సరిహద్దులో ఉద్రిక్తత.. చొరబాటుకు బంగ్లాదేశీయుల యత్నం | Tension Prevails As 1000 Bangladeshis Gather At Bengal Border | Sakshi
Sakshi News home page

సరిహద్దులో ఉద్రిక్తత.. చొరబాటుకు బంగ్లాదేశీయుల యత్నం

Aug 10 2024 9:22 AM | Updated on Aug 10 2024 10:47 AM

Tension Prevails As 1000 Bangladeshis Gather At Bengal Border

కలకత్తా: బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌లోకి వచ్చేందుకు ప్రయత్నించిన బంగ్లాదేశీయులను బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) బలగాలు అడ్డుకున్నాయి. పశ్చిమబెంగాల్‌లోని కూచ్‌బెహార్‌ జిల్లా సరిహద్దు నుంచి వెయ్యి మంది భారత భూభాగంలో ప్రవేశించేందుకు యత్నించారు.

సరిహద్దులోని ఫెన్సింగ్‌కు 400 మీటర్ల దూరంలో బంగ్లాదేశీయులు గుమిగూడడంతో బీఎస్‌ఎఫ్‌ బలగాలు అప్రమత్తమయ్యాయి. ‘సరిహద్దు వద్ద గుమిగూడిన వందలాది మంది బంగ్లాదేశీయులను భారత భూభాగంలో ప్రవేశించకుండా అడ్డుకున్నాం. 

వారందరినీ బంగ్లాదేశ్‌ బలగాలు వెనక్కి తీసుకెళ్లాయి’అని బీఎస్‌ఎఫ్‌ అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్‌లో అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో అక్కడి నుంచి భారత్‌లోకి చొరబాట్లను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement