాటునేతలకు పాక్ హైకమిషన్ ఆహ్వానం నేపథ్యంలో.. పాక్‌తో ఎన్ఎస్ఏ స్థాయి చర్చలను కొనసాగించాలనే భారత్ భావిస్తోందని తెలుస్తోంది. పాక్‌లో తలదాచుకున్నారని భావిస్తున్న దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్ సహా 60 మంది ఉగ్ర నేరస్తుల జాబితాను భారత్ చర్చల్లో పాక్‌కు అందజేయనుంది. వారిని తమకప్పగించాలని డిమాండ్ చేయనుంది. ఇటీవలి గురుదాస్‌పూర్, ఉధంపూర్ ఉగ్ర ఘటనలను, భారత్‌కు చిక్కిన పాక్ ఉగ్రవాది నవేద్ ఉదంతాన్ని ప్రస్తావించనుంది. ముంబై దాడుల కేసు సత్వర విచారణ అంశాన్నీ లేవనెత్తనుంది. సంరతా ఎక్స్‌ప్రెస్ పేలుళ్లు, బలూచిస్తాన్ అస్థిరతను పాక్ లేవనెత్తొచ్చని, సంఝౌతా ఉదంతంతో ముంబై దాడులను పోల్చే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, పాక్ వాదనను తిప్పికొట్టాలని, ముంబై దాడులు పాక్ ప్రభుత్వ సంస్థల సహకారంతో జరిగిన విషయాన్ని ఎత్తి చూపాలని భారత్ భావిస్తోందని పేర్కొన్నాయి. లష్కరే శిక్షణపై పాక్ ఉగ్రవాది నవేద్ ఇచ్చిన సమాచారాన్ని, నవేద్ తెలిపిన పాక్‌లోని తన ఇంటి అడ్రస్‌ను పాక్ ఎన్ఎస్ఏతో దోవల్ పంచుకుంటారని వెల్లడించాయి. -
భారత్‌తో చర్చల్లో పాక్ 'కశ్మీర్' కిరికిరి
న్యూఢిల్లీ: మరో నాలుగు రోజుల్లో ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారుల భేటీ జరగనున్న సందర్భంలో ఎప్పటిలాగే పాకిస్థాన్ తన మార్కు రాజకీయాలకు తెరలేపింది. ఆదివారం ఢిల్లీలో భారత్- పాక్ జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్, సర్తాజ్ అజీజ్ సమావేశం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశానికి ముందే అజీజ్.. కశ్మీర్ వేర్పాటువాద నేతలతో భేటీ అవుతారని పాకిస్థాన్ హైకమిషనర్ ప్రకటించడం తీవ్రచర్చనీయాంశమైంది. అజీజ్‌తో సమావేశానికి రావాల్సిందిగా హురియత్ నేత సయ్యద్ అలీషా గిలానీ సహా పలువురు వేర్పాటువాద నాయకులకు పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ బుధవారం ఆహ్వానాలు పంపారు. పాక్ ఆహ్వానాన్ని గిలానీ సహా వేర్పాటువాదులు అంగీకరించారు కూడా. పాక్ అనూహ్య చర్యతో చర్చల ప్రక్రియపై ఒక్కసారిగా కారుమేఘాలు కమ్ముకున్నట్లయింది. అయితే ఈ విషయంలో పాక్ లా దూకుడుగా కాకుండా పూర్తి సమన్వయంతో వ్యవహరించాని భారత్ ఇదివరకే నిర్ణయించుకున్న దరిమిలా.. ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చల ప్రక్రియ రద్దుకాదని ప్రభుత్వ వర్గాలు తేల్చిచెప్పాయి. 'నిజానికి పాక్ చర్య భారత ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. వారు ద్వంద్వ విధానాలు అవలంభిస్తున్నదని అందరికీ అర్థమవుతూనేఉంది. కానీ ఏం చేస్తాం? ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఉగ్రవాద సమస్యపై వారితో తప్ప ఎవరితో మాట్లాడగలం?' అని అత్యున్నత స్థాయి అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. మరోవైపు ఐక్యరాజ్యసమితిలోనూ కశ్మీర్ అంశాన్నిపాక్ లేవనెత్తింది. 'ప్రాంతీయ సమాఖ్యలు, సమకాలీన ప్రపంచ భద్రతా సవాళ్లు' అనే అంశంపై బుధవారం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాకిస్థాన్ శాశ్వత ప్రతినిధి మలీహా లోథీ మాట్లాడారు. భారత్- పాక్ ల మధ్య ఏళ్లుగా నలిగిపోతోన్న కశ్మీర్ సమస్య పరిష్కారానికి ఐక్యరాజ్యసమితి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ)లు సహకరించాలని కోరారు. -
మోదీ- షరీఫ్ చర్చల ముఖ్యాంశాలు
షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సదస్సు సందర్భంగా శుక్రవారం రష్యాలోని ఉఫాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ గంటపాటు ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలతో పాటు ఇరుదేశాల సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఉగ్రవాదంపై వారు లోతుగా చర్చించారు. వాటిలో ముఖ్యాంశాలు.. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో ఇరుదేశాల భద్రత సలహాదార్లు అజిత్ దోవల్(భారత్), సర్తాజ్ అజీజ్ (పాక్) ఢిల్లీలో సమావేశమై ఉగ్రవాద అంశాలపై చర్చిస్తారు. (అజీజ్‌కు పాక్‌లో దార్శనికుడిగా, ఆర్థికవేత్తగా పేరుంది) పాక్‌లో జరుగుతున్న 26/11 ముంబై దాడుల విచారణను వేగవంతం చేసేందుకు.. స్వర నమూనాలను అందించడం సహా.. అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు అంగీకారం. (ఈ విచారణలో తీవ్ర జాప్యం, అలసత్వంపై భారత్ ఇప్పటికే పలుమార్లు తీవ్ర అభ్యంతరం తెలిపింది. దాడుల సూత్రధారి లఖ్వీని జైలు నుంచి విడుదల చేయడాన్ని నిరసించింది. అందుకు బాధ్యత వహించాల్సిన పాకిస్తాన్‌పై చర్య తీసుకోవాలంటూ ఐరాసలో ఒక తీర్మానాన్ని సైతం ప్రవేశపెట్టింది. చైనా అడ్డుకోవడంతో అది వీగిపోయింది) వాస్తవాధీన రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంట శాంతి నెలకొనేందుకు తీసుకునే చర్యలపై చర్చించేందుకు భారత సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) డెరైక్టర్ జనరల్, పాక్ రేంజర్స్ డెరైక్టర్ జనరల్‌ల మధ్య అతిత్వరలో భేటీ. తర్వాత ఇరుదేశాల డెరైక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్(డీజీఎంఓ) భేటీ. శాంతి స్థాపన, అభివృద్ధి సాధన ఇరుదేశాల ఉమ్మడి బాధ్యత అని స్పష్టీకరణ. ఆ దిశగా, అన్ని అపరిష్కృత అంశాలపై చర్చలు జరపాలని నిర్ణయం. అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్ని మోదీ, షరీఫ్‌లు తీవ్రంగా ఖండించారు. దక్షిణాసియా నుంచి ఉగ్రవాద భూతాన్ని తరిమేసేందుకు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయం. పాక్ జైళ్లలో ఉన్న 355 మంది భారత జాలర్లను, భారత జైళ్లలోని 27 మంది పాక్ జాలర్లను, వారి పడవలతో సహా 15 రోజుల్లోగా విడుదల చేయాలని నిర్ణయం. మతపరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక యంత్రాంగ రూపకల్పన. వచ్చే సంవత్సరం ఇస్లామాబాద్‌లో జరగనున్న సార్క్ శిఖరాగ్ర సదస్సుకు హాజరవాలన్న షరీఫ్ ఆహ్వానానికి మోదీ సానుకూల స్పందన. (2004 జనవరిలో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పాక్ పర్యటన అనంతరం భారత ప్రధాని పాక్‌కు వెళ్లడం ఇదే ప్రథమం)