పుల్వామాలో మళ్లీ ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం | LeT Terrorist Killed In Encounter In Jammu And Kashmir Pulwama District - Sakshi
Sakshi News home page

పుల్వామాలో మళ్లీ ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం

Published Fri, Dec 1 2023 11:57 AM | Last Updated on Fri, Dec 1 2023 12:24 PM

Terrorist Killed In Encounter In Jammu And Kashmir Pulwama - Sakshi

కశ్మీర్: జమ్మూకశ్మీర్‌ సరిహద్దుల్లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోతున్నారు. సరిహద్దుల్లో ఉగ్రదాడికి పాల్పడటానికి ప్రయత్నించిన వారి పథకాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఈ క్రమంలో పుల్వామాలో మళ్లీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ గుర్తుతెలియని ఉగ్రవాది హతమయ్యాడు.

స్థానికంగా అరిహాల్ ప్రాంతంలో న్యూ కాలనీలోని తోటల్లో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రదాడిని తిప్పికొట్టారు. ఈ ఎదురుదాడిలో గుర్తు తెలియని ఓ ఉగ్రవాది హతమైనట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: 'పన్నూ హత్య కుట్ర కేసుపై అమెరికా సీరియస్'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement