
చొరబాటు యత్నం.. ఉగ్రవాది హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల చొరబాట్లు కొనసాగుతున్నాయి. బారాముల్లా జిల్లాలోని రామ్‌పూర్ సెక్టార్‌లో గురువారం ఉదయం ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భద్రతా బలగాలు నియంత్రించాయి. లైన్ ఆఫ్ కంట్రోల్(ఎల్‌ఓసీ) సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అతడి వద్ద నుంచి ఏకే 47 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.
ఉగ్రవాదుల చొరబాటుకు సహకరిస్తూ నవంబర్ 6న పాకిస్తాన్ ఆర్మీ జరిపిన దాడిలో ఇద్దరు భారత సైనికులు మృతి చెందడంతో పాటు ఐదుగురు గాయపడిన విషయం తెలిసిందే. భారత్ జరిపిన సర్జికల్ దాడుల అనంతరం సరిహద్దులో ఇప్పటివరకు 100కు పైగా కాల్పుల ఉల్లంఘన ఘటనలకు పాకిస్తాన్ పాల్పడింది.