శ్రీనగర్ : వాస్తవాధీన రేఖను దాటి దాదాపు 40 మంది ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి అడుగుపెట్టినట్టు భద్రతా దళాలు పేర్కొన్నాయి. వీరు దేశంలో పలు కీలక స్ధావరాలపై దాడులకు తెగబడవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. సరిహద్దు వెంబడి పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడేందుకు చేసిన ప్రయత్నాలను తాము చాలావరకూ భగ్నం చేశామని, ఈ ప్రక్రియలో కొంత మంది సరిహద్దును దాటి భారత భూభాగంలోకి ప్రవేశించే అవకాశం ఉందని జమ్ము కశ్మీర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ దిల్బాగ్ సింగ్ పేర్కొన్నారు. భారత్‌లోకి చొరబాట్లు పెరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భద్రతా దళాలు సరిహద్దు వెంట నిఘాను ముమ్మరం చేశాయని సింగ్ తెలిపారు. కశ్మీర్ లోయలో అలజడి రేపేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేస్తున్న ప్రయత్నాలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment