ఐదుగురు ఉగ్రవాదుల కాల్చివేత | 5 Terrorists Killed In Jammu And Kashmir's Machil Sector, Major Infiltration Bid Foiled | Sakshi
Sakshi News home page

ఐదుగురు ఉగ్రవాదుల కాల్చివేత

Published Mon, Aug 7 2017 9:30 PM | Last Updated on Sun, Sep 17 2017 5:16 PM

ఐదుగురు ఉగ్రవాదుల కాల్చివేత

ఐదుగురు ఉగ్రవాదుల కాల్చివేత

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో సోమవారం రాత్రి భద్రతా దళాలు ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. నియంత్రణ రేఖను దాటి మచిల్‌ సెక్టార్‌లో చొరబాటుకు యత్నిస్తున్న ఉగ్రవాదులను భద్రతా దళాలు గుర్తించాయి. వెంటనే అప్రమత్తమై వారిపై కాల్పులు జరిపి మట్టుబెట్టాయి. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది.

ఉగ్రవాదుల నుంచి ఐదు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. మచిల్‌ సెక్టార్‌లో ఉగ్రవాదుల కోసం ఇంకా బలగాలు వెతుకుతున్నట్లు తెలిపింది. నియంత్రణ రేఖ దాటి చొరబాటుకు యత్నిస్తున్న 40 మంది ఉగ్రవాదులను ఈ ఏడాది బలగాలు మట్టుబెట్టాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement