ఐసిస్‌కు ఆ ఛాన్సే ఇవ్వం.. విడిచిపెట్టం: రాజ్‌నాథ్‌ | Won't let ISIS become challenge for India, says Home Minister Rajnath Singh | Sakshi
Sakshi News home page

ఐసిస్‌కు ఆ ఛాన్సే ఇవ్వం.. విడిచిపెట్టం: రాజ్‌నాథ్‌

Published Mon, Feb 27 2017 7:54 PM | Last Updated on Tue, Sep 5 2017 4:46 AM

ఐసిస్‌కు ఆ ఛాన్సే ఇవ్వం.. విడిచిపెట్టం: రాజ్‌నాథ్‌

ఐసిస్‌కు ఆ ఛాన్సే ఇవ్వం.. విడిచిపెట్టం: రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ: భారత్‌ను టార్గెట్‌ చేసుకునే అవకాశం ఇస్లామిక్‌ స్టేట్‌కు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబోమని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. ఐసిస్‌ను అంత తేలికగా విడిచిపెట్టబోమని హెచ్చరించారు. ఢిల్లీలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన రాజ్‌నాథ్‌ సింగ్‌ ఒక ప్రత్యేక సమాచారం ద్వారా గుజరాత్‌ ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్‌) ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేసిందని చెప్పారు.

గుజరాత్‌లో భారీ పేలుళ్లు సృష్టించేందుకు ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులతో ఇదే రాష్ట్రానికి చెందిన ఇద్దరు సోదరులు కుట్ర చేసిన విషయం తెలిసిందే. మరో రెండు రోజుల్లో వారి ప్లాన్‌ అమలు చేయనుండగా ముందుగానే పసిగట్టిన ఏటీఎస్‌ వారిని అదుపులోకి తీసుకొని పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకుంది. సోషల్‌ మీడియా సహాయంతో వారు ఐసిస్‌తో టచ్‌లో ఉండి ఈ దుశ్చర్యకు దిగారు. ఈ నేపథ్యంలో రాజ్‌నాథ్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement