భారత్‌లో ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ప్రభావం లేదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
న్యూఢిల్లీ: భారత్‌లో ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ప్రభావం లేదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మనదేశంలో విస్తరించడంలో ఐసిస్ విఫలమైందని తెలిపారు. 90 మందిపైగా ఐసిస్ సానుభూతిపరులను పట్టుకున్నట్టు వెల్లడించారు. ఐసిస్ నుంచి ఎదురైన సవాళ్లను దీటుగా ఎదుర్కొన్నామని చెప్పారు.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు మెరుగుపడ్డాయన్నారు. కశ్మీర్‌లో ఉడాన్ పథకం కింద 20 వేల మంది యువతకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత చొరబాట్లు 45 శాతం తగ్గాయని తెలిపారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో కొత్త పంథా అనుసరిస్తున్నామని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.