infiltration
-
చొరబాట్లకు మమత సర్కారే కారణం: అమిత్‌షా
కోల్‌కతా: బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం చొరబాట్లను ప్రోత్సహిస్తోందని కేంద్రహోం మంత్రి అమిత్‌షా ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ ముందున్న పెద్ద టార్గెట్ అన్నారు. ఆదివారం(అక్టోబర్ 27) కోల్‌కతాలో పర్యటన సందర్భంగా బీజేపీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో అమిత్ షా పాల్గొని మాట్లాడారు.బెంగాల్లో చొరబాట్లను తక్షణమే ఆపాలన్నారు. బెంగాల్లో చొరబాట్లు,అవినీతి ఆగాలంటే 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తేనే సాధ్యమన్నారు.బెంగాల్లో మహిళలకు భద్రత లేదని చెప్పడానికి సందేశ్ ఖాలీ హింస,ఆర్జీ కర్ ఆస్పత్రి ఘటనలే నిదర్శనమన్నారు.అక్రమ వలసలు పెరగడం వల్ల దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని అమిత్ షా ఆందోళన వ్యక్తంచేశారు. చొరబాట్లను ఆపినప్పుడే బెంగాల్లో శాంతి నెలకొంటుందన్నారు.కాగా, పశ్చిమబెంగాల్లో రూ.500 కోట్లతో నిర్మించిన ల్యాండ్‌పోర్ట్‌ను అమిత్‌షా ప్రారంభించారు. ఇదీ చదవండి: దీపావళి తర్వాత జార్ఖండ్‌లో ప్రధాని ఎన్నికల ప్రచారం -
సరిహద్దులో ఉద్రిక్తత.. చొరబాటుకు బంగ్లాదేశీయుల యత్నం
కలకత్తా: బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి వచ్చేందుకు ప్రయత్నించిన బంగ్లాదేశీయులను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) బలగాలు అడ్డుకున్నాయి. పశ్చిమబెంగాల్లోని కూచ్‌బెహార్ జిల్లా సరిహద్దు నుంచి వెయ్యి మంది భారత భూభాగంలో ప్రవేశించేందుకు యత్నించారు.సరిహద్దులోని ఫెన్సింగ్‌కు 400 మీటర్ల దూరంలో బంగ్లాదేశీయులు గుమిగూడడంతో బీఎస్ఎఫ్ బలగాలు అప్రమత్తమయ్యాయి. ‘సరిహద్దు వద్ద గుమిగూడిన వందలాది మంది బంగ్లాదేశీయులను భారత భూభాగంలో ప్రవేశించకుండా అడ్డుకున్నాం. వారందరినీ బంగ్లాదేశ్ బలగాలు వెనక్కి తీసుకెళ్లాయి’అని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్‌లో అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో అక్కడి నుంచి భారత్‌లోకి చొరబాట్లను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. -
‘బంగాదేశ్ నుంచి ఇలా చొరబడొచ్చు’
రిజర్వేషన్ల వ్యతిరేక అల్లర్లతో బంగ్లాదేశ్ అట్టుడికి పోయింది. ఇప్పుడిప్పుడే దేశంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే బంగ్లాదేశ్ ఏర్పడినప్పటి నుండి అక్కడి ప్రజలు తరచూ భారతదేశంలోకి చొరబడే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ చొరబాట్లు భారత్‌కు పెద్ద సమస్యగా మారాయి. తాజాగా బంగ్లాదేశ్‌కు చెందిన ఓ యూట్యూబర్ తమ దేశం నుంచి భారత్‌లోకి చొరబడటం చాలా సులభం అని చెబుతూ ఒక వీడియో చేశాడు. ఆ వీడియోలో సదరు యూ ట్యూబర్ చొరబాటు లొకేషన్‌ను రికార్డ్ చేశాడు. ఎలాంటి వీసా లేదా చెకింగ్ లేకుండా ఈ మార్గం గుండా భారతదేశంలోకి ప్రవేశించవచ్చని ఆ వీడియోలో చూపించాడు.ఆ వీడియోలో ఒక వైపున భారతదేశం మరొక వైపు బంగ్లాదేశ్ అని గుర్తించిన మార్కింగ్‌లు కూడా కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో ఎక్కడా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది కనిపించకపోవడం ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ❗National Security Alert❗A Bangladeshi YouTuber who is making videos on his YouTube channel and telling how to enter In India without passport and visa.pic.twitter.com/smwoC29qZU— DUDI_PARMARAM🇮🇳 (@PARMARAMDU12861) July 26, 2024 -
అతివాద బోధకులకు బ్రిటన్‌లోకి నో ఎంట్రీ
లండన్: పాకిస్తాన్, ఆఫ్గానిస్తాన్, ఇండోనేసియా వంటి దేశాల నుంచి అతివాద ఇస్లామిస్ట్ విద్వేష ప్రబో ధకులను దేశంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవాలని బ్రిటిష్ ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను తయారు చేసిందని ‘డైలీ టెలీగ్రాఫ్’ తెలిపింది. తీవ్రవాద కార్యకలాపాలు ఊహించని రీతిలో పెరుగుతుండటం పట్ల బ్రిటిష్ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. విదేశాల నుంచి వచ్చే అతివాద మత ప్రబోధకులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వారి పేర్లను వీసా హెచ్చరిక జాబితాలో చేరుస్తారు. వీరికి దేశంలోకి ప్రవేశించే దారులు మూసుకుపోతాయని ‘డైలీ టెలీగ్రాఫ్’ పేర్కొంది. -
కొనసాగుతున్న ఆపరేషన్.. ఐదుగురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో నియంత్రణ రేఖ వెంబడి అక్రమ చొరబాటుకి యత్నించిన ఉగ్రవాదుల్ని కశ్మీర్ పోలీసులు, భారత సైన్యం సంయుక్తంగా మట్టుబెట్టాయి. గురువారం ఐదుగురు ఉగ్రవాదులు హతమైనట్లు కశ్మీర్ పోలీసులు ప్రకటించారు. సరిహద్దు వెంట చొరబాటు కార్యకలాపాల నియంత్రణకు సైన్యం, జమ్ము పోలీసులతో కలిసి ఆపరేషన్ చేపట్టింది. కుప్వారా జిల్లా మచిల్ సెక్టార్లో ఉదయం జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు.. ఆపై కాల్పుల్లో మరో ముగ్గురు చనిపోయినట్లు జమ్ముకశ్మీర్ అదనపు డీజీ విజయ్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోందన్నారాయన. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల చొరబాటు నిరోధక ఆపరేషన్లలో పోలీసు బలగాల్ని సైతం వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా భారీ ఆపరేషన్ చేపట్టారు. కశ్మీర్‌కు చెందిన పోలీసులు, సెక్యూరిటీ ఏజెన్సీలు శ్రీనగర్‌లోని 15 కార్ప్స్లో బుధవారం భేటీ అయ్యారు. ఈ ఏడాది 46 మంది ఉగ్రవాదులు హతమవ్వగా.. వారిలో 37మంది పాకిస్థానీలు కాగా.. తొమ్మిది మంది స్థానికంగా ఉన్నవారేనని ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి. గత 33 ఏళ్లలో స్థానిక ఉగ్రవాదుల కన్నా.. విదేశీ ఉగ్రవాదులు అత్యధిక సంఖ్యలో హతం కావడం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. -
చొరబాటు యత్నం భగ్నం.. ఇద్దరు టెర్రరిస్టులు హతం
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో పూంచ్ జిల్లా బాలాకోట్ సెక్టార్లో శనివారం ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భద్రతా సిబ్బంది భగ్నం చేశారు. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని అధికారులు వెల్లడించారు. ఇటీవల ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలు పెరిగాయని, అయితే భద్రతా దళాలు విజయవంతంగా అడ్డుకుంటున్నట్లు తెలిపారు. చొరబాటుకు యత్నించి ఉగ్రవాదుల వద్ద భారీ సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ముష్కరులు నియంత్రణ రేఖ వద్ద భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తుండగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ముగ్గురిని అరెస్ట్ చేస్తే 100 మంది వచ్చారు.. పోలీసులకే చుక్కలు చూయించారు! -
తైవాన్‌కి చుక్కలు చూపించేలా.. చైనా సైనిక విన్యాసాలు
చైనా మళ్లీ తైవాన్‌పై కయ్యానికి కాలుదువ్వే కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఈ మేరకు తైవాన్‌కి సమీపంలోని జల, వాయు మార్గాల్లో చైనా సైనిక విన్యాసాలు నిర్వహించిందని తైవాన్ రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. దీన్ని చైనా చేస్తున్న అతిపెద్ద చొరబాటు ప్రయత్నంగా తైవాన్ చెబుతోంది. ఐతే చైనా మిలటరీ మాత్రం ఇది అమెరికా కవ్వింపు చర్యలకు ప్రతిగా ఈ సైనిక కసరత్తులని స్పష్టం చేసింది. యూఎస్ రెచ్చగొట్టు చర్యలకు ఇది గట్టి కౌంటర్ అని కూడా పేర్కొంది. అంతేగాదు యూఎస్ తన రక్షణ బడ్డెట్లో తైవాన్‌కు రూ. 82 వేల కోట్ల సహాయం అందించిందని, దీన్ని తాము ఎన్నటికీ సహించమని తెగేసి చెప్పింది చైనా. ఈ మేరకు చైనా తైవాన్ గగతలంలోకి పంపించిన విమానాల్లో 6ఎస్‌యూ30 ఫైటర్ జెట్లు, హెచ్6 బాంబర్లు, అణుదాడులు కలిగిన డ్రోన్లు ఉన్నాయని తైవాన్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. చైనా తన యుద్ధ విమానాలతో 47 సార్లు తైవాన్ గగనతలంలోకి చొరబడినట్లు తెలపింది. తమ ప్రాంతంలోని శాంతికి విఘాతం కలిగించేలా ప్రజలను భయపెట్టడానికి చైనా ప్రయత్నిస్తోందంటూ తైవాన్ ఆరోపణలు చేసింది. మరోపక్క తైవాన్ విదేశాంగ మంత్రి తైవాన్‌లో చొరబడేందుకే చైనా ఇలా సాకులు వెతుకుతోందని మండిపడ్డారు. కాగా, రోజు రోజుకి తైవాన్ చైనా మధ్య పరిస్థితులు అధ్వాన్నంగా మారుతున్నాయి. చైనా పదే పదే చొరబడటంతో..ఏ క్షణం ఏం జరుగుతుందోనని తైవాన్ నిరంతరం ఆందోళన చెందుతోంది. (చదవండి: తక్షణమే ప్రజల ప్రాణాలను కాపాడండి..అధికారులకు జిన్‌పింగ్ ఆదేశాలు -
ఈశాన్యంలో వైమానిక విన్యాసాలు ప్రారంభం
న్యూఢిల్లీ: ఈశాన్య ప్రాంతంలో భారత వైమానిక దళం(ఐఏఎఫ్) విన్యాసాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రఫేల్ జెట్లతో సహా ఈస్ట్రన్ ఎయిర్ కమాండ్ పరిధిలోఉన్న సుఖోయ్–30 యుద్ధవిమానం, ఇతర అత్యాధునిక యుద్ధ విమానాలు ఇందులో పాల్గొంటున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో వాస్తవాధీన రేఖ వద్ద చైనా సైనికుల చొరబాటు యత్నం నేపథ్యంలో ఈ విన్యాసాలు ప్రారంభం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారమే ఇవి జరుగుతున్నాయని, సైనికుల ఘర్షణతో వీటికి సంబంధం లేదని భారత వైమానిక దళం స్పష్టం చేసింది. విన్యాసాలు శుక్రవారం ముగియనున్నాయి. ఇదిలా ఉండగా, 36 రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి భారత్‌కు చేరుకున్నాయని ఐఏఎఫ్ ట్వీట్ చేసింది. దీంతో ఒప్పందం మేరకు మొత్తం విమానాలు వచ్చినట్లయ్యిందని పేర్కొంది. -
సరిహద్దుల్లో సొరంగం
జమ్మూ: భారత్‌లో చొరబాట్లకు జిత్తుల మారి పాకిస్తాన్ ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తూనే ఉంది. జమ్మూలోని సాంబా సెక్టార్లో గాలార్ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి పాక్ వైపు వెళుతున్న ఒక సొరంగ మార్గాన్ని సరిహద్దు భద్రతా బలగాలు (బీఎస్ఎఫ్) కనుగొన్నట్టు శనివారం అధికారులు వెల్లడించారు. 25 అడుగుల లోతు, 20 అడుగుల పొడవు, 3–4 అడుగుల వెడల్పున ఈ సొరంగ మార్గం ఉంది. భారత్‌లోకి చొరబాట్లు, నార్కోటిక్ డ్రగ్స్, ఆయుధాలు రవాణా చేయడం కోసమే పాక్ దీనిని నిర్మించిందని అధికారులు వెల్లడిం చారు. సరిహద్దుల నుంచి భారత్ భూభాగం వైపు 50 మీటర్ల దూరంలో ఈ సొరంగమార్గం ఉంది. పాకిస్తాన్లో తయారైనట్టుగా గుర్తులు ఉన్న ఆకుపచ్చ రంగు ఇసుక బస్తాలతో సొరంగ మార్గాన్ని కప్పి ఉంచినట్టుగా బీఎస్ఎఫ్ దళాలు గుర్తించాయి. దీంతో బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ రాకేశ్ ఆస్తానా సాంబా సెక్టార్లో అణువణువు గాలించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ ఆపరేషన్ విస్తృతంగా సాగుతోంది. ఇటీవల కాలంలో భారీగా వర్షాలు కురవడంతో ఈ సొరంగ మార్గం ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో మట్టి వదులుగా మారింది. ఎందుకిలా మట్టి ఉందన్న అనుమానంతో అక్కడ అంతా పరిశీలించి చూడగా పాకిస్తాన్లో తయారీ అయినట్టుగా చిహ్నాలు ఉన్న ఇసుక బస్తాల్ని బలగాలు గుర్తించాయి. వాటిని తొలగించి చూడగా 170 మీటర్ల పొడవైన సొరంగం కనిపించింది. సాంబా సెక్టార్లో వేల్‌బ్యాక్ శిబిరానికి దగ్గరగా ఈ సొరంగం ఉంది. కరాచి, శంకర్గఢ్ అని పేర్లు ముద్రించి ఉన్న 8–10 ప్లాస్టిక్ ఇసుక బస్తాలు కూడా ఇక్కడ లభ్యమయ్యాయి. ఈ ప్లాస్టిక్ బస్తాలపై ఉన్న తేదీలను బట్టి అవి ఇటీవల తయారైనట్టుగా తెలుస్తోంది. ఈ సొరంగం పాకిస్తాన్ వైపు సరిహద్దు శిబిరం గుల్జార్ వరకు కొనసాగిం దని అధికారులు చెప్పారు. ఈ సొరంగం ద్వారా పాక్ ఉగ్రవాదులు చాలా సులభంగా చొరబాట్లు చేయవచ్చునని వివరించారు. పాక్‌కు తెలిసే చేసింది ఈ సొరంగం నిర్మాణం గురించి పాకిస్తాన్ ప్రభుత్వానికి బాగా తెలుసునని బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ ఎన్ఎస్ జమ్వాల్ చెప్పారు. ఆ సొరంగాన్ని ఇటీవల తవ్వారని ప్రాథమిక విచారణలో తేలింద న్నారు. సాంబా సరిహద్దుల్లో పాక్ వైపు నుంచి సొరంగాన్ని తవ్వారన్న సమా చారం తమకు అందగానే సరిహద్దు బలగాలు రంగం లోకి దిగాయన్నారు. శుక్రవారం సాయం త్రానికి దీన్ని గుర్తించామని చెప్పారు. ప్రస్తుతం జమ్వాల్ సాంబ సెక్టార్లోనే ఉంటూ పాక్ ఇంకా ఎక్కడెక్కడ సొరంగాలు ఏర్పాటు చేసిందో తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. -
కశ్మీర్లోకి 40 మంది ఉగ్రవాదుల ఎంట్రీ..
శ్రీనగర్ : వాస్తవాధీన రేఖను దాటి దాదాపు 40 మంది ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి అడుగుపెట్టినట్టు భద్రతా దళాలు పేర్కొన్నాయి. వీరు దేశంలో పలు కీలక స్ధావరాలపై దాడులకు తెగబడవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. సరిహద్దు వెంబడి పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడేందుకు చేసిన ప్రయత్నాలను తాము చాలావరకూ భగ్నం చేశామని, ఈ ప్రక్రియలో కొంత మంది సరిహద్దును దాటి భారత భూభాగంలోకి ప్రవేశించే అవకాశం ఉందని జమ్ము కశ్మీర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ దిల్బాగ్ సింగ్ పేర్కొన్నారు. భారత్‌లోకి చొరబాట్లు పెరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భద్రతా దళాలు సరిహద్దు వెంట నిఘాను ముమ్మరం చేశాయని సింగ్ తెలిపారు. కశ్మీర్ లోయలో అలజడి రేపేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేస్తున్న ప్రయత్నాలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నామని చెప్పారు. -
పాక్‌కు భారత ఆర్మీ సూచన..
న్యూఢిల్లీ : భారత్‌లో చొరబాటుకు యత్నించిన పాక్ సైన్యం ప్రయతాల్ని భారత ఆర్మీ సమర్దవంతంగా తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. నియంత్రణ రేఖ వెంబడి జరిగిన కాల్పుల్లో పాక్ బోర్డర్ యాక్షన్ టీమ్(బీఏటీ) సభ్యులతో పాటు ఉగ్రవాదులు కూడా మృతిచెందారు. ఈ ఘటన జరిగి నాలుగు రోజులు గడుస్తున్న వారి మృతదేహాలు అక్కడే పడివున్నాయి. పాక్ నుంచి చొరబాటు యత్నాలు ఎక్కువ కావడంతో భారత సైన్యం నియంత్రణ రేఖ వెంబడి గస్తీని భారీగా పెంచింది. పాక్ సైన్యం నియంత్రణ రేఖ వైపు నిత్యం షెల్స్ ప్రయోగించడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో భారత ఆర్మీ కీలక ప్రకటన చేసింది. నియంత్రణ రేఖ వద్ద చనిపోయినవారి మృతదేహాలను తీసుకెళ్లాల్సిందిగా పాక్‌ను కోరింది. ఇందుకోసం ఎటువంటి హింసకు పాల్పడకుండా తెల్లజెండాలు చూపించి భారత భూభాగం వైపు రావాలని సూచించింది. అయితే భారత సూచనపై ఇప్పటివరకు పాక్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. కాగా, జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా కేరన్ సెక్టార్లో జూలై 31వ తేదీ అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని ఆర్మీ అధికార ప్రతినిధి కల్నల్ రాజేశ్ కాలియా తెలిపారు. వీరిలో నలుగురు పాక్ సైనికులతో పాటు, ఉగ్రవాదులు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. మరోవైపు కశ్మీర్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అమర్నాథ యాత్రికులను, సందర్శకులను తమ స్వస్థలాలకు పంపించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. చదవండి : పాక్ ‘బ్యాట్’ సైనికుల హతం -
అమెరికాలో చొరబడుతున్న భారతీయులు...!
అమెరికాలో భారతీయులు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఆ దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తూ పట్టుబడిన విదేశీయుల్లో ప్రథమస్థానంలో నిలవడం ద్వారా... అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించినపుడు అదుపులోకి తీసుకున్న భారతీయుల సంఖ్య ఈ ఏడాది దాదాపు మూడు రెట్లు పెరిగిందని యూఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) విభాగం తాజాగా ప్రకటించింది. యూఎస్–మెక్సికో సరిహద్దును అక్రమంగా దాటేందుకు ఒక్కొక్కరికీ 25–50 వేల డాలర్ల మధ్యలో ‘మనుషుల స్మగ్లింగ్ బందాల’కు చెల్లిస్తున్నట్టు వెల్లడైంది. ఇలా దొంగతనంగా అమెరికాలోకి ప్రవేశించేవారు స్వదేశాల్లో తాము హింసను, పీడనను ఎదుర్కొంటున్న కారణంగా అక్కడ ఆశ్రయం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సెప్టెంబర్ 30తో ముగిసిన ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 9 వేల మంది (గతేడాది 3,162 మంది) భారతీయులను సరిహద్దుల్లో అరెస్ట్ చేసినట్టు సీబీపీ అధికారి సాల్వడార్ జమోరా వెల్లడించారు. వీరిలో 4వేల మంది దాకా అమెరికాలోకి అక్రమ ప్రవేశానికి అనుకూలంగా ఉందని భావిస్తున్న మెక్సికాలి సరిహద్దు కంచెను దాటి వచ్చినట్టు చెప్పారు. రకరకాల కారణాలు చెప్పి... ఆశ్రయం పొందేందుకు భారతీయులు అనేక కారణాలు చెబుతున్నారు. కులాంతర వివాహాలు చేసుకున్నందున తమను చంపుతారనే భయంతో అమెరికాకు పారిపోయి వచ్చినట్టు కొందరు చెబుతుండగా, సిక్కులు మాత్రం భారత్‌లో రాజకీయ పీడన కారణంగానే తాము ఇక్కడకు రావాల్సి వచ్చిందని చెబుతున్నారని ఇమిగ్రేషన్ లాయర్లు తెలిపారు. ఇతర వలసదారులు చెప్పే కారణాలనే కొందరు వెల్లడిస్తూ ఆశ్రయం కోసం ప్రభుత్వాన్ని మోసగించే ప్రయత్నం చేస్తున్నారని జమోరా పేర్కొన్నారు. 2012–17 మధ్యకాలంలో ఆశ్రయం కోసం అర్జీలు పెట్టుకున్న 42.2 శాతం భారతీయుల విజ్ఞప్తులను తోసిపుచ్చినట్టు సైకాక్యూస్ యూనివర్శిటీ ట్రాన్సాక్షనల్ రికార్డ్స్ యాక్సెస్ క్లియరింగ్ హౌజ్ తెలియజేసింది. ఈ విషయంలో 79 శాతంతో ఎల్‌సాల్వడార్ వాసులు మొదటిస్థానంలో, 78 శాతంతో హ్యుండరస్కు చెందినవారు రెండోస్థానంలో నిలిచారు. అమెరికాలో పట్టుబడ్డాక భారతీయులకు బాండ్లు కట్టి మానవ అక్రమరవాణా బందాలు విడిపిస్తున్నట్టు జమోరా తెలిపారు. బాండ్లపై విడుదలయ్యాక హోటళ్లు, ఇతర స్టోర్లలో ఇండియన్లు పనిచేసి డబ్బు సంపాదిస్తున్నారు. ఆ విధంగా వచ్చిన ఆదాయంతో ఆ బందాలకు బాండ్ ఫీజు రుసుమును తిరిగి చెల్లించడంతో పాటు, అక్రమంగా ప్రవేశించేందుకు చేసిన అప్పులను తీర్చేందుకు ఉపయోగిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. -
కశ్మీర్లో చొరబాటు యత్నం భగ్నం
శ్రీనగర్: కశ్మీర్‌లోని ఉడీ సెక్టార్లో భద్రతా బలగాలు పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్(బ్యాట్) చొరబాటు యత్నాన్ని భగ్నం చేసి ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన జరిగినట్లు ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపారు. ఎల్వోసీ వెంట చొరబడటానికి ప్రయత్నించిన ఉగ్రవాదులను ఆర్మీ అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయని, అందులో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు. చనిపోయిన ఉగ్రవాదుల వద్ద భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి లభ్యమైందని వెల్లడించారు. -
చొరబాట్లు : బీఎస్ఎఫ్ చేతిలో ఇద్దరు హతం
న్యూఢిల్లీ : భారత భద్రతా బలగాలు సరిహద్దులో అత్యంత శక్తివంతంగా పనిచేస్తున్నాయి. పాకిస్తాన్ చొరబాటు దారులును భారత సైన్యం ఎక్కడిక్కడ ఏరిపారేస్తోంది. తాజాగా బుధవారం పంజాబ్ సరిహద్దులో ఉన్న ఇండో-పాక్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద చొరబాట్లకు ప్రయత్నించిన ఇద్దరు పాక్ స్మగ్గర్లను బీఎస్ఎఫ్ దళాలు మట్టికరిపించాయి. మృతుల వద్ద నుంచి 4 ఏకే 47 తుపాకులు, ఏకే మ్యాగ్, 9 ఎంఎం పిస్టల్, పాకిస్తాన్ మొబైల్ సిమ్ కార్డ్, రూ. 20 వేల పాక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు భద్రతాబలగాలు ప్రకటించాయి. -
ఐదుగురు ఉగ్రవాదుల కాల్చివేత
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో సోమవారం రాత్రి భద్రతా దళాలు ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. నియంత్రణ రేఖను దాటి మచిల్ సెక్టార్లో చొరబాటుకు యత్నిస్తున్న ఉగ్రవాదులను భద్రతా దళాలు గుర్తించాయి. వెంటనే అప్రమత్తమై వారిపై కాల్పులు జరిపి మట్టుబెట్టాయి. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఉగ్రవాదుల నుంచి ఐదు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. మచిల్ సెక్టార్లో ఉగ్రవాదుల కోసం ఇంకా బలగాలు వెతుకుతున్నట్లు తెలిపింది. నియంత్రణ రేఖ దాటి చొరబాటుకు యత్నిస్తున్న 40 మంది ఉగ్రవాదులను ఈ ఏడాది బలగాలు మట్టుబెట్టాయి. -
ముగ్గురు ఉగ్రవాదులు హతం!
చొరబాటుయత్నాన్ని భగ్నం చేసిన భద్రతా దళాలు శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద ఉగ్రవాదుల చొరబాటుయత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేశాయి. ఈ సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదుల్ని హతమార్చాయి. 'గురేజ్ సెక్టార్లో ఎల్వోసీ వద్ద గురువారం ఉదయం జరిగిన చొరబాటుయత్నాన్ని భగ్నం చేశాం. ఈ సందర్భంగా ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు' అని ఆర్మీ తన అధికారిక ట్విట్టర్ పేజీలో వెల్లడించింది. అనంతరం మరో ఉగ్రవాది హతమైనట్టు వెల్లడించింది. ప్రస్తుతం ఇక్కడ ఆపరేషన్ కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. గత నెలలో కశ్మీర్‌లోని ఉడీ సెక్టార్లో చొరబాటు యత్నాన్ని భగ్నం చేసి.. ఐదుగురు ఉగ్రవాదుల్ని భద్రతా దళాలు హతమార్చిన సంగతి తెలిసిందే. -
ఐసిస్ ప్రభావం లేదు: రాజ్‌నాథ్
-
ఐసిస్ ప్రభావం లేదు: రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: భారత్‌లో ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ప్రభావం లేదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మనదేశంలో విస్తరించడంలో ఐసిస్ విఫలమైందని తెలిపారు. 90 మందిపైగా ఐసిస్ సానుభూతిపరులను పట్టుకున్నట్టు వెల్లడించారు. ఐసిస్ నుంచి ఎదురైన సవాళ్లను దీటుగా ఎదుర్కొన్నామని చెప్పారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు మెరుగుపడ్డాయన్నారు. కశ్మీర్లో ఉడాన్ పథకం కింద 20 వేల మంది యువతకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత చొరబాట్లు 45 శాతం తగ్గాయని తెలిపారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో కొత్త పంథా అనుసరిస్తున్నామని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. -
సైలెన్సర్ గన్‌తో సెంట్రీని చంపి..
నగ్రోటా ఆర్మీ క్యాంప్‌లోకి ఉగ్రవాదుల చొరబాటు శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని నగ్రోటాలో ఉన్న ఆర్మీ యూనిట్‌పై దాడి కోసం ఉగ్రవాదులు పక్కా ప్రణాళికతో వచ్చినట్లు తేలింది. సైలెన్సర్ గన్‌తో సెంట్రీని కాల్చి చంపి ఉగ్రవాదులు ఆర్మీ క్యాంప్‌లోకి ప్రవేశించినట్లు అధికారులు గుర్తించారు. గతనెల 29న నగ్రోటాలోని ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ రోజు తెల్లవారుజామున 5.30కు ముగ్గురు ముష్కరులు ఒక్కసారిగా ఆర్మీ యూనిట్‌పై కాల్పులు జరుపుతూ, గ్రెనేడ్లతో దాడికి దిగారు. వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది వారిని మట్టుబెట్టింది. ఈ ఘటనకు గల కారణాలను అన్వేషించిన ఆర్మీ అధికారులు పలు ఆధారాలు గుర్తించారు. దీని ప్రకారం, తొలుత ఆర్మీ క్యాంప్ ప్రాంగణాన్ని సమీపించిన ఉగ్రవాదులు వెనుక వైపు నుంచి ఎలిఫెంట్ గ్రాస్ ద్వారా ప్రవేశమార్గం వద్దకు వచ్చారు. అక్కడున్న సెంట్రీని సైలెన్సర్ బిగించిన తుపాకీతో కాల్చి చంపి లోపలికి ప్రవేశించారు. సెంట్రీని చంపినట్లు ఒకరు గుర్తించగానే ప్రాంగణంలో కొంత భయానక వాతావ రణం ఏర్పడింది. సైనిక కుటుంబాలున్న భవంతిలోకి ఉగ్రవాదులు ప్రవేశిస్తుం డటాన్ని సైనికులు గుర్తించారు. సైనికుల కుటుంబాలను బందీలు చేసుకునే అవకాశముందని గుర్తించిన బలగాలు ముందుగా పారాకమాండోల సాయంతో పిల్లల్ని, మహిళల్ని సురక్షిత ప్రదేశానికి తరలించారు. అనంతరం ఉగ్రవాదులపై పూర్తిస్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే డ్రోన్ల సాయం తీసుకొని క్యాంప్‌లోని పలుచోట్ల నక్కి ఉన్న ఉగ్రవాదులను గుర్తించి తుదముట్టించారు. -
చొరబాటు యత్నం.. ఉగ్రవాది హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల చొరబాట్లు కొనసాగుతున్నాయి. బారాముల్లా జిల్లాలోని రామ్‌పూర్ సెక్టార్లో గురువారం ఉదయం ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భద్రతా బలగాలు నియంత్రించాయి. లైన్ ఆఫ్ కంట్రోల్(ఎల్ఓసీ) సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అతడి వద్ద నుంచి ఏకే 47 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదుల చొరబాటుకు సహకరిస్తూ నవంబర్ 6న పాకిస్తాన్ ఆర్మీ జరిపిన దాడిలో ఇద్దరు భారత సైనికులు మృతి చెందడంతో పాటు ఐదుగురు గాయపడిన విషయం తెలిసిందే. భారత్ జరిపిన సర్జికల్ దాడుల అనంతరం సరిహద్దులో ఇప్పటివరకు 100కు పైగా కాల్పుల ఉల్లంఘన ఘటనలకు పాకిస్తాన్ పాల్పడింది. -
నదుల గుండా చొరబడి.. దేశంలో భారీ బ్లాస్ట్స్!
-
నదుల గుండా చొరబడి.. దేశంలో భారీ బ్లాస్ట్స్!
భారీ విధ్వంసానికి కుట్రపన్నిన లష్కరే ఉగ్రవాద దాడులు పొంచి ఉండటంతో భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో భద్రతను భారీగా పెంచిన నేపథ్యంలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు మరో మార్గం మీదుగా దేశంలోకి ప్రవేశించి.. భారీ విధ్వంసానికి పాల్పడాలని కుట్రపన్నారు. నిఘా వర్గాల విశ్వసనీయ సమాచారం ప్రకారం.. లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ భారత్‌లో మరో భారీ విధ్వంసానికి పథకం రచిస్తున్నాడు. ఇందుకోసం సరిహద్దుల్లో ఉన్న నదులు, కాలువలను ఉపయోగించుకొని తన ఉగ్రమూకను దేశంలోకి పంపాలని అతను కుట్ర పన్నినట్టు నిఘా వర్గాలు తెలిపాయి. ఈ ఉగ్రవాద ఆపరేషన్‌కు లష్కరే కమాండర్ అబు ఇర్ఫాన్ తందేవాలాను ఇన్చార్జిగా సయీద్ నియమించినట్టు సమాచారం. దేశంలో భారీ మారణహోమం లక్ష్యంగా ఎనిమిది నుంచి తొమ్మిది మంది ఈ ఆపరేషన్‌లో పాల్గొనబోతున్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు వీలుగా పాక్ సైన్యం లోపాయికారి సహకారం అందిస్తున్నట్టు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దుల మీదుగా ఉన్న నదులు, కాలువ మార్గాల వద్ద భారత సైన్యం నిఘాను, భద్రతను మరింత పెంచింది. అంతేకాకుండా అనుమానిత చొరబాటు మార్గాల వద్ద బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి పహారా కాస్తున్నది. భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ చేసిన తర్వాత అంతర్జాతీయ సరిహద్దుల మీదుగా రికార్డుస్థాయిలో ఉగ్రవాద చొరబాటు యత్నాలు ఈసారి జరిగాయని, సెప్టెంబర్ 29 తర్వాత దాదాపు 15 చొరబాటు యత్నాలను బీఎస్ఎఫ్ భగ్నం చేసిందని సమాచారం. కాగా, భారత్-పాక్ సరిహద్దుల్లో మూడు నదులు, 11 కాలువలు ఉన్నాయి. -
కొనసాగుతున్న దాడులు.. ఇద్దరు జవాన్లు మృతి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో చొరబాటుదారులు, పాక్ రేంజర్ల దాడులు కొనసాగుతున్నాయి. గురువారం జరిగిన రెండు వేరువేరు ఘటనల్లో ఇద్దరు భారత జవాన్లు మృతి చెందారు. కుప్వారా జిల్లాలో చొరబాటుదారులు జరిపిన కాల్పుల్లో ఓ సైనికుడు మృతి చెందగా.. జమ్మూ జిల్లాలోని ఆర్ఎస్ పురా సెక్టర్లో పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో ఓ బీఎస్ఎఫ్ జవాన్ మృతి చెందాడు. పాక్ రేంజర్ల దాడిలో ఏడుగురు పౌరులు సైతం గాయపడ్డారని సీనియర్ ఆర్మీ అధికారి వెల్లడించారు. పూంచ్ జిల్లాలోని కృష్ణ ఘాటి సెక్టార్లో సైతం గురువారం సాయంత్రం పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిందని ఆర్మీ అధికారి కల్నల్ రాజేష్ కలియా వెల్లడించారు. చొరబాటుదారుల దాడిని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోందని, ఆపరేషన్ కొనసాగుతుందని ఆయన తెలిపారు. -
జూలై 26... నిజంగా మరువలేని రోజు
జూలై 26. సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదే రోజున కార్గిల్ విజయం భారత్ కి దక్కింది. దాదాపు నెల రోజుల పాటు ప్రపంచంలోని అతి ఎత్తైన ప్రాంతంలో భారత్ పాకిస్తాన్ లు బాహాబాహీగా పోరాడాయి. భారత భూభాగాన్ని చేజిక్కించుకున్న పాకిస్తాన్ పాచికలు పారకుండా, వెనక్కి తరిమేసింది భారత సైన్యం. కార్గిల్ యుద్ధం గురించి కొన్ని విషయాలుః యుద్ధం ఎలా మొదలైంది? మామూలుగా చలికాలం సరిహద్దు సైనిక పోస్టులను ఇరు దేశాల సైనికులూ వదిలేసి వెచ్చని ప్రాంతాలకు వస్తారు. కానీ 1999 శీతాకాలంలో పాకిస్తానీ సైనికులు తమ పోస్టులను వదలలేదు. భారత్ పోస్టులను కూడా ఆక్రమించుకున్నారు. మిలిటెంట్ల రూపంలో పాకిస్తానీలు చొరబడ్డారు. ఈ విషయం మే నెలలో భారత్ దృష్టికి వచ్చింది. దీంతో కార్గిల్ జిల్లాలోని సరిహద్దుల్లో ఉన్న ఎత్తైన మంచు పర్వతాలను తిరిగి చేజిక్కించుకునేందుకు యుద్ధం ప్రారంభించింది. కార్గిల్ ప్రాముఖ్యం ఏమిటి? కార్గిల్ లడాఖ్ ప్రాంతాన్ని కలిపే భాగం. దీన్ని చేజిక్కించుకుంటే లడాఖ్ ప్రాంతం భారత్ చేజారుతుంది. సియాచిన్ గ్లేసియర్ కి వెళ్లే మార్గాలన్నీ మూసుకుపోతాయి. అప్పుడు ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ భూమి సియాచిన్ లో పాక్ జెండా ఎగురుతుంది. అందుకే పాకిస్తాన్ ఈ ఘాతుకానికి పాల్పడింది. కార్గిల్ యుద్ధం ప్రత్యేకత ఏమిటి? కార్గిల్ యుద్ధం ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఎత్తు మీద జరిగిన యుద్ధం. పూర్తిగా మంచు కొండల్లో జరిగిన హిమ యుద్ధం. శత్రువు కొండ మీద పాతుకుపోయి ఉన్నాడు. మన సైన్యం కింద ఉంది. కింద నుంచి పైకి ఎగబాకి యుద్ధం చేయడం చాలా క్లిష్టమైనది. ఆ యుద్ధంలో మనం ఘన విజయం సాధించాం. అదీ దీని ప్రత్యేకత. నెల రోజుల పోరాటంలో టైగర్ హిల్, టోలోలింగ్ ఇలా కొండ కొనలపై ఉన్న ఒక్కొక్క స్థావరం నుంచి పాకిస్తాన్ ను తరిమి కొట్టాం. ఈ యుద్ధంలో ఎంత మంది భారతీయ జవాన్లు అమరులయ్యారు? ఇందులో 537 మంది భారతీయ జవాన్లు అమరులయ్యారు. 1363 మంది గాయపడ్డారు. రెండు విమానాలు, ఒక హెలీకాప్టర్ లను నష్టపోయాం. ఒక జవాను శత్రువు చేతిలో ఖైదీగా చిక్కాడు. పాకిస్తాన్ కి చెందిన 453 మంది చనిపోయారు. 665 మంది గాయపడ్డారు. ఎనిమిది మంది బందీలుగా చిక్కారు. కొండ పైకి ఎగబాకి యుద్ధం చేయాల్సి రావడంతో మనకు ఎక్కువ నష్టం సంభవించింది. ఈ యుద్ధంలో గ్రెనేడియర్ యోగేంద్ర యాదవ్, మనోజ్ కుమార్ పాండే, కాప్టెన్ విక్రమ్ బాత్రా, సంజయ్ కుమార్, కాప్టన్ అనుజ్ నయ్యర్, మేజర్ రాజేష్ అధికారి, మేజర్ శరవణన్, స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహూజాలకు అత్యంత పరాక్రమాన్ని ప్రదర్శించారు. కార్గిల్ యుద్ధం వల్ల మనం లాభపడ్డామా, నష్టపడ్డామా? ఈ యుద్ధాన్ని కార్గిల్ కే పరిమితం చేయడం ద్వారా భారత్ ఒక బాధ్యతాయుతమైన దేశంగా మనం ప్రపంచానికి రుజువు చేయగలిగాం. పాకిస్తాన్ సైన్యం మొదట ఈ యుద్ధంతో తనకు సంబంధం లేదన్నా తరువాత అంగీకరించక తప్పలేదు. దీని వల్ల పాకిస్తాన్ కి అంతర్జాతీయంగా దౌత్యపరంగా కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ యుద్ధం తరువాత పాకిస్తాన్ లో ప్రభుత్వమే మారిపోయింది. పాకిస్తాన్ ను ఒక ఉగ్రవాద దేశంగా ప్రపంచం ముందు నిలబెట్టడంలో భారత్ విజయం సాధించింది. -
మోడీ వస్తున్నారు - ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు!
జమ్మూ కాశ్మీర్ కి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం రానున్నారు. దీంతో రెచ్చిపోయిన పాక్ సేనలు గత 24 గంటల్లో రెండు సార్లు అంతర్జాతీయ సరిహద్దు దాటి చొరబడేందుకు ప్రయత్నించాయి. రెండు సార్లూ మట్టి కరిచాయి. ముగ్గురు పాక్ తీవ్రవాదులు ఖతం అయ్యారు. పూంఛ్ జిల్లాలోని కృష్ణాఘాటీ సెక్టర్ లోనే ఈ రెండు చొరబాటు యత్నాలు జరిగాయి. తొమ్మిది మంది ఉగ్రవాదులు చొరబాటు యత్నానికి పాల్పడినప్పుడు కాల్పులు జరిగాయి. ఈ ఘటనల్లో ముగ్గురు ఉగ్రవాదులుచనిపోయారు. మిగతా వారు వెనుతిరిగారు. మన జవాన్లకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రధానమంత్రి పదవి చేపట్టిన తరువాత మోడీ తొలిసారి జమ్మూ కాశ్మీరుకు రానున్నారు. ఆయన జమ్మూలో ఉధమ్ పూర్ కట్రా రైల్వే సేవలను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి శ్రీనగర్ వెళ్లి శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షిస్తారు. -
కేరన్ సెక్టర్లో నలుగురు తీవ్రవాదులు హతం
జమ్మూ కాశ్మీర్లో కెరన్ సెక్టర్లో భారత్‌లోకి చోరబడేందుకు యత్నించిన నలుగురు తీవ్రవాదులను హతమార్చినట్లు ఆర్మీ అధికారులు శనివారం వెల్లడించారు. ఆ ఘటన స్థలంలో ఆరు ఏకే 47 రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిన్న దేశంలో చోరబాటుకు యత్నించిన ముగ్గురు తీవ్రవాదులను హతమార్చినట్లు చెప్పారు. దాంతో భారత్, పాక్ సరిహద్దుల్లోని గస్తీని పెంచినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. అయితే గత 12 రోజులుగా దేశంలో తీవ్రవాదుల చోరబాట్లు అధికమైనాయని చెప్పారు.