కేంద్ర హోంమంత్రిని కలిసిన గవర్నర్
న్యూఢిల్లీ : కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ బుధవారం కలిశారు. విభజన చట్టంలోని అంశాలపై ఆయన ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌తో చర్చ జరిపారు. భేటీ అనంతరం గవర్నర్ మాట్లాడుతూ ఏపీ, తెలంగాణ మంత్రులతో విభజన చట్టం సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన సమావేశం అంశాలను రాజ్‌నాథ్‌కు వివరించినట్లు తెలిపారు.
అలాగే షెడ్యూల్ 9, 10, ఏపీ భవన్ విభజన తదితర అంశాలపై కూడా చర్చించినట్లు చెప్పారు. అలాగే రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై కమిటీ వేశామని, ఇప్పటికే రెండు సమావేశాలు జరిగాయన్నారు. మార్చి 26న మరోసారి భేటీ అవుతారని గవర్నర్ పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల బడ్జెట్ చాలా బాగుందని ఆయన ప్రశంసించారు.