న్యూఢిల్లీ: భారత్-పాకిస్తాన్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల (ఎన్‌ఎస్‌ఏ) చర్చలు రద్దవడం దురదృష్టకరం అని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈ చర్చలకు భారత్ సుముఖంగా ఉన్నా పాకిస్తాన్ రద్దు చేసుకుందన్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘింస్తూ వస్తుంది, దీన్ని పాక్ ఆపాల్సిన అవసరం ఉందని తెలిపారు. పొరుగు దేశాలతో సత్సంబంధాల కోసం భారత్ ప్రయత్నిస్తునే ఉంటుందని పునరుద్ఘాటించారు.