
కోల్‌కతా: బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం చొరబాట్లను ప్రోత్సహిస్తోందని కేంద్రహోం మంత్రి అమిత్‌షా ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ ముందున్న పెద్ద టార్గెట్ అన్నారు. ఆదివారం(అక్టోబర్ 27) కోల్‌కతాలో పర్యటన సందర్భంగా బీజేపీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో అమిత్ షా పాల్గొని మాట్లాడారు.
బెంగాల్‌లో చొరబాట్లను తక్షణమే ఆపాలన్నారు. బెంగాల్‌లో చొరబాట్లు,అవినీతి ఆగాలంటే 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తేనే సాధ్యమన్నారు.బెంగాల్‌లో మహిళలకు భద్రత లేదని చెప్పడానికి సందేశ్ ఖాలీ హింస,ఆర్‌జీ కర్ ఆస్పత్రి ఘటనలే నిదర్శనమన్నారు.
అక్రమ వలసలు పెరగడం వల్ల దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని అమిత్ షా ఆందోళన వ్యక్తంచేశారు. చొరబాట్లను ఆపినప్పుడే బెంగాల్‌లో శాంతి నెలకొంటుందన్నారు.కాగా, పశ్చిమబెంగాల్లో రూ.500 కోట్లతో నిర్మించిన ల్యాండ్‌పోర్ట్‌ను అమిత్‌షా ప్రారంభించారు.
ఇదీ చదవండి: దీపావళి తర్వాత జార్ఖండ్‌లో ప్రధాని ఎన్నికల ప్రచారం